22, ఏప్రిల్ 2026, బుధవారం

సమస్య - 5447

23-4-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము”
(లేదా...)
“చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే”

20 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      అర్హతకుమించి పట్టాల నందుకొనఁగఁ
      గార్యనిర్వహణార్థము ఘటికుడనుచు
      మెచ్చనధికారి లౌక్యము మృగ్యమౌచు
      చదువులెక్కువై పెట్టఁడు సంతకమ్ము!

      చంపకమాల
      కొదువయె లేని యర్హతలఁ గొల్వునకొప్పునటంచు మెచ్చియన్
      బదిలపు కార్యనిర్వహణఁ బాటవముండునటన్న భ్రాంతిమై
      బుధుడని గద్దెపై నిలుప ముందుకుసాగెడు లౌక్య శూన్యుఁడై
      చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే!

      తొలగించండి
  2. పత్ర ము పయి చే వ్రాలును పన్ను మనగ ,
    నందు దనకు జే టు నిడెడి యంశ ముండ ,
    మునుపు మాదిరి మూఢత్వ ము దిగనాడి ,
    చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము

    రిప్లయితొలగించండి
  3. కుట్ర కారకులఁ విడిచి కొఱఁతవెట్ట
    నేర పూరిత కుట్రకు నిగ్గు దేల్చ
    మనుచు తగువరి చెప్పడు మనవి వినడు
    చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము

    కుదురుగ న్యాయపీఠమున గొప్పగ తీర్పునొసంగు విజ్ఞుడే
    పదిలము సూత్రధారులని పండితు లన్నను శోధనంబునే
    కుదురుగ పూర్తిచేయమని కుట్రను దేల్చ మటంచు చెప్పడే
    చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే

    రిప్లయితొలగించండి
  4. -
    ఫేకు బుక్కు బతుకులాయె పెద్దలార
    యెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలియ,
    చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
    నొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను




    రిప్లయితొలగించండి
  5. చదువరియే యతండు పలు శాస్త్రములన్ పఠియించె గొప్శదౌ
    పదవి నలంకరించెను విపన్నులఁ గాచెను ధర్మమూర్తియై
    సదమల మూర్తి బాధితుల సంకటముల్ తొలగింపలేనిచో
    చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే

    రిప్లయితొలగించండి

  6. పరుల సంతకమును పట్టు పట్టి నేర్చి
    పరుల వంచించు వారలీ వసుధ యందు
    కలరనెడనుమానము తోడ నిలను జూడ
    చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము.


    పదిలము కాదు సంతకము పాటవ మెంతయొ చూపి ధాత్రిలో
    ముదమున దొంగ సంతకము మ్రుచ్చులు చేతుర టంచు శంకతో
    పదిలమె వ్రేలి ముద్ర ప్రపంచము లోనని విశ్వ సించుచున్
    చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే.

    రిప్లయితొలగించండి
  7. చదువు సంధ్యలు నేర్చిన చతురుఁ డతడు
    లోకులొసగెడు రూకకు లొంగబోడు
    బాధితుల మేలు గూర్చని పథకములకు
    చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము

    రిప్లయితొలగించండి
  8. ముదిమది తప్పి మూల్గుచును మూల పరుండును కాళ్ళు చేతులున్
    కదుప బలంబులేక కడు కన్నఱ చెందుచు నుండు మిక్కిలిన్
    సదనము నందునన్ జనుల చక్కగ గాంచడు దృష్టిలేక యా
    చదువది యొంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే

    రిప్లయితొలగించండి
  9. చం॥ చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయ నొప్పడే
    కుదురుగ విద్య నేర్చి యటఁ గూర్చిన జిత్తులు పత్రమందునన్
    నదురుగఁ గాంచు ప్రజ్ఞఁ గని నాంత్రము మీరఁగ నచ్చఁ జెప్పినన్
    గదలక నాఁకళించుకొని గాసిలి నిక్కమెఱుంగఁ గ్రుద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  10. ఒదవె మహోన్నతమ్మయిన యోగము మిన్నగు విద్యతోడుతన్
    హృదయమునందు స్వార్థమది రేగుచునుండగ నెల్ల వేళలన్
    కదలదె యొక్క కాగితము కాసులు రాలక కార్య శాలలో
    చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే

    రిప్లయితొలగించండి
  11. వేలి ముద్రల పధ్ధతి న్ విధిగ నుంచ
    సాధ్య పడ ద య్యె చేయగా సంత కమ్ము
    పరి హ చిం చుచు నొక్కడు పలికె నిట్లు
    చదువు లెక్కు వై పెట్టడు సంతకమ్ము

    రిప్లయితొలగించండి
  12. అలరి కాకర కాయ నాఁ బలికెఁ జదువు
    లేని నాఁడు కీకర కాయ నా నుడివెను
    జదివి మిక్కుటమ్ముగఁ బైత్యము దనరంగఁ
    జదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము


    కుదురును విత్త కార్యములు గోరిన యప్పుడ జాల వేదికం
    బదిలము కార్య సంచయము పన్నుగఁ జేసిన జాల వేదికం
    దుద కిట నన్ని కార్యములు తూర్ణము సంధిల జాల వేదికం
    జదు వది యెంతొ కల్గినను సంతక మొక్కటి చేయ నొప్పఁడే

    [జాల వేదిక = అంతర్జాలము]

    రిప్లయితొలగించండి