14-4-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు”(లేదా...)“స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే”
తేటగీతిఉన్న మంచమొక్కటె నల్లులుండ నెటులఁగ్రొత్తజంట శోభనమది కుదురుననఁగబెడ్డు బగ్గు స్ప్రే వాడఁగ వీడి పోయిమంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములుచంపకమాలసరసపు సౌఖ్యమున్ బడయ జంటకు నేర్పరచంగఁ దల్పమున్గొరతగ నొక్కటే కలదు కూర్చుటనెట్లని చింతఁజేయగన్గురియగ బెడ్డు స్ప్రే రయమె కూలుచు నన్నియు వీడి మంచమున్స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
పాన్పుపయి పరుపు పరచి పడగ , నిద్ర రాక నటునిటు దొర్లితి , రక్త పాయి లెన్నొ చావగ గలిగిన యెరుపు వలన మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
సౌఖ్యమిడునని చూపిరి చక్కనిదగుహంస తూలికా తల్పము హర్షమలరరాత్రి గడిచిన తఱి విశారదుడు దెల్పెమంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములుసురతిని గూర్చు నీకనుచు సుందర మైన విశాల తల్పమున్సరసుడు బండితుండునగు సత్కవి కిచ్చిరి విశ్రమించగామరుదినమా బుధానుడనె మంచపు ఠీవిని బ్రస్తుతించుచున్స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
విరహమును తాళ లేనైతి పిరిమి జేరి ముద్దు మురిపాల తోడ నా నిద్దుర నిక చెరచు నీదగు బాధ్యత చేగొని యిట మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు.పురమును వీడి పోయితివి పువ్విలుకాని శరమ్ములే గనన్ విరహము పెంచు చుండె నను ప్రేమగ జేరుచు మందసానమున్ బరమును చేయు నీ పనిని బాధ్యత గాగొనెనేమొ కాంచ నా స్ఫురుదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే.
-మామిడాకుల తోరణ మాల లచటమంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములువాటి వాసనకు బెదిరి పరుగు లిడుచునక్కె మూలలో; కత కంచి నగరి చేరె కవివరులు నిదురను జారు కాలమాయె
మంచ మునకు శోభ గుర్చును మత్కు ణ ములు కాని మనుజుల కు నిదుర కర వగు గద న ల్లు లను జంపు మందులు చల్లగా ను మంచి శోభయు కలుగును మంచము నకు
శయ్యపై నిద్ర పోయెడు సమయమందుమనకు తోడుగ నడయాడు మత్కుణములుమత్తు నెడలించి మనకవి మంచి చేయుమంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
తిరముగ పట్టెమంచమున తీరుగ నిద్దుర వోవుచుండగాసరగున జేరి నల్లులు నిశాచరులై రుధిరమ్ము బీల్చుచున్సరసములాడుచున్నవిక జాగరమే వరమౌను, రేయిలోస్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
స్ఫురదుర అంటే నాకు అర్థము కాలేదండి నిఘంటువులో కనపడలేదు. సందర్భానుసారంగా ఊహించుకున్నాను. దయచేసి తెలుపమని విన్నపము. ధన్యవాదములు
స్ఫురత్ ప్రకాశించే, ఉరు శ్రేష్ఠమైన
పొమ్మని యన లేక తివిరి పొగను బెట్టినట్లు కూర్పఁగ శయ్యను నక్కజముగ వార కొనరింప మరియాద దూర బంధు మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు తరువుల పైన భాసిలఁగఁ దన్మయ మందఁగఁ జూచువారలే సురుచిర వర్ణ సమ్మిళిత సుందర మూర్తుల బంధు వర్గమే మురిసి శిలా లసద్విజ సమూహముఁ జక్క నలంకరింపఁగా స్ఫుర దురు శయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే [మత్కుణములు = నా కాకులు]
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.క్రొత్త దంపతుల్ తొలి రాత్రి కోర్కె దీరపూల దండలు కట్టిరి పూలు జల్లిమంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములుకుట్ట రేయంత జంటకు కుపితులైరి.
తేటగీతి
రిప్లయితొలగించండిఉన్న మంచమొక్కటె నల్లులుండ నెటులఁ
గ్రొత్తజంట శోభనమది కుదురుననఁగ
బెడ్డు బగ్గు స్ప్రే వాడఁగ వీడి పోయి
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
చంపకమాల
సరసపు సౌఖ్యమున్ బడయ జంటకు నేర్పరచంగఁ దల్పమున్
గొరతగ నొక్కటే కలదు కూర్చుటనెట్లని చింతఁజేయగన్
గురియగ బెడ్డు స్ప్రే రయమె కూలుచు నన్నియు వీడి మంచమున్
స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
పాన్పుపయి పరుపు పరచి పడగ , నిద్ర
రిప్లయితొలగించండిరాక నటునిటు దొర్లితి , రక్త పాయి
లెన్నొ చావగ గలిగిన యెరుపు వలన
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
సౌఖ్యమిడునని చూపిరి చక్కనిదగు
రిప్లయితొలగించండిహంస తూలికా తల్పము హర్షమలర
రాత్రి గడిచిన తఱి విశారదుడు దెల్పె
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
సురతిని గూర్చు నీకనుచు సుందర మైన విశాల తల్పమున్
సరసుడు బండితుండునగు సత్కవి కిచ్చిరి విశ్రమించగా
మరుదినమా బుధానుడనె మంచపు ఠీవిని బ్రస్తుతించుచున్
స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
రిప్లయితొలగించండివిరహమును తాళ లేనైతి పిరిమి జేరి
ముద్దు మురిపాల తోడ నా నిద్దుర నిక
చెరచు నీదగు బాధ్యత చేగొని యిట
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు.
పురమును వీడి పోయితివి పువ్విలుకాని శరమ్ములే గనన్
విరహము పెంచు చుండె నను ప్రేమగ జేరుచు మందసానమున్
బరమును చేయు నీ పనిని బాధ్యత గాగొనెనేమొ కాంచ నా
స్ఫురుదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే.
-
రిప్లయితొలగించండిమామిడాకుల తోరణ మాల లచట
మంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములు
వాటి వాసనకు బెదిరి పరుగు లిడుచు
నక్కె మూలలో; కత కంచి నగరి చేరె
కవివరులు నిదురను జారు కాలమాయె
మంచ మునకు శోభ గుర్చును మత్కు ణ ములు
రిప్లయితొలగించండికాని మనుజుల కు నిదుర కర వగు గద
న ల్లు లను జంపు మందులు చల్లగా ను
మంచి శోభయు కలుగును మంచము నకు
శయ్యపై నిద్ర పోయెడు సమయమందు
రిప్లయితొలగించండిమనకు తోడుగ నడయాడు మత్కుణములు
మత్తు నెడలించి మనకవి మంచి చేయు
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
తిరముగ పట్టెమంచమున తీరుగ నిద్దుర వోవుచుండగా
రిప్లయితొలగించండిసరగున జేరి నల్లులు నిశాచరులై రుధిరమ్ము బీల్చుచున్
సరసములాడుచున్నవిక జాగరమే వరమౌను, రేయిలో
స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
స్ఫురదుర అంటే నాకు అర్థము కాలేదండి నిఘంటువులో కనపడలేదు. సందర్భానుసారంగా ఊహించుకున్నాను. దయచేసి తెలుపమని విన్నపము. ధన్యవాదములు
రిప్లయితొలగించండిస్ఫురత్ ప్రకాశించే, ఉరు శ్రేష్ఠమైన
రిప్లయితొలగించండిపొమ్మని యన లేక తివిరి పొగను బెట్టి
రిప్లయితొలగించండినట్లు కూర్పఁగ శయ్యను నక్కజముగ
వార కొనరింప మరియాద దూర బంధు
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు
తరువుల పైన భాసిలఁగఁ దన్మయ మందఁగఁ జూచువారలే
సురుచిర వర్ణ సమ్మిళిత సుందర మూర్తుల బంధు వర్గమే
మురిసి శిలా లసద్విజ సమూహముఁ జక్క నలంకరింపఁగా
స్ఫుర దురు శయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే
[మత్కుణములు = నా కాకులు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
క్రొత్త దంపతుల్ తొలి రాత్రి కోర్కె దీర
పూల దండలు కట్టిరి పూలు జల్లి
మంచమునకు శోభనుఁ గూర్చె;
మత్కుణములు
కుట్ట రేయంత జంటకు కుపితులైరి.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
క్రొత్త దంపతుల్ తొలి రాత్రి కోర్కె దీర
పూల దండలు కట్టిరి పూలు జల్లి
మంచమునకు శోభనుఁ గూర్చె;
మత్కుణములు
కుట్ట రేయంత జంటకు కుపితులైరి.