8-4-2026 (బుధవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే” (లేదా...) “పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే” (ఈ సమస్యను ఎవరు పంపారో గుర్తు లేదు. వారికి ధన్యవాదాలు)
కం:పక్షిని గొట్టిన హింసా పక్షిని గౌతముఁడు గొట్టె, "వద్దన సఖుఁడే కక్ష గొను" నంచు వెరువక శిక్షకు వలె వాదమున విశేష ప్రేమన్. (గౌతముడు హింసాపక్షం వహించిన దేవదత్తుణ్ని వాదం తో కొట్టాడు. అదీ ప్రేమగానే.శిక్షకుని లాగా అనగా విద్య నేర్పే వాడి లాగా. )
పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే అన్నది సమస్యాపాదం. అందరూ దీనిని దేవదత్తుఁడే వద్దని చెప్పగ గౌతముఁడు పక్షినిఁ గొట్టె అని అన్వయించుకొని పూరిస్తున్నారు. కాని మరొక అన్వయం ఉంది. బహుశః అదే సరైనదేమో కూడా. దాని ప్రకారం దేవదత్తుఁడే పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ. ఇలా చూస్తే అసలు సమస్యే లేదు. మరి సమస్య ఏమిటీ అంటే ఈ అన్వయం చప్పున స్ఫురించటం అన్నమాట! సమస్యా పాదం వినగానే పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే అని తోచటంతో సమస్య విడిపోతుంది! ఈ విధంగా ఆదూరి ఫణీంద్రరావు గారు పూరించటం ముదావహం. స్వస్తి.
చక్షువుల పైకెగబడగ
రిప్లయితొలగించండితక్షణమే యొడిసిపట్టి , దానికి దగుదౌ
శిక్ష నొసంగుట కొరకై
పక్షిని గౌతముఁడు గొట్టె , వద్దన సఖుఁడే
బాగుంది మీ పూరణ.
తొలగించండిరక్షణ చేయుచు మనుజుల
రిప్లయితొలగించండిత క్షణ మే సాయ పడె డి దయగల శీలు న్
కక్ష గ పలుక గ నెప్పుడు
పక్షిని గౌతము డుగొ ట్టె వద్దన సఖు డే?
బాగున్నదండీ..
తొలగించండి-
రిప్లయితొలగించండిఅక్షరము వ్రాయ తెలియదు
పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే
సాక్షిగ! స్వయమగు నేర్పిది
దీక్షగ సాధించినదిది ధీమహి తోడై
మంచి పూరణ.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. 'విహంగమునకు' అనడం సాధువు. అక్కడ 'ద్విజమ్మునకు' అనవచ్చు. 'తక్షణ' కాదు.. అది 'తత్క్షణ'. కాని దానివల్ల ప్రస తప్పుతుంది.
తొలగించండి[ధన్యవాదాలు గురూజీ .🙏... సవరించిన పూరణ....]
తొలగించండిరక్షించెను గాయపడిన
పక్షిని గౌతముఁడు; గొట్టె వద్దన సఖుఁడే
శిక్షణలో భాగమనుచు
దక్షత పెంపొసగ దేవ దత్తుడు శిఖితో
శిక్షణ పొందనెంచి క్రమశిక్షణతో విలువిద్య నేర్చుచున్
దక్షత పెంపొనర్చునని తానొక వీరతరమ్ము తోడుతన్
బక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పగ, దేవదత్తుఁడే!
రక్షణ నిచ్చె గౌతముడు రాలిన పక్షికి తత్క్షణంబునన్
భిక్షుకుడాతఁడు జీవుల
రిప్లయితొలగించండిరక్షణ గోరును తలపడు మ్రక్కిడ నెపుఁడున్
భిక్షువు నట్లన దగునా
పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే?
బాగున్నది.
తొలగించండిరక్షకుడైన గౌతముఁడు ప్రాణుల యున్నతి కాంక్ష చేయుచున్
రిప్లయితొలగించండిరక్షణగోరు నెల్లరకు రాక్షస వృత్తిని కీడు సేయునా?
కుక్షిని నింపగా దలచి గ్రూరముగా వినువీధిఁబోవునా
పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పగ, దేవదత్తుఁడే
బాగున్నది మీ పూరణ.
తొలగించండికం॥ దక్షుఁడు గౌతముఁడు గద వి
రిప్లయితొలగించండిచక్షణఁ గనని మడియఁడగు సంరంభముతోఁ
గక్షను గట్టుచు వ్రాసెనొ
పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే
ఉ॥ దక్షుఁడు గౌతముండటులఁ దాల్మిని నేర్పఁగ దేవదత్తుఁడే
రాక్షస బుద్ధిఁ గాంచి చనె రంధినిఁ బెంచుచుఁ గ్రూరుఁడై సదా
కక్షలఁ గట్టుచున్ విషముఁ గ్రక్కెడు వారలు వ్రాసిరీ విధిన్
బక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పఁగ దేవదత్తుఁడే
సంరంభము కోపము
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండికం:పక్షిని గొట్టిన హింసా
రిప్లయితొలగించండిపక్షిని గౌతముఁడు గొట్టె, "వద్దన సఖుఁడే
కక్ష గొను" నంచు వెరువక
శిక్షకు వలె వాదమున విశేష ప్రేమన్.
(గౌతముడు హింసాపక్షం వహించిన దేవదత్తుణ్ని వాదం తో కొట్టాడు. అదీ ప్రేమగానే.శిక్షకుని లాగా అనగా విద్య నేర్పే వాడి లాగా. )
బాగున్నది.
రిప్లయితొలగించండిఉ:కుక్షిని నింప రుచ్య మగు కూటిని బొందగ పక్షి మాంసమున్
రిప్లయితొలగించండిభక్షణ జేయ రాజులకు పాపము కాదని దేవదత్తు డా
పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పగ, దేవదత్తుఁ డే
కక్షణ మందు నవ్వుకొనె "క్షత్రియుడే యిత?" డంచు నెంచుచున్.
(ఈ సిద్ధార్థుడు అసలు క్షత్రియుడేనా అనుకొని దేవదత్తుడు నవ్వుకొన్నాడు. )
పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే అన్నది సమస్యాపాదం. అందరూ దీనిని దేవదత్తుఁడే వద్దని చెప్పగ గౌతముఁడు పక్షినిఁ గొట్టె అని అన్వయించుకొని పూరిస్తున్నారు. కాని మరొక అన్వయం ఉంది. బహుశః అదే సరైనదేమో కూడా. దాని ప్రకారం దేవదత్తుఁడే పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ. ఇలా చూస్తే అసలు సమస్యే లేదు. మరి సమస్య ఏమిటీ అంటే ఈ అన్వయం చప్పున స్ఫురించటం అన్నమాట! సమస్యా పాదం వినగానే పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే అని తోచటంతో సమస్య విడిపోతుంది! ఈ విధంగా ఆదూరి ఫణీంద్రరావు గారు పూరించటం ముదావహం. స్వస్తి.
రిప్లయితొలగించండిఆహా
తొలగించండిఎంత మాంఛి వివరణ.
సమస్య:
రిప్లయితొలగించండి*పక్షిని గొట్టె గౌతముడు వద్దని చెప్పగ దేవదత్తుడే*
ఉ.
వీక్షణ జేసి చక్కగను విష్ణుపదంబున పోవుచుండు యా
పక్షిని గొట్టె, గౌతముడు వద్దని చెప్పగ దేవదత్తుడే
పక్షమునందు గట్టిగను పాపపు కార్యమిదంచు యెంచకన్
రాక్షస బుద్ధిచే రగిలి రక్తపు ధారలు కారునట్లుగా
ఆర్కే శర్మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిదక్షత, రూపము మేరకె
వీక్షింప జనులు నటులుగ వేసిరి పాత్రల్
నిక్షిప్త గుణము వీడక
పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే!
ఉత్పలమాల
దక్షత రూపమున్ వెరశి దక్కిన పాత్రల జూప నైపుణిన్
వీక్షణ జేసెరే జనులు వేడుకఁ జేసెడు నాటకమ్మనన్
కుక్షియె నేర్చెడున్ రుచుల కోరెడు కౌతుక వాస్తవమ్మునన్
పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే!
ఈ క్షితిని దేవదత్తుఁడు
రిప్లయితొలగించండిదాక్షిణ్యము లేని సఖుఁడు దాఁ గ్రూరుండై
సక్షమ వే రక్షింపఁగఁ
బక్షిని గౌతముఁడు, గొట్టె, వద్దన సఖుఁడే
అక్షయ పాప కర్ముఁడు నరాధముఁ డుగ్రుఁడు బాంధవుండు దా
నీ క్షితిపాత్మ జాతునకు నెన్నఁగ భిన్న మనస్కుఁ డింకనున్
రాక్షస సన్నిభాత్ముఁడు నిరర్థకుఁ డౌర దయా విహీనుఁ డై
పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పఁగ, దేవదత్తుఁడే
ఉత్పలమాల//
రిప్లయితొలగించండిశిక్షను బొందెడున్ తరుణశీలముతో విలుబట్టి వేగమే !
పక్షినిఁ గూల్చఁగా దలచె భావన సేయక నాడు రాహువున్ !
నక్షము ముందటన్ నిలువ నమ్మకమున్ గనలేక సిద్ధుఁడౌ !
పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే !!
✍️ Malli Siripuram srisailam
ఉత్పలమాల//
శిక్షకుఁడౌచు ద్రోణుకడ శీఘ్రముగా ధనురాది విద్యలన్ !
శిక్షణఁ బొందు కాలమున జిత్తమునన్ భ్రమ నొంది యెక్కడో !
పక్షినిఁ గొట్టె గౌతముఁడు; వద్దని చెప్పగ దేవదత్తుఁడే !
రక్షణఁ జేయగాఁ దలఁచె; రాజకుమారక లీల చిత్రమౌ !!
✍️ Malli Siripuram srisailam
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రక్షించె భీతి చెందిన
పక్షిని గౌతముడు; గొట్టె వద్దన సఖుడే
రాక్షస ప్రవృత్తి జూపుచు
కుక్షిని నింపుకొన దలచి క్రూరత్వముతో.