18, జూన్ 2026, గురువారం

సమస్య - 5502

19-6-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

(లేదా...)

“కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా”

9 కామెంట్‌లు:

  1. ఊసులు జెప్పు కొనుటకై
    లేసుగ పలికెడు పదములు రేగుచు నుండన్
    నాసిరకముగ నగుపడెడి
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

    రిప్లయితొలగించండి
  2. (ఒక కన్నడ భాషాభిమాని తన మిత్రునితో...)
    సుందరమైన కన్నడము సూడఁగఁ బాతది తెల్గు కంటె; నే
    డిందరుఁ బల్కుమాట యది యేదనఁ గస్తురి కన్నడమ్మె; నీ
    కెందుకు సందియమ్ము? వినుటెందుకు వారల వీరి మాటలన్?
    గొందరు భాషలందుఁ దెలుఁగున్ ఘనమందురు - నమ్మబోకుమా!

    రిప్లయితొలగించండి

  3. కాసుల కొరకై వరుణా
    వాసమ్మును దాటి పోవు వైధేయుడు సా
    వాసికి తా జెప్పె నిటుల
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ.


    అందరి వోలె మోజుపడి అత్యధికమ్ముగ ప్రాతి భావ్యమున్
    బొందెడి కౌతికమ్మున సముద్రము దాటి విదేశ మేగెడిన్
    మందుడొకండు వాగెనట మద్యము గ్రోలుచు స్నేహి తో నిటుల్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా.

    రిప్లయితొలగించండి
  4. కందం
    మా సము లెవ్వరు లేరని
    మీసముఁ ద్రిప్పుచు పలికె తమిళుడుగరువమై
    గాసిల తెలుగులు గూసెను
    "బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ!"

    ఉత్పలమాల
    ముందుగ పుట్టెనే ముదము పొందగ మా తమిళంపు భాష మీ
    రెందున గొప్పవారనుచు నీర్ష్య మదాంధుడుమీరు గర్వమై
    కుందఁగఁ దెల్గువారలిలఁ గూసెను నోటికి వచ్చురీతిగన్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా!

    రిప్లయితొలగించండి


  5. కొందరు బాసలందు దెలుగున్ ఘనమందురు; నమ్మబోకుమా
    కొందరుకాదుకాదనుచు కుత్సితులైనిజమొప్పుకోక దు
    ర్నిందలుజేయుచుందురిల నేరుగచర్చలుజేయలేరునెం
    దెందరు ఎన్నియున్ బలుక నీ భువిలోతెలుగేఘనంబులే

    రిప్లయితొలగించండి
  6. కం॥
    వ్రాసినదేమో యొక్కటి,
    వాసిగ పలుకంగనేమొ వావిరి యాంక్షల్!
    నాసిగ నిట్టుల గాసిలు
    బాసలలోఁదెలుఁగు ఘనమ? వట్టిదె సుమ్మీ!

    (కొన్ని భాషలలో వ్రాసిన లిపి ప్రకారం ఉచ్చారణ ఉండదు. ఇంగ్లీషులో know లాగా. అలాగే కొన్ని భారతీయ భాషల్లో కూడా ఇదే తంతు. కాని మన తెలుగులోని వర్ణమాల విస్తారమయినది. అంతే కాక వ్రాసిందే నిష్కర్షగా నిర్భయంగా చదవగలం కూడా.
    కాబట్టి అలా "బాధ" పడే భాషలలో తెలుగెలా ఘనమవుతుంది? కాదు కదా !!అని నా పూరణ)

    రిప్లయితొలగించండి
  7. సుందరమైన భాషయని శ్రోతలు పల్కగ ముక్త కంఠలై
    *“కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా”*
    మందమతిన్మొరంకులటుమాటలనాడిన ద్రిప్పిగొట్టుచున్
    సందియమేలరా వినుము చక్కని భాషయనంతెలుంగెరా.

    బాస నెరుంగక యందురు
    బాసలలో తెలుగు ఘనము వట్టిదె సుమ్మీ
    మీసము దువ్వుచు చెపుమా
    బాసలలో మేటియైన భాషతెలుంగే!


    రిప్లయితొలగించండి
  8. వాసిగ దేశము నందున
    భాసిలు సౌందర్యముగల భాష తెలుంగే!
    దోసముతో కూడినవగు
    బాసలలోఁ దెలుఁగు ఘనమ! వట్టిదె సుమ్మీ!


    [ఒక సంస్కృత భాషాభిమాని తన మిత్రునితో....]

    ముందుగ సంస్కృతమ్ముగద మ్రోగినదిచ్చట వేద ఘోషగా
    పొందిక తోడ భాసిలి ప్రపూజితమైనది తల్లిభాషగా
    సందియమేల తానొసగె చక్కని పల్కులు తెల్గు భాషకై
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా

    రిప్లయితొలగించండి