ఆ. "వాఁడె నీవు , నీవె వాఁడ"ను ౙాడను పాడిగ పదుగురికి నుడువనెంచి ఎడనెడల గుడుచుచు నొడికపు నడతను వాడ వాడ దిరుగువాఁడు గురువు
ఒడికము : యుక్తము. ఎడనెడ : అచ్చటచ్చట. అప్పడప్పడు.
భావం: "వాడు (పరమాత్మ) నీవే, నీవు వాడవే" అనే అద్వైత మార్గం యొక్క పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని సంకల్పించి, ఎక్కడ/ఎప్పుడు దొరికితే అక్కడ/అప్పుడు భుజిస్తూ (భిక్షాటన చేస్తూ), నిరాడంబరమైన (యుక్తమైన) ప్రవర్తనతో వీధి వీధి తిరిగేవాడే నిజమైన గురువు.
ఆటవెలది
రిప్లయితొలగించండిఆదియోగి యంశ నంది పుచ్చుకొనఁగన్
వీధి వీధి తిరిగి భిక్షమెత్తి
పతితపావనునిగ నుతులందు శ్రీసాయి
వాడ వాడ దిరుగువాఁడు! గురువు!
ఉత్పలమాల
తాడును బొంగరమ్ము గొని తానొక బాలునిఁ బోల్కి యాడుచున్
గూడును పిల్లలన్ మిగుల కూరిమి జూపుచు బాలకృష్ణుడై
బాడుచు గీత హస్తమున పట్టును భిక్షను షిర్డివాసుడై
వాడల వాడలం దిరుగువాఁడఁట విశ్వగురుండు! చిత్రమే?
అయ్య వారికి దగు నైదు వరహములు ,
రిప్లయితొలగించండిబాలకులకు జాలు పప్పు బెల్ల
మనుచు , వాని జీతమనుకూలముగ లేక
వాడ వాడ దిరుగువాఁడు గురువు
రిప్లయితొలగించండిధర్మ బోధ సేసి ధరణి మానవులను
జాగృత మొనరించు చడుము తోడ
బంటు లనెడి వారు వెంటనడుచుచుండ
వాడ వాడ దిరుగువాఁడు గురువు.
క్రీడికి ధర్మ మార్గమగు గీతను బోధన సేసి నట్టి వ్రే
రేడె కదాపడంతుల పరిచ్చదముల్ హరియించె నందురే
తోడులటంచు గొల్లలగు ధూర్తుల తో నవ నీత కమ్ము కై
వాడల వాడలం దిరుగువాఁడఁట విశ్వగురుండు చిత్రమే.
పాడియావుల కడ దూడలను విడిచి
రిప్లయితొలగించండిపాలు కుడువఁ బెట్టు ప్రల్లదుండు
వెన్న దొంగిలింప వ్రేపల్లె నందున
వాడ వాడ దిరుగువాఁడు గురువు
దూడల కట్టులిప్పి పరితోషము నొందిన కొంటెబాలుడే
తోడుగ మిత్రులుండ మరి దుష్కృత కర్మల మున్గితేలుచున్
వేడుక తోడనుట్టిపయి వెన్నను దొంగిలఁ దుష్టశీలుడై
వాడల వాడలం దిరుగువాఁడఁట విశ్వగురుండు చిత్రమే
ఆ॥ నీడ నొసఁగి బ్రదుకు నెమ్మదిఁ బొందఁగ
రిప్లయితొలగించండిజ్ఞాన సమిధ వెలుఁగ శ్రమను విడక
నక్కఱఁ గని పరఁగు ననిశము బోధించ
వాడ వాడ దిరుగు వాఁడగు గురువు
ఉ॥ వాడల వాడలం దిరుగు వాఁడఁట విశ్వగురుండు చిత్రమే!
చూడఁగఁ జిత్రమే కనను స్ఫూర్తిని విశ్వగురుండు సర్వదా
నీడ నొసంగు జ్ఞానధృతి నిత్యము పంచు నవశ్యమెంచుచున్
వీడకఁ జేరి యచ్చటికి ప్రీతినిఁ గాంచుచు మార్గదర్శియై
జగతి యందు జనుల జాగృతి పరచగా
రిప్లయితొలగించండివాడ వాడ తిరుగు వాడు గురువు
హితము కోరి మసలు సతతంబు తానంచు
మె చ్చు కొనరె జనులు మేటి గాను
గోపకులను కూడి కూర్మితో తిరుగుచు
రిప్లయితొలగించండిగొల్లభామల మది కొల్లగొట్టి
క్రీడికి రణమందు గీతను తెలిపిన
వాడవాడ తిరుగు వాడు! గురువు!
ఆడుచు పాడుచున్ తిరుగు నర్భకు డీతడె గాంచు డొప్పుగా
వీడకనూదుచున్ మురళి వ్రేతల డెందము దోచువాడుతా
కూడుచు గోప బాలురను కూరిమి తోడను గోకులమ్మునన్
*“వాడల వాడలం దిరుగువాఁడఁట విశ్వగురుండు చిత్రమే”*
రిప్లయితొలగించండిఆ. "వాఁడె నీవు , నీవె వాఁడ"ను ౙాడను
పాడిగ పదుగురికి నుడువనెంచి
ఎడనెడల గుడుచుచు నొడికపు నడతను
వాడ వాడ దిరుగువాఁడు గురువు
ఒడికము : యుక్తము.
ఎడనెడ : అచ్చటచ్చట. అప్పడప్పడు.
భావం: "వాడు (పరమాత్మ) నీవే, నీవు వాడవే" అనే అద్వైత మార్గం యొక్క పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని సంకల్పించి, ఎక్కడ/ఎప్పుడు దొరికితే అక్కడ/అప్పుడు భుజిస్తూ (భిక్షాటన చేస్తూ), నిరాడంబరమైన (యుక్తమైన) ప్రవర్తనతో వీధి వీధి తిరిగేవాడే నిజమైన గురువు.
ఆ॥వె
రిప్లయితొలగించండివిద్యనభ్యసించు విద్యార్థి మనసుల
వాడవాడ దిరుగువాడు గురువు!
తిమిరమావరించ దీధితిన్నెనయించి
జ్ఞాన జ్యోతి నిచ్చు సవిత గురువు!!
చింత సేయ వైతి సుంత యేని నకట
రిప్లయితొలగించండిమందబుద్ధి వైతి సుందరాంగ
వే రొకండు లేఁడె యూరిలో నీ కయ్యొ
వాడ వాడ దిరుగు వాఁడు గురువు
పాడిగఁ బార్థ పౌత్రునకు భాగవతమ్మును జెప్పె నిల్చి యే
నాఁడును సుస్థిరమ్ముగ మనస్వి మునీంద్రుఁడు నిల్చు వాఁ డహో
కాఁడఁట క్షీరముం బిదుకు కాలము మాత్రమ యుండు నొక్కెడన్
వాడల వాడలం దిరుగువాఁ డఁట విశ్వ గురుండు చిత్రమే
ఆ॥వె
రిప్లయితొలగించండికుక్కలెన్నిగలవొ లెక్కపెట్టగపంప
చట్టబండలయ్యె చదువులన్ని!
బతకలేని పంతులింతటితోనయ్యె
"వాడవాడ దిరుగువాడు గురువు"!!
(ఈమధ్య టీచర్లకు కుక్కల గణాంకాలను సమీకరించే బాధ్యతను బీహారులోని ససారం మున్సిపాలిటీ వారు అప్పగించారన్న వార్త చదివిన తరువాత)
కూడియు గొల్ల పిల్లలను కొంటె
రిప్లయితొలగించండిపనుల్ గడు జేయుచున్ సదా
వీడక గొల్ల లోగలిలొ వెన్నను
పాలను దొంగిలించుచున్
బాడుచు నాడు చల్లరిగ బాలుర
గూడి చరించు కృష్ణుడున్
వాడల వాడలందిరుగు వాడట
విశ్వగురుండు చిత్రమే!