3-12-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”(లేదా...)“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”
సతతము పన్నుల సొమ్మునుకృతకంబౌ కరుణచూపి కేరింతలతోవితరణ సల్పెద నేననుమతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
మ.శ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్ రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నేమతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !
సతతము చదువరులేలఁగగతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్ అతిరోతన దలచిరకట మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతతము మసనము నందుననతులముగా వాసముండు నతఁడు తనువునన్వితతము దాలుచు బూడిదమతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నాపతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతోనతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననేమతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
మితిమీరిన వలసలతోగతిదప్పిన పాలకులను గర్హించ జనుల్ మతదాతలమెరికనులనె మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
Disclaimer : Not a political statement .
సతతంబా దొర రుద్రభూమి కడ విస్తారంబుగా నుండు సంతతమాతండు ధరించు బూది, తలపై తాగంగనుందాల్చు శాశ్వతుడౌ భూతగణాధి నాథుని గళంబందుండు సర్పంబునామతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
కందంక్షితిపై ధర్మ పథమ్మున్గతిగఁ దలంచి జనరంజకమ్మగు రీతిన్నుతులందగ నేలుచు 'దుర్మతి చలియించిన' ప్రభుండె మమ్మేలవలెన్(దుర్మతి చలియించిన= దుర్మతి వీగిన)మత్తేభవిక్రీడితముక్షితిపై ధర్మపథమ్మునన్ కదలి నిశ్చింతన్ ప్రసాదించి సద్గతులన్ బాలన సాగెడున్ సరళిలో దాక్షిణ్యమేపారఁ దా'నుతులందన్', ప్రతిపక్షమన్నటుల మందుండే? యయోగ్యుండనన్మతిచాంచల్యము గల్గు వాఁడె? 'ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్'
సతతము పన్నుల సొమ్మును
రిప్లయితొలగించండికృతకంబౌ కరుణచూపి కేరింతలతో
వితరణ సల్పెద నేనను
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
మ.
రిప్లయితొలగించండిశ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్
రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ
పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నే
మతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !
సతతము చదువరులేలఁగ
రిప్లయితొలగించండిగతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్
అతిరోతన దలచిరకట
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతతము మసనము నందున
రిప్లయితొలగించండినతులముగా వాసముండు నతఁడు తనువునన్
వితతము దాలుచు బూడిద
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నా
రిప్లయితొలగించండిపతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతో
నతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననే
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
మితిమీరిన వలసలతో
రిప్లయితొలగించండిగతిదప్పిన పాలకులను గర్హించ జనుల్
మతదాతలమెరికనులనె
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
Disclaimer : Not a political statement .
రిప్లయితొలగించండిసతతంబా దొర రుద్రభూమి కడ విస్తారంబుగా నుండు సం
రిప్లయితొలగించండితతమాతండు ధరించు బూది, తలపై తాగంగనుందాల్చు శా
శ్వతుడౌ భూతగణాధి నాథుని గళంబందుండు సర్పంబునా
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
కందం
రిప్లయితొలగించండిక్షితిపై ధర్మ పథమ్మున్
గతిగఁ దలంచి జనరంజకమ్మగు రీతిన్
నుతులందగ నేలుచు 'దు
ర్మతి చలియించిన' ప్రభుండె మమ్మేలవలెన్
(దుర్మతి చలియించిన= దుర్మతి వీగిన)
మత్తేభవిక్రీడితము
క్షితిపై ధర్మపథమ్మునన్ కదలి నిశ్చింతన్ ప్రసాదించి స
ద్గతులన్ బాలన సాగెడున్ సరళిలో దాక్షిణ్యమేపారఁ దా
'నుతులందన్', ప్రతిపక్షమన్నటుల మందుండే? యయోగ్యుండనన్
మతిచాంచల్యము గల్గు వాఁడె? 'ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్'