14, మార్చి 2026, శనివారం

సమస్య - 5408

15-3-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”
(లేదా...)
“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”

17 కామెంట్‌లు:

  1. కందం
    నిపుణత హరి మాయావిగఁ
    గపటమునన్ దానమడుగ కాదనుము బలీ!
    విపరీతమనఁగ వామన
    తపమెందుకు? దానమేలఁ దగ సుజనులకున్?

    చంపకమాల
    నిపుణతఁ జూపుచున్ హరియె నీ దెసఁ జేరియు దానమెంచఁగన్
    గపటము దాగియుండుననఁ గాదనుమంచును దెల్పె శుక్రుడే,
    యపశృతి, ప్రాణగండమన నాడిన మాటను దప్పలేననన్
    దప మొనరింపరాదు! మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
  2. అపరిమిత భక్తితోడన
    చపలత లేకుండు రీతి సామిని దలచన్ ,
    కపటపు చేష్టలయిన యీ
    తపమెందుకు ? దానమేలఁ ? దగ సుజనులకున్

    రిప్లయితొలగించండి
  3. అపరిమితంపు భక్తి మనముందున నుంచుకొనంగ జాలునే
    చపలతలేని రీతి దన సామిని దల్చుచునుండ నొప్పగున్
    కపటపు చేష్టలందుననె కామితుడౌచు నిరంత రంబుగా
    తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”

    రిప్లయితొలగించండి
  4. స్వపరమను వేఱిమి తొలగి
    ప్రపంచమే స్వర్గమైన భావన నిడుమా!
    చపలత కికతావెక్కడ
    తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్

    చపలత లేనిమానసముఁ జక్కని భావనలే చెలంగగా
    నపజయమన్నదే వినక హాయిగనెల్లరు సంతసింపరే!
    స్వపరములేని చక్కనగు స్వర్గము గావలె విశ్వమంతయున్
    దప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్

    రిప్లయితొలగించండి

  5. ఉపకారమ్మును జేసెద
    వపకారికి నైన కాదె యవనీ తలమున్
    తపన గలిగి యది చాలదె
    తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్.


    *(హిరణ్యకశిపుడు తన రాజ్యంలో వేయించిన దండోరా...)*

    శపథము జేయుచుంటి నిట చక్రిని కొల్వగ రాదెవండిటన్
    కపిలుని దేవదేవుడని కల్మషముల్ తొలగించు వాడనిన్
    సుపథము చూపు నంచతని స్తోత్రము జేయనిషేధ మంటి నే
    తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  6. ఎపుడయినన్ గృపామతిని నెవ్వరి మేలునుఁ గోరఁబోక యే
    సుపథమునన్ జరింపక, ప్రచోదన సేయక సద్గుణాళినిన్,
    గపటము సూపుచున్ బరవికాసము నోర్వఁగలేనివారికై
    *“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”*

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  7. కృపతో నార్తులకెన్నఁడు
    నుపకారము సేయనదియె యుత్కృష్టంబౌ
    తపమగు మేలొనగూర్చును
    తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్

    రిప్లయితొలగించండి
  8. మార్చి వ్రాసిన రెండు పూరణలు క్రమాలంకారములో నండి

    కం॥ తపనయు శ్రద్ధయు కొరవడ.,
    నపరిమితముగా., మురియుచు ననిశము తోడై
    కృపనిడు దైవము వీరికి.,
    తపమెందుకు., దానమేల., దగ సుజనులకున్

    చం॥ తపనయు శ్రద్ధఁ బొందకను., దామస రూపులు., తెల్పమందువో
    యెపుడు నపాత్రులే యడుగ నేమిటి నేమము., ధాత్రి యందునన్
    నెపమును గాంచకుండఁ గడు నెమ్మిని సాయమొనర్చు చుందురే!
    తప మొనరింపరాదు మఱి., దానముఁ జేయఁగ వద్దు., సజ్జనుల్

    వృత్తములో తపన శ్రద్ధ లేకపోయినా తామస రూపులైనా తపము చేయరాదు అని అండి

    రిప్లయితొలగించండి
  9. సుపథ ము నందున సాగుచు
    కృప తో సేవలను సలుపి కీర్తి పరులు గా
    కపటము నెరుగని వారికి
    తప మెందుకు? దానమేల? దగ సుజను లకు న్

    రిప్లయితొలగించండి
  10. తపమగు లేనివారలకు దానము నీయ దయాప్రపూర్ణులై
    తపమగు నార్త రక్షణము, ధర్మపథంబున సంచరించుటల్
    తపమెటులౌను మానవులు తర్షమునున్ విడనాడకున్ననా
    తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  11. కపటం బనంగ నేరని
    విపరీత పరోపకార విలసిత మతియే
    యుపలబ్ధము గాఁగ భృశము
    తప మెందుకు దాన మేలఁ దగ సుజనులకున్


    కపటము నూని డెందమునఁ గంజ దళాక్షున కెన్నఁ డేనియుం
    గుపితుఁడు గాక వే తనదు కోరిక తీర్చుట కర్థి కీయఁగా
    నుపమమె యెన్న లంచమున కుర్విని విశ్వ వినాశనార్థమై
    తప మొనరింప రాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  12. చపలము నొందని బుధ్ధిని
    నిపుణతతో సేవఁజేయ నేరుగఁబ్రజకు
    న్రుపకృతి యయినన్నరయగఁ
    దపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”

    రిప్లయితొలగించండి
  13. ఉపకృతిఁజేయు చుండునెడ తృప్తిని పొందినవారు కల్గుచో
    తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”
    చపలపు బుధ్ధితోడమఱి సాములు కొందఱు కక్షతోడనే
    కుపితమనస్కులొందుచును గోరిక మీఱగ హానిఁజేతురో?

    రిప్లయితొలగించండి
  14. కపటము తెలియని వారికి
    తపమెందుకు ? దానమేలఁ దగ సుజనులకున్”
    నెపమెంచక నృపసుంకము
    నెపుడున్ తప్పక కట్టెడు నియమము తోడన్

    డా .అన్నపరెడ్డి వీర కుమారి

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అపకారికైన గానీ
    యుపకారము చేయనెంచు నున్నత
    మనమున్
    జపములు చేసెడు వారికి
    తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్?

    రిప్లయితొలగించండి