మ:నిను బ్రేమించుచు నారు జన్మముల కంటెన్ ద్వేషభావమ్ము బూ నిన చో మూటనె జేర జాలెదమె ? కానిమ్మట్టులే శ్రీహరీ తనకున్ శత్రువులైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా! తననే చింతన జేయుచున్న నను నీ తత్త్వమ్ము మోద మ్మిడెన్. (జయవిజయులు శ్రీహరి తో ప్రేమ తో నీ కోసం ఆరు జన్మలు వచి యుండ లేము.ద్వేషం తో ఐనా మూదు జన్మల లో వచ్చేస్తాము అన్నారు. )
భావం : సనక సనందుల శాపము వల్ల (జయవిజయులు) శ్రీమహావిష్ణువునే ఎదిరించారు. అయినప్పటికీ, ఆ నారాయణుడు ఆ రాక్షసులకు ఉత్తమ గతులను (మోక్షాన్ని) ప్రసాదించాడు. దీనిని బట్టి దైవం తనను శత్రువులుగా భావించే వారిని కూడా కరుణించి రక్షిస్తారు.
కందం
రిప్లయితొలగించండిఅనయము దేవుని నమ్ముచుఁ
దన కర్తవ్యమున సాగు ధర్మపరునిపై
కొనసాగ దాడు, లణచుచు
తన శత్రువులైన జనుల, దైవము ప్రోచున్
మత్తేభవిక్రీడితము
తొలగించండిఅనయమ్మున్ మది భక్తి తత్పరతలందాదైవమున్ నమ్ముచున్
దన కర్తవ్యము నిష్ఠగన్ సలిపెడున్ 'ధర్మాత్మునిన్' ,ద్వేషమై
కొనసాగింపగ దాడులన్ దగనిదౌ క్రూరాన, చిక్కించి యా
తనకున్ శత్రువులైనవారిని, 'సదా దైవంబు ప్రోచుం గదా! '
తనకలిని గలుగ జేయును
రిప్లయితొలగించండితన శత్రువులైన జనుల దైవము ; ప్రోచున్
తనపయి నమ్మక ముంచిన
మనుజుల సర్వ సమయముల మాన్యత తోడన్
రిప్లయితొలగించండిచెనటి నగుచు నీవరివని
మనమున దలువ పొరపాటు మన్నింపు మటం
చు నమసము చేసి నంతనె
తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్.
వినుమా శాంతిని గోరి వచ్చె నిటకున్ వెన్నుండు సత్ప్రీతి తో
వినడీ మూర్ఖుడు ధార్తరాష్ట్రు డనుచున్ వృద్ధుండనెన్ ద్రోణుతో
మొన తా గోరగ నేమి గాంచగ పృథా పుత్రుండ్రె యా పాండవుల్
తనకున్ శత్రువు, లైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా.
అనయము దేవుని తలపులు
రిప్లయితొలగించండిమనసున విహరించు చుండు మానవ వితతిన్
వినుతించు నాస్తిక చిరం
తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్
అనయంబున్మది భక్తి భావనలతో నారాధనా బ్రాతితో
జనితాహ్లాదము నిండియుండ సతమున్ సన్మంగళా కారునిన్
దనదైవంబనుచున్ వచించు జనులన్, దర్కించు నాస్తిక్య చిం
తనకున్ శత్రువులైనవారిని, సదా దైవంబు ప్రోచుం గదా
(కర్ణ దుర్యోధనాదులు చేసినదే నండి)
రిప్లయితొలగించండికం॥ వినక హితవాక్యమెప్పుడు
ఘనుఁడగు దుష్టుఁడు పరఁగుచుఁ గఠినాత్ముండై
కని పలుకు విధి మరలబడఁ
దన శత్రువులైన జనుల దైవము ప్రోచున్
మ॥ వినకన్ నీచుఁడు ధర్మ సంహితము నావేశంబుతో సర్వదా
కనుచున్ మిన్నగ దుష్టకృత్యముల సంస్కారమ్ము శూన్యంబుగా
తనరన్ వర్తిలి యంత్యకాలమున నిందన్ జేయు నీరీతిగన్
దనకున్ శత్రువులైన వారిని సదా దైవంబు ప్రోచుంగదా
మరలబడు వక్రించు
కం:తన భజన జేయ నొల్లని
రిప్లయితొలగించండిఘననాస్తికు లైన గాని కష్టమ్ములలో
మనుజులకు సాయ బడినన్
తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్”
(కొందరు నాస్తికులలో మానవసేవాభావం ఉంటుంది. వాళ్లు తనకి శత్రువులే ఐనా భగవంతుడు కాపాడతాడు.)
మ:నిను బ్రేమించుచు నారు జన్మముల కంటెన్ ద్వేషభావమ్ము బూ
రిప్లయితొలగించండినిన చో మూటనె జేర జాలెదమె ? కానిమ్మట్టులే శ్రీహరీ
తనకున్ శత్రువులైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా!
తననే చింతన జేయుచున్న నను నీ తత్త్వమ్ము మోద మ్మిడెన్.
(జయవిజయులు శ్రీహరి తో ప్రేమ తో నీ కోసం ఆరు జన్మలు వచి యుండ లేము.ద్వేషం తో ఐనా మూదు జన్మల లో వచ్చేస్తాము అన్నారు. )
వనజాక్షుఁడు కరుణామయుఁ
రిప్లయితొలగించండిడనిశం బార్త జన బంధువై చరియించుం
గినియక శరణాగతులను
దన శత్రువు లైన జనుల దైవము ప్రోచున్
తనిపెన్ మోక్షమునన్ హిరణ్యకశిపున్ దైత్యున్ హిరణ్యాక్షునిన్
వనితం జంపి యొనర్చెఁ బావనినిఁ దాఁ బాలీయఁగాఁ బూతనం
బనిపెం గంసుని స్వీయ లోకమునకుం బాపాత్ము నింపారఁగం
దనకున్ శత్రువు లైన వారిని సదా దైవంబు ప్రోచుం గదా
మనమున నీ ర్ష్యా ద్వేషము
రిప్లయితొలగించండిలను విడ నాడియు మనెడు వి లక్షణు ని మదిన్
జానహిత మును గోరును గద
తన దైన శత్రు జను ల దైవము ప్రోచున్
సమస్య : తనశత్రువులైన జనుల దైవము ప్రోచున్
రిప్లయితొలగించండికం. సనక సనందుల శాపము
నను హరినే ధిక్కరింప నారాయణుడా
దనుజులకుత్తమగతినిడె,
తనశత్రువులైన జనుల దైవము ప్రోచున్
భావం : సనక సనందుల శాపము వల్ల (జయవిజయులు) శ్రీమహావిష్ణువునే ఎదిరించారు. అయినప్పటికీ, ఆ నారాయణుడు ఆ రాక్షసులకు ఉత్తమ గతులను (మోక్షాన్ని) ప్రసాదించాడు. దీనిని బట్టి దైవం తనను శత్రువులుగా భావించే వారిని కూడా కరుణించి రక్షిస్తారు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పనిగొని శిక్ష విధించును
తన శత్రువులైన జనుల దైవము; ప్రోచున్
అనయము భక్తిని గొలుచుచు
మనమున స్మరియించు వారి మరువక
సతమున్.