8, మే 2018, మంగళవారం

సమస్య - 2672 (కలుషాత్ముల కెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్"
(లేదా...)
"కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

97 కామెంట్‌లు:

 1. పలుకుచు సుభాషితమ్ములు
  తెలుపుచు వేల్పుల కథలను దీటగు రీతిన్
  వెలిగించి జ్ఞాన దీపిక
  కలుషాత్ముల కెల్ల కవులకారణ మిత్రుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండేళ్ళ క్రితం నేను (మాతృభాష రాని) కలుషాత్ముడిని. ఏదో కలుషబుద్ధితో దేనికోసమో అంతర్జాలములో గాలిస్తూ అనుకోకుండా అకారణముగా శంకరాభరణం తగిలిన తరువాత ఇప్పుడు నాకు రెండు వందల పైగా కవులు మిత్రులైనారు సార్ :)

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   అప్పటి అకారణమిత్రులు ఇప్పుడు సకారణమిత్రు లయ్యారు!

   తొలగించండి
 2. చెలి,నుడి,విషమై పరగును
  కలుషాత్ములకెల్ల:కవులకారణమిత్రుల్
  కలి కల్మష నాశములగు
  పలు నీతులు బోధలిచ్చు వారలగుటచే.

  రిప్లయితొలగించండి
 3. నలుగురు కలిసిన చాలును
  కలతలు పుట్టంగ వేగ కయ్యా లనగన్
  మలినపు మనసుల వెలువడి
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనసుల కడుగగ' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 4. చెలిమిని పంచుచు సతతము
  పలవురు మెచ్చంగ జగతి పరహిత మతులై
  మలినము వీడగ దలచెడు
  "కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి
 5. ఇలలో లోకులు వ్యర్థులు
  కలుషాత్ముల కెల్ల, కవుల కారణ మిత్రుల్
  మలినాత్ములు కాని జనులు
  బలహీనులు వృద్ధులు విధి వంచితు లెల్లన్.

  రిప్లయితొలగించండి
 6. పలుకులు రాని లేత పసిబాలలఁ గాంచి , దురాగతమ్ములన్
  సలిపెడి క్రూర దుష్ట జన సంఘమనంగ సమూహమై జనన్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె ! సత్కవుల్
  పలుకుల ముల్కులన్ ఖలులపై కదనమ్మొనరింపగావలెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ విరుపుతో ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 7. పలికెదరు వీరెటువయిపు
  న లిఖించుచు పద్యములను నమ్మదగునటుల్,
  వలువ వలె నాకతాయి,య
  కలుషాత్ముల కెల్ల కవులకారణమిత్రుల్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ఇలనవినీతినిఁద్రుంపగ
  విలువలు పెంచగ ప్రజలకు, విజ్ఞత తోడన్
  పలుసేవలను సలుపు ని
  ష్కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి


 9. పలికెద రయ్య దుష్టునకు, పల్కుల జిమ్ముదురే తుటారికిన్ !
  పలికెదరే జిలేబులకు, పల్కుల గొల్తురు రే విదగ్ధలన్!
  కలల జగంబు లో ధృవపు కావ్యము లన్నెల కొల్పుచుందురే!
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. పలు రీతుల నీతి కథలు
  విలసిత జీవన పథ ములు ప్రీతి గ దె లు ప న్
  ద ల చ గ వారల బంధ ము
  కలుషా త్ముల కె ల్ల కవులకార ణ మిత్రుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
   ఖలనాయకు డొకడుండక
   బలముగ నా పుణ్యగాథ భాసింపదు వే
   కలతల బలియగు ఖర్మల
   కలుషాత్ములకెల్ల కవులకారణ మిత్రుల్

   తొలగించండి
  3. సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఖర్మ' సాధువు కాదు. కర్మలు అనాలి.

   తొలగించండి
 11. ఇలలో మంచియు చెడులను
  పలురీతుల చాటిజెప్పి బంచుచు చెలిమిన్
  తొలగించగ తిమిరమ్మును
  కలుషాత్ముల కెల్ల కవులకారణ మిత్రుల్!!!

  ఇల జరిగెడు దారుణములు
  తిలకించుచు నూరుకొనక దెలుపుచు వాటిన్
  నలుగురి మేల్గోరెడు ని
  ష్కలుషాత్ముల కెల్ల కవులకారణ మిత్రుల్!!!

  రిప్లయితొలగించండి
 12. పొలతుల కసురుట మోదమె
  కలుషాత్ములకెల్ల; కవుల కారణమిత్రుల్
  సలిపెడి విమర్శలెప్పుడు
  పలువిధములుగ కవితలను బాగుపరచుగా

  1. కవులకా రణమిత్రులు=
  కవులకు+ఆ రణమిత్రులు (కవులతో యుద్ధం చేసే, విమర్శకులు, మిత్రులే కదా)
  2. (కవులకుపయోగపడే) నిమిత్తము మిత్రులయినవారు= కారణ మిత్రులు ( కారణజన్ములు అన్నట్లు)

  రిప్లయితొలగించండి
 13. విలువలు నిండిన పలుకులు
  చెలువము నను వ్రాతలందు చేర్చెడి వారే!
  మలినము లూడ్చగ మతులను
  "కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్"

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2672
  సమస్య :: *కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్.*
  ‘’కవులు పాపాత్ములు. వాళ్లు ఏ కారణం లేకుండానే చెడ్డవాళ్లకు మిత్రులౌతారు కదా ‘’ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: మంచివారికి హితోపదేశం చేయవలసిన అవసరంలేదు. చెడ్డవాళ్లకే హితాన్ని ఉపదేశించాలి. గొప్ప కవులు దుర్జనులపై జాలిపడుతూ స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఓ అజ్ఞానులారా!
  త్యజ దుర్జన సంసర్గం
  భజ సాధులమాగమం ।
  కురు పుణ్య మహోరాత్రం
  స్మర నిత్య మనిత్యతామ్ ।। అనే శ్లోకాన్ని చెబుతూ
  మీరు కలుషితమైన బుద్ధిని వదలివేయండి. సుఖంగా ఉండండి. సాధువులను సేవించండి. పగలు రాత్రి అనుకోకుండా ఎల్లప్పుడూ పుణ్యకార్యములను చేయండి. ఈ లోకంలో ఏది శాశ్వతము? ఏది అశాశ్వతము? అని తెలిసికొనండి అని ఉపదేశం చేస్తుంటారు. అటువంటి సత్కవులు చెడ్డవారు కాదు. వారు దురాత్ములకు మంచిని చెబుతున్నారు కాబట్టి ఏ కారణం లేకుండానే ఆ దుష్టులకు మిత్రులౌతారు అని విశదీకరించే సందర్భం.

  పలువల ప్రేమతో గనుచు బల్కరె సత్కవు లెల్ల మిత్రతన్
  ‘’కలుషిత బుద్ధి వీడుడు, సుఖమ్ముల గాంచుడు, సాధుమూర్తులన్
  గలసి భజించి పుణ్య మిడు కార్యమె చేయు డహర్నిశ మ్మిలన్,
  తెలియు డనిత్య నిత్యముల ధీరత’’నంచు ; తలంప కారుగా
  *కలుషమతుల్ ; దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-5-2018)

  రిప్లయితొలగించండి
 15. శ్లోకంలో రెండవ పాదంలో సవరణ
  *భజ సాధుసమాగమమ్ ।*
  గమనించ ప్రార్థన

  రిప్లయితొలగించండి
 16. తెలుపుచు తమ కవితలచే
  మెలకువతో నడచెడు పలు మేలగు త్రోవల్
  విలువలు పట్టని దుష్టుల
  కలుషాత్ముల కెల్ల కవులకారణ మిత్రుల్!

  రిప్లయితొలగించండి
 17. పలుమరు బోధ జేయుచును పామరులన్ మఱి సంస్కరించుచున్
  మలినము బారద్రోలి పది మందికి నీభువి మేలు గూర్చుచున్
  వలుగులు నింపగన్ జగతి వేసట జందక నెల్లవేళలన్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్

  రిప్లయితొలగించండి
 18. కం:-
  పలుగురి మనస్సులు దడిమి
  మెలకువ కలిగించి బ్రతుకు మెరుగులుదిద్దన్
  మలినపు ఛాయల నెడపగ
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్ !!!

  @ మీ పాండురంగడు*
  ౦౮/౦౫/౨౦౧౮

  రిప్లయితొలగించండి
 19. డా.పిట్టాసత్యనారాయణ
  పలు శనగల్ మరీ వరిని పాళ్ళను గల్పని పిండి వంటలే
  పలువరుసన్ బడంగ పరిపాటిగ తుస్సుమనంగ జూడమే
  మలుపగ కర్రు కట్కుమను మాడ్కి ఖలాళిని కోరిదెచ్చి వే
  వలువల నుంచు చెప్పులను వాయగ మోదిన నౌను సత్కథల్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గాదె సత్కవుల్

  రిప్లయితొలగించండి
 20. డా.ఎన్.వి.ఎన్.చారి
  తలపులలోన నిండిన కుతంత్రము లన్నియు పారద్రోలగా
  తలచుచు భారతీయుల సదాచరణ మ్ముల చాటిచెప్పుచున్
  పలుపలురీతులన్ చెడినవారిని మార్చు నెపంబునన్ గదా
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులుగారె సత్కవుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఎన్వీయెన్ చారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 21. కందం
  కులకాంతను నిందగ చా
  కలి మాటాడంగ పతియె గానల కంపన్
  గొలువిడె వాల్మీకియె ని
  ష్కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి
 22. రవి గాంచనిదదె కవి కాంచును కాంచిన దందరికి
  తా పంచును
  మంచి చెడులుగ తూకము నెంచును భ్రష్టత్వపు
  మెడలు వంచును
  చెడుతో పోరగ సాహచర్యమన అనుసరణీయులు
  దుర్మతుల్
  కలుష మతుల్ దురాత్ముల కకారణ మిత్రులు
  గారె సత్కవుల్

  రిప్లయితొలగించండి
 23. పలుకు సుభాషిత విహితము
  పలుకులు దేనియల జల్లులను పంచవె, తా
  నులుకక నిలిచే దుర్మతి,
  కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 24. కలతలు కల్గ చేయుచును గ్రామములందున స్వీయలబ్దికై
  సలుపుచు దుష్ట కార్యముల సాగెడి స్వార్థపు రాజకీయపున్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె! సత్కవుల్
  విలువలు పెంచ దేశమున విజ్ఞత తోడుత కైత లల్లెడిన్

  రిప్లయితొలగించండి
 25. లలనల సౌందర్యంబును
  నలవోకగ జెప్పునట్టి యాశుక వివరుల్
  విలసిత సత్కవి వరులయి
  కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి
 26. ఫలమును గోరిన స్నేహం
  బలవడునె మన మలరంగ వాణీ సత్పు
  త్రులు విద్వజ్జను లా ని
  ష్కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్


  వలపటి చేతి ఘంటమున వ్రాయఁగ భాగవతమ్ము ధాత్రినిం
  జెలువము మీఱ మారిరి కృశించ మనో౽ఘము లంత మానవుల్
  లలితపు వాక్ప్రసూనముల లాలన సేయుచు మార్చ నింపుగం
  గలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్

  కారె = కారు, కారణ మిత్రులే ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 27. మిత్రులందఱకు నమస్సులు!

  విలువలఁ బేర్చు నట్టివి; సువేద్య, మహోన్నత శాస్త్ర పాండితీ
  కలిత విశేష సత్కథల కాకరమై చనునట్టివౌ కృతుల్
  విలసన మొప్ప వ్రాసి, యిడి, పెంచుచు నైతిక వృత్తి నెప్పుడున్,
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్?

  రిప్లయితొలగించండి
 28. కం:-
  కలహము వద్దని దెల్పుచు
  కలికిని తల్లిగ దలంచి గాంచిన మనమున్
  కలనము నెఱిగించగ యిల
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్ !!!

  @ మీ పాండురంగడు *
  ౦౮/౦౫/౨౦౧౮
  కలనము...జ్ఞానము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాండురంగడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎఱిగించగ నిల' అనండి.

   తొలగించండి
  2. కం:- ������
   కలహము వలదని దెల్పుచు
   కలికిని తల్లిగ దలంచి గాంచిన మనమున్
   కలనము నెఱిగించగ నిల
   కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్ !!!౦౨

   @ మీ పాండురంగడు *
   ౦౮/౦౫/౨౦౧౮
   కలనము...జ్ఞానము.

   తొలగించండి
 29. తలపులతలుపులుతెరవగ
  భళిరాసత్కవితలల్లుభాగ్యంబబ్బెన్
  కలుషాత్ములెందరున్నను
  కలుషాత్ములకెల్లకవులకారణమిత్రుల్.

  ఆచార్యలక్ష్మణ పెద్దింటి యానాం

  రిప్లయితొలగించండి
 30. విలసిత పాండి తీమహిమ బేషరతన్విలసిల్లగామదిన్
  "కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్"
  కలతలులేక యుండగ సకారణ కావ్యపుసారబోధనల్
  లలితపదంబులొయ్యన సరాగముతోడనుసైయనంగుగా

  రిప్లయితొలగించండి
 31. మలిన మనస్కులై చెలగు మానవ కోటికి గాంచినంతనే
  యిల జను లెల్ల శత్రువులు హీనులుగా నగుపింపరే భువిన్
  కలుష మతుల్ దురాత్ముల, కకారణ మిత్రులుగారె సత్కవుల్
  బలరహితుల్ నిరాశ్రయులు బాధలనందెడు కష్టజీవికిన్

  రిప్లయితొలగించండి
 32. తలలో,శవములకు,విజే
  తలకును,దేవతలకు విరిదండలవలెనే
  తలపోయగ?శ్లేషనువిని
  కలుషాత్ములకెల్ల కవులెకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి
 33. ఆటవిడుపు పద్యం:
  (సరదా పూరణ)

  కులుకుచు పుల్లలేరుకొని గూడులు గట్టుచు పిల్లజెల్లకున్
  పలుకుచు కేరు కేరుమని ప్రక్కన వానిని గ్రుచ్చి ముక్కుతో
  కలహము లాడుచుండుచు సుఖమ్ముగ నుండగలేని తమ్మువోల్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్

  సత్కవి = శ్రేష్ఠమైన నీటికాకి
  పిల్లాజెల్ల = సంతానము (మా నెల్లూరు భాష)
  ...ఆంధ్రభారతి నిఘంటు శోధన

  తమ్మువోల్ = తామువలె

  రిప్లయితొలగించండి
 34. విలువల వల్వ లూడ్చి తమ వేడుకకై బలహీనులైన బా
  లల తరుణీ లలామలను రాయిడి పెట్టెడి కీచకాళి నే
  డిల చెలరేగుచుండి రన హింసను మెచ్చెడి ధూర్త నేత లీ
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె? సత్కవుల్!

  రిప్లయితొలగించండి


 35. కలకాలము దుశ్చర్యలు
  కలవరపడకుండచేయు కలుషాత్ములకున్
  తెలివిని పంచిరి భువిలో
  కలుషాత్ములకెల్ల కవులకారణమిత్రుల్.

  2.ఇలలో శశియే శత్రువు
  కలుషాత్ములకెల్ల,కవులకారణ మిత్రుల్
  వలపుల ఝరిలో తిరిగెడు
  నెలతలకెల్లను సఖుండు నెలవంకేయౌ.

  రిప్లయితొలగించండి
 36. పలుచన జేయుటేగద యభాగ్యుల నైజ మనంగ నిక్కమౌ
  కలుషమతుల్ దురాత్ముల; కకారణ మిత్రులుగారె సత్కవుల్
  విలువల నేర్పుచున్ బడుగు పీడిత తాడిత దీనులన్ భళా!
  కలుపుచు నేకతాటిని సుకావ్యములల్లుగ మేలుకొల్పచున్

  రిప్లయితొలగించండి
 37. చంపకమాల

  పలుకుచు నీతివాక్యముల పాపపు కర్మలఁ జేయు వారలున్
  చిలుకుచు వ్యంగ్య భాష్యముల జిత్తులుఁ బన్నెడు దుష్టబుద్ధులుం
  దొలి కవి సంగమందుఁ దిగు నూతన చిత్రములందు జూడగన్
  గలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్!

  రిప్లయితొలగించండి
 38. పలు నేరములను జేయుచు
  పలువురి లో కీర్తి పొంద పద్యమ్ములతో
  పలు శ్లాఘింపుల గోరెడు
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్ !!!

  రిప్లయితొలగించండి
 39. ఇల అవగుణాల కలయిక
  కలదెవ్వారల; నిశాత కలమెవరిదిలన్;
  కలిమి వలన గల్గు నెవరు;
  కలుషాత్ముల కెల్ల; కవుల;కారణ మిత్రుల్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీకాంత్ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 40. డా.పిట్టాసత్యనారాయణ
  పలు శనగల్ మరీ వరిని పాళ్ళను గల్పని పిండి వంటలే
  పలువరుసన్ బడంగ పరిపాటిగ తుస్సుమనంగ జూడమే
  మలుపగ కర్రు కట్కుమను మాడ్కి ఖలాళిని కోరిదెచ్చి వే
  వలువల నుంచు చెప్పులను వాయగ మోదిన నౌను సత్కథల్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గాదె సత్కవుల్

  రిప్లయితొలగించండి
 41. *8-5-18*
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ఇల నందరు మిత్రు లగుట
  కలుషమతుల కేదియొ యొక కారణముననే..
  తుల లేని బోధఁ జేయుచుఁ
  గలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్

  2 వ పూరణము..

  సందర్భము: పాపం చేయడానికి అలవాటు పడిన వారికి మంచి దారిలో నడువు డని చెబితే రుచించదు. అలా చెప్పేవారు శత్రువులుగా కనిపిస్తారు. కాని నిజానికి వారే మిత్రులు. అదీ మామూలు మిత్రులు కారు. అకారణ మిత్రులు. అంటే యేమీ ఆశించని మిత్రులు.
  దురాత్ములకు ఆ విషయం తాము చేతులారా చేసిన దుష్కృత్యాలకు ఫలితాలు అనుభవానికి వచ్చినప్పుడు గాని తెలిసిరాదు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ఇల మంచి దారి నడువగ
  వలె నని కోరుచు హితవును
  వచియించెడు వా
  రలు రిపులుగఁ గనిపింతురు
  కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 42. చెలియవి గుబ్బలొల్లుచును చెక్కిలి వన్నెను సంస్తుతించుచున్
  పలుకుల బూతు లొల్కుచును పాపపు చింతల పద్యమల్లుచున్
  కులుకుచు రాజు దీవెనల గుట్టుగ పట్టుచు మంత్రి కాళ్ళనున్
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్

  రిప్లయితొలగించండి