27-4-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్”
(లేదా...)
“బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్”
దొంతిగ నున్న ఘటములకుబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్ ,వింత గొలిపెనాదృశ్యము నంతను జూచెడు పరిజన మానందించన్
ఎంతయొ వేగముతోనాబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్సుంతయు విభ్రాంతి పడకవింతగ కొట్టెను క్రికెట్టు వీరుడు వడిగావింతగు సన్నివేశమది వేడుక తోడ క్రికెట్టు నాడుచున్బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్సుంతయు భ్రాంతిలేక ఘన శూరుడు గొట్టెను హద్దుమీఱగానంతట లేని బంతియని హాయిగ దెల్పెను మేటి తీర్పరే పంతము నెగ్గినామనుచు పర్వులు దక్కిన వారు చాటిరే[క్రికెట్ ఆటలో బాట్స్మన్ సిక్సర్ కొట్టగా ఆ బాల్ ని నోబాల్ గా అంపైర్ ప్రకటించడంతో ఏడు పరుగులు లభ్యమయ్యాయని భావన]
దొంతిగ నున్న ఘటములకు
రిప్లయితొలగించండిబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్ ,
వింత గొలిపెనాదృశ్యము
నంతను జూచెడు పరిజన మానందించన్
ఎంతయొ వేగముతోనా
రిప్లయితొలగించండిబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్
సుంతయు విభ్రాంతి పడక
వింతగ కొట్టెను క్రికెట్టు వీరుడు వడిగా
వింతగు సన్నివేశమది వేడుక తోడ క్రికెట్టు నాడుచున్
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
సుంతయు భ్రాంతిలేక ఘన శూరుడు గొట్టెను హద్దుమీఱగా
నంతట లేని బంతియని హాయిగ దెల్పెను మేటి తీర్పరే
పంతము నెగ్గినామనుచు పర్వులు దక్కిన వారు చాటిరే
[క్రికెట్ ఆటలో బాట్స్మన్ సిక్సర్ కొట్టగా ఆ బాల్ ని నోబాల్ గా
అంపైర్ ప్రకటించడంతో ఏడు పరుగులు లభ్యమయ్యాయని భావన]