21-4-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె”
(లేదా...)
“అమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా”
పరిమితముగ తినుటగూర్చి పలుకుచుండ ,నన్నము దినుటకు విడువుమనుచు , బంతులమ్మకున్ మ్రొక్క ; దున్నపోతనుచుఁ దిట్టెనామె శిష్యుని, హెచ్చుగనాగ్రహించి
ప్రజల పాలకుడై మ్రింగి ప్రజల సొమ్ము తిరిగి యోట్లడగగ నూర్లు తిరుగు వేళ జనుల మధ్యన నిలుచున్న సఖుని యొక్క యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె.అమ్మలు నక్కలంచు వినయమ్మును జూపుచు నోట్ల యుద్ధమున్ గొమ్మల యోట్లతో గెలిచి కోట్ల ధనమ్ము హరించి నట్టి యా దమ్మము తప్పినట్టి వాసుధాధిపుడచ్చట వేచి యున్న పె ద్దమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా.
రమ్మనుచు పిల్చె నాభామ రాత్రివేళచిమ్మ చీకటి మాటున నమ్మకముగ పిమ్మట యువకుడేతించి వెలదియొక్కయమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టెతుమ్మెద రెక్కలై కదలు తుంటరి చూపుల గాలమేసి తారమ్మని బిల్చెనా రమణి రాతిరి వేళ రహస్య మార్గమున్బిమ్మట కోడెకాడటకు వేగిరపాటునఁ జేర వచ్చి దానమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా
పరిమితముగ తినుటగూర్చి పలుకుచుండ ,
రిప్లయితొలగించండినన్నము దినుటకు విడువుమనుచు , బంతు
లమ్మకున్ మ్రొక్క ; దున్నపోతనుచుఁ దిట్టె
నామె శిష్యుని, హెచ్చుగనాగ్రహించి
రిప్లయితొలగించండిప్రజల పాలకుడై మ్రింగి ప్రజల సొమ్ము
తిరిగి యోట్లడగగ నూర్లు తిరుగు వేళ
జనుల మధ్యన నిలుచున్న సఖుని యొక్క
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె.
అమ్మలు నక్కలంచు వినయమ్మును జూపుచు నోట్ల యుద్ధమున్
గొమ్మల యోట్లతో గెలిచి కోట్ల ధనమ్ము హరించి నట్టి యా
దమ్మము తప్పినట్టి వాసుధాధిపుడచ్చట వేచి యున్న పె
ద్దమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా.
రమ్మనుచు పిల్చె నాభామ రాత్రివేళ
రిప్లయితొలగించండిచిమ్మ చీకటి మాటున నమ్మకముగ
పిమ్మట యువకుడేతించి వెలదియొక్క
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
తుమ్మెద రెక్కలై కదలు తుంటరి చూపుల గాలమేసి తా
రమ్మని బిల్చెనా రమణి రాతిరి వేళ రహస్య మార్గమున్
బిమ్మట కోడెకాడటకు వేగిరపాటునఁ జేర వచ్చి దా
నమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా