ఆమిథిలాపురిఁ జానకి రామునిఁ గాంచ నుదయించె ప్రశ్నలు మదిలో కాముని బురుడించు మనో రాముం డెవఁడంచు సీత ప్రశ్నించెఁ గదా
తామసుడైన దానవుడు ధర్మము తప్పిన బర్బరుండు! శ్రీ రాముడు లేనివేళ నను రాక్షస మాయలతోడఁ దెచ్చెనే! కాముకుడైనవాడు పలు కాంతల వెన్కొనువాడు నింద్రియా రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
రాముని పాత్ర నెన్నగను ప్రాగ్ర్యము రాముని సచ్చరిత్రలో మోమును జూడ నాతఁడొక మొక్కలికాఁడుగ దోచు వానికిన్ రాముని పాత్రనీయ సుతరాము సహించను నాటకమ్మునన్ రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
కం:"రాముడు మీరే కద! యీ రాముం డెవఁ?"డంచు సీత ప్రశ్నించెఁ," గదా ప్రేమికుడే కాదు పరశు రాముం డిత" డనుచు నవ్వి రాముడు పలికెన్. (ఈ రాముడు గదాయుద్ధ ప్రేమికుడు మాత్రమే కాదు, పరశు రాముడు అన్నాడు.పరశు రాముడు గదాయుద్ధం లో కూడా గురువు. )
రాముడు సీతయుంగలసి రంజన మొప్పగ పాఠశాలలో నీమము దప్పకుండగను నిత్యము చద్విరి నాడు ,యిప్పడున్ సోమరిపోతుగా దిరుగు చుండెను మిక్కిలి త్రాగినట్టి యీ రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామాయణ నాటకమున
రిప్లయితొలగించండిఏమాత్రము వెరవకుండ యెదురుగ నిలువన్
నామగనిగ నటించెడి
రాముం డెవఁడంచు సీత ప్రశ్నించెఁ గదా”
1. త్రిజట సీతమ్మతో:
రిప్లయితొలగించండికందం
ధీమంతుండై లంకకు
సేమమ్ముగ మిమ్మయోధ్యఁ జేర్చగ లాగన్
కాముక రావణుఁడోర్వక
రాముం డెవఁడంచుఁ బలికె, వైదేహి! యటన్
2.
ఉత్పలమాల
ధీమతియైన కానలకుఁ దెచ్చునె కోమలినెవ్వడేనియున్
భామరొ! సేవలంతిపుర వాసమునందున గూర్తు రాణిగన్ !
సేమమొసంగు వాడె పతి! చేవయె లేదని రావణుండనన్
రాముడు వీడెవండ? నుచు, ప్రాభవ మేదని? సీత చింతిలెన్
నామము సీతగ నుండిన
రిప్లయితొలగించండికోమలి సందియము గలుగ కోవిదు నొకనిన్
భామిని. చేరియు నడు గు చు
రాము o డెవ డంచు సీత ప్రశ్నించె గదా
ఆమిథిలాపురిఁ జానకి
రిప్లయితొలగించండిరామునిఁ గాంచ నుదయించె ప్రశ్నలు మదిలో
కాముని బురుడించు మనో
రాముం డెవఁడంచు సీత ప్రశ్నించెఁ గదా
తామసుడైన దానవుడు ధర్మము తప్పిన బర్బరుండు! శ్రీ
రాముడు లేనివేళ నను రాక్షస మాయలతోడఁ దెచ్చెనే!
కాముకుడైనవాడు పలు కాంతల వెన్కొనువాడు నింద్రియా
రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
రిప్లయితొలగించండిభామను ముని వేషమ్మున
కాముకుడై చేరె నంచు గౌతమి గాథన్
రాముడు వచియింపగ సూ
త్రాముం డెవఁడంచుఁ సీత ప్రశ్నంచె గదా.
భామను బొందగా దలచి భాషపు రూపము నందు చేరె నా
కాముకు డైన యింద్రుడని గౌతమి గాథను చెప్పు చుండగా
నామె విషాద మందుచు మహాత్ముడు రాముని ప్రశ్న జేసె సూ
త్రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్.
రాముని పాత్ర నెన్నగను ప్రాగ్ర్యము రాముని సచ్చరిత్రలో
రిప్లయితొలగించండిమోమును జూడ నాతఁడొక మొక్కలికాఁడుగ దోచు వానికిన్
రాముని పాత్రనీయ సుతరాము సహించను నాటకమ్మునన్
రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
(ఒకడు రాక్షస మాయతో రాముని వలె కనపడగ సీతమ్మ తల్లి గుర్తుపట్టుట)
రిప్లయితొలగించండిఉ॥ స్వామిని గుర్తు పట్టుటయు సాధ్వికిఁ గష్టమ యెప్పుడైననున్
హేమముఁ గంచు నొక్కటియ హీనుఁడు రాముని వేషమందునన్
గామిత రూపమందు నటు కన్పడ రాక్షస మాయ నిల్పుచున్
రాముఁడు వీడెవండనుచుఁ బ్రాభవ మేదని సీత చింతిలెన్
కామున కోడి గౌతముని కాంతను పొందగ గోరి కోడియై
రిప్లయితొలగించండిధామము నెక్కి కూసెను ముదంబుగ మాపున వృష్ణి యంచు శ్రీ
రాముడు చెప్ప సీతకనురాగము తోడుత !పృచ్ఛజేసి సూ
త్రాముడు వీడెవండనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
కం:"రాముడు మీరే కద! యీ
రిప్లయితొలగించండిరాముం డెవఁ?"డంచు సీత ప్రశ్నించెఁ," గదా
ప్రేమికుడే కాదు పరశు
రాముం డిత" డనుచు నవ్వి రాముడు పలికెన్.
(ఈ రాముడు గదాయుద్ధ ప్రేమికుడు మాత్రమే కాదు, పరశు రాముడు అన్నాడు.పరశు రాముడు గదాయుద్ధం లో కూడా గురువు. )
ఉ:"రాముడు ధర్మ మూర్తి, యిక రావణు డెంతటి వాడు ? వానికిన్
రిప్లయితొలగించండిబ్రేమ యదేమి? కాముకత రెచ్చెను వీనికి శౌర్యమూర్తి యై
ప్రేమను బంచు భర్త యయి, వేగమె వీనిని సంహరింపడే
రాముడు? వీడెవం? " డనుచు ప్రాభవ మేదని సీత చింతిలెన్
నామగ డెంచి చూడగ ఘనమ్మగు దోర్బల శక్తియుక్తుడై
రిప్లయితొలగించండినీమముతో చెలంగుచును నిర్మల చిత్తముతో కనున్ ననున్
కామము నాదు దేహమును కాంచుచు నుండెను తచ్చ రూపసీ
రాముఁడు, వీడెవండనుచుఁ బ్రాభవ మేదని సీత చింతిలెన్
రామాయణ నాటకమున
రిప్లయితొలగించండిరాముని పాత్రను ధరించి లక్ష్మణుఁడనగన్
రాముఁడ నేనని, మరియా
రాముం డెవఁడంచు సీత ప్రశ్నించెఁ గదా
[ఎప్పుడూ లక్ష్మణుని వేషం వేసే నటుడు ఆరోజు నాటకంలో రాముడు వేషం తనదని చెప్పగా మరి రాముని వేషం వేసే నటుడిది ఏ పాత్ర అని సీత అడిగినట్టు.]
భీమోగ్ర రూపునిఁ బరశు
రిప్లయితొలగించండిరాముని వీక్షించి వెస ధరణిజ కదిసి యో
రామా వచియింపుమ యీ
రాముం డెవఁ డంచు సీత ప్రశ్నించెఁ గదా
లేమకు రావణుం డనుచు లేశము కల్గెను శంక యాత్మలో
నేమన లంక నన్య నరుఁ డెవ్వఁడు దూఱఁ గలండు వింతయే
రామ చరిత్ర పాడుచుఁ గరమ్ము ముదం బిడినే యెఱుంగునే
రాముడు, వీఁ డెవం డనుచుఁ బ్రాభవ మేదని సీత చింతిలెన్
రాముడు సీతయుంగలసి రంజన
రిప్లయితొలగించండిమొప్పగ పాఠశాలలో
నీమము దప్పకుండగను నిత్యము
చద్విరి నాడు ,యిప్పడున్
సోమరిపోతుగా దిరుగు చుండెను
మిక్కిలి త్రాగినట్టి యీ
రాముడు వీడెవండనుచు ప్రాభవ
మేదని సీత చింతిలెన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గ్రామమున నాటకమ్మున
రామునిగా వేయువాడు రాడని తెలిసెన్
నీమముగా చర్చ జరుగ
రాముం డెవడంచు సీత ప్రశ్నించెఁ గదా!