10-4-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ”(లేదా...)“ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్”
గగన మందున మబ్బులు గాను పించి వివిధ రూ పాలతో నవి వేడ్క సేయ నాక సంబున దేలె హర్మ ంబు లె న్నొ యనుచు నబ్బు ర ముగ గాంచి రందర పుడు
తేటగీతిబీడుభూములనుచు రైతు వేదనఁబడధరలు పలుకు దినమదె దగ్గరపడంగసహజవాయు నిక్షేపాల ఛాయఁదెలిసిఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ!శార్దూలవిక్రీడితముమాకే రీతిని మేలు చేయునని కంపమ్మెత్త రైతన్నలన్శోకమ్మందున బీడు భూములవియే శుష్కింపఁ జేయంగనేసాకారమ్మయి వాయువే సహజమై సంపన్నతన్ లభ్యమైయాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
కృత్రిమమగు బుద్ధిని వాడ , కృతము నొందె చలన చిత్రమొకటి యొక జాణ చేత ,చెన్నుగ ఫరిశీలించగ చిత్రమందు నాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ
గగన మందున మబ్బులు గాను పించి
రిప్లయితొలగించండివివిధ రూ పాలతో నవి వేడ్క సేయ
నాక సంబున దేలె హర్మ ంబు లె న్నొ యనుచు నబ్బు ర ముగ గాంచి రందర పుడు
తేటగీతి
రిప్లయితొలగించండిబీడుభూములనుచు రైతు వేదనఁబడ
ధరలు పలుకు దినమదె దగ్గరపడంగ
సహజవాయు నిక్షేపాల ఛాయఁదెలిసి
ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ!
శార్దూలవిక్రీడితము
మాకే రీతిని మేలు చేయునని కంపమ్మెత్త రైతన్నలన్
శోకమ్మందున బీడు భూములవియే శుష్కింపఁ జేయంగనే
సాకారమ్మయి వాయువే సహజమై సంపన్నతన్ లభ్యమై
యాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
కృత్రిమమగు బుద్ధిని వాడ , కృతము నొందె
రిప్లయితొలగించండిచలన చిత్రమొకటి యొక జాణ చేత ,
చెన్నుగ ఫరిశీలించగ చిత్రమందు
నాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ