23, జులై 2026, గురువారం

సమస్య - 5537

24-7-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును”

(లేదా...)

“రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో భువనగిరి పురుషోత్తం గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. ఉదయపు లగనమున నుద్వా మొనరించ
    గాదిలిగ దొలిరెయి కౌగిలి గొని
    యాలి పెదవి తాకి యామె యధర నిర్జ
    రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    మానసిక సమస్యలే నరులు గుములు
    ఖేద కారణమన, కృష్ణ గీత
    యా సమస్యలనిల గాసిల జేయు! సా
    రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును

    ఉత్పలమాల
    నమ్ముచు కృష్ణునిన్ నరుఁడు నర్మిలి సాదిగనెంచి మోహమే
    క్రమ్మగ విల్లు వీడ దిగి గాసిలె మానసికంపు బాధలన్
    గమ్మని గీతనే వినియు కౌరవసేనల గెల్చె! శాస్త్ర సా
    రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీ భువిన్

    రిప్లయితొలగించండి

  3. ఆకలి యను పేద యన్నార్థులను గాంచి
    యన్న మిడుచు వారి నాదు కొనగ
    బెగ్గడిల్ల కుండ పృథ్విని ధర్మ సా
    రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును.


    సొమ్మన మోహమున్, చెనటి స్యోనము లన్నను రోత గించి తా
    నిమ్మహి లోన గాంచ పరమేశ్వరు డొక్కడె శాశ్వతమ్మనే
    నమ్మిక తోడ గొల్చినననంతము దక్కునటంచు భక్తి సా
    రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్.

    రిప్లయితొలగించండి
  4. రామ కథను జదివి రామకీర్తన విని
    రామ రాజ్యమన్న రమతి యనుచు
    రామనామ నిర్జర రసమందుగల సా
    రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును

    కమ్మని రామ కీర్తనల గానసుధారసమున్ గ్రహించి మో
    దమ్మును బొందువారలకు దక్కిన మానవ జన్మమందు తా
    నమ్మిన దైవ సంస్తవము నాకము జేరుచునన్న భక్తి సా
    రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్

    రిప్లయితొలగించండి