కం:మృతు డయ్యెను మూర్ఖుండౌ పతి, శంకరు వంటి జ్ఞాని పతి గా దక్కెన్ గతమును మరచెద , మేలన్ మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్? (ఉభయభారతి తో కామశాస్త్ర వాదం చెయ్యటానికి శంకరులు ఒక మృతు డైన రాజు శరీతం లోకి పరకాయప్రవేశం చేసారు.అది గ్రహించిన రాణులు తమకు మూర్ఖు డైన భర్త బదులు జ్ఞాని ఐన శంకరుడు లభించినందుకు సంతోషించి శంకరులు తన శరీరం లోకి తిరిగి ప్రవేశించకుండా దానిని తగుల బెట్ట మని భటులకు ఆజ్ఞాపించారు.)
సతతము పన్నుల సొమ్మును
రిప్లయితొలగించండికృతకంబౌ కరుణచూపి కేరింతలతో
వితరణ సల్పెద నేనను
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
పితృసంపాదన మాద్రి దానమనుచున్ బేట్రేగుటే కావలెన్
తొలగించండిగృతకంబౌ దయచూపు చుండ వలయున్ గేరింతలన్ దేలుచున్
సతతంబివ్విధి పంచిపెట్ట మనెదన్ సామాన్యుడో మూర్ఖుడో
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
మ.
రిప్లయితొలగించండిశ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్
రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ
పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నే
మతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !
సతతము చదువరులేలఁగ
రిప్లయితొలగించండిగతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్
అతిరోతన దలచిరకట
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతతము మసనము నందున
రిప్లయితొలగించండినతులముగా వాసముండు నతఁడు తనువునన్
వితతము దాలుచు బూడిద
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నా
రిప్లయితొలగించండిపతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతో
నతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననే
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
మితిమీరిన వలసలతో
రిప్లయితొలగించండిగతిదప్పిన పాలకులను గర్హించ జనుల్
మతదాతలమెరికనులనె
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
Disclaimer : Not a political statement .
రిప్లయితొలగించండిసతతంబా దొర రుద్రభూమి కడ విస్తారంబుగా నుండు సం
రిప్లయితొలగించండితతమాతండు ధరించు బూది, తలపై తాగంగనుందాల్చు శా
శ్వతుడౌ భూతగణాధి నాథుని గళంబందుండు సర్పంబునా
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
కందం
రిప్లయితొలగించండిక్షితిపై ధర్మ పథమ్మున్
గతిగఁ దలంచి జనరంజకమ్మగు రీతిన్
నుతులందగ నేలుచు 'దు
ర్మతి చలియించిన' ప్రభుండె మమ్మేలవలెన్
(దుర్మతి చలియించిన= దుర్మతి వీగిన)
మత్తేభవిక్రీడితము
క్షితిపై ధర్మపథమ్మునన్ కదలి నిశ్చింతన్ ప్రసాదించి స
ద్గతులన్ బాలన సాగెడున్ సరళిలో దాక్షిణ్యమేపారఁ దా
'నుతులందన్', ప్రతిపక్షమన్నటుల మందుండే? యయోగ్యుండనన్
మతిచాంచల్యము గల్గు వాఁడె? 'ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్'
రిప్లయితొలగించండిక్రతువుగ దలంచి యిప్పుడు
ప్రతివారికి యుచిత మంచు ప్రభుత పలుక తం
డ్రితుడుల మైతిమి కావున
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్.
ప్రతిభా పాటవ మేలరా జనులనే పాలింప నీకాలమున్
బ్రతి మాసమ్ము చితమ్ముగా ధనమునే బట్వాడ ద్రవ్యమ్ము కై
సతమాశించెడి మూర్ఖులున్న నిక నీ సామ్రాజ్య మేలన్ గనన్
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
కృతమతుల సదస్యులనిరి
రిప్లయితొలగించండిశతావధానమొనరించు శాస్త్రులు కలుగన్
వతనుగ వారొసగెడు యను
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
రిప్లయితొలగించండిశంకరాభరణం
సమస్య 03/12/2025
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
మత్తేభము
( లంకావాసులు రావణుడి గూర్చి ఇలా తల్చుచున్నారు,)
సతతమ్మున్ బరమేశుఁ గొల్చు కడు నా క్ష్మాభృత్తు లంకేశుడే
యతి చక్కంగను గాచి మమ్ములను విఖ్యాతమ్ముగా నేలినన్
మతిహీనుండయి సాధ్వి సీతఁ గొనెఁ గామంబున్ ; లతాంగిన్ గనన్
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
కం:మృతు డయ్యెను మూర్ఖుండౌ
రిప్లయితొలగించండిపతి, శంకరు వంటి జ్ఞాని పతి గా దక్కెన్
గతమును మరచెద , మేలన్
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్?
(ఉభయభారతి తో కామశాస్త్ర వాదం చెయ్యటానికి శంకరులు ఒక మృతు డైన రాజు శరీతం లోకి పరకాయప్రవేశం చేసారు.అది గ్రహించిన రాణులు తమకు మూర్ఖు డైన భర్త బదులు జ్ఞాని ఐన శంకరుడు లభించినందుకు సంతోషించి శంకరులు తన శరీరం లోకి తిరిగి ప్రవేశించకుండా దానిని తగుల బెట్ట మని భటులకు ఆజ్ఞాపించారు.)
అతి క్రూరుని కన్న మతి చాంచల్య మున్న వాడే నయమని అండి
రిప్లయితొలగించండికం॥ అతి దుష్టుఁడుగఁ జరించుచు
సతతము బాధఁ గని ప్రజలు సతమత మొందన్
వెతల నిడు విభుని కన్నను
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
మ॥ అతి దుష్టుండుగఁ గ్రూర కర్మలను సంహ్లాదమ్ము నేపారఁగన్
సతతమ్మావిధి స్వార్థమే పరఁగ విస్తారమ్ముగన్ బన్నులన్
మితి లేకుండ విధించు కాపురుషుఁడౌ మ్లేచ్ఛుండుతోఁ బోల్చఁగన్
మతి చాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్
మ:అతిదుర్మార్గులు మంత్రు లిట్లనిరి విద్యావంతుడౌ రాజు తో
రిప్లయితొలగించండినతి కష్ట మ్మగుచుండె, నింతయును నే యర్థమ్ము రానీడు గా!
హతుడై పోగనె యీత, డీతని సుతుండౌ రాజు,శీఘ్రమ్ము గా
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”
(రాజు విద్యావంతుడు,తెలివైన వాడు.వాడి పరిపాలన లో మాకు ఆర్థికం గా ప్రయొజనం లేదు.ఈ రాజు తొందరగా పోతే మతి చాంచల్యం ఉన్న వీడి కొదుకు రా జౌతాడు.అది జరిగితే బాగుండును అనుకొన్నారు మంత్రులు. )
కం॥
రిప్లయితొలగించండిఅతి యెచ్చుల వాగ్దానము
లతినలి చూపంగ వెడగులబడుచు గెలిపిం
చితిమిక మాఖర్మిదె! యీ
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్!!