ఉ:దయ్యము బట్టి నా సుతుడు తల్లడ బొందుచునుండె,పుత్రు మా దయ్యకు స్వాస్థ్యమి మ్మతడు దారికి వచ్చిన గొండ నెక్కెదన్ చెయ్యన నీ కృపన్ బరుప చెంగున బారదె క్రూర యైన యా దయ్యమ! వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడు మాదయన్” (కొడుకు పేరు మాదయ్య.వాడికి దయ్యం పెట్టింది.మాదయ ని కాపాడ మని తండ్రి వెంకన్న కి మ్రొక్కుకుంటున్నాడు.)
ఉ.
రిప్లయితొలగించండికయ్యము జీవితంబిచట కాంచన గర్భుని వ్రాత వింత మే
మొయ్యన సద్గుణౌఘముల నోరిమి నేరిచి యుండలేము మా
నెయ్యము సాగబెప్డు కట నేరిమి పోదిక ముక్తికడ్డు పె
న్దయ్యమ, వేంకటేశ్వర సదా నిను గొల్తుము చూడుమా దయన్ !
కందం
రిప్లయితొలగించండినెయ్యము బ్రహ్మోత్సవమదె
యియ్యవనిని జన్మధన్యమే యగు గనినన్
కయ్యములుఁ దొలఁగ జేయ హృ
దయ్యమ! శ్రీవేంకటేశ! దయఁ గనుమయ్యా!
ఉత్పలమాల
నెయ్యము తిర్మలన్ నలువ నిష్ఠగ జేసెడునుత్సవాలు మా
కియ్యవనిన్ గనన్ దనర, నీప్సితముల్ నెరవేర్చు వేడినన్
గయ్యము లాడఁ జూచి మము గాసిల బెట్టెడు వారి పాలి ప్రా
దయ్యమ! వేంకటేశ్వర! సదా నినుఁ గొల్తుము చూడుమా! దయన్
అయ్యా తిరుమలవాసా
రిప్లయితొలగించండిసయ్యన నా మొరలు వినఁగ చలమేలను రా
వయ్య కరుణఁ గావఁగ నా
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా
అయ్యవు నీవటంచు మది యార్తిని బాపెదవంచు నమ్మితిన్
రిప్లయితొలగించండిచయ్యన నాదుకొమ్ము మనసార భజించెద నీదునామమున్
కయ్యములేల నల్పుడను గావర దేవర నీదు భక్తునిన్
దయ్యమ! వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్
రిప్లయితొలగించండిఇయ్యవనిని వెలసిన మా
యయ్యవు నీవనుచు నమ్మి యగచాటనకన్
తొయ్యలితో జేరితి మా
దయ్యమ! శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా.
ఇయ్యవనీతలమ్మునకు నెల్ల గుధేరుడ వీవె కావునన్
దొయ్యలి వెంటబెంటుకుని దూరమటంచుదలంచ కుండనే
చయ్యన జేరుకుంటిమి ప్రజాళినికాచెడి వాడవౌ మహా
దయ్యమ వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్.
నెయ్యము జూపబోరు యను నిత్యము కారణ మేమి లేకనే
రిప్లయితొలగించండికయ్యము పెట్టు కొంచు మము గాసిల జేతురు మాదు వైరులన్
చయ్యన వచ్చి కావు మయ శత్రుభయంబును మాపు మయ్య యో
దయ్యము వేంకటేశ్వర సదా నిను గొల్తుము చూడుమా దయన్
కం॥ మెయ్యికొన భక్తి ధరణిని
రిప్లయితొలగించండినెయ్యము వీడక మనమున నిలిపితి మయ్యా
పెయ్యిని వంచి కొలిచితిమి
దయ్యమ శ్రీవెంకటేశ దయఁగను మయ్యా
ఉ॥ మెయ్యికొనంగ భక్తి యిల మేటిగ విచ్చెను దత్పరోధృతిన్
గయ్యము లాడమెప్పుడును గామిత మంతయు సత్వమే కదా!
నెయ్యముఁ జూపు మయ్య మము నెమ్మినిఁ బ్రోచు పరాత్పరా భువిన్
దయ్యమ వెంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్
మెయ్యికొను పుట్టు, పెయ్యి శరీరము ఒడలు
నెయ్యుడు మరుని గొమరుడట
రిప్లయితొలగించండికయ్యము జేయుచు నయినను గంతుని దోడన్
వియ్యము దలపో సితి నా
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా”
తియ్యనిదౌ జీవితమునఁ
రిప్లయితొలగించండిజెయ్యక తప్పని పనులని చేసితి నఘముల్
కయ్యములేర్పడె రయమున
దయ్యమ! శ్రీవేంకటేశ! దయఁ గనుమయ్యా
తియ్యని దైన జీవనము తీరగు సంపద మాకొసంగినన్
జెయ్యక తప్పలేదనుచు చేసిన పాపము వెంబడించగా
చయ్యన నిన్నువేడెదము సంభవ కారక మమ్ముగాచు మా
దయ్యమ! వేంకటేశ్వర! సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్
[దయ్యము = దేవుఁడు]
అయ్యా తి రుమల వాసా!
రిప్లయితొలగించండిసయ్యా టలు మాని మమ్ము చల్లగ బ్రో వన్
నెయ్య ము తో వేడు గొ నె ద
దయ్యమ! శ్రీ వేంక టేశ! దయ గను మ య్యా!
కం:ఇ "య్య" ను బ్రాసగ బెట్టితి
రిప్లయితొలగించండితియ్యగ "దైవ"మన బ్రాస తీర్చుట యెటులౌ
నయ్యా! దొరకెను వికృతిగ
దయ్యమ, శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా!
(స్వామీ!నిన్ను పొగిడే పద్యం లో "య్య" ని ప్రాసగా పెట్టుకు అఘోరించాను.మరి "దైవము" అంటే ప్రాస కుదరక వికృతి ఐన "దయ్యం" వాడాను.మన్నించు.)
ఉ:దయ్యము బట్టి నా సుతుడు తల్లడ బొందుచునుండె,పుత్రు మా
రిప్లయితొలగించండిదయ్యకు స్వాస్థ్యమి మ్మతడు దారికి వచ్చిన గొండ నెక్కెదన్
చెయ్యన నీ కృపన్ బరుప చెంగున బారదె క్రూర యైన యా
దయ్యమ! వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడు మాదయన్”
(కొడుకు పేరు మాదయ్య.వాడికి దయ్యం పెట్టింది.మాదయ ని కాపాడ మని తండ్రి వెంకన్న కి మ్రొక్కుకుంటున్నాడు.)