14, ఏప్రిల్ 2026, మంగళవారం

సమస్య - 5439

15-4-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ”

(లేదా...)

“అన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్”

(శ్యామ్ కుమార్ గుప్తా గారికి ధన్యవాదాలతో...)

32 కామెంట్‌లు:

  1. వధువు తల్లిదండ్రుల సంభాషణ:

    కందం
    ఎన్నితిమి సుగుణఁడనుచున్
    వెన్నుని దయవలన నటులె వేడుకఁ జేయన్
    జున్ను, వడలు లేకుండఁగ
    నన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ!

    ఉత్పలమాల
    ఎన్నితిమెన్నియో తలఁచి యిందుని బోలిన నందగాడనన్
    వెన్నుని దీవనల్ గుదిరి వేడుక జేసెడు వాడె చిక్కఁగన్
    మన్నన జూపగావలెను మాన్యుడటంచును తీపి లేని ప
    ప్పన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
  2. ఉన్నది కలియో గంజియొ
    తిన్నను యాఁకొన్నతనము తీరును మనకున్
    ఉన్నను లేకున్నను చ
    ద్దన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ

    ఆఁకొన్నతనము= ఆఁకలి

    రిప్లయితొలగించండి
  3. ఉన్నను లేకపోయినను యోరిమి వీడక జావ తాగి యాఁ
    కొన్నతనమ్ము దీర్చుకొని గుట్టుగ రోజులు వెళ్ళబుచ్చుచున్
    మన్నన నొందుచుంటిమి సమాజమునందున నైనఁగాని చ
    ద్దన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నది మీ పూరణ.
      'పోయినను + ఓరిమి' అన్నపుడు యడాగమం రాదు. "త్రాగి" అని ఉండాలి.

      తొలగించండి
    2. ఉన్నను లేనినాడయిన నోరిమి వీడక జావ త్రాగి యాఁ
      కొన్నతనమ్ము దీర్చుకొని గుట్టుగ రోజులు వెళ్ళబుచ్చుచున్
      మన్నన నొందుచుంటిమి సమాజమునందున నైనఁగాని చ
      ద్దన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్

      తొలగించండి
  4. చెన్నగు నల్లుడు దొరకగ
    సన్నుతి చేయుచు నతనిని సకల విధా లన్
    మన్నన సేయుచు పాసిన
    నన్నము పెట్ట వలదు మన మల్లు న కు సుమీ

    రిప్లయితొలగించండి
  5. ఎన్నో నాళ్ళాయె ననుచు
    మిన్నవయిన వంటకముల మెండుగ బెట్టన్
    తిన్నవరుగ లేదేమో
    యన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ

    రిప్లయితొలగించండి

  6. కన్నియ పతిగా నతనిని
    మన్నింపగ వలయు గాదె మానిని వినుమా
    యెన్నడు నాతని కిట శీ
    తాన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ.


    మన్నన సేయగా వలయు మాన్యుడ వంచును నత్త మామలే
    మిన్నగ నాదరించవలె మేదిని యందున నెంచ యాత్మజున్
    గన్నను ముఖ్యడై చెలగు గౌరవ నీయు డతండు కాన శీ
    తాన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్.

    రిప్లయితొలగించండి
  7. -
    అన్నా! మధుమేహము కలు
    గన్నా ! క్షీణించు శక్తి కచ్చితముగ! ఓ
    రన్నా! మాటవినుము పర
    మాన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ


    రిప్లయితొలగించండి
  8. క్రన్నన విజయముఁ గైకొని
    మన్నన లొందెను గద మన మల్లుడు నేడే
    పన్నుగ బూరెలు వండక
    యన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ

    క్రన్నన వైరిపైబడుచు కష్టతరంబగు పోరు సల్పుచున్
    మన్నన లందినాడు మన మల్లుడు గెల్విడి ద్వంద్వ యుద్ధమున్
    బన్నుగ పంచ భక్ష్యములు వండక పచ్చడి పప్పుచారుతో
    నన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
  9. కం: ఉన్న ముతక బియ్యము మన
    కిన్నాళ్లును తిండి కాని,యీ అల్లునికై
    సన్నాలు వండ వలె మన
    యన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ”
    (సన్నాలు అనేది బియ్యం లో ఒక రకం.మనం తినే మోటు బియ్యం కాక అల్లునికి ఆ సన్న బియ్యం వండాలి అని. )

    రిప్లయితొలగించండి
  10. ఉ:"తిన్నగ వండ లేని యొక తింగరి యాలి లభించె" నంచు నె
    ట్లున్నను మెక్కు నల్లునికి నొక్క దినమ్మున మంచి వంటలన్
    మన్నన తోడ బెట్టెదము, మంచిగ జేయని బిడ్డ వండు నా
    యన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్”
    (వంట చేత కాని మన తింగరి కూతురు వండే వంటని మన అల్లుడు రోజూ తినక ఎలాగూ తప్పదు. పండగ కి అతను వచ్చే ఒక్క రో జైనా మన కూతురు తో వండించక మనమే వండి పెడదాము అని. )

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ ఎన్నుచు భార్య యన్న తగువే సరసమ్మని మద్యపానమున్
    మన్నన సేసి జూదమును మానక బాధ్యత వీడి వర్తిలన్
    దన్నినఁ దప్పు గాదుకద తల్లడ మొందఁగ నిక్కమే సుమీ
    అన్నముఁ బెట్ట రాదు మనమల్లుఁడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి
      అల్లునకు మధుమేహమున్నచో:

      ఉ॥ దన్నగు స్వాస్థ్యమొప్పఁ జిరు ధాన్యము లెన్నియొ నిక్కమే సుమా
      మిన్నగఁ బొందఁగాను మధుమేహము నౌషధ మంచు నెంచుచున్
      మన్నన ప్రేమమున్న నటు మక్కువతో నివి యేవి లేకనే
      యన్నముఁ బెట్ట రాదు మనమల్లుఁడు పండుగటంచు వచ్చినన్

      మధుమేహము నకు ముఖ్యంగా కొఱ్ఱలు (foxtail) ఆరికలు (అరికెలు, Kodo) ఒరుగులు (barnyard) ప్రశస్త మండి. ఒక సారి నా HBA1C 8.6 నుండి 5.3 కితగ్గింది.

      తొలగించండి
  12. అన్ని రుజల్ చనున్ చలిది యన్నము గ్రోలిన యంచు నెంచుచున్
    నిన్నటి యన్నమంత పులి నీళ్ళగ మారిచి యారగింతుమే
    పన్నుగ సన్నబియ్యమును పండుగ కై కొని తెచ్చితేను శే
    షాన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
  13. వెన్నుం జూపెను వైరికి
    మన్ననకు ననర్హుఁ డితఁడు మనుజాధీశా
    మన్ను కఱచె లేక బలం
    బన్నముఁ బెట్టవలదు మన మల్లునకుఁ జుమీ


    కన్నియ నిచ్చినారలము కాంతకు దుఃఖ మొసంగ రాదు సూ
    మన్నన కర్హుఁ డీతఁ డభిమాన ధనుండు చిరాగతుండు శు
    ద్ధాన్నము పంచ భక్ష్యముల నల్లునకుం దగు సంతతమ్ము చ
    ద్దన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండు గటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
  14. మన్నన చేయగావలయు మామయు నత్తయు ప్రీతితోడుతన్
    చెన్నగు దుస్తులన్ ఋణము చేసిన నైనను పెట్టగావలెన్
    మిన్నగు శాకపాకములు మెచ్చెడు నట్టుల వండి నింట ప
    ప్పన్నము పెట్టరాదు మన మల్లుడు పండుగటంచు వచ్చినన్

    రిప్లయితొలగించండి
  15. ఎన్నిక లందు గెల్చె పదిహేను శతంబుల ఓట్ల పెచ్చుతో
    మన్నన చేయగా వలయు మాన్యుడ వంచును శాలు కప్పుచున్
    మిన్నగు శాకపాకములు మెచ్చెడు నట్టుల వండి వట్టి ప
    *ప్పన్నము పెట్టరాదు మన మల్లుడు పండుగటంచు వచ్చినన్*

    రిప్లయితొలగించండి
  16. ఉన్నను భుక్తి బాధలు గడున్నను
    పేదరికంపు కష్టముల్
    పన్నుగ బెట్టగా వలయు భారమ
    టంచును చింతజెందకన్
    మన్ననతోడ నల్లునకు మక్కువగా
    వరి యన్నమిప్డు స
    జ్జన్నము పెట్టరాదు మన మల్లుడు
    పండుగటంచు వచ్చినన్.

    రిప్లయితొలగించండి
  17. ఉన్నను భుక్తి బాధలు గడున్నను
    పేదరికంపు కష్టముల్
    పన్నుగ బెట్టగా వలయు భారమ
    టంచును చింతజెందకన్
    మన్ననతోడ నల్లునకు మక్కువగా
    వరి యన్నమిప్డు స
    జ్జన్నము పెట్టరాదు మన మల్లుడు
    పండుగటంచు వచ్చినన్.

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సున్నిత మనస్కు డాతడు
    పన్నుగ నేతెంచుచుండె పండుగ దినమున్
    మిన్నగు వంటలిడుము, చ
    ద్దన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ!

    రిప్లయితొలగించండి