సీత కోసము రామ భద్రుడు చేరి లంకకు యుద్ధమున్ నీతి వీడిన రావణా సురు నిండు ప్రాణము తీసినన్ బ్రీతితోడను రాజ్యమిచ్చె విభీషణుండకు, భానుజున్ భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
ఖ్యాతి గాంచిన రామ భద్రుడు కానలందున నుండగా భ్రాత యా భరతుండె కోరగ పాద రక్షల నిచ్చుచున్ భీతి యన్నదెఱుంగకుండను వీరునిన్ రణ మందు నీ భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
మ.కో:భ్రాతృ హత్యకు కారణ మ్మగు వ్రాత పట్టెను నాకు మ ద్భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా! భ్రాత యేలనొ నా యెడన్ కడు వైర మూనే నటంచు దుః ఖాతిరేకత వాలి తమ్ముడు నంగలార్చెను ఖిన్నుడై ("మా అన్నని చంపిన రాముడు భ్రాతృప్రేమ కలవాడు. మా అన్నకి నా మీద వైర మెందుకో! అన్న హత్యకు కారకుణ్నయ్యానే!" అని సుగ్రీవుదు బాధ పడ్డాడు. )
చేత లన్ గని మంద లించె ను జేయ రాని ద టం చ నె న్నా తనిన్ దను జేర దీ సియు నా శ్ర యం బొ స గెన్ కృప న్ సీత గావ గ రావ ణాసురు జంపి శీఘ్ర మె తా నని న్త్స భాతృ హంతకుడైన రాముడు భాతృ వత్సలు డే కదా
భీతి లేకయె యుండె యక్కట వీర మల్లుఁడు హాలులో భ్రాతృహంతకుఁడైన ,రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా గీత దాటని వారు కావున గేలనిచ్చుచు రక్షగాఁ దాత వోలెను డెంద మందున దాచు కొందును బ్రేమతో.
మత్తకోకిల
రిప్లయితొలగించండినీతిఁ దప్పిన నన్న రావణు నీల్గ గూల్చియు మీదటన్
జోతలందుచు వాని తమ్ముని నొప్పి రాజుగ జేయఁగన్
రాతమార్చియు నన్న రావణు రాల్చి తమ్మునిఁ గావఁగన్
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా!
రిప్లయితొలగించండిసీత కోసము రామ భద్రుడు చేరి లంకకు యుద్ధమున్
నీతి వీడిన రావణా సురు నిండు ప్రాణము తీసినన్
బ్రీతితోడను రాజ్యమిచ్చె విభీషణుండకు, భానుజున్
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
భ్రాత బాధలు తాళజాలక రక్షకోరిన భ్రాతకై
రిప్లయితొలగించండినీతిమాలిన రీతి వాలిని నేలకూల్చెను చూడగా;
భ్రాతకోరగ వానికిచ్చెను పాదుకల్ తనగుర్తుగా
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
మత్తకోకిల:
రిప్లయితొలగించండిసీతనొంటిగ కాననమ్మున జేసి మాయలు పన్ని దు
ర్నీతుఁడై గొనిపోవలంకకు నీతి జెప్పు విభీషణున్
పోతరమ్మున లెక్క సేయక పోరు సల్పెను రాముతో
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
రిప్లయితొలగించండిఖ్యాతి గాంచిన రామ భద్రుడు కానలందున నుండగా
భ్రాత యా భరతుండె కోరగ పాద రక్షల నిచ్చుచున్
భీతి యన్నదెఱుంగకుండను వీరునిన్ రణ మందు నీ
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
మ.కో:భ్రాతృ హత్యకు కారణ మ్మగు వ్రాత పట్టెను నాకు మ
రిప్లయితొలగించండిద్భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా!
భ్రాత యేలనొ నా యెడన్ కడు వైర మూనే నటంచు దుః
ఖాతిరేకత వాలి తమ్ముడు నంగలార్చెను ఖిన్నుడై
("మా అన్నని చంపిన రాముడు భ్రాతృప్రేమ కలవాడు. మా అన్నకి నా మీద వైర మెందుకో! అన్న హత్యకు కారకుణ్నయ్యానే!" అని సుగ్రీవుదు బాధ పడ్డాడు. )
చేత లన్ గని మంద లించె ను జేయ రాని ద టం చ నె
రిప్లయితొలగించండిన్నా తనిన్ దను జేర దీ సియు నా శ్ర యం బొ స గెన్ కృప న్
సీత గావ గ రావ ణాసురు జంపి శీఘ్ర మె తా నని న్త్స
భాతృ హంతకుడైన రాముడు భాతృ వత్సలు డే కదా
నీతి నెంచినఁ జంపు టెట్లగు నీతి లోకము నందుఁ దా
రిప్లయితొలగించండినాతతమ్ము తపించి లోపల నన్న లందఱి జంకకే
యాతఱిన్ జనకాజ్ఞఁ జంపెనె యౌర భార్గవ రాముఁడే
భ్రాతృహంతకుఁ డైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
భీతి లేకయె యుండె యక్కట వీర మల్లుఁడు హాలులో
రిప్లయితొలగించండిభ్రాతృహంతకుఁడైన ,రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా
గీత దాటని వారు కావున గేలనిచ్చుచు రక్షగాఁ
దాత వోలెను డెంద మందున దాచు కొందును బ్రేమతో.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోతి మూక సహాయమున్ గొని కుత్సి
తుండగు రావణున్
నీతి తప్పక భండనంబున నేర్పుగా హత
మార్చియున్
భ్రాతయైన విభీషణున్నట రాజు చేసెను
లంకకున్
భ్రాతృ హంతకుడైన రాముడు భ్రాతృ
వత్సలుడే కదా!
మత్త॥ చేతలందున దుష్టులైచనఁ జేవఁ జూపి వధించఁగా
రిప్లయితొలగించండినూతమిచ్చిరి యుత్సహించఁగ నొప్పి క్రూరుల సోదరుల్
త్రాత అయ్యెను స్వంత వారికిఁ ద్రచ్చఁ దమ్ముల నేఁచెడిన్
భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా!