23-6-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్”
(లేదా...)
“ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
కందంపదునేడేళ్ల మనుమనిన్విధివంచితు పెంచి నేర్పి విద్యాబుద్ధుల్ముదమునఁ బితామహుఁడడుగముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్చంపకమాలవిధివశమౌచు మన్మనుని పెంచియు నేర్పియు విద్యలెన్నియోకుదురుగ గౌరవప్రదపు కొల్వున జేరఁ బితామహుండు తాముదమున పెళ్లిచేసుకొని ముచ్చట దీర్చుమటంచుఁ గోరఁగన్ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్
ముదమగు నీ పెండ్లి గనిన పిదపనె చచ్చెద నటంచు వృద్ధుండచటన్ వదలక కోరిక కోరెను ముదిమినిఁ , బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్.పదుగురు కోర నేమిర వివాహమునే వల దన్న వేళ లో నది సరి కాదటంచును ప్రియత్వము తోడ పితా మహుండు తా వదలక నాదు పెండ్లి గని సంస్థితి పొందెద నంచు కోరె నా ముదిమినిఁ , బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్.
ముదముగ దీవించ దగునుముదిమినిఁ ; బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్పదునెనిమిది యేండ్ల వయసు పదంపడి వరునిగ వయసు పాటిగ నుండన్
మది తలచును శివ నామము ముదిమిని :: పెండ్లాడ దగును ముగ్ధ ను బాలన్ పదునగు వయసున యువకుడు ముదమున పెద్దలు కుదుర్చు మూరుత మందున్
పదిలముగా తెలిపె నతడుముదురు వయస్సున వరించి, ముదిత మగనికిన్జెదరని సేవలనిడగాముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్ముదురు వయస్సునందునొక ముగ్ధను జూచి వివాహమాడి తాఁగుదురుగ పల్కెనావిభుడు గొప్ప రహస్యము చిత్తగింపుమావధువు వయస్సు ముఖ్యమగు, భార్యయె సేవలొనర్చు భర్తకున్ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్
మదిని మరల్చి నీవు పరమాత్ముని వైపుకు ముక్తి కోసమైసదమల బుద్ధితో సతము చక్కగ పూజలొనర్చగా వలెన్ముదిమినిఁ ,బెండ్లియాడవలె ముగ్ధను షోడశ వర్షబాలికన్ముదముగ యవ్వనాన పరి పూర్ణత గాంచగఁ జీవితంబునన్
-సదమల శంకరు గొల్వున ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్పదముల పద్యంపు చెలినిసుధలన్ గ్రోలంగ రారె శుభముల బడయన్
https://youtube.com/shorts/SRia2AMqhdY?is=iTdUlMDT_z9mn9M5
చం॥ చదువులు నేలఁ దైలమున సంపదఁ గాంచితిమిట్లు హెచ్చుగన్రదములు నూఁడ భాగ్య నగరమ్మున చక్కని కన్య చిక్కునేముదితలరబ్బులన్న కడు మోదము మీర లభింతు రచ్చటన్మదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్(కొన్ని సం॥ క్రితం ముసలి అరబ్బులు హైదరాబాద్ లో పేద పిల్లల నిలాగ పెండ్లి చేసుకోవడంపై చాలా కథానలు వచ్చేవండి. అదృష్ట వశాత్తు ఈ నడుమ రావటంలేదు)
చదువులతో గడిపి బ్రతుకుముదిమి వయసు వచ్చువరకు మూర్ఖత్వముగా తుదకే రీతిగ ముదుసలి“ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్”?
చదువులలోన యవ్వనము సర్వము వ్యర్థ మొనర్చి యక్కటాముదుసలివైన నీవిపుఁడు మూఢుఁడవై మనువాడ జూతువా!విధవనుజేసి నీసతిని వేదన పాలొనరింప నేలకోముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్?
పదిలముగఁ బొందఁ బ్రాయము నద నెఱిఁగి యతుల తపో మహత్వం బున్నన్ సదమల మునీంద్రు భంగిన్ ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్ ముదిరిన బెండకాయ జన భోజన పాత్రము కాదు సుంతయుం గుదురుగఁ జాగ సంతతము క్రొత్త కుటుంబము వర్థిలంగ దోహదము నొసంగ నున్నతికి యౌవన మందునె కాదు సుమ్ము నీ ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశ వర్ష బాలికన్
కందం
రిప్లయితొలగించండిపదునేడేళ్ల మనుమనిన్
విధివంచితు పెంచి నేర్పి విద్యాబుద్ధుల్
ముదమునఁ బితామహుఁడడుగ
ముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
చంపకమాల
విధివశమౌచు మన్మనుని పెంచియు నేర్పియు విద్యలెన్నియో
కుదురుగ గౌరవప్రదపు కొల్వున జేరఁ బితామహుండు తా
ముదమున పెళ్లిచేసుకొని ముచ్చట దీర్చుమటంచుఁ గోరఁగన్
ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్
రిప్లయితొలగించండిముదమగు నీ పెండ్లి గనిన
పిదపనె చచ్చెద నటంచు వృద్ధుండచటన్
వదలక కోరిక కోరెను
ముదిమినిఁ , బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్.
పదుగురు కోర నేమిర వివాహమునే వల దన్న వేళ లో
నది సరి కాదటంచును ప్రియత్వము తోడ పితా మహుండు తా
వదలక నాదు పెండ్లి గని సంస్థితి పొందెద నంచు కోరె నా
ముదిమినిఁ , బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్.
ముదముగ దీవించ దగును
రిప్లయితొలగించండిముదిమినిఁ ; బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
పదునెనిమిది యేండ్ల వయసు
పదంపడి వరునిగ వయసు పాటిగ నుండన్
మది తలచును శివ నామము
రిప్లయితొలగించండిముదిమిని :: పెండ్లాడ దగును ముగ్ధ ను బాలన్
పదునగు వయసున యువకుడు
ముదమున పెద్దలు కుదుర్చు మూరుత మందున్
పదిలముగా తెలిపె నతడు
రిప్లయితొలగించండిముదురు వయస్సున వరించి, ముదిత మగనికిన్
జెదరని సేవలనిడగా
ముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
ముదురు వయస్సునందునొక ముగ్ధను జూచి వివాహమాడి తాఁ
గుదురుగ పల్కెనావిభుడు గొప్ప రహస్యము చిత్తగింపుమా
వధువు వయస్సు ముఖ్యమగు, భార్యయె సేవలొనర్చు భర్తకున్
ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్
మదిని మరల్చి నీవు పరమాత్ముని వైపుకు ముక్తి కోసమై
రిప్లయితొలగించండిసదమల బుద్ధితో సతము చక్కగ పూజలొనర్చగా వలెన్
ముదిమినిఁ ,బెండ్లియాడవలె ముగ్ధను షోడశ వర్షబాలికన్
ముదముగ యవ్వనాన పరి పూర్ణత గాంచగఁ జీవితంబునన్
-
రిప్లయితొలగించండిసదమల శంకరు గొల్వున
ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
పదముల పద్యంపు చెలిని
సుధలన్ గ్రోలంగ రారె శుభముల బడయన్
https://youtube.com/shorts/SRia2AMqhdY?is=iTdUlMDT_z9mn9M5
రిప్లయితొలగించండిచం॥ చదువులు నేలఁ దైలమున సంపదఁ గాంచితిమిట్లు హెచ్చుగన్
రిప్లయితొలగించండిరదములు నూఁడ భాగ్య నగరమ్మున చక్కని కన్య చిక్కునే
ముదితలరబ్బులన్న కడు మోదము మీర లభింతు రచ్చటన్
మదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్
(కొన్ని సం॥ క్రితం ముసలి అరబ్బులు హైదరాబాద్ లో పేద పిల్లల నిలాగ పెండ్లి చేసుకోవడంపై చాలా కథానలు వచ్చేవండి. అదృష్ట వశాత్తు ఈ నడుమ రావటంలేదు)
చదువులతో గడిపి బ్రతుకు
రిప్లయితొలగించండిముదిమి వయసు వచ్చువరకు మూర్ఖత్వముగా
తుదకే రీతిగ ముదుసలి
“ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్”?
చదువులలోన యవ్వనము సర్వము వ్యర్థ మొనర్చి యక్కటా
రిప్లయితొలగించండిముదుసలివైన నీవిపుఁడు మూఢుఁడవై మనువాడ జూతువా!
విధవనుజేసి నీసతిని వేదన పాలొనరింప నేలకో
ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్?
పదిలముగఁ బొందఁ బ్రాయము
రిప్లయితొలగించండినద నెఱిఁగి యతుల తపో మహత్వం బున్నన్
సదమల మునీంద్రు భంగిన్
ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
ముదిరిన బెండకాయ జన భోజన పాత్రము కాదు సుంతయుం
గుదురుగఁ జాగ సంతతము క్రొత్త కుటుంబము వర్థిలంగ దో
హదము నొసంగ నున్నతికి యౌవన మందునె కాదు సుమ్ము నీ
ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశ వర్ష బాలికన్