28-4-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంచములో గారెలున్నఁ గాని తినండే”
(లేదా...)
“కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే”
కందంపొంచిన దిగులదిమనమునమంచమునుండంగ నిద్రమాటయె కరవౌ!కొంచెము నాకలి లేదనకంచములో గారెలున్నఁ గాని తినండే!ఉత్పలమాలనించిన కుండలన్ గలుగ నీరము దాహములేక త్రాగమే!మంచమునుండియున్ దిగులుమానసమెంచగ నిద్రవచ్చునే?కొంచెమునైన నాకలియె కుక్షిని లేదన నిచ్ఛగింపకేగంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే!
సంచిలొ దెచ్చిన వడలను పంచన గూర్చుండబెట్టి భక్షించుమనన్కొంచెము నలత కలదనుచుకంచములో గారెలున్నఁ గాని తినండే
పంచగ, మారుతికి నివే దించి ప్రసాదముగ నచట దేవళ మందున్ కాంచన వర్ణ మ్మున గల కంచములో గారెలున్నఁ గాని తినండే.పంచగ భక్త కోటికిని, వాయుసుతుండకు భక్తితో నివే దించగ నెంచి భూరిగను దేవళ మందున నర్చకుండు వే యించిన గారె లాతనికి యిష్టమటంచును తెచ్చి నట్టి యా కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే.
చంచలమౌ వ్యక్తిత్వమువంచన యని నమ్ముచుండు వలదను నతడేత్రుంచగ నెంచక నుండునుకంచములో గారెలున్నఁ గాని తినండేచంచలమైన మానసము సత్వరమున్ మదినమ్మకుండుగావంచన లేకపోయినను భద్రము కాదని నిబ్బరించుచున్ ద్రుంచడు తాను చిన్నదగు తుండెము నైనను నోటబెట్టడే కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే
-పంచాపకేశ అయ్యరుకంచెము లో గారెలున్న గాని తినండేటంచను గాను జిలేబియెముంచెత్తక పిండిని ఘృతమున వేడిగనే
కందం
రిప్లయితొలగించండిపొంచిన దిగులదిమనమున
మంచమునుండంగ నిద్రమాటయె కరవౌ!
కొంచెము నాకలి లేదన
కంచములో గారెలున్నఁ గాని తినండే!
ఉత్పలమాల
నించిన కుండలన్ గలుగ నీరము దాహములేక త్రాగమే!
మంచమునుండియున్ దిగులుమానసమెంచగ నిద్రవచ్చునే?
కొంచెమునైన నాకలియె కుక్షిని లేదన నిచ్ఛగింపకే
గంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే!
సంచిలొ దెచ్చిన వడలను
రిప్లయితొలగించండిపంచన గూర్చుండబెట్టి భక్షించుమనన్
కొంచెము నలత కలదనుచు
కంచములో గారెలున్నఁ గాని తినండే
రిప్లయితొలగించండిపంచగ, మారుతికి నివే
దించి ప్రసాదముగ నచట దేవళ మందున్
కాంచన వర్ణ మ్మున గల
కంచములో గారెలున్నఁ గాని తినండే.
పంచగ భక్త కోటికిని, వాయుసుతుండకు భక్తితో నివే
దించగ నెంచి భూరిగను దేవళ మందున నర్చకుండు వే
యించిన గారె లాతనికి యిష్టమటంచును తెచ్చి నట్టి యా
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే.
చంచలమౌ వ్యక్తిత్వము
రిప్లయితొలగించండివంచన యని నమ్ముచుండు వలదను నతడే
త్రుంచగ నెంచక నుండును
కంచములో గారెలున్నఁ గాని తినండే
చంచలమైన మానసము సత్వరమున్ మదినమ్మకుండుగా
వంచన లేకపోయినను భద్రము కాదని నిబ్బరించుచున్
ద్రుంచడు తాను చిన్నదగు తుండెము నైనను నోటబెట్టడే
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే
-
రిప్లయితొలగించండిపంచాపకేశ అయ్యరు
కంచెము లో గారెలున్న గాని తినండే
టంచను గాను జిలేబియె
ముంచెత్తక పిండిని ఘృతమున వేడిగనే