1, ఏప్రిల్ 2026, బుధవారం

సమస్య - 5426

2-4-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరువదేండ్ల వరు వరించె నలరి బాల”
(లేదా...)
“అరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్”

8 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      వరుని తండ్రికి మొన్ననే వైభవముగ
      షష్టిపూర్తి ముగిసెనన సంబరమునఁ
      ' గట్టుకొనెడువాడట తాళిఁ గట్టఁ' ,మ్రొక్కి
      నరువదేండ్ల వరు, 'వరించె నలరి బాల'

      చంపకమాల
      మురిపెపు ప్రేమ సంద్రమున మున్కలువైచిన జంట పెండ్లియే
      జరిగెడు ముందుగన్ వరుని సత్పితనొందఁగ షష్టిపూర్తియే
      ' మరుడను వాడె కట్టగనె మంగళసూత్రము' ,మ్రొక్కి మామయే
      యరువది యేండ్ల పెండ్లికొడు కంచు, 'వరించెను బాల ప్రేముడిన్'

      తొలగించండి
  2. తరలి వచ్చిరి పౌత్రిలు , తాత గారి
    ని వరునిగ సవరణ జేయ , నెమ్మి నొంది
    అరువదేండ్ల వరు వరించె నలరి బాల
    తనకు ముద్దులీ యమనుచు దనివిదీర

    రిప్లయితొలగించండి
  3. నిత్యనూతనమైన దాంపత్యమందు
    షష్టిపూర్తి సంబరమును జరుపునాడు
    బంధువులు వేడ్కగానిట్లు పలికినారు
    అరువదేండ్ల వరు వరించె నలరి బాల


    పరువము మించిపోయినను భ్రాతియొకింతయు మాసిపోని యా
    యిరువురు పుణ్యదంపతులు యింపుగ చేసిన కాపురంబునన్
    వెరవుగ షష్టిపూర్తియను వేడుక సల్పెడువేళ నాథుఁడే
    యరువది యేండ్ల పెండ్లికొడుకంచు వరించెను బాల ప్రేముడిన్

    రిప్లయితొలగించండి

  4. తాన మేరికాకేగగ తగిన యనుమ
    తులవి లభియింప లేదని సులభ మార్గ
    మైన యచటి పౌరుండగు జీను డైన
    అరువదేండ్ల వరు వరించె నలరి బాల.


    స్థిరముగ నుండ నెంచి పర దేశము నేగగ నెంచనేమి సం
    గరము లభించ లేదనుచు కన్నియ యచ్చటి పౌర సత్వమే
    జరతియె కల్గి యుండెనని సంకట ముండదటంచు నమ్మి యా
    యరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్.

    రిప్లయితొలగించండి
  5. పరువము లేతదౌ పడుచు పండుగ రోజునఁ జూచెనాతనిన్
    బరిచయ మైనతత్క్షణము ప్రశ్రయమేర్పడె షష్టిపూర్తిపై
    సరియగు జోడుగాఁ దలచి సత్వర మాతనిఁ గోరుకొన్నదై
    యరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రేమ గ్రుడ్డిదనిరి మన పెద్దవారు
      వారి పలుకులకు రుజువు పడతి చూపె
      చూచి నంతట మెచ్చెను సుదతి వరుని
      నరువదేండ్ల వరు వరించె నలరి బాల

      తొలగించండి
  6. ముప్పదేండ్ల క్రితమ్మున ముచ్చటగను
    మూడుముళ్ళు వేసిన పతి మురిసి తాను
    మరల షష్ఠిపూర్తియనుచు మనువునాడ
    అరువదేండ్ల వరు వరించె నలరి బాల”*



    తరుణిగపెండ్లియాడితిని తండ్రియుచూసినవానినప్పుడే
    త్వరితముగానుసాగెనుగ ప్రాయముదాటెను షష్ఠిపూర్తికిన్
    తరుణమువచ్చెనంచునటతానుతలంచుచుసంతసమ్ముతో
    *“నరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్”*



    రిప్లయితొలగించండి