15-3-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”(లేదా...)“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”
కందంనిపుణత హరి మాయావిగఁగపటమునన్ దానమడుగ కాదనుము బలీ!విపరీతమనఁగ వామనతపమెందుకు? దానమేలఁ దగ సుజనులకున్?చంపకమాలనిపుణతఁ జూపుచున్ హరియె నీ దెసఁ జేరియు దానమెంచఁగన్గపటము దాగియుండుననఁ గాదనుమంచును దెల్పె శుక్రుడే,యపశృతి, ప్రాణగండమన నాడిన మాటను దప్పలేననన్దప మొనరింపరాదు! మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్!
👆 శుక్రాచార్యుడు బలిచక్రవర్తి తో...
అపరిమిత భక్తితోడనచపలత లేకుండు రీతి సామిని దలచన్ ,కపటపు చేష్టలయిన యీతపమెందుకు ? దానమేలఁ ? దగ సుజనులకున్
అపరిమితంపు భక్తి మనముందున నుంచుకొనంగ జాలునేచపలతలేని రీతి దన సామిని దల్చుచునుండ నొప్పగున్కపటపు చేష్టలందుననె కామితుడౌచు నిరంత రంబుగా తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”
స్వపరమను వేఱిమి తొలగిప్రపంచమే స్వర్గమైన భావన నిడుమా!చపలత కికతావెక్కడతపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్చపలత లేనిమానసముఁ జక్కని భావనలే చెలంగగానపజయమన్నదే వినక హాయిగనెల్లరు సంతసింపరే!స్వపరములేని చక్కనగు స్వర్గము గావలె విశ్వమంతయున్దప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
ఉపకారమ్మును జేసెద వపకారికి నైన కాదె యవనీ తలమున్ తపన గలిగి యది చాలదె తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్. *(హిరణ్యకశిపుడు తన రాజ్యంలో వేయించిన దండోరా...)*శపథము జేయుచుంటి నిట చక్రిని కొల్వగ రాదెవండిటన్ కపిలుని దేవదేవుడని కల్మషముల్ తొలగించు వాడనిన్ సుపథము చూపు నంచతని స్తోత్రము జేయనిషేధ మంటి నే తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్.
ఎపుడయినన్ గృపామతిని నెవ్వరి మేలునుఁ గోరఁబోక యేసుపథమునన్ జరింపక, ప్రచోదన సేయక సద్గుణాళినిన్, గపటము సూపుచున్ బరవికాసము నోర్వఁగలేనివారికై*“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”* - విట్టుబాబు
కృపతో నార్తులకెన్నఁడునుపకారము సేయనదియె యుత్కృష్టంబౌతపమగు మేలొనగూర్చునుతపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్
మార్చి వ్రాసిన రెండు పూరణలు క్రమాలంకారములో నండికం॥ తపనయు శ్రద్ధయు కొరవడ.,నపరిమితముగా., మురియుచు ననిశము తోడైకృపనిడు దైవము వీరికి.,తపమెందుకు., దానమేల., దగ సుజనులకున్చం॥ తపనయు శ్రద్ధఁ బొందకను., దామస రూపులు., తెల్పమందువోయెపుడు నపాత్రులే యడుగ నేమిటి నేమము., ధాత్రి యందునన్నెపమును గాంచకుండఁ గడు నెమ్మిని సాయమొనర్చు చుందురే!తప మొనరింపరాదు మఱి., దానముఁ జేయఁగ వద్దు., సజ్జనుల్వృత్తములో తపన శ్రద్ధ లేకపోయినా తామస రూపులైనా తపము చేయరాదు అని అండి
సుపథ ము నందున సాగుచు కృప తో సేవలను సలుపి కీర్తి పరులు గా కపటము నెరుగని వారికి తప మెందుకు? దానమేల? దగ సుజను లకు న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తపమగు లేనివారలకు దానము నీయ దయాప్రపూర్ణులైతపమగు నార్త రక్షణము, ధర్మపథంబున సంచరించుటల్తపమెటులౌను మానవులు తర్షమునున్ విడనాడకున్ననాతప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
కపటం బనంగ నేరని విపరీత పరోపకార విలసిత మతియే యుపలబ్ధము గాఁగ భృశము తప మెందుకు దాన మేలఁ దగ సుజనులకున్ కపటము నూని డెందమునఁ గంజ దళాక్షున కెన్నఁ డేనియుం గుపితుఁడు గాక వే తనదు కోరిక తీర్చుట కర్థి కీయఁగా నుపమమె యెన్న లంచమున కుర్విని విశ్వ వినాశనార్థమై తప మొనరింప రాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
చపలము నొందని బుధ్ధిని నిపుణతతో సేవఁజేయ నేరుగఁబ్రజకున్రుపకృతి యయినన్నరయగఁదపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”
ఉపకృతిఁజేయు చుండునెడ తృప్తిని పొందినవారు కల్గుచో తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”చపలపు బుధ్ధితోడమఱి సాములు కొందఱు కక్షతోడనే కుపితమనస్కులొందుచును గోరిక మీఱగ హానిఁజేతురో?
కపటము తెలియని వారికి తపమెందుకు ? దానమేలఁ దగ సుజనులకున్” నెపమెంచక నృపసుంకము నెపుడున్ తప్పక కట్టెడు నియమము తోడన్ డా .అన్నపరెడ్డి వీర కుమారి
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అపకారికైన గానీయుపకారము చేయనెంచు నున్నత మనమున్జపములు చేసెడు వారికితపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్?
కందం
రిప్లయితొలగించండినిపుణత హరి మాయావిగఁ
గపటమునన్ దానమడుగ కాదనుము బలీ!
విపరీతమనఁగ వామన
తపమెందుకు? దానమేలఁ దగ సుజనులకున్?
చంపకమాల
నిపుణతఁ జూపుచున్ హరియె నీ దెసఁ జేరియు దానమెంచఁగన్
గపటము దాగియుండుననఁ గాదనుమంచును దెల్పె శుక్రుడే,
యపశృతి, ప్రాణగండమన నాడిన మాటను దప్పలేననన్
దప మొనరింపరాదు! మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్!
👆 శుక్రాచార్యుడు బలిచక్రవర్తి తో...
తొలగించండిఅపరిమిత భక్తితోడన
రిప్లయితొలగించండిచపలత లేకుండు రీతి సామిని దలచన్ ,
కపటపు చేష్టలయిన యీ
తపమెందుకు ? దానమేలఁ ? దగ సుజనులకున్
అపరిమితంపు భక్తి మనముందున నుంచుకొనంగ జాలునే
రిప్లయితొలగించండిచపలతలేని రీతి దన సామిని దల్చుచునుండ నొప్పగున్
కపటపు చేష్టలందుననె కామితుడౌచు నిరంత రంబుగా
తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”
స్వపరమను వేఱిమి తొలగి
రిప్లయితొలగించండిప్రపంచమే స్వర్గమైన భావన నిడుమా!
చపలత కికతావెక్కడ
తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్
చపలత లేనిమానసముఁ జక్కని భావనలే చెలంగగా
నపజయమన్నదే వినక హాయిగనెల్లరు సంతసింపరే!
స్వపరములేని చక్కనగు స్వర్గము గావలె విశ్వమంతయున్
దప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
రిప్లయితొలగించండిఉపకారమ్మును జేసెద
వపకారికి నైన కాదె యవనీ తలమున్
తపన గలిగి యది చాలదె
తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్.
*(హిరణ్యకశిపుడు తన రాజ్యంలో వేయించిన దండోరా...)*
శపథము జేయుచుంటి నిట చక్రిని కొల్వగ రాదెవండిటన్
కపిలుని దేవదేవుడని కల్మషముల్ తొలగించు వాడనిన్
సుపథము చూపు నంచతని స్తోత్రము జేయనిషేధ మంటి నే
తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్.
ఎపుడయినన్ గృపామతిని నెవ్వరి మేలునుఁ గోరఁబోక యే
రిప్లయితొలగించండిసుపథమునన్ జరింపక, ప్రచోదన సేయక సద్గుణాళినిన్,
గపటము సూపుచున్ బరవికాసము నోర్వఁగలేనివారికై
*“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”*
- విట్టుబాబు
కృపతో నార్తులకెన్నఁడు
రిప్లయితొలగించండినుపకారము సేయనదియె యుత్కృష్టంబౌ
తపమగు మేలొనగూర్చును
తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్
మార్చి వ్రాసిన రెండు పూరణలు క్రమాలంకారములో నండి
రిప్లయితొలగించండికం॥ తపనయు శ్రద్ధయు కొరవడ.,
నపరిమితముగా., మురియుచు ననిశము తోడై
కృపనిడు దైవము వీరికి.,
తపమెందుకు., దానమేల., దగ సుజనులకున్
చం॥ తపనయు శ్రద్ధఁ బొందకను., దామస రూపులు., తెల్పమందువో
యెపుడు నపాత్రులే యడుగ నేమిటి నేమము., ధాత్రి యందునన్
నెపమును గాంచకుండఁ గడు నెమ్మిని సాయమొనర్చు చుందురే!
తప మొనరింపరాదు మఱి., దానముఁ జేయఁగ వద్దు., సజ్జనుల్
వృత్తములో తపన శ్రద్ధ లేకపోయినా తామస రూపులైనా తపము చేయరాదు అని అండి
సుపథ ము నందున సాగుచు
రిప్లయితొలగించండికృప తో సేవలను సలుపి కీర్తి పరులు గా
కపటము నెరుగని వారికి
తప మెందుకు? దానమేల? దగ సుజను లకు న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితపమగు లేనివారలకు దానము నీయ దయాప్రపూర్ణులై
రిప్లయితొలగించండితపమగు నార్త రక్షణము, ధర్మపథంబున సంచరించుటల్
తపమెటులౌను మానవులు తర్షమునున్ విడనాడకున్ననా
తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
కపటం బనంగ నేరని
రిప్లయితొలగించండివిపరీత పరోపకార విలసిత మతియే
యుపలబ్ధము గాఁగ భృశము
తప మెందుకు దాన మేలఁ దగ సుజనులకున్
కపటము నూని డెందమునఁ గంజ దళాక్షున కెన్నఁ డేనియుం
గుపితుఁడు గాక వే తనదు కోరిక తీర్చుట కర్థి కీయఁగా
నుపమమె యెన్న లంచమున కుర్విని విశ్వ వినాశనార్థమై
తప మొనరింప రాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్
చపలము నొందని బుధ్ధిని
రిప్లయితొలగించండినిపుణతతో సేవఁజేయ నేరుగఁబ్రజకు
న్రుపకృతి యయినన్నరయగఁ
దపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”
ఉపకృతిఁజేయు చుండునెడ తృప్తిని పొందినవారు కల్గుచో
రిప్లయితొలగించండితప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”
చపలపు బుధ్ధితోడమఱి సాములు కొందఱు కక్షతోడనే
కుపితమనస్కులొందుచును గోరిక మీఱగ హానిఁజేతురో?
కపటము తెలియని వారికి
రిప్లయితొలగించండితపమెందుకు ? దానమేలఁ దగ సుజనులకున్”
నెపమెంచక నృపసుంకము
నెపుడున్ తప్పక కట్టెడు నియమము తోడన్
డా .అన్నపరెడ్డి వీర కుమారి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అపకారికైన గానీ
యుపకారము చేయనెంచు నున్నత
మనమున్
జపములు చేసెడు వారికి
తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్?