1-4-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్”(లేదా...)“వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ”
కందంరోదనమున బాధితులున్వాదింప నెదురుగ నష్టపరిహారముకై,సాధింపగ లాయరుతోవాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్ఉత్పలమాలరోదనమందు బాధితులు రొక్కము నష్టనివారణమ్ముగన్మాదగు న్యాయమన్ బగిది మర్మము విప్పుచు వాదులాడినన్నీదగు నైపుణిన్ జెలఁగి నిశ్చయమందున న్యాయవాదితోవాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య! వృత్తియౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వాదులాడు చుండిరనుచు వగచి , న్యాయవాది తగవరి యెదుటన బరిఘటించువాదన న్యాయమ్ము కొఱకు ; వైద్యుఁ డొనర్చున్వేదన బాపుట ; నగదము విరివిగ నిడుచున్
మేదిని వకీలు సలిపెడువాదన న్యాయమ్ము కొఱకు; వైద్యుఁ డొనర్చున్బాధిత రోగుల శరీరవేదన తొలగించు రీతి విరుగుడు క్రియలన్మేదిని న్యాయవాది పని మేధకు నేర్పుకు లంకెవేయుచున్వేదనఁ బొందువారలకు వేగమె న్యాయము గల్గు రీతినిన్వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె; వైద్యవృత్తియౌభాధితులైన రోగులకు పట్టిన బాధలు దొల్గజేయుటే
మోదం బనుచును హెచ్చుగకాదంబరి గ్రోలి నట్టి ఖలుడు వచించెన్ సోదర భువిలో కాంచగవాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్.మోదమె మద్యమంచునెడి మూర్ఖుడొకండట పాన శాలలో స్వాదురసమ్ము గ్రోలి యను సారకు లెల్లరి తోడ మత్తు లో వాదన సేయుచున్ బలికె పాటవ మొప్పెడి రీతిగా భువిన్ వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ.
కందం
రిప్లయితొలగించండిరోదనమున బాధితులున్
వాదింప నెదురుగ నష్టపరిహారముకై,
సాధింపగ లాయరుతో
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్
ఉత్పలమాల
రోదనమందు బాధితులు రొక్కము నష్టనివారణమ్ముగన్
మాదగు న్యాయమన్ బగిది మర్మము విప్పుచు వాదులాడినన్
నీదగు నైపుణిన్ జెలఁగి నిశ్చయమందున న్యాయవాదితో
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య! వృత్తియౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాదులాడు చుండిరనుచు వగచి , న్యాయ
రిప్లయితొలగించండివాది తగవరి యెదుటన బరిఘటించు
వాదన న్యాయమ్ము కొఱకు ; వైద్యుఁ డొనర్చున్
వేదన బాపుట ; నగదము విరివిగ నిడుచున్
మేదిని వకీలు సలిపెడు
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ము కొఱకు; వైద్యుఁ డొనర్చున్
బాధిత రోగుల శరీర
వేదన తొలగించు రీతి విరుగుడు క్రియలన్
మేదిని న్యాయవాది పని మేధకు నేర్పుకు లంకెవేయుచున్
వేదనఁ బొందువారలకు వేగమె న్యాయము గల్గు రీతినిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె; వైద్యవృత్తియౌ
భాధితులైన రోగులకు పట్టిన బాధలు దొల్గజేయుటే
రిప్లయితొలగించండిమోదం బనుచును హెచ్చుగ
కాదంబరి గ్రోలి నట్టి ఖలుడు వచించెన్
సోదర భువిలో కాంచగ
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్.
మోదమె మద్యమంచునెడి మూర్ఖుడొకండట పాన శాలలో
స్వాదురసమ్ము గ్రోలి యను సారకు లెల్లరి తోడ మత్తు లో
వాదన సేయుచున్ బలికె పాటవ మొప్పెడి రీతిగా భువిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ.