విజయుడు జానపదమునే సృజించె నబ్బురపు చలన చిత్రంబనుచున్ నిజముగ చూపిన దృశ్యము గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్
క్రొత్తగ గండరించె తన కోరిక మేరకు చిత్ర రాజమున్ జిత్త ప్రవృత్తితో చలన చిత్రము నిర్మిత మయ్యెఁ జూడగా తెత్తులు భూతముల్ మరియు దృశ్యములందున మంత్రతంత్రముల్ మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా
ద్విజులందు బుట్టి గాంధీ ,
రిప్లయితొలగించండియజేయులుగ ప్రథ బడసిన యాంగ్ల యరసులన్
గజగజ లాడించుట గన
గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్
ఒత్తిడి తాళ లేక పనిలో పలవించుచు నుండు నెల్లెడన్
రిప్లయితొలగించండిబొత్తిగ నొక్క వాక్యమును పోడిగ వ్రాయగలేదు, యామెకో
యుత్తము రాలు పుత్రికగ నుద్గతి గాన్ వచియించి రెల్లరున్
’మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా”.
కందం
రిప్లయితొలగించండిగజగజ వణికించి జనుల
రుజలొందగ చేసెనౌర రూఢిగ కలుగన్
గజహస్తము కొండి యనఁగ
గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్!
ఉత్పలమాల
అత్తరి కొండికిన్ బదులునందెనొ తొండము గుట్టినంతటన్
బిత్తర పోవ రక్తమును బీల్చునె యూపిరులాగునట్లుగన్
తత్తర రేపుచుండెఁగద తాలుటనెట్లనఁ బల్కిరెల్లరున్,
"మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా! "
విజయుడు జానపదమునే
రిప్లయితొలగించండిసృజించె నబ్బురపు చలన చిత్రంబనుచున్
నిజముగ చూపిన దృశ్యము
గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్
క్రొత్తగ గండరించె తన కోరిక మేరకు చిత్ర రాజమున్
జిత్త ప్రవృత్తితో చలన చిత్రము నిర్మిత మయ్యెఁ జూడగా
తెత్తులు భూతముల్ మరియు దృశ్యములందున మంత్రతంత్రముల్
మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా
రిప్లయితొలగించండిసుజను డొకడు చెలి మరితో
వ్రజ నాథుని గాథ తెలిపి ప్రవచించె నిటుల్
కుజనుల శిక్షించుటకై
గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్.
తత్తర పాటు లేక సతతమ్ము జపమ్ముగ నెంచి తాను భూ
భృత్తును తల్చుచుండు నరవిష్వను పుత్రుని గాంచి విజ్ణులే
బిత్తర పోయి పల్కిరట పృథ్విని దుష్టుల మచ్చ మాపగా
మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా.
రుజువులు లేనట్టి వి ధ ము న ను
రిప్లయితొలగించండిప్రజలన మా యకులు జేసి పలుకుట మేలా,?
నిజమది కాదది యెక్కడ
గజ మొ క్క టి పు ట్టె నీ గ గ ర్బము నం దున్?
మొ దటి పాదంలో విధ మున అని సవరణ చేయడమైనది
తొలగించండి