28-6-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట”(లేదా...)“గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్”
బద్ధకమ్మును కలిగిన వాడోకండు తనదు పోలిక కలిగిన తనయు నపుడు వెక్కిరించుట గాంచిన విహితు డనెను గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట.బిడ్డన్ గాంచుచు బద్ధకస్తుడనుచున్ వేధింతువే నిత్యమున్ విడ్డూరంబిది నీదు పోలికయె యావృ ఆవృత్తవ్ చు చేరెన్ గదా బిడ్డన్, నిన్నిలబోలినట్టి సుతుడన్ వెంగమ్ము లాడన్ గనన్ గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్.
లెస్సగనె నీ వలె కదల లేదని కనుగ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట !కసిడి దినముల లోననె కదల గల్గి యున్న చోటు నుండి చలించు నొప్పిదముగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శార్దూలము:ఎడ్డెమ్మన్నను తెడ్డెమందువుగదా యేబ్రాసివా? వెర్రివా?బిడ్డా! చాలును చాలునింక తగునా ప్రేలాపనల్? మానుమావిడ్డూరమ్ముగ మాటలాడెదవుగా పెచ్చారివా? ద్రాపివా?గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్
(సరదా పూరణ)
చెడ్డీ చక్కగ వేయ నీవు నెరుగవ్ చెప్తుంటివే సూక్తులన్వడ్డీ లెక్కలు వచ్చునా యనుచు నన్ ప్రశ్నించుచున్ నుంటివేవిడ్డూరంబుగ మాటలాడెదవుగా పెట్రేగుచున్ మిక్కిలిన్గ్రూడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్
(మూడు నాలుగు రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఘోరము ఆధారంగా నండి దారి తప్పిన పిల్లలు తల్లిదండ్రులలో తప్పులు వెదుకుతారు కాని తిద్దుకోరు అని. చంపేదానికీ వెనుకాడరు)శా॥ అడ్డమ్మేదయ దారిఁ దప్పఁగను నేఁడయ్యో విలోమమ్ముగాజెడ్డన్ మెచ్చుచుఁ దల్లిదండ్రులను హిసించంగ దోషమ్ములన్గడ్డాయమ్ముగఁ జూప సూక్తమును బల్కంగా నిటుల్ విందురే!గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్ (విషయము తెలిపేందుకు అఖండయతి తప్పలేదండి 3వ పాదములో)
యుద్ధ రంగాన నభిమన్యు యుద్ధ పటిమ గాంచి కురుపతి కుట్ర తో కయ్య మందు పధ్ధతిని వీడి చంపుట పాడి యగునె?గ్రుడ్డు వై వెక్కిరింతు వె కూన నకట!
పిల్లలెదిగి కనుల ముందు పెద్దలగుటసర్వ సాధారణంబగు సంగతి గదవారి పనులలో విజ్ఞత వారిదనకగ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకటఅడ్డాదిడ్డు లనంగవచ్చునుగదా హాస్యోక్తులన్ బల్కినన్ గడ్డాలొచ్చిన నాడు బిడ్డలయినన్ గాకుందురా విజ్ఞులేవిడ్డూరంబుగ చూచుచుంటివిగదా విజ్ఞాని నీదృష్టి లో గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్[ పిల్లలు పెరిగి పెద్దయినా వారిని తగిన రీతి మెచ్చక పరిహాసమాడే భర్తతో భార్య అన్న మాటలు ]
పామరుండ వీ వాతఁడు పండితుండు పేదవాఁడవు నీవు కుబేరుఁ డతఁడు బక్కవాఁడ వీ వాతఁడు బల్లిదుండు గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట పడ్డన్ లేవవు నీ బలం బెఱుఁగుమా వారింపు మీ కూఁతలే యడ్డం బేల చరింతు కుక్కుటమ సర్పారాతి కో మన్మఁడా విడ్డూరమ్ముగ దగ్గు తాతకునె నేర్పింపంగ యత్నింతువా గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్
రిప్లయితొలగించండిబద్ధకమ్మును కలిగిన వాడోకండు
తనదు పోలిక కలిగిన తనయు నపుడు
వెక్కిరించుట గాంచిన విహితు డనెను
గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట.
బిడ్డన్ గాంచుచు బద్ధకస్తుడనుచున్ వేధింతువే నిత్యమున్
విడ్డూరంబిది నీదు పోలికయె యావృ ఆవృత్తవ్ చు చేరెన్ గదా
బిడ్డన్, నిన్నిలబోలినట్టి సుతుడన్ వెంగమ్ము లాడన్ గనన్
గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్.
లెస్సగనె నీ వలె కదల లేదని కను
రిప్లయితొలగించండిగ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట !
కసిడి దినముల లోననె కదల గల్గి
యున్న చోటు నుండి చలించు నొప్పిదముగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశార్దూలము:
రిప్లయితొలగించండిఎడ్డెమ్మన్నను తెడ్డెమందువుగదా యేబ్రాసివా? వెర్రివా?
బిడ్డా! చాలును చాలునింక తగునా ప్రేలాపనల్? మానుమా
విడ్డూరమ్ముగ మాటలాడెదవుగా పెచ్చారివా? ద్రాపివా?
గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్
(సరదా పూరణ)
తొలగించండిచెడ్డీ చక్కగ వేయ నీవు నెరుగవ్ చెప్తుంటివే సూక్తులన్
రిప్లయితొలగించండివడ్డీ లెక్కలు వచ్చునా యనుచు నన్ ప్రశ్నించుచున్ నుంటివే
విడ్డూరంబుగ మాటలాడెదవుగా పెట్రేగుచున్ మిక్కిలిన్
గ్రూడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్
(మూడు నాలుగు రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఘోరము ఆధారంగా నండి దారి తప్పిన పిల్లలు తల్లిదండ్రులలో తప్పులు వెదుకుతారు కాని తిద్దుకోరు అని. చంపేదానికీ వెనుకాడరు)
రిప్లయితొలగించండిశా॥ అడ్డమ్మేదయ దారిఁ దప్పఁగను నేఁడయ్యో విలోమమ్ముగా
జెడ్డన్ మెచ్చుచుఁ దల్లిదండ్రులను హిసించంగ దోషమ్ములన్
గడ్డాయమ్ముగఁ జూప సూక్తమును బల్కంగా నిటుల్ విందురే!
గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్
(విషయము తెలిపేందుకు అఖండయతి తప్పలేదండి 3వ పాదములో)
యుద్ధ రంగాన నభిమన్యు యుద్ధ పటిమ
రిప్లయితొలగించండిగాంచి కురుపతి కుట్ర తో కయ్య మందు
పధ్ధతిని వీడి చంపుట పాడి యగునె?
గ్రుడ్డు వై వెక్కిరింతు వె కూన నకట!
పిల్లలెదిగి కనుల ముందు పెద్దలగుట
రిప్లయితొలగించండిసర్వ సాధారణంబగు సంగతి గద
వారి పనులలో విజ్ఞత వారిదనక
గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట
అడ్డాదిడ్డు లనంగవచ్చునుగదా హాస్యోక్తులన్ బల్కినన్
గడ్డాలొచ్చిన నాడు బిడ్డలయినన్ గాకుందురా విజ్ఞులే
విడ్డూరంబుగ చూచుచుంటివిగదా విజ్ఞాని నీదృష్టి లో
గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్
[ పిల్లలు పెరిగి పెద్దయినా వారిని తగిన రీతి మెచ్చక
పరిహాసమాడే భర్తతో భార్య అన్న మాటలు ]
పామరుండ వీ వాతఁడు పండితుండు
రిప్లయితొలగించండిపేదవాఁడవు నీవు కుబేరుఁ డతఁడు
బక్కవాఁడ వీ వాతఁడు బల్లిదుండు
గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట
పడ్డన్ లేవవు నీ బలం బెఱుఁగుమా వారింపు మీ కూఁతలే
యడ్డం బేల చరింతు కుక్కుటమ సర్పారాతి కో మన్మఁడా
విడ్డూరమ్ముగ దగ్గు తాతకునె నేర్పింపంగ యత్నింతువా
గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్