ఉ:నారదు డిట్లు పల్కెను ధనమ్మును దోచగ గోరు బోయ తో "నోరి నిషాద! వేట యని ,యుద్ధతి జీవుల జంప, చచ్చు నే క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే? దారకు నీదు పాపముల దాల్చెడు ధర్మము గొంత యుండునే? (నువ్వు ఇన్ని మృగాలని చంపితే నీ భార్య కనీసం క్రూరమృగాన్ని చంపినా సంతోషించిందా? పోనీ నీ పాపాన్ని తీసుకోటానికి ఒప్పుకుంటుందా? అని నారదుడు వాల్మీకి తో అన్నాడు.)
పండుగ దినమునందున వాడుకయగు
రిప్లయితొలగించండిబొమ్మల కొలువుతోపాటు పొంతన యొక
అడవి నేర్పరచు తరి సింహమును బోలు
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి”
తేటగీతి
రిప్లయితొలగించండిమగడు వెంటరాన్ వనముల మగువ తిరిగె
కొండకోనల నందాల మెండు గనుచు
దారి కడ్డమై గర్జింపఁ బార ద్రోలఁ
గ్రూరమృగమును, ముద్దాడెఁ గోమలాంగి
ఉత్పలమాల
ఆ రమణీమణిన్ వనవిహారము సేయ మగండు చేకొనెన్
గోరిన కొండ కోనలను కొంగునుబట్టుకు సంచరించగన్
దారికి యడ్డమై నిలిచి తత్తరఁ బెట్టఁగఁ బార ద్రోలఁగన్
గ్రూరమృగమ్మునుం, గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
రిప్లయితొలగించండిదనుజుడా హిరణ్య కశిపు దునుమ నెంచి
హరియె నరసింహ రూపాన నవత రించి
చెలగెడి సమయమందున చెంచు లక్ష్మి
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి.
ఔరసుడైన బాలకుని యంతము జేయ దలంచి నట్టి యా
ఫేరవునిన్ వధించుటకు విష్ణువు ధాత్రి నృసింహ రూపమున్
చేరగ కానలందు గల చెంచిత మోహము నంది నంత నా
క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే.
వనవిహారమనుచుఁ జని భామయొకతె
రిప్లయితొలగించండికాననంబున భీతిల్లె గాంచి నంత
క్రూరమృగమును; ముద్దాడెఁ గోమలాంగి
జింకపిల్ల తన దరికి చేర రాగ
దూరము నున్న కాననము దూరిన బృందము నందు భీతిలెన్
గ్రూరమృగమ్మునుం గనిన కోమలి; ముద్దిడి సంతసించెనే
చేరగ వచ్చినట్టిదగు చిత్ర మృగంబును గౌగిలించుచున్
వారికిఁ గల్గె గాఢమగు వన్య మృగానుభవమ్ము నిండుగా
చిత్రకారుని ప్రతిభకు చిత్తరువులె
రిప్లయితొలగించండిజీవకళలుట్టి పడుచుండె చిత్రముగను
విపినమందున సలుపుచు విహరణమ్ము
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి
వారెవ! నేత్రపర్వముగ భాసిలె కుడ్యపు చిత్రలేఖనం
రిప్లయితొలగించండిబారయ జీవముట్టిపడునా పటకారుని చిత్రమందునన్
ఘోర వనాంతమందు నొక కూపమునందున జిక్కె సింగమా
క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
తే.గీ:కూర కై లేడినిన్ నీవు కూల్చ బోవ ,
రిప్లయితొలగించండిబాణహతి తప్పి యా లేడి బతికె చూడు!
హింస వదలుము! చూడుమా యింతి క్రియను
క్రూర! మృగమును ముద్దాడెఁ గోమలాంగి”
(నాలుగవ పాదం లో మృగము అంటే లేడి. )
ఉ:నారదు డిట్లు పల్కెను ధనమ్మును దోచగ గోరు బోయ తో
రిప్లయితొలగించండి"నోరి నిషాద! వేట యని ,యుద్ధతి జీవుల జంప, చచ్చు నే
క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే?
దారకు నీదు పాపముల దాల్చెడు ధర్మము గొంత యుండునే?
(నువ్వు ఇన్ని మృగాలని చంపితే నీ భార్య కనీసం క్రూరమృగాన్ని చంపినా సంతోషించిందా? పోనీ నీ పాపాన్ని తీసుకోటానికి ఒప్పుకుంటుందా? అని నారదుడు వాల్మీకి తో అన్నాడు.)
పోరడు జాత్ర చూద్దమని పోరును బెట్టుచు నుండ నందరమ్
రిప్లయితొలగించండిచేరువ నున్ను జాతరకు శీఘ్రమె నేరుగ వెళ్ళి తియ్యనౌ
బూరెలు పిండి వంటలును బొమ్మలు చాల క్రయించ బొమ్మయౌ
క్రూరమృగమ్మునుంగనిన కోమలి ముద్దిడి సంతసించెనే