ప్రేమగ జానకి యొడిలో రాముడు శయనించి యుండ శ్రావక మొకటిన్ భామ యెడమేను పొడవగ రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్.
భాముడు తీవ్ర రూపమున బైలును నిప్పులు రాల్చు వేళ లో భామిని సీత యంకమున పర్ణ కుటీరములో శయింపగా రాముడు ప్రత్యుటాకము వరానన వక్షము గాయ పర్చగా రాముని వక్షమం దెసఁగె రక్తపదద్వయముద్ర లద్దిరా.
యామిని సమయము నందున
రిప్లయితొలగించండికోమలి సీతను కవుగిలి గొను తరుణమునన్
నామె నుదిటి కుంకుమొలయ
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్”
కందం
రిప్లయితొలగించండికోమల పాదాలంకృత
రామాత్మజులాడ హృదయ రమ్యస్థలిపై
సేమముగ నా కుటీరా
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్!
ఉత్పలమాల
కోమలమైన పాదములఁ గూర్చి యలంకృతు లా కుమారులన్
దామరకంటి సీత యిడ, ధన్యచరిత్రుడు ప్రేమమీరగన్
సేమము నాడిపించ హృది సీమను బ్రేమ నహో! తదాశ్రమా
రాముని వక్షమం దెసఁగె రక్తపదద్వయముద్ర లద్దిరా!
చామ పదంబులనలదిన
రిప్లయితొలగించండిపైమెఱుగు తళుకులనరసి వైవశ్యముతో
రాముడు హత్తుకొనునపుడు
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్
భామిని పాదపద్మముల భాసిలు కాంతుల మంత్రముగ్ధుడై
రాముడు హత్తుకొన్న యెడ రమ్యమనోహర రీతినిన్ జెలుల్
భూమిజ పాదయుగ్మమున పూసిన కుంకుమ తాకినంతనే
రాముని వక్షమం దెసఁగె రక్తపదద్వయముద్ర లద్దిరా
రిప్లయితొలగించండిప్రేమగ జానకి యొడిలో
రాముడు శయనించి యుండ శ్రావక మొకటిన్
భామ యెడమేను పొడవగ
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్.
భాముడు తీవ్ర రూపమున బైలును నిప్పులు రాల్చు వేళ లో
భామిని సీత యంకమున పర్ణ కుటీరములో శయింపగా
రాముడు ప్రత్యుటాకము వరానన వక్షము గాయ పర్చగా
రాముని వక్షమం దెసఁగె రక్తపదద్వయముద్ర లద్దిరా.
కం॥ భామను చెరనిడ రావణుఁ
రిప్లయితొలగించండిడామెకు దుఃఖము తొలఁగఁగ నాజిని త్రుంచన్
భూమిని తాకుచుఁ జిందఁగ
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్
(ఇక్కడ పాద ముద్రలు కానందున చిందిన రక్తపు ముద్రలండి)
ఉ॥ భామిని కాంచెనే త్రిజట భవ్య పరాక్రమ మొప్ప రావణున్
దామస రూపు స్వప్నమునఁ ద్రాత వధించఁగ కుప్పకూలుచున్
భూమిని తాకువేళనటు పొర్లుచు నంటగ రాఘవేంద్రునిన్
రాముని వక్షమందెసఁగె రక్తపదద్యయ ముద్ర లద్దిరా
(ఇక్కడ పాదముద్రలన్నందున త్రిజటకు స్వప్నములో అలా కనిపించిందని యండి)
త్రాత కాచువాడు రాముడండి
కం:కాముకు డౌ రావణుడున్
రిప్లయితొలగించండిభీమ పరాక్రమము జూపి వేయగ శరముల్
శ్యామ శరీరుండగు శ్రీ
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్
కాముకు దగు రావణు తో
రిప్లయితొలగించండిభీమము గా పోరు సల్ప భీకర శరము ల్
కోమల తనువును దాక గ
రాముని వక్షమున నెస గె రక్తపు ముద్ర ల్
దామోదరు ప్రోద్బలమున
రిప్లయితొలగించండిభీమమ్ముగఁ జెలఁగి చంప వెస నాటల యం
దేమఱక ప్రలంబుని బల
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్
భూమిపుఁ డైన నేమి తన ముద్దుల కొడ్కున కీఁడె ముద్దులన్
సీమను గాంచ లేము పరిశీలన సేయఁగఁ గన్న ప్రేమకుం
బ్రేమ సెలంగఁ దండ్రి మురిపెమ్ముగ నిల్పఁ గుమారు శైశవున్
రాముని, వక్షమం దెసఁగె రక్త పదద్వయ ముద్ర లద్దిరా
[రక్తపదద్వయము = ఎఱ్ఱని పాదయుగము]
భామామణి సీతంగని
రిప్లయితొలగించండిప్రేమన్జేరంగనామె పెణకువ లాడన్
వేమారుఁగౌగిలించఁగ
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్.
భామిని మోమున తిలకము
రిప్లయితొలగించండిరామునిమేనునకుతాక రాగము తోడన్
శ్యామలవర్ణుండౌయా
రాముని వక్షముననెసగె రక్తపు ముద్రల్