1-1-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి”(లేదా...)“కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)
చ.పనిగొని ప్రొద్దు రేయులను బాయక కార్యములందు మున్గి నేకనులను మూసి నిద్దుఱకు కౌగిలి నిచ్చితి నప్డు స్వప్నమందున వనమందు చిత్రముగ దూరి నికుంజములందు పోకడంగనుగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాకటన్ !
కని శిఖండిని భీష్మడు కదన మందు నస్త్రములను వీడుచు చేరె నంపశయ్య ననుచు చెప్పి నంత నొకడు ననియె నిట్లు కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.ఘనుడుగు క్రీడి మారుగ శిఖండిని గాంచి ధనుస్సు వీడుచున్ జినుడట యంపశయ్య పయి చేరెనటంచును తెల్పినంతనే యనుచరు డొక్కడిట్టులనె యచ్చరు వొందుచు, నెంత చిత్రమో కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్.
తే. జీర్ణ దేవాలయమ్మున జీవనమునుహరుని చెంతన గడిపెను హరియొకండుశర్వసామీప్యపుణ్యమున్ జననమరణకాలసర్పముం గబళించెఁ గప్ప యొకటిహరి : కప్ప
బొమ్మల కొలువు పెట్టిరి బుడతలచట ద్విజములనచట వ్రేలాడ దీసినంతదారము తెగి సర్పము రాలె దాటరి పయికాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి
చ.
రిప్లయితొలగించండిపనిగొని ప్రొద్దు రేయులను బాయక కార్యములందు మున్గి నే
కనులను మూసి నిద్దుఱకు కౌగిలి నిచ్చితి నప్డు స్వప్నమం
దున వనమందు చిత్రముగ దూరి నికుంజములందు పోకడం
గనుగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాకటన్ !
రిప్లయితొలగించండికని శిఖండిని భీష్మడు కదన మందు
నస్త్రములను వీడుచు చేరె నంపశయ్య
ననుచు చెప్పి నంత నొకడు ననియె నిట్లు
కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.
ఘనుడుగు క్రీడి మారుగ శిఖండిని గాంచి ధనుస్సు వీడుచున్
జినుడట యంపశయ్య పయి చేరెనటంచును తెల్పినంతనే
యనుచరు డొక్కడిట్టులనె యచ్చరు వొందుచు, నెంత చిత్రమో
కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్.
తే. జీర్ణ దేవాలయమ్మున జీవనమును
రిప్లయితొలగించండిహరుని చెంతన గడిపెను హరియొకండు
శర్వసామీప్యపుణ్యమున్ జననమరణ
కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి
హరి : కప్ప
బొమ్మల కొలువు పెట్టిరి బుడతలచట
రిప్లయితొలగించండిద్విజములనచట వ్రేలాడ దీసినంత
దారము తెగి సర్పము రాలె దాటరి పయి
కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి