9-4-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును”(లేదా...)“తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆంగ్ల భాష నే ర్చి యమెరికా కు వెడలి భాష మరచి పో వ భావ్యమగున తెలుగు వాడు తెలుగు దివ్య మ్ము నేర్చి తెలుగు లోన బలుక దిట్ట యగును
మూడవ పాదం చివర గానే ర్చిఅని సవరణ చేయడమైనది
ఆటవెలదిలలితమైన తెనుగు రంజిల్లఁ బలుకక, నిన్నమొన్న నేర్చి నిగిడి మిగులసదరు భాషతోడ సంకరమొందించితెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగునుచంపకమాలవెలుగులఁ జిమ్ము భాష విన వెన్నను బోలెడు సున్నితంబుగన్బలికిన జున్నుఁ జిందుచును బంచును మాధురి తెన్గు భాషయే!పలుచనఁ జేసి, యన్యముల పట్టియు సంకరమొంద వంకరన్దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
ఆ.వె.తెలుగు భాషలోని తియ్యందనమ్మునుతెలుసుకొనగలేక తెలివిమాలివచ్చిరాని మాట లిచ్చవచ్చిన యట్లుతెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
చంపకమాల:గలగలపాఱు యేరువలె గజ్జెల సవ్వడివోలె తేనియల్చిలికిన రీతిగా మనసు జివ్వను తెల్గున మాటలాడినన్తెలివి యొకింతలేక గణుతింపక మాటలలోని భావమున్తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
తెలుగు నేలఁ బుట్టి తెలుగు భాషనునేర్చితెలుగు నుచ్చరింప దిగులు పడుచుతెలుగు మాధ్యమమును దొలగింతు నేననితెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగునుతెలుగుల నేలపై వెలసి తెన్గు పదంబుల నుచ్చరింపగాదలపక తెల్గదేలయని తాను తెలుంగున పాఠశాలలన్దొలఁగగ జేతు నేననుచు తొందరపాటున వక్కణించుచున్దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
ప్రభుత నిర్ణయించె పదవి నిడగ నాడుదెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగునుననుచు, పాఠ శాల యందునాంగ్లమె యన దెలుగు భాష బతుకు తెల్ల వారె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంగ్ల భాష నే ర్చి యమెరికా కు వెడలి
రిప్లయితొలగించండిభాష మరచి పో వ భావ్యమగున
తెలుగు వాడు తెలుగు దివ్య మ్ము నేర్చి
తెలుగు లోన బలుక దిట్ట యగును
మూడవ పాదం చివర గానే ర్చిఅని సవరణ చేయడమైనది
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిలలితమైన తెనుగు రంజిల్లఁ బలుకక,
నిన్నమొన్న నేర్చి నిగిడి మిగుల
సదరు భాషతోడ సంకరమొందించి
తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
చంపకమాల
వెలుగులఁ జిమ్ము భాష విన వెన్నను బోలెడు సున్నితంబుగన్
బలికిన జున్నుఁ జిందుచును బంచును మాధురి తెన్గు భాషయే!
పలుచనఁ జేసి, యన్యముల పట్టియు సంకరమొంద వంకరన్
దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
ఆ.వె.
రిప్లయితొలగించండితెలుగు భాషలోని తియ్యందనమ్మును
తెలుసుకొనగలేక తెలివిమాలి
వచ్చిరాని మాట లిచ్చవచ్చిన యట్లు
తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
చంపకమాల:
రిప్లయితొలగించండిగలగలపాఱు యేరువలె గజ్జెల సవ్వడివోలె తేనియల్
చిలికిన రీతిగా మనసు జివ్వను తెల్గున మాటలాడినన్
తెలివి యొకింతలేక గణుతింపక మాటలలోని భావమున్
తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగు నేలఁ బుట్టి తెలుగు భాషనునేర్చి
రిప్లయితొలగించండితెలుగు నుచ్చరింప దిగులు పడుచు
తెలుగు మాధ్యమమును దొలగింతు నేనని
తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
తెలుగుల నేలపై వెలసి తెన్గు పదంబుల నుచ్చరింపగా
దలపక తెల్గదేలయని తాను తెలుంగున పాఠశాలలన్
దొలఁగగ జేతు నేననుచు తొందరపాటున వక్కణించుచున్
దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్
ప్రభుత నిర్ణయించె పదవి నిడగ నాడు
రిప్లయితొలగించండిదెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
ననుచు, పాఠ శాల యందునాంగ్లమె యన
దెలుగు భాష బతుకు తెల్ల వారె