3-12-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”(లేదా...)“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”
సతతము పన్నుల సొమ్మునుకృతకంబౌ కరుణచూపి కేరింతలతోవితరణ సల్పెద నేననుమతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
మ.శ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్ రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నేమతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !
సతతము చదువరులేలఁగగతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్ అతిరోతన దలచిరకట మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతతము మసనము నందుననతులముగా వాసముండు నతఁడు తనువునన్వితతము దాలుచు బూడిదమతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నాపతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతోనతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననేమతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
మితిమీరిన వలసలతోగతిదప్పిన పాలకులను గర్హించ జనుల్ మతదాతలమెరికనులనె మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
Disclaimer : Not a political statement .
సతతము పన్నుల సొమ్మును
రిప్లయితొలగించండికృతకంబౌ కరుణచూపి కేరింతలతో
వితరణ సల్పెద నేనను
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
మ.
రిప్లయితొలగించండిశ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్
రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ
పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నే
మతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !
సతతము చదువరులేలఁగ
రిప్లయితొలగించండిగతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్
అతిరోతన దలచిరకట
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతతము మసనము నందున
రిప్లయితొలగించండినతులముగా వాసముండు నతఁడు తనువునన్
వితతము దాలుచు బూడిద
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
సతిపై ప్రేమను జాపనెంచిమదిలో సాక్షాత్కరింపంగ, నా
రిప్లయితొలగించండిపతి నే డింటికి ముందు వచ్చె ననుచున్ బ్రాణేశుపై ప్రేమతో
నతిమాధుర్యత నొల్కబోసిపలికెన్ నాభర్త నాపైననే
మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్.
మితిమీరిన వలసలతో
రిప్లయితొలగించండిగతిదప్పిన పాలకులను గర్హించ జనుల్
మతదాతలమెరికనులనె
మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్
Disclaimer : Not a political statement .
రిప్లయితొలగించండి