కం;మది లో తమమున్ బూనుచు నిదురన్ సతతము మునిగిన నిందయె పొందున్ ముదమందుచు యోగమునన్ నిదురించెడివాఁడు యశమునే గడియించున్. (యోగ నిద్ర అనేది ఒకటి ఉంటుంది. ఆ నిద్ర లో ఉన్న వాణ్ని మహర్షి అని ప్రశంసిస్తారు. తమోగుణపునిద్ర వేరు.యోగనిద్ర వేరు.)
ఉ:సద్దు లొనర్చుచుండగనె సైన్యము ఘోరరణమ్మునందు నన్ "వద్దిక యుద్ధ" మం చనక,ప్రక్కగ గుర్రమె కాగ చక్కగా నిద్దుర వోయి లేచునట నేత నెపోలియ నట్టి ధైర్యమౌ నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్” (ఫ్రెంచ్ విప్లవ యోధుడు నెపోలియన్ చక్రవర్తికి యుద్ధం అంటే ఒక ఆట. యుద్ధం లో ఒక ప్రక్క తుపాకులు, ఫిరంగులు మోగుతున్నా అతను కాసేపు యుద్ధం ఆపండని కూడా చెప్పకుండా తన గుర్రం మీదనే హాయిగా ఐదు నిమిషాలు కునుకు తీసి లేచి మళ్లీ యుద్ధం చేసే వాడట. అంత ధైర్యం గా నిద్రించ గల ధైర్యవంతుడు కీర్తినే పొందుతాడు. )
హృదిని యనుకొనిన కార్యము
రిప్లయితొలగించండిమొదలిడి, యది పూర్తి గాక ముందె విడువకన్
కుదురు పరచిన తదుపరియె
నిదురించెడివాఁడు యశమునే గడియించున్
మొదలిడిన కార్య మెల్లను
రిప్లయితొలగించండివదలక పూర్తీ యొ నర్చి పావను డ గు చున్
హృదయము తనిసిన పిదపయె
నిదు రించె డి వాడు యశము నే గడియించు న్
కందం
రిప్లయితొలగించండిఅదనుకు సిద్ధమునగుచున్
కదలుచునానాటి ముఖ్య కర్తవ్యములన్
దదనుగుణముగ ముగించియె
నిదురించెడివాఁడు యశమునే గడియించున్
ఉత్పలమాల
రద్దుల మాటనే మఱచి లాఘవమొప్పగ ముఖ్యకార్యముల్
విద్దెల నేర్పెడున్ సరళి వీడక యెప్పటికేది ప్రస్తుత
మ్మద్దియె పూనికన్ దలఁచి యాచరణన్ ముగియించి మీదటన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
రిప్లయితొలగించండిసదమల మతితో సతతము
పదుగురి కిట మేలొనర్చి పరపంథకులీ
యదితిని లేరంచు ధృతిని
నిదురించెడివాఁడు యశమునే గడియించున్.
విద్దెల నేర్వకున్నను వివేకము తోచరియించు వారలై
పెద్దల గౌరవించి నిరుపేదల పేర్మిని సత్కరించుచున్
గద్దఱు లైన వారలను కావలురౌజన గుండె లందునన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.
పదుగురు మెచ్చువిధంబున
రిప్లయితొలగించండిపదవిని జేబూని సతము పనిమంతుండై
హృదయము పైచేయి నిగుడ
నిదురించెడివాఁడు యశమునే గడియించున్
పద్దతి తప్పకుండు పొరపాటున లంచము లివ్వజూపినన్
వద్దని నొక్కిచెప్పెడు ప్రవర్తన కల్గిన బుద్ధిమంతుడై
యొద్దిక తోడ కార్యముల యోచన సల్పి జనుల్ శబాసనన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
ఉ॥ సుద్దులు మాని కార్యముల స్ఫూర్తిని వీడక బుద్ధిమంతుఁడై
రిప్లయితొలగించండిసద్దును జేయ నేరకఁ బ్రసన్నతఁ గాంచి సదా ఘటించుచున్
హద్దు దినమ్మునందుఁ దగు నంచును మాత్రము నేడు గంటలే
నిద్దర పోవు వాఁడు ధరణిన్ ఘన కీర్తి గడించి మించెడిన్
కం;మది లో తమమున్ బూనుచు
రిప్లయితొలగించండినిదురన్ సతతము మునిగిన నిందయె పొందున్
ముదమందుచు యోగమునన్
నిదురించెడివాఁడు యశమునే గడియించున్.
(యోగ నిద్ర అనేది ఒకటి ఉంటుంది. ఆ నిద్ర లో ఉన్న వాణ్ని మహర్షి అని ప్రశంసిస్తారు. తమోగుణపునిద్ర వేరు.యోగనిద్ర వేరు.)
ఉ:సద్దు లొనర్చుచుండగనె సైన్యము ఘోరరణమ్మునందు నన్
రిప్లయితొలగించండి"వద్దిక యుద్ధ" మం చనక,ప్రక్కగ గుర్రమె కాగ చక్కగా
నిద్దుర వోయి లేచునట నేత నెపోలియ నట్టి ధైర్యమౌ
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్”
(ఫ్రెంచ్ విప్లవ యోధుడు నెపోలియన్ చక్రవర్తికి యుద్ధం అంటే ఒక ఆట. యుద్ధం లో ఒక ప్రక్క తుపాకులు, ఫిరంగులు మోగుతున్నా అతను కాసేపు యుద్ధం ఆపండని కూడా చెప్పకుండా తన గుర్రం మీదనే హాయిగా ఐదు నిమిషాలు కునుకు తీసి లేచి మళ్లీ యుద్ధం చేసే వాడట. అంత ధైర్యం గా నిద్రించ గల ధైర్యవంతుడు కీర్తినే పొందుతాడు. )
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పదుగురి క్షేమంబు నరసి
వదలక ప్రతిరోజు దైవ ప్రార్ధన జరుపన్
హృదయముపై చేతి నిడుచు
నిదురించెడి వాడు యశమునే గడియించున్.
హద్దులు మీఱు రాక్షసుల నంతము జేయుచు భూతధాత్రిపై
రిప్లయితొలగించండితద్దయు ప్రీతి భక్తులకు దారిని జూపుచు పొంద స్వర్గమున్
పధ్ధతి చూపి మౌనులకు భక్తి భజింప, యుగాంత మందునన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
చదువకచెడిపోవుసతము
రిప్లయితొలగించండి*“నిదురించెడివాఁడు, యశమునే గడియించున్”*
వదలకపొత్తములెల్లను
సదమల మతితోపఠించసద్గుడుడగుచున్