17-3-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”(లేదా...)“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”
కందంఐహిక సుఖముల నొసఁగుచుదాహము తీర్చక గడింప తహతహ రేపున్మోహపడక ధనమున సందేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్ఉత్పలమాలఐహిక సౌఖ్యముల్ బడయ నందరుకోరు ధనమ్ము పొందుటన్దాహము తీర్చకే కుతిని నర్మిలి పెంచునునంతకంతకున్మోహము సెందకే మితియె ముఖ్యమటంచు గడించుటందు సందేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో!
తాహతును మీరు కోర్కెలమోహితుడై మిగులకస్తి మొగపడి యుండన్ గేహముగనెంచు యాత్మకుదేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”
డా బల్లూరి ఉమాదేవి మోహము చూపక సతతమునైహికబంధములపట్ల ,నచ్యుతు గొలువన్నాహరినేనమ్ముచుసం*“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”*దేహముశాశ్వతమ్మనుచుతీరుగ చేసిన దుష్ట కార్యముల్ మోహముతోడతప్పదిక ముప్పను మాటను మర్వకన్ సదాసోహపుభావనల్ విడిచి చూచుచు నెల్లర మంచిగాను, సం *“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”*
ఐహిక సుఖముల పై వ్యా మోహమ్ము కలిగిన వారె పుడమి నరులనన్ ద్రోహులు దుర్మతు లను సం దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్.ఐహిక మైన సౌఖ్యముల నర్మిలి పొందుట యందు హెచ్చు వ్యా మోహము కల్గి యీశ్వరుడు మోక్షము గూర్చి వచించు వారలన్ ద్రోహులటంచు సంపదల దోచెడి మార్గమె వారి కంచు సం దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో.
ఊహల చిందులతో నుత్సాహము పొంగారు వేళ తన చిత్తములోమోహముఁ బోనొత్తెడు సందేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్ఊహలు చిందులేసి మధురోహల చిక్కిన మానసమ్ము నుత్సాహము పొంగులెత్తి మరి తప్పులు సేయగ నెంచినంతనేమోహమునే జయింపమను మోసపు మాటలు కల్గజేయు సందేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో
కందం
రిప్లయితొలగించండిఐహిక సుఖముల నొసఁగుచు
దాహము తీర్చక గడింప తహతహ రేపున్
మోహపడక ధనమున సం
దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్
ఉత్పలమాల
ఐహిక సౌఖ్యముల్ బడయ నందరుకోరు ధనమ్ము పొందుటన్
దాహము తీర్చకే కుతిని నర్మిలి పెంచునునంతకంతకున్
మోహము సెందకే మితియె ముఖ్యమటంచు గడించుటందు సం
దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో!
తాహతును మీరు కోర్కెల
రిప్లయితొలగించండిమోహితుడై మిగులకస్తి మొగపడి యుండన్
గేహముగనెంచు యాత్మకు
దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిమోహము చూపక సతతము
నైహికబంధములపట్ల ,నచ్యుతు గొలువన్
నాహరినేనమ్ముచుసం
*“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”*
దేహముశాశ్వతమ్మనుచుతీరుగ చేసిన దుష్ట కార్యముల్
మోహముతోడతప్పదిక ముప్పను మాటను మర్వకన్ సదా
సోహపుభావనల్ విడిచి చూచుచు నెల్లర మంచిగాను, సం
*“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”*
రిప్లయితొలగించండిఐహిక సుఖముల పై వ్యా
మోహమ్ము కలిగిన వారె పుడమి నరులనన్
ద్రోహులు దుర్మతు లను సం
దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్.
ఐహిక మైన సౌఖ్యముల నర్మిలి పొందుట యందు హెచ్చు వ్యా
మోహము కల్గి యీశ్వరుడు మోక్షము గూర్చి వచించు వారలన్
ద్రోహులటంచు సంపదల దోచెడి మార్గమె వారి కంచు సం
దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో.
ఊహల చిందులతో ను
రిప్లయితొలగించండిత్సాహము పొంగారు వేళ తన చిత్తములో
మోహముఁ బోనొత్తెడు సం
దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్
ఊహలు చిందులేసి మధురోహల చిక్కిన మానసమ్ము ను
త్సాహము పొంగులెత్తి మరి తప్పులు సేయగ నెంచినంతనే
మోహమునే జయింపమను మోసపు మాటలు కల్గజేయు సం
దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో