29-9-2025 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు”(లేదా...)“సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్”(అనంతచ్ఛందం సమూహ సౌజన్యంతో)
తేటగీతిభువి చతుర్విధ పురుషార్థములను బడయనాతి తో చరింతుననుచుఁ బ్రీతిఁ బలికిచేరి జీవించ తగు మితిమీరు రీతిసతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండుమత్తేభవిక్రీడితముక్షితిపైనన్ పురుషార్థముల్ బడయగన్ జీవింతునియ్యాలితోకుతుకమ్మెందునఁ జూప, ధర్మమును నే గుర్తించకే మోహినైమితిమీరన్ ప్రతిదాని యందుననుచున్ మేల్బల్కి గుంపించుచున్సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్
అరుదుగ సకల విషయమలందు మిగుల ననువగునదయ్యు ; నందము నందున దనయాలి కంటెను జక్కగ నగుపడు పరసతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
తల్లి దండ్రుల విడనాడి ధవుడె సర్వమనుచు విశ్వసించుచు వచ్చి నట్టి కొమనుప్రాణప్రదముగ ప్రేమించి వసుధను పర సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.పతియే సర్వమటంచు నమ్ముచును సంభావించి ప్రేమించెడిన్ లతకూనన్ హృదయమ్ము నిల్పుచు బహిః ప్రాణమ్ముగా నెంచుచున్ సతతమ్మాకొమ నాదరించగలయా సధ్యంచు డన్యుండ్రకున్ సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్.
తే॥ సరస సమరస భావము సౌఖ్యమిడఁగకలసిమెలసి పరఁగు చుండు కతన ముదమువిరియ మనసులు ముడివడి వరలఁగ పర సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండుమ॥ చతురుండై కని బాధ్యతాదులను సంస్కారమ్ముతోఁ దాల్చుచున్మితి ప్రాముఖ్యము నేర్పు భార్యకటులన్ మెల్పున్ గనన్ సర్వదావితతాత్ముండుగు జ్ఞాని యన్యులదియై ప్రేఁచంగ నేమాత్రమాసతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్
వితతాత్ముండగు జ్ఞాని చిన్న టైపాటు
జతతానైన శుభాంగి పైన వలపే సంపూర్ణమై సాగగాగతమేదైనను పొంగులెత్తునుగదా గాఢంబుగా మక్కువే'సతి'గా పేర్కొని నట్టి కృత్యముఁ దురాచారంబు ఖండించుచున్ 'సతి'పైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్[సతి = సతీసహగమనము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తల్లిదండ్రుల విడనాడి తరలివచ్చిపతిని సేవించు గద భార్య వలపు తోడవన్నె చిన్నెల నరయుచు నెన్నడు పరసతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
తనదు భార్య యె ముఖ్య మై తనరు చుండ భావ మo దు న స్వ చ్ఛ త పరిఢ విల్లమెలగు మాదిరి భర్త యై యల రుచు పర సతి ని బ్రేమించని పతి యె సజ్జ నుండు
తే.గీ:ప్రముఖ రచయిత్రి స్త్రీపక్షపాతి యగుచుబలికె నీరీతి-రాముని భగవదంశయందు,రతడు గర్భిణి భార్య నడవి కంపెసతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు?
మ:అతి ధర్మమ్మున జూడ రాఘవు డయోధ్యావాసులన్,క్రూరతల్మతులన్ దాల్చుచు బల్కి రిట్టు "లిది ధర్మంబౌనె ?యా లంకలోనతి సౌశీల్యత నుండెనే సతి? పరస్థానమ్మునన్ దృప్తయౌసతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్"(రాముడు అయోధ్యావాసులని ఎంత ధర్మం గా పరిపాలించినా ఆ అయోధ్యావాసులే సీత పై,రాముని పై నిందలు వేసారు.కేవలం ఒక చాకలి నింద వేసినట్టు కంకంటి రామాయణం లో ఉండ వచ్చు కానీ వాల్మీకం లో అనేకులు భావించినట్లే ఉంది.లోకం కృతజ్ఞత లేక అధర్మం గా నింద వేయటం అప్పట్లోనూ సహజమే.)
తేటగీతిపతినని యతిచేయని వాడు వరగుణ మణి-సతి యితమును దీర్చెడివాడు సరసపు ధణి-సతియెడల తన నడవడి సడలక పరసతినిఁ బ్రేమించని పతియె సజ్దనుండు !!
తోడఁ బుట్టిన సతి భంగి తోఁపఁ బరుని సతినిఁ బ్రేమించి చరియించు నతని పగిది కామ లోలుఁడై కరము నిబ్భూమి నన్య సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు [పతి = ప్రభువు] సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్ సతిపైఁ బ్రేమనుఁ జూపు నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్ సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్ సతిపైఁ బ్రేమనుఁ జూప నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్ [చూపన్ + అట్టి పతియే, చూపఁగా నట్టి పతియే]
మత్తేభ విక్రీడితము అతి మేధోబలమూఢమే వలచి అత్యాశే ప్రకోపించగన్హితమే వీడిన భూపతేను నరుడున్ హీనంబుగా జూచునేవెతలన్ గూర్చుచు మానవుండిలను హా! వింతేనులే చెప్పినన్!"సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్!"
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తల్లిదండ్రులను విడిచి తానె సర్వమనుచు వచ్చిన భార్యకు మమత చూపిపంచుచు సతము ప్రేమను బ్రతుకున పరసతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.
తేటగీతి
రిప్లయితొలగించండిభువి చతుర్విధ పురుషార్థములను బడయ
నాతి తో చరింతుననుచుఁ బ్రీతిఁ బలికి
చేరి జీవించ తగు మితిమీరు రీతి
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
మత్తేభవిక్రీడితము
క్షితిపైనన్ పురుషార్థముల్ బడయగన్ జీవింతునియ్యాలితో
కుతుకమ్మెందునఁ జూప, ధర్మమును నే గుర్తించకే మోహినై
మితిమీరన్ ప్రతిదాని యందుననుచున్ మేల్బల్కి గుంపించుచున్
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్
అరుదుగ సకల విషయమలందు మిగుల
రిప్లయితొలగించండిననువగునదయ్యు ; నందము నందున దన
యాలి కంటెను జక్కగ నగుపడు పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
రిప్లయితొలగించండితల్లి దండ్రుల విడనాడి ధవుడె సర్వ
మనుచు విశ్వసించుచు వచ్చి నట్టి కొమను
ప్రాణప్రదముగ ప్రేమించి వసుధను పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.
పతియే సర్వమటంచు నమ్ముచును సంభావించి ప్రేమించెడిన్
లతకూనన్ హృదయమ్ము నిల్పుచు బహిః ప్రాణమ్ముగా నెంచుచున్
సతతమ్మాకొమ నాదరించగలయా సధ్యంచు డన్యుండ్రకున్
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్.
తే॥ సరస సమరస భావము సౌఖ్యమిడఁగ
రిప్లయితొలగించండికలసిమెలసి పరఁగు చుండు కతన ముదము
విరియ మనసులు ముడివడి వరలఁగ పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
మ॥ చతురుండై కని బాధ్యతాదులను సంస్కారమ్ముతోఁ దాల్చుచున్
మితి ప్రాముఖ్యము నేర్పు భార్యకటులన్ మెల్పున్ గనన్ సర్వదా
వితతాత్ముండుగు జ్ఞాని యన్యులదియై ప్రేఁచంగ నేమాత్రమా
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్
వితతాత్ముండగు జ్ఞాని చిన్న టైపాటు
తొలగించండిజతతానైన శుభాంగి పైన వలపే సంపూర్ణమై సాగగా
రిప్లయితొలగించండిగతమేదైనను పొంగులెత్తునుగదా గాఢంబుగా మక్కువే
'సతి'గా పేర్కొని నట్టి కృత్యముఁ దురాచారంబు ఖండించుచున్
'సతి'పైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్
[సతి = సతీసహగమనము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితల్లిదండ్రుల విడనాడి తరలివచ్చి
తొలగించండిపతిని సేవించు గద భార్య వలపు తోడ
వన్నె చిన్నెల నరయుచు నెన్నడు పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
తనదు భార్య యె ముఖ్య మై తనరు చుండ
రిప్లయితొలగించండిభావ మo దు న స్వ చ్ఛ త పరిఢ విల్ల
మెలగు మాదిరి భర్త యై యల రుచు పర
సతి ని బ్రేమించని పతి యె సజ్జ నుండు
తే.గీ:ప్రముఖ రచయిత్రి స్త్రీపక్షపాతి యగుచు
రిప్లయితొలగించండిబలికె నీరీతి-రాముని భగవదంశ
యందు,రతడు గర్భిణి భార్య నడవి కంపె
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు?
మ:అతి ధర్మమ్మున జూడ రాఘవు డయోధ్యావాసులన్,క్రూరతల్
రిప్లయితొలగించండిమతులన్ దాల్చుచు బల్కి రిట్టు "లిది ధర్మంబౌనె ?యా లంకలో
నతి సౌశీల్యత నుండెనే సతి? పరస్థానమ్మునన్ దృప్తయౌ
సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్"
(రాముడు అయోధ్యావాసులని ఎంత ధర్మం గా పరిపాలించినా ఆ అయోధ్యావాసులే సీత పై,రాముని పై నిందలు వేసారు.కేవలం ఒక చాకలి నింద వేసినట్టు కంకంటి రామాయణం లో ఉండ వచ్చు కానీ వాల్మీకం లో అనేకులు భావించినట్లే ఉంది.లోకం కృతజ్ఞత లేక అధర్మం గా నింద వేయటం అప్పట్లోనూ సహజమే.)
తేటగీతి
రిప్లయితొలగించండిపతినని యతిచేయని వాడు వరగుణ మణి-
సతి యితమును దీర్చెడివాడు సరసపు ధణి-
సతియెడల తన నడవడి సడలక పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్దనుండు !!
తోడఁ బుట్టిన సతి భంగి తోఁపఁ బరుని
రిప్లయితొలగించండిసతినిఁ బ్రేమించి చరియించు నతని పగిది
కామ లోలుఁడై కరము నిబ్భూమి నన్య
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు
[పతి = ప్రభువు]
సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూపు నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్
సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూప నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్
[చూపన్ + అట్టి పతియే, చూపఁగా నట్టి పతియే]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమత్తేభ విక్రీడితము
రిప్లయితొలగించండిఅతి మేధోబలమూఢమే వలచి అత్యాశే ప్రకోపించగన్
హితమే వీడిన భూపతేను నరుడున్ హీనంబుగా జూచునే
వెతలన్ గూర్చుచు మానవుండిలను హా! వింతేనులే చెప్పినన్!
"సతిపైఁ బ్రేమనుఁ జూపనట్టి పతియే సౌశీల్యుఁడయ్యా మహిన్!"
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తల్లిదండ్రులను విడిచి తానె సర్వ
మనుచు వచ్చిన భార్యకు మమత చూపి
పంచుచు సతము ప్రేమను బ్రతుకున పర
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు.