11-4-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన”(లేదా...)“అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో”
తేటగీతిసిగను గంగమ్మ మేనిలో సగము గౌరివిశ్వనాథుని రూపాన వేడ్కఁ జేయభక్తవత్సలునర్చించి ముక్తిఁ గొనఁకకాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోనచంపకమాలతనువున గౌరియున్ సిగను ధారగ గంగయు నిండి మంగళంబొనరఁగ జేయుఁ రూపమున పుణ్యమొసంగెడు విశ్వనాథునిన్గనులను నింపి ముక్తిఁగొను నమ్మకముండగ నన్యమేదియున్కనుగొనఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో!
విశ్వ నాథుని దర్శింప వెడలి కాశి యర్చన లు సల్పి మొ క్కె ద రంద రపుడు కాంచ దగిన దెద్ది యును. కాశి లోన లే దని యు పల్కు దురు గద లీల గాను
శివుని దరిసించి , యతనిని చేత దడవి ,కాంచనపు పుతయున్న శిఖరమునుగని ,ధన్యజీవుల మగుటయె తప్ప , లాతికాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన
మునులు మోక్షార్థులు చరించు పుణ్య భూమి భవుడు వెలసిన క్షేత్రమీ వారణాసి పట్టణమున కాముక ప్రేమ పక్షులకట కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన.మనమున శూలి నామమును మంత్రము గా జపి యించుచున్ విమోచనమును గోరు వారికిట సాధనమే సుళువైన క్షేత్రమై న నిట రసజ్ఞులౌ జన మనస్సును దోచేడి వింత ప్రాంతముల్ కనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో.
పాత నగరమే పరికింప వారణాశివిశ్వనాథుని దర్శించు వీలుతప్పకాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోనజీవితంబును విడవలె శివునిజేరపరమ పురాతనమ్మనెడి వర్ణన మొప్పును వారణాసికిన్దరిసెనమే గదా మనకు దక్కెడి భాగ్యము లింగరూపమున్అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పోమరియిక దేహమున్ విడుము మాయల చెంచుని జేరముక్తికై
తేటగీతి
రిప్లయితొలగించండిసిగను గంగమ్మ మేనిలో సగము గౌరి
విశ్వనాథుని రూపాన వేడ్కఁ జేయ
భక్తవత్సలునర్చించి ముక్తిఁ గొనఁక
కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన
చంపకమాల
తనువున గౌరియున్ సిగను ధారగ గంగయు నిండి మంగళం
బొనరఁగ జేయుఁ రూపమున పుణ్యమొసంగెడు విశ్వనాథునిన్
గనులను నింపి ముక్తిఁగొను నమ్మకముండగ నన్యమేదియున్
కనుగొనఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో!
విశ్వ నాథుని దర్శింప వెడలి కాశి
రిప్లయితొలగించండియర్చన లు సల్పి మొ క్కె ద రంద రపుడు
కాంచ దగిన దెద్ది యును. కాశి లోన
లే దని యు పల్కు దురు గద లీల గాను
శివుని దరిసించి , యతనిని చేత దడవి ,
రిప్లయితొలగించండికాంచనపు పుతయున్న శిఖరమునుగని ,
ధన్యజీవుల మగుటయె తప్ప , లాతి
కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన
రిప్లయితొలగించండిమునులు మోక్షార్థులు చరించు పుణ్య భూమి
భవుడు వెలసిన క్షేత్రమీ వారణాసి
పట్టణమున కాముక ప్రేమ పక్షులకట
కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన.
మనమున శూలి నామమును మంత్రము గా జపి యించుచున్ విమో
చనమును గోరు వారికిట సాధనమే సుళువైన క్షేత్రమై
న నిట రసజ్ఞులౌ జన మనస్సును దోచేడి వింత ప్రాంతముల్
కనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో.
పాత నగరమే పరికింప వారణాశి
రిప్లయితొలగించండివిశ్వనాథుని దర్శించు వీలుతప్ప
కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన
జీవితంబును విడవలె శివునిజేర
పరమ పురాతనమ్మనెడి వర్ణన మొప్పును వారణాసికిన్
దరిసెనమే గదా మనకు దక్కెడి భాగ్యము లింగరూపమున్
అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో
మరియిక దేహమున్ విడుము మాయల చెంచుని జేరముక్తికై