మతి లేని మాట లేలర పతి వ్రతము నాచరించు పడుతుల కిలలో పతి మరణము గన శాపము పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్?
తెగులది సోకె దిట్టలుగ ధృత్వరి పేరును గన్న వారె య స్తగమన మింక తప్పదని సాధ్వికి చెప్పిన వేళ యామెయే వగచక ముక్తి మార్గమను భావన తో జన వారణాశి లో మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే.
పతనమగు వారి నారయ
రిప్లయితొలగించండిశతవిధముల మగడు జతన జరుపుచు నుండన్
గతిని నిలుపు దళముల యధి
పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్
కందం
రిప్లయితొలగించండివెతపడు కన్యలఁ గావఁగ
సతితో నరకుని వధించు సమితిన్., సత్యా
పతి చేత నయ్యసురగణ
పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్
చంపకమాల
వగపును బాప కన్యలకుఁ బంకజనేత్రుడు ''సత్యభామ' 'తో
భగభగమండుచున్ నరకుఁ బాపిని గూల్చరణంబుకేగియున్
నిగుడుచు నిక్కుచున్ బరమనీచుని 'దుష్టుని' సంహరింపగన్
మగడు, 'గతింపఁ' ,గాంచి కడు మంగళమంచుఁ దలంచె ''భార్య' 'యే
రిప్లయితొలగించండిమతి లేని మాట లేలర
పతి వ్రతము నాచరించు పడుతుల కిలలో
పతి మరణము గన శాపము
పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్?
తెగులది సోకె దిట్టలుగ ధృత్వరి పేరును గన్న వారె య
స్తగమన మింక తప్పదని సాధ్వికి చెప్పిన వేళ యామెయే
వగచక ముక్తి మార్గమను భావన తో జన వారణాశి లో
మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే.