28, సెప్టెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5258

29-9-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు”
(లేదా...)
“సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్”
(అనంతచ్ఛందం సమూహ సౌజన్యంతో)

18 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
భువి చతుర్విధ పురుషార్థములను బడయ
నాతి తో చరింతుననుచుఁ బ్రీతిఁ బలికి
చేరి జీవించ తగు మితిమీరు రీతి
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు

మత్తేభవిక్రీడితము
క్షితిపైనన్ పురుషార్థముల్ బడయగన్ జీవింతునియ్యాలితో
కుతుకమ్మెందునఁ జూప, ధర్మమును నే గుర్తించకే మోహినై
మితిమీరన్ ప్రతిదాని యందుననుచున్ మేల్బల్కి గుంపించుచున్
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్

Sitharamayya Solasa చెప్పారు...

అరుదుగ సకల విషయమలందు మిగుల
ననువగునదయ్యు ; నందము నందున దన
యాలి కంటెను జక్కగ నగుపడు పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు

విరించి చెప్పారు...


తల్లి దండ్రుల విడనాడి ధవుడె సర్వ
మనుచు విశ్వసించుచు వచ్చి నట్టి కొమను
ప్రాణప్రదముగ ప్రేమించి వసుధను పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.


పతియే సర్వమటంచు నమ్ముచును సంభావించి ప్రేమించెడిన్
లతకూనన్ హృదయమ్ము నిల్పుచు బహిః ప్రాణమ్ముగా నెంచుచున్
సతతమ్మాకొమ నాదరించగలయా సధ్యంచు డన్యుండ్రకున్
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ సరస సమరస భావము సౌఖ్యమిడఁగ
కలసిమెలసి పరఁగు చుండు కతన ముదము
విరియ మనసులు ముడివడి వరలఁగ పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు

మ॥ చతురుండై కని బాధ్యతాదులను సంస్కారమ్ముతోఁ దాల్చుచున్
మితి ప్రాముఖ్యము నేర్పు భార్యకటులన్ మెల్పున్ గనన్ సర్వదా
వితతాత్ముండుగు జ్ఞాని యన్యులదియై ప్రేఁచంగ నేమాత్రమా
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

వితతాత్ముండగు జ్ఞాని చిన్న టైపాటు

M.B.G.TILAK చెప్పారు...

జతతానైన శుభాంగి పైన వలపే సంపూర్ణమై సాగగా
గతమేదైనను పొంగులెత్తునుగదా గాఢంబుగా మక్కువే
'సతి'గా పేర్కొని నట్టి కృత్యముఁ దురాచారంబు ఖండించుచున్
'సతి'పైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్

[సతి = సతీసహగమనము]

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

తల్లిదండ్రుల విడనాడి తరలివచ్చి
పతిని సేవించు గద భార్య వలపు తోడ
వన్నె చిన్నెల నరయుచు నెన్నడు పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తనదు భార్య యె ముఖ్య మై తనరు చుండ
భావ మo దు న స్వ చ్ఛ త పరిఢ విల్ల
మెలగు మాదిరి భర్త యై యల రుచు పర
సతి ని బ్రేమించని పతి యె సజ్జ నుండు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:ప్రముఖ రచయిత్రి స్త్రీపక్షపాతి యగుచు
బలికె నీరీతి-రాముని భగవదంశ
యందు,రతడు గర్భిణి భార్య నడవి కంపె
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు?

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:అతి ధర్మమ్మున జూడ రాఘవు డయోధ్యావాసులన్,క్రూరతల్
మతులన్ దాల్చుచు బల్కి రిట్టు "లిది ధర్మంబౌనె ?యా లంకలో
నతి సౌశీల్యత నుండెనే సతి? పరస్థానమ్మునన్ దృప్తయౌ
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్"
(రాముడు అయోధ్యావాసులని ఎంత ధర్మం గా పరిపాలించినా ఆ అయోధ్యావాసులే సీత పై,రాముని పై నిందలు వేసారు.కేవలం ఒక చాకలి నింద వేసినట్టు కంకంటి రామాయణం లో ఉండ వచ్చు కానీ వాల్మీకం లో అనేకులు భావించినట్లే ఉంది.లోకం కృతజ్ఞత లేక అధర్మం గా నింద వేయటం అప్పట్లోనూ సహజమే.)

గురురాజారావు చెప్పారు...

తేటగీతి
పతినని యతిచేయని వాడు వరగుణ మణి-
సతి యితమును దీర్చెడివాడు సరసపు ధణి-
సతియెడల తన నడవడి సడలక పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్దనుండు !!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తోడఁ బుట్టిన సతి భంగి తోఁపఁ బరుని
సతినిఁ బ్రేమించి చరియించు నతని పగిది
కామ లోలుఁడై కరము నిబ్భూమి నన్య
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు

[పతి = ప్రభువు]


సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూపు నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్
సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూప నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్

[చూపన్ + అట్టి పతియే, చూపఁగా నట్టి పతియే]

kishore akaveeti చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
kishore akaveeti చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
kishore akaveeti చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
kishore akaveeti చెప్పారు...

మత్తేభ విక్రీడితము

అతి మేధోబలమూఢమే వలచి అత్యాశే ప్రకోపించగన్

హితమే వీడిన భూపతేను నరుడున్ హీనంబుగా జూచునే

వెతలన్ గూర్చుచు మానవుండిలను హా! వింతేనులే చెప్పినన్!

"సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్!"

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

తల్లిదండ్రులను విడిచి తానె సర్వ
మనుచు వచ్చిన భార్యకు మమత చూపి
పంచుచు సతము ప్రేమను బ్రతుకున పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.