8-3-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే”(లేదా...)“తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్”(ఆకాశవాణి వారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మహారాజు దశరథునితో బ్రహ్మర్షి వశిష్ఠుడు:కందంమునివరుఁ డెంచిన యజ్ఞముదనుజులు నాటంక పరుచ, దక్షత గావన్ఘనులనుచుఁ బంపఁ గోరఁగఁదనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే!చంపకమాలమునివరుడైన కౌశికుడు పూనిన యజ్ఞము నడ్డగించెడున్దనుజుల గూల్చి రక్షనిడు దక్షులు మీ సుతులన్న బాలలంచని వెనుకాడబోకుమధిపా! ఘనులొప్పఁగ మోదమొందుచున్దనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్!
జనులందరిలోననె దమ తనయుల నమ్మెడి తండ్రులఁ దగ మెచ్చెదరే!అనువు దొరకు వెనువెంటనె జననీ జనకుల వ్యయమును జార్ఛెద రుగదా
ధనమును వరకట్నమనుచు ఘనముగ పొందంగ నెంచి కల్పము నందున్ వనితలను వధువులకు తమ తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే.వనితలు తెచ్చు సంపదల పైనను మోహము పెర్గి నంతటన్ తనయుని పెండ్లి సేయుటకు దందడి కట్నము కోరు చుండుటే ఘనమని యెంచి హెచ్చుగను కానుక లిచ్చిన యాడ పిల్లకే తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.దనుజులు భగ్నమొనర్చెడి ముని యజ్ఞపు రక్ష గోరి పుత్రుడు రఘురా ముని పంప వలయు మునులకు తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే. ఘనమగు యజ్ఞకార్యమది కానల యందున నిర్వహింపగన్ దనుజులు భగ్నపర్చగను దాడులు సేయుచు నుందు రైరి నీ తనయుని యాగ రక్షకయి తక్షణ మంపు మహోన్నతుండ్రకున్ తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.
మునిజన యజ్ఞము గావగతనయుల నంపె దశరథుఁడు తను నమ్ముటచేమనసున మెచ్చిరి మునులే తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరేతనయుల పైనినమ్మకము తండ్రుల కుండుట సాజమేగదాతనపయి నుంచినట్టిదగు ధర్మము తప్పని వాడు రాముడేజననిని చంపమన్న యెడఁ జంపిన వాడన జామదగ్నియౌతనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
(అందరు తల్లిదండ్రులు తప్పక ఆచరించవలసిన విధి ధర్మమండి)చం॥ తనరుచు సంతు బాధ్యతలఁ దత్పరతాన్వితులై వహించుచున్వినయము నేర్పి యోగ్యులుగఁ బ్రీతినిఁ దీర్చఁగ సద్గుణాఢ్యులైమనునటు వృద్ధులైన తరి మన్నన సేయుచు సంప్రదింపులన్దనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్ఇక్కడ నమ్ము ను యథాతథంగా తీసుకున్నానండి(ఒక తండ్రి మనోగతమండి. కట్నకానుకలు పుత్రునకే చెందుతాయి. కనుక కాల న్యాయము ప్రకారము తీసుకోవచ్చు అనుకోవడం)చం॥ ఘనతర కట్నకానుకలు కమ్మన నేఁటి విధాన మైనచోఁదనరఁగ నాస్తి మిక్కటము ధన్యతఁ గాంచును పుత్రుఁడే కదా!యనఁదగుఁ బుత్రునమ్మిరని యైనను న్యాయమె దీర్ఘదర్శియైతనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్ఇక్కడ అమ్ము తీసుకున్నానండి
వినయ వి ధేయత లు గలిగి మునుకొని మాతా పిత లకు మోదము లలరన్ ఘనముగ సేవలు సలపెడి తనయుల నమ్మెడి జనకుల దగ మె చ్చె ద రే!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.వినయముతో వర్తించుచుమనమున తలిదండ్రులపయి మన్ననచూపన్తనువులు చాలించు వరకుతనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే!
ధనము ప్రధానముగ దలఁచిగుణహీనులు విపణియందు గొడ్డులరీతిన్ధనమున కమ్మిన యట్టులతనయుల నమ్మెడి జనకుల దగ మెచ్చెదరే?ధనము ప్రధానమంచు తలిదండ్రులు భీకర పణ్యశాలలన్తనయుని విక్రయించెదరు తామరకంటి వివాహమందునన్పనిగొని నాన వీడి కడుపాశవికంబుగ బూని యెవ్విధిన్తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్?
అనయము పెద్దవారలకులకు హర్షము పంచుచు చిత్తశుద్ధితో వినయముతోడుతన్ సకల విద్యల నేరిచి చెంగలించుచున్ ఘనమగు కీర్తి చంద్రికల కాంచి కుటుంబపు పేరు నిల్పు నా తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
వినయము తోడను పెరుగుచు తను మనములతోడ తల్లిదండ్రులకిలలోననయముగౌరవ మొసగెడుతనయుల నమ్మెడుజనకుల దగమెచ్చెదరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమహారాజు దశరథునితో బ్రహ్మర్షి వశిష్ఠుడు:
తొలగించండికందం
మునివరుఁ డెంచిన యజ్ఞము
దనుజులు నాటంక పరుచ, దక్షత గావన్
ఘనులనుచుఁ బంపఁ గోరఁగఁ
దనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే!
చంపకమాల
మునివరుడైన కౌశికుడు పూనిన యజ్ఞము నడ్డగించెడున్
దనుజుల గూల్చి రక్షనిడు దక్షులు మీ సుతులన్న బాలలం
చని వెనుకాడబోకుమధిపా! ఘనులొప్పఁగ మోదమొందుచున్
దనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్!
జనులందరిలోననె దమ
రిప్లయితొలగించండితనయుల నమ్మెడి తండ్రులఁ దగ మెచ్చెదరే!
అనువు దొరకు వెనువెంటనె
జననీ జనకుల వ్యయమును జార్ఛెద రుగదా
రిప్లయితొలగించండిధనమును వరకట్నమనుచు
ఘనముగ పొందంగ నెంచి కల్పము నందున్
వనితలను వధువులకు తమ
తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే.
వనితలు తెచ్చు సంపదల పైనను మోహము పెర్గి నంతటన్
తనయుని పెండ్లి సేయుటకు దందడి కట్నము కోరు చుండుటే
ఘనమని యెంచి హెచ్చుగను కానుక లిచ్చిన యాడ పిల్లకే
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.
దనుజులు భగ్నమొనర్చెడి
ముని యజ్ఞపు రక్ష గోరి పుత్రుడు రఘురా
ముని పంప వలయు మునులకు
తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే.
ఘనమగు యజ్ఞకార్యమది కానల యందున నిర్వహింపగన్
దనుజులు భగ్నపర్చగను దాడులు సేయుచు నుందు రైరి నీ
తనయుని యాగ రక్షకయి తక్షణ మంపు మహోన్నతుండ్రకున్
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.
మునిజన యజ్ఞము గావగ
రిప్లయితొలగించండితనయుల నంపె దశరథుఁడు తను నమ్ముటచే
మనసున మెచ్చిరి మునులే
తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే
తనయుల పైనినమ్మకము తండ్రుల కుండుట సాజమేగదా
తనపయి నుంచినట్టిదగు ధర్మము తప్పని వాడు రాముడే
జననిని చంపమన్న యెడఁ జంపిన వాడన జామదగ్నియౌ
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
(అందరు తల్లిదండ్రులు తప్పక ఆచరించవలసిన విధి ధర్మమండి)
రిప్లయితొలగించండిచం॥ తనరుచు సంతు బాధ్యతలఁ దత్పరతాన్వితులై వహించుచున్
వినయము నేర్పి యోగ్యులుగఁ బ్రీతినిఁ దీర్చఁగ సద్గుణాఢ్యులై
మనునటు వృద్ధులైన తరి మన్నన సేయుచు సంప్రదింపులన్
దనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
ఇక్కడ నమ్ము ను యథాతథంగా తీసుకున్నానండి
(ఒక తండ్రి మనోగతమండి. కట్నకానుకలు పుత్రునకే చెందుతాయి. కనుక కాల న్యాయము ప్రకారము తీసుకోవచ్చు అనుకోవడం)
చం॥ ఘనతర కట్నకానుకలు కమ్మన నేఁటి విధాన మైనచోఁ
దనరఁగ నాస్తి మిక్కటము ధన్యతఁ గాంచును పుత్రుఁడే కదా!
యనఁదగుఁ బుత్రునమ్మిరని యైనను న్యాయమె దీర్ఘదర్శియై
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
ఇక్కడ అమ్ము తీసుకున్నానండి
వినయ వి ధేయత లు గలిగి
రిప్లయితొలగించండిమునుకొని మాతా పిత లకు మోదము లలరన్
ఘనముగ సేవలు సలపెడి
తనయుల నమ్మెడి జనకుల దగ మె చ్చె ద రే!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వినయముతో వర్తించుచు
మనమున తలిదండ్రులపయి మన్ననచూపన్
తనువులు చాలించు వరకు
తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే!
ధనము ప్రధానముగ దలఁచి
రిప్లయితొలగించండిగుణహీనులు విపణియందు గొడ్డులరీతిన్
ధనమున కమ్మిన యట్టుల
తనయుల నమ్మెడి జనకుల దగ మెచ్చెదరే?
ధనము ప్రధానమంచు తలిదండ్రులు భీకర పణ్యశాలలన్
తనయుని విక్రయించెదరు తామరకంటి వివాహమందునన్
పనిగొని నాన వీడి కడుపాశవికంబుగ బూని యెవ్విధిన్
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్?
అనయము పెద్దవారలకులకు హర్షము పంచుచు చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండివినయముతోడుతన్ సకల విద్యల నేరిచి చెంగలించుచున్
ఘనమగు కీర్తి చంద్రికల కాంచి కుటుంబపు పేరు నిల్పు నా
తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్
వినయము తోడను పెరుగుచు
రిప్లయితొలగించండితను మనములతోడ తల్లిదండ్రులకిలలో
ననయముగౌరవ మొసగెడు
తనయుల నమ్మెడుజనకుల దగమెచ్చెదరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి