10, మే 2018, గురువారం

స్వస్తిక్ బంధ చిత్రమాలిక

                              
హరి ప్రార్థన(తేటగీతిలో)
హరి వెలుగు నిడు, వెన్నెల హరి విదుర్చు,
హరి గినుక వహిoచ, బెరుకు హరి యసువులు,
హరి రిపువు గద మహిలోన హరికి. నట్టి  
హరికి జేతును నమసము హరి హరి యని. 
అర్ధము
హరి = (సూర్యుడు) వెలుగు నిడును,  హరి = (చంద్రుడు) వెలుగు నందించు,  హరి = (గాలి) కినుక వహించ,  బెరుకు =  లాగు, హరి = (యముడు) యసువులు, హరి = పాము, రిపువు = (శత్రువు) గద మహిలోన,  హరి=(కప్ప)కు  అట్టి హరికి నమస్కారము చేతును హరి హరి యనుచు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

9, మే 2018, బుధవారం

సమస్య - 2673 (కరణము వద్దనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్"
(లేదా...)
"కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

8, మే 2018, మంగళవారం

సమస్య - 2672 (కలుషాత్ముల కెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్"
(లేదా...)
"కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

7, మే 2018, సోమవారం

సమస్య - 2671 (భీతిన్ మున్ముందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్"
(లేదా...)
"భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

6, మే 2018, ఆదివారం

సమస్య - 2670 (దేహము విడనాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"
(లేదా...)
"దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

5, మే 2018, శనివారం

సమస్య - 2669 (ధవుఁడె కారకుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధవుఁడె కారకుండు తనయు మృతికి"
(లేదా...)
"ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్"
(మద్దూరి రామమూర్తి గారి 'అవధాన కల్యాణి' గ్రంథం నుండి...)

4, మే 2018, శుక్రవారం

సమస్య - 2668 (చీకటిలో వస్తుచయము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"
(లేదా...)
"చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

3, మే 2018, గురువారం

సమస్య - 2667 (నాల్గు రెండయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"
(లేదా...)
"నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

2, మే 2018, బుధవారం

సమస్య - 2666 (హానిం జేయకయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"
(లేదా...)
"హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో"
('శంకరాభరణం' వాట్సప్ సభ్యులకు ధన్యవాదాలతో...)

1, మే 2018, మంగళవారం

సమస్య - 2665 (తండ్రులకు మ్రొక్కెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"
(లేదా...)
"మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)