2, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5322

3-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”
(లేదా...)
“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”

10 కామెంట్‌లు:

  1. సతతము పన్నుల సొమ్మును
    కృతకంబౌ కరుణచూపి కేరింతలతో
    వితరణ సల్పెద నేనను
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  2. మ.
    శ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్
    రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ
    పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నే
    మతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !

    రిప్లయితొలగించండి
  3. సతతము చదువరులేలఁగ
    గతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్
    అతిరోతన దలచిరకట
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  4. సతతము మసనము నందున
    నతులముగా వాసముండు నతఁడు తనువునన్
    వితతము దాలుచు బూడిద
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  5. సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నా
    పతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతో
    నతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననే
    మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.

    రిప్లయితొలగించండి
  6. మితిమీరిన వలసలతో
    గతిదప్పిన పాలకులను గర్హించ జనుల్
    మతదాతలమెరికనులనె
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  7. సతతంబా దొర రుద్రభూమి కడ విస్తారంబుగా నుండు సం
    తతమాతండు ధరించు బూది, తలపై తాగంగనుందాల్చు శా
    శ్వతుడౌ భూతగణాధి నాథుని గళంబందుండు సర్పంబునా
    మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్

    రిప్లయితొలగించండి
  8. కందం
    క్షితిపై ధర్మ పథమ్మున్
    గతిగఁ దలంచి జనరంజకమ్మగు రీతిన్
    నుతులందగ నేలుచు 'దు
    ర్మతి చలియించిన' ప్రభుండె మమ్మేలవలెన్

    (దుర్మతి చలియించిన= దుర్మతి వీగిన)

    మత్తేభవిక్రీడితము
    క్షితిపై ధర్మపథమ్మునన్ కదలి నిశ్చింతన్ ప్రసాదించి స
    ద్గతులన్ బాలన సాగెడున్ సరళిలో దాక్షిణ్యమేపారఁ దా
    'నుతులందన్', ప్రతిపక్షమన్నటుల మందుండే? యయోగ్యుండనన్
    మతిచాంచల్యము గల్గు వాఁడె? 'ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్'

    రిప్లయితొలగించండి

  9. క్రతువుగ దలంచి యిప్పుడు
    ప్రతివారికి యుచిత మంచు ప్రభుత పలుక తం
    డ్రితుడుల మైతిమి కావున
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్.



    ప్రతిభా పాటవ మేలరా జనులనే పాలింప నీకాలమున్
    బ్రతి మాసమ్ము చితమ్ముగా ధనమునే బట్వాడ ద్రవ్యమ్ము కై
    సతమాశించెడి మూర్ఖులున్న నిక నీ సామ్రాజ్య మేలన్ గనన్
    మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.

    రిప్లయితొలగించండి