11, ఏప్రిల్ 2026, శనివారం

సమస్య - 5436

12-4-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్”
(లేదా...)
“ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్”

5 కామెంట్‌లు:

  1. అవమతిగ పలికితివిటుల
    "ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్"
    సవరించు మాతలంపును
    అవిరళమగు కృషిసలుపుచు నవి నేర్చిరిగా

    రిప్లయితొలగించండి
  2. ప్రవచన కర్తలు తెలిపిన
    వివరములకు మూలమగును వేదములెల్లన్
    గవనము చెప్పునపుడు క్షి
    ప్ర వచనకర్తలన మృషలు వల్కెడివారల్

    ప్రవచనకర్త లెల్లరును బల్కెడివన్నియు నమ్మగావలెన్
    వివరములన్ వచింత్రుగద వేదములన్నియు సంగ్రహించుచున్
    గవనము వేగవంతమయి కైతల నల్లెడి వేళలందు క్షి
    ప్ర వచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్

    రిప్లయితొలగించండి
  3. స్తవ మగు రీ తి గ సభలో
    నవతకు నాందీ పలుకుచు నైపుణ్య ము తో
    ప్రవ చించంగా యె ట్టు ల
    ప్రవచన కర్త ల న మృష లు వల్కె డు వారల్

    రిప్లయితొలగించండి
  4. -
    అవమానింపవలదు వా
    రి వైభవముపై నసూయ రీఢయు వలదోయ్
    కవిరాట్ ! పల్కవలదటుల
    ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?




    రిప్లయితొలగించండి

  5. భువిని సనాతన ధర్మము
    నవమానించు టొకటె పని యని తలచెడి యా
    వివరుణులు కపట విబుధులు
    ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్.


    అవనిని పూర్వ కాలమున నామతి గల్గిన యగ్ర వర్ణులే
    యవమితి జేసి రంచు నభియాతులు వారలు వారి ధర్మమున్
    భువి నుడపుచ్చ నెంచుచును పొచ్చెపు మాటలు నేర్చి నట్టి యా
    ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్.

    రిప్లయితొలగించండి