గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2668 సమస్య :: *చీకటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయమ్ము దప్పకన్.* చీకట్లో వెతికితే వస్తువులు తప్పకుండా దొరుకుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని నామ స్మరణతో తాను తరిస్తూ తన తోటి విద్యార్థులను కూడా తరింపజేయాలని అనుకొన్నాడు. ఓ బాలకులారా! శ్రీ హరిని స్మరించే భక్తులకు క్రమంగా యోగము క్షేమము మొదలైన శ్రీకరమైన వస్తువులు దొరుకుతాయి. బాహ్య ప్రపంచ భాంతి అనే చీకటి తొలగిపోతుంది. చివరకు మోక్షం లభిస్తుంది. ఎవరైనా సరే *పుట్టని చావని త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి* అంటూ ఉపదేశం చేసే సందర్భం.
చేకురు భక్తవర్యులకు శ్రీకర వస్తు చయమ్ము, భక్తితో నా కమలాక్షు శ్రీ హరిని యాశ్రితపాలకునే స్మరింపు డీ పోక నెఱుంగుడీ, తొలగి పోవును బాహ్య ప్రపంచ భ్రాంతియన్ *చీకటి ; లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-5-2018)
కాలములో తను వచ్చినది కాలములోనే కరిగి పోవును కళ్ళకు కనబడు జగతి చూడు రోజొక రీతి రూపు మారును నిత్యము సత్యము తెలియగ అంతర దృష్టిని సారించినన్ చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని సమస్యగా కందపాదాన్ని కాక, ఉత్పలమాల తీసుకున్నారు. 'విద్యుత్' అని హలంతంగా వ్రాయరాదు. అక్కడ "విద్యుత్తు చనెన్" ఆనండి.
గురుమూర్తి గారూ, ఇప్పుడే నా సహాధ్యాయి, తెలుగు పండితులు భూసారపు నర్సయ్య గారు ఫోన్ చేశాను. "చాలారోజుల తర్వాత నాకు ఆత్మానందాన్ని కలిగించే పద్యాన్ని మీ బ్లాగులో చూసాను. 'లో వస్తుచయము' అన్న విరుపులో లోతైన ఆధ్యాత్మిక భావ సంపద ఉన్నది. పద్యాన్ని వ్రాసిన గురుమూర్తి గారికి అభినందనలు తెలియవలసింది" అని ఆ ఫోన్ సారాంశం. మాట్లాడిన పది నిమిషాలూ మీ పద్యాన్ని గురించిన ప్రశంసయే...
ఆడవారైనా, మగవారైనా అలవాటైన పరిసరాల్లోని వస్తువుల్ని చీకట్లోనూ తేలిగ్గా వెతుకగలుగుతారు! నన్నే తీసుకోండి... అది రాత్రైనా, పగలైనా నేను పఠించెడి గ్రంథచయాన్ని నేను కళ్ళుమూసుకొని వెదుకగలను! చీకట్లోనూ నాకు కావలసిన పుస్తకాన్ని సులభంగా గుర్తించి, బయటికి తీయగలను! ఇది కేవలం అలవాటు, పరిసర పరిచయము ఉంటే చాలు...ఎవరికైనా సాధ్యమే!
అక ప్రత్యయాంత అవ్యయమైన 'తప్పక' కళయే. 'తప్పకన్' అన్న ప్రయోగం దోషమే. అయితే ఇది ఆకాశవాణి వారిచ్చిన సమస్య. సమస్యను ఉన్నదున్న?ట్లుగా స్వీకరించడం జరిగింది. దానికి కందపాద రూపాన్నిచ్చింది నేను. (బి.వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు తాము పూరించిన ఆకాశవాణి సమస్యలను ఒక పుస్తకంగా ప్రకటించారు. అందులోనుండి గ్రహించాను). నిజానికి ఇచ్చే సమయంలో నాకు అనుమానం రాలేదు. ఈరోజు ఉదయం గుర్తించి గుండు మధుసూదన్ గారితో ఈ విషయమై చరించాను కూడా. శ్రీహరి నిఘంటువు దీనిని క్రియా విశేషణం అన్నది. అప్పుడు 'తప్పకన్' అంటే దోషం లేదు. బి.ఎన్.రెడ్డి నిఘంటువు అవ్యయంగా పేర్కొన్నది. అప్పుడు దోషమే. కాబట్టి మనం క్రియావిశేషణంగా స్వీకరిద్దాం.
సందర్భము: అజ్ఞాన మనే చీకటి వున్నంతవరకు వస్తు వ్యామోహం వుంటుంది. అంటే రకరకాల వస్తువులను సేకరించడంలో భ్రమ. ఆ దశలో నరునికి లభించేవి వస్తువులే! కాని శాశ్వతమైన దివ్యానందానుభవాన్ని ప్రసాదించే *ఆత్మ* కాదు. వెదుకగా వెదుకగా.. అనగా ఆత్మకోసం అన్వేషించగా.. అజ్ఞానాంధకారం నశిస్తుంది. జ్ఞాన భాస్కరు డుదయిస్తాడు. ఆ వేకువలోనే ఆత్మ లభిస్తుంది. వస్తు ప్రీతిని వర్ధిల్ల జేసే భ్రమ లన్నీ పటాపంచ లౌతాయి. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ ప్రాకటమగు నజ్ఞానపు చీకటిలో వస్తుచయము చిక్కును; వెదుకన్ చీకటి నశించు; జ్ఞానపు వేకువ నాత్మయె లభించు; విడు వస్తు భ్రమల్
మధుసూదన రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'చేతిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చేతను నుండన్" అనండి. రెండవ పూరణలో కొన్ని టైపు దోషాలున్నవి.
రిప్లయితొలగించండిశ్రీ కంది వరులు పలికిరి
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక
న్నా కందుకనియె నిష్టం
బీ కవి వరుల సభ! దొరకు విరివిగ పదముల్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెదుక న్నా కందుకనియె' ఇక్కడ కొంత సందిగ్ధత?
ఆకట నటమట లాడెడి
రిప్లయితొలగించండిశ్రీకరులగు ముద్దుముద్దు చిన్నారులపై
చీకాకందని యమ్మకు
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్ .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిసరదాగా:
రిప్లయితొలగించండి"లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్"
పాకము పట్టగ ధ్యాన మ
నేకము లయమై నిజమ్ము నీవె మిగులగా
శోకము మాయమ్మై పెను
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
వస్తువు = వాస్తవిక పదార్థము
చయము = సమూహము
"సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం"
(విరుపు నచ్చనపుడు వేదాంతమే శరణ్యం)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి👌👌👌🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీకో సముమది నిండుగ
తొలగించండినేకాంతము కోరుకొనుచు నేనుండగ వెలుగై
రాకాశశి యడ్డు బడిన
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "కోరుకొనగ నే నట వెలుగై" అందామా?
నీకో సమెమది నిండుగ
తొలగించండినేకాంతము కోరుకొనగ నేనటు వెలుగై
రాకాశశి యడ్డు బడిన
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచేకొని సాధువేషమును స్త్రీలను మోసము చేసి , వారి లో...
లాకుల , గాజులన్ , గొలుసులన్ గొని , దాచుచు పంచె యందు , చీ...
కాకులు పెట్టు వాని పసిగట్టియు , కొట్టియు , లాగిచూడ గో...
చీ , కటిలోపలన్ వెదుక చిక్కును వస్తుచయంబు దప్పకన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
👏👏👏
తొలగించండిపరమాద్భుతం
విశిష్టమైన విరుపుతో రుచిరమైన చమత్కారం
తొలగించండిసాధించారండీ! 👌
తొలగించండిఆహా చీకటి లో గోచీ లాగట మా !
భేష్! అవధానులవధానులే !
అడురహో !
జిలేబి
చీకటి యావరించెనని చింతలఁబొందగనేల ? ధీరతన్
తొలగించండిచేకొని నిల్వఁ బోవు పెనుజీకటి , నూతన కాంతి చిందుచున్
వేకువ వచ్చు , దీరునిక వేదన , భానుని రాక ద్రుంచగా
చీకటి , లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅవధానుల కలానికి రెండువైపులా పదునే! 👏👏👌👌🙏🙏
తొలగించండిఏ కారపు డబ్బాయో ,
తొలగించండియే కర్రయొ , కత్తిపీట , యేబండయొ , యే
చాకో దొంగను కొట్టగ
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రేఖా! పోయిన వేవియు
రిప్లయితొలగించండిచీకటి ముదిరిన దొరకవు శీఘ్రము తోడన్
శోకము మానుచు నీ చిరు
చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క-ఖ'లకు ప్రాసమైత్రి లేదు. సవరించండి.
రిప్లయితొలగించండివేకువజాము జోగి సయి వెంగలి విత్తువ లెన్జిలేబియా
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్?
నీకల నివ్వటిల్లదు! సునిశ్చలు నిన్మది నెంచి యత్నమున్
సాకము చేయ గావలయు శాశ్వతు డాతడు లోన వెల్గగన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఓ కవి వర్యా యితరుల
దౌ కవనము గిట్టదయ్య దయ కరువై యా
లోకనగన వరుసల చిరు
చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసోకక దూరముగ నిలిచి
మాకిక పద్యములు రావు మల యన నేలా ?
జోక పడగన్ కవులతో
చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
'మల'...?
తొలగించండిమల - కొండ గుట్ట
తిరుమల !
జిలేబి
శ్రీకరు లార్యులు,యోగులు,
రిప్లయితొలగించండిప్రాకటముగ కనులు మూసి ప్రణవంబందున్
వీకను దైవముఁజూడరె!
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిచీకటి వెలుతురులందున
రిప్లయితొలగించండిలోకమ్మును జూడగలుగు లోపమె వరమై
చీకునకనవరతమ్మున్
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్!!!
చీకు = అంధుడు
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపోకను జూర(చూర) జేసికొని పొందుగ దంతము లాడనీయకన్
పాకము రాదు(అది తాంబూలమనే అర్థం)పద్యముల భంగులు లేఖలవ్రాసినట్లుగా,
రూకల
గుప్ప బెట్టునటు రొక్కపు నాణెములౌనె? పాదముల్
వీకన రెంటి మధ్యనొక విస్తృత భావము (absurdity)నానగా వలెన్
చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
(విశ్వకవి రవీంద్రుని పద్యం లోని శబ్దము/సమూహము యొక్క అర్థమేమిటని పాఠకులు అడుగగా"నాకూ తెలియదు. ఒక్కొక్క పాఠకుడు ఒక్కొక్క అర్థాన్ని గ్రహిస్తాడు." అని సమాధానము నిచ్చారట రవీంద్రుడు.ఉన్నదున్నట్లు చదవడం ఊహలు లేని పాఠకుని స్వభావము.వివరణ లేనిది నే నెట్లా ఒప్పుకుంటానని అనకూడదని భావము.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కం.
రిప్లయితొలగించండిఆకలిగొని మార్జాలము
చీకటిలో నెలుకcజంపు చిత్రము తోడన్
చీకటి వెలుగౌ పిల్లికి
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చద్ది దిని వెళ్ళే రైతు గురించి
రిప్లయితొలగించండిఆకటిని యలమ టించకు
చేకూరునువలయు తిండి సిద్ధముగనటన్
వేకువ జామున కప్పర
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకటిని నలమటించకు' అనండి.
నీకే కా దెల్లరకును
రిప్లయితొలగించండిజీకాకును గూర్చుఁ జిమ్మచీకటి గనుకన్
వీకన్ దివిటీఁ జేకొనఁ
జీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్.
గురువుగారూ! అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించాలని చక్కగా చెప్పారు! ధన్యవాదాలండీ! 🙏🙏🙏🙏
తొలగించండిమే కొ ని జ్ఞాన పు వెలుగుల
రిప్లయితొలగించండిధీ కరుడ గు గురువు నింపు దేదీప్యము గా
నే కరణి న్న జ్ఞాన పు
చీకటి లో వస్తు చ య ము చిక్కు ను వెదుక న్ ॥
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీకవి దొరకునె వెదకిన
రిప్లయితొలగించండిచీకటిలో ,వస్తుచయము చిక్కును వెదుకన్
వేకువ వెలుగులు విచ్చిన
ప్రాకటముగ గానుపించు ప్రతి యెక్కటియున్!!!
శైలజ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2668
సమస్య :: *చీకటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయమ్ము దప్పకన్.*
చీకట్లో వెతికితే వస్తువులు తప్పకుండా దొరుకుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని నామ స్మరణతో తాను తరిస్తూ తన తోటి విద్యార్థులను కూడా తరింపజేయాలని అనుకొన్నాడు. ఓ బాలకులారా! శ్రీ హరిని స్మరించే భక్తులకు క్రమంగా యోగము క్షేమము మొదలైన శ్రీకరమైన వస్తువులు దొరుకుతాయి. బాహ్య ప్రపంచ భాంతి అనే చీకటి తొలగిపోతుంది. చివరకు మోక్షం లభిస్తుంది. ఎవరైనా సరే *పుట్టని చావని త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి* అంటూ ఉపదేశం చేసే సందర్భం.
చేకురు భక్తవర్యులకు శ్రీకర వస్తు చయమ్ము, భక్తితో
నా కమలాక్షు శ్రీ హరిని యాశ్రితపాలకునే స్మరింపు డీ
పోక నెఱుంగుడీ, తొలగి పోవును బాహ్య ప్రపంచ భ్రాంతియన్
*చీకటి ; లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-5-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అద్భుతమైన పూరణ అవధాని గారూ! అందుకోండి అభినందనలు! 💐💐💐🙏🙏🙏🙏
తొలగించండిసందర్భంలో
తొలగించండిభాంతి అనే పదానికి బదులు
భ్రాంతి అని చదువ ప్రార్థన.
గురువరేణ్యా! శ్రీ కంది శంకరార్యా! ప్రణామాలండీ. మీకు ఆరోగ్యం పూర్తిగా సమకూరినదా? మీరు మరికొంత విశ్రాంతి తీసికొంటే బాగుంటుంది కదండీ.
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. .
తొలగించండిచీకటిలో వేటాడెడు
రిప్లయితొలగించండినాకటి ప్రాణులకునందు నాహారమహో
తేకువ గురిగొన చిక్కని
చీకటిలోవస్తుచయము చిక్కును వెదుకన్!
చేకొని ధ్యానపు మార్గము
తొలగించండివేకువ ఝామున తలపగ వెన్నుని మనమున్
పోకార్చుచు నజ్ఞానపు
చీకటి, లో వస్తుచయము చిక్కును వెదకన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిఏకాగ్రత సాధించిన
రిప్లయితొలగించండిలోకమునే గెలువ నగును లోతుగ జూడన్
నాకము సృజియించ నగును
"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాలములో తను వచ్చినది కాలములోనే
రిప్లయితొలగించండికరిగి పోవును
కళ్ళకు కనబడు జగతి చూడు రోజొక రీతి
రూపు మారును
నిత్యము సత్యము తెలియగ అంతర దృష్టిని
సారించినన్
చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు
దప్పకన్
తొలగించండిరమేశు గారి భావనకు
వేకువ తో తురీయమును వేగముగాను రమేశ దాటగ
న్నాకడ నీకడన్ జనుడ ! నమ్ముము నేకడ యైన నే మయా!
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పక
న్నీకది సత్యమైవెలయు నిత్యము బాహ్యపు దృష్టి వీడగన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండి__/\__
లోకమునను దీపముతో
రిప్లయితొలగించండి"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక"
న్నేకేశ్వరు నెఱిగినపుడు
శోకమ్ములు లేవు సత్య శోధన జేయన్!
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకేశుని సేవించిన
రిప్లయితొలగించండిగీకారణ్యమున నైన గ్రీడించనగున్
శోకము బోద్రోలనగును
"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చీకటికి దివ్వె జూపిన
రిప్లయితొలగించండిజీకటులే బోయి వెలుగు జిమ్మును, నచట
న్జీకటి మాటే యుండక
చీకటిలో వస్తుచయముచిక్కును వెదకన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండితాకిన వెలుగులఁ జిమ్మెడు
సౌకర్యంపు చరవాణి సాధనపు వలన్
లోకమ్మును జూడఁ దగును
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వలన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "సాధనములచే" అనండి.
అక్కడ వల అంటే నెట్(అంతర్జాలమను) భావముతో వాడితిని. గురుదేవులు పరిశీలించ మనవి.
తొలగించండి
రిప్లయితొలగించండి*** *** *** *** ***
కం
శ్రీకరు దయగొన జాలును
సాకారమగు సుళువుగ నసాధ్యములెల్లన్
ప్రాకటముగ జరుగు నిదియె
"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం.
రిప్లయితొలగించండిఆకారము కనిపించదు
శ్రీకారము చేయవలెను చీకటి గదిలో
కోకయను తెరను దీయగ
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరమేశు గారి భావనకు
వేకువ తో తురీయమును వేగముగాను రమేశ దాటగ
న్నాకడ నీకడన్ జనుడ ! నమ్ముము నేకడ యైన నే మయా!
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పక
న్నీకది సత్యమైవెలయు నిత్యము బాహ్యపు దృష్టి వీడగన్
జిలేబి
పాకెటు టార్చిలైటొకటి పన్నుగ నింపిన బ్యాటరీలదౌ...
రిప్లయితొలగించండిచేకొని పృష్ఠభాగమున చెన్నుగ తట్టుచు గట్టిగట్టిగా
కేకలు వేయుచున్ పతిని గిచ్చుచు మొట్టుచు మీట నొక్కగా...
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్
తొలగించండిజిలేబీ పేటెంటడ్ పజ్జాలను మీర్రాస్తే ఎట్లాగండీ జీపీయెస్ వారు :)
సూపర్
జిలేబి
మీ పేటెంట్లు "శార్"దూలాలు కదా!
తొలగించండి😊😊😊
తొలగించండి:)
జిలేబి
శారీ దుకూలాలు!😀😀😀
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చమత్కార జనకంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
అయినా ఆమాత్రం దానికి మొగుణ్ణి గిచ్చడ, మొట్టడం ఎందుకు?
తొలగించండిఅవన్నీ లేకుండా పద్యాన్ని లాగడమెట్లాగండి నాలుగు పాదాల దాక :)
జిలేబి
సార్! జిలేబీ గారికి తెలియనిదేమున్నది?
తొలగించండిపతిని గిచ్చడం, మొట్టడం, inverter పెట్టించలేదని... ఎన్నిసార్లు మొత్తుకున్నా...
తొలగించండిచీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"
రిప్లయితొలగించండిచక్కగ జెప్పిరార్యులిట సాధ్యముగానిదిలేదుగానిలన్
చీకటి బోవగాదివియ చిమ్మును గాంతిని వెల్తురయ్యెడన్
మక్కువతోడరాగమరి మంచిగ గన్పడు వస్తుసంపదల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేదుగా యిలన్' అనండి.
శోకించ నేల భీతిని
రిప్లయితొలగించండినే కాలము నందు నైన నింకఁ గరమునం
బ్రాకటపు దీప ముండగఁ
జీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
నాకుఁడు గృంకె నక్కట వినా వర దీపిక దుష్కరంబగున్
వాకిట జాఱి కన్పడని బంగరు టుంగర మింకఁ బొందగన్
వ్యాకుల చిత్త మేల ననపాయమ సోమ కృపా లసన్మరీ
చీ కటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్
అరసున్న మహిమ:
తొలగించండినాకుఁడు = సూర్యుఁడు; అరసున్న పెట్టకున్న నాకుట
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
'నాకుఁడు గ్రుంకె' టైపాటు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. అవునండి సరిచేశాను.
తొలగించండి
రిప్లయితొలగించండివాకబు చేసి చూడగను వాక్కున కాయము లోగలండు;పెం
జీకటి కావలన్ గలడు! జీవుని కాతడు పట్టు గొమ్మగా
పాకలమై సదాశివుడు భాగ్యము గాగలడయ్య నాతడిన్
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్
జిలేబి
🙏🙏🙏
తొలగించండివెదకెదను
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
స ర దా గా = సె ల్ ఫోన్ పై ఒ క చి న్న ప ద్యం
>>>>>>>>>> >>>>>>>>
వాకొన వచ్చు | దూరముగ వాసము జేసెడు నట్టి వారి నా
హా ! కనులార జూడ నగు | హాయి వినం దగు శ్రావ్య గీతముల్ |
మైకును వెట్టి మాట , కెమెరా గొని చిత్రము = దాచవచ్చు | నీ
లోకపు సంగతుల్ విని -- విలోకన మీ వొనరింప వచ్చు | నీ
పాకెటు లోని . సెల్లున . ప్రపంచ మిముడ్చగ వచ్చు | దానిలోన్
దాకొని యున్న టార్చి నిడినన్ > బ్రసరించెడు కాంతిరేఖచే
జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయమ్ము తప్పకన్ ! !
{ వాకొను = మాటాడు ; దాచవచ్చు = S a v e చేయవచ్చు ;
దాకొనియున్న = దాగియున్న }
తొలగించండిగురుమూర్తి వారి చరవాణి మధురవాణి :)
చాలా బాగుందండీ "సెల్పక" మాల ;
జిలేబి
తొలగించండి* -సెల్ ఫల మాల సెల్ఫల మాల !
జిలేబి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు పదనమస్కృతులు , ధన్యవాదములు
తొలగించండిజిలేబి గారికి మధుర మయిన ధన్యవాదములు
రిప్లయితొలగించండిరాకాసి సునామీచే
భీకర నష్టము కలిగెను విద్యుత్పోయెన్
ఈ కందిలి వెలిగించియు
చీకటిలోపలన్, వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని సమస్యగా కందపాదాన్ని కాక, ఉత్పలమాల తీసుకున్నారు.
'విద్యుత్' అని హలంతంగా వ్రాయరాదు. అక్కడ "విద్యుత్తు చనెన్" ఆనండి.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిచేకొని పూనికన్ దపముఁ జేయుచు వేలకు వేల యేళ్లుగన్
శ్రీకర వేదవాజ్ఞ్మయముఁ జిన్మయ మంద ఋషీశ్వరాదులున్
మీకును ధ్యానమార్గమది మేలొనరించును, వీడ మోహపున్
జీకటి, లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిచీకటి చీకటి యనుచును
రిప్లయితొలగించండిచీకాకును జెంద నేల చినవాడా లే
వాకిటి దీపము తెమ్మిటు
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కేకలు పెట్ట గూరుచొని గీ యని చిక్కునె లోని వస్తువుల్?
రిప్లయితొలగించండిపోకిరి వేమి? చాలు నిక, పొ మ్మిట సేవకు లేరి? లేచి యా
వాకిటి దీపముం గొనుము, వంట గదిం జని చూడు వెల్గులో
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ.
తొలగించండిఆకర్షణగా యంధుడు
రిప్లయితొలగించండిజేకొను కార్యాలుజేయు చేతులుకాళ్లే
దాకగ?కళ్లై!జూపగ
చీకటిలోవస్తు చయము చిక్కును వెదకన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకర్షణగా నంధుడు' అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
** త త్త్వ సా ర ము **
*****************
[ అన్నిటి కన్న ఙ్ఞానధనము మిన్న • భవబంధము విడుము •
నీవు మనసు లో ఆ అఙ్ఞానాంధకారమును పోగొట్టుకొనుము •
వెదికినచో నీకు అన్ని విషయములు గోచర మగును • ]
లోకములో మిన్న యగును
ప్రాకట మగు ఙ్ఞానధనము | బంధము విడుమా !
పోకార్చు కొనుము నీ వా
చీకటి (న్ ) , " లో " || వస్తు చయము చిక్కును వెదుకన్ ! !
{ బంధము = భవబంధము ; పోకార్చుకొనుము = పోగొట్టుకొనుము
చీకటి = అఙ్ఞానము ; లో = మనసు లో ; వస్తువు = విషయము ;
వెదుకన్ = పరిశోధించగా }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు పద నమస్కృతులు & ధన్యవాదములు
తొలగించండిగురుమూర్తి గారూ,
తొలగించండిఇప్పుడే నా సహాధ్యాయి, తెలుగు పండితులు భూసారపు నర్సయ్య గారు ఫోన్ చేశాను. "చాలారోజుల తర్వాత నాకు ఆత్మానందాన్ని కలిగించే పద్యాన్ని మీ బ్లాగులో చూసాను. 'లో వస్తుచయము' అన్న విరుపులో లోతైన ఆధ్యాత్మిక భావ సంపద ఉన్నది. పద్యాన్ని వ్రాసిన గురుమూర్తి గారికి అభినందనలు తెలియవలసింది" అని ఆ ఫోన్ సారాంశం. మాట్లాడిన పది నిమిషాలూ మీ పద్యాన్ని గురించిన ప్రశంసయే...
వేకువ లేదజ్ఞానికి
రిప్లయితొలగించండిప్రాకటముగ వెలుగు చుండు ప్రాజ్ఞున కెపుడున్
లోకములో నతి సులువుగ
చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
కోకారి వెన్నెలచందము
రిప్లయితొలగించండిపై కవితలనల్లకలము పట్టితి వ్రాయన్
పైకొన నెటుల నవిద్యపు
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
గమనించితిని. ధన్యవాదములు ఆచార్యా
తొలగించండి🙏🏽
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[వడఁగండ్ల వాన తీవ్రతచే, నిన్న పండ్రెండు గంటలకుఁ బోయిన కరెం, టిప్పుడే వచ్చినందున, నా పూరణ మిప్పటికిఁ బెట్టఁగలిగితిని! నిన్న చీఁకటిలో నన్ని వస్తువులనుఁ జూపించుటకు మొబైల్ టార్చియే మాకు దిక్కయ్యెను! శంకరయ్య గారునుం జీఁకటిలో వస్తుచయమ్మునకై వెదకిన దొరకునంచు సమస్యనుం బెట్టినారు! ఇంక నా కేమి తక్కువ? వెంటనే, మొబైలు టార్చిని నాధారము చేసికొని, సమస్యనుం బూరించితిని!]
నాకునుఁ జూడఁ జోద్యమిడు నవ్య కృతమ్మగు యంత్ర కల్పనల్
శ్రీకరమయ్యు నొప్పె భువిఁ! జెప్పఁగ లేని భయమ్ముఁ జీల్చి, నీ
కాకృతిఁ జూపు, నీదు కరమందున నుండిన ఫోను టార్చిచేఁ,
జీఁకటిలోపలన్ వెదుకఁ, జిక్కును వస్తుచయంబు దప్పకన్!
(2)
రిప్లయితొలగించండివేకువ జామునన్ నిదుర వీడియు, నింటఁ గలట్టి వస్తువుల్
చేకొని శుభ్రమందఁగనుఁ జేసియు, నెచ్చటి వస్తు వాడ హే
వాకము తోడఁ జేర్చు నలవాటు గడించిన కాంత కెప్పుడున్
జీఁకటిలోపలన్ వెదుకఁ, జిక్కును వస్తుచయంబు దప్పకన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిశబ్ద భేది లాగ స్థాన భేది విద్యాప్రకాశ భామామణి :)
జిలేబి
బహుబాగా శలవిచ్చారు జిలేబిగారు!!👌👌👌
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిఆడవారైనా, మగవారైనా అలవాటైన పరిసరాల్లోని వస్తువుల్ని చీకట్లోనూ తేలిగ్గా వెతుకగలుగుతారు! నన్నే తీసుకోండి... అది రాత్రైనా, పగలైనా నేను పఠించెడి గ్రంథచయాన్ని నేను కళ్ళుమూసుకొని వెదుకగలను! చీకట్లోనూ నాకు కావలసిన పుస్తకాన్ని సులభంగా గుర్తించి, బయటికి తీయగలను! ఇది కేవలం అలవాటు, పరిసర పరిచయము ఉంటే చాలు...ఎవరికైనా సాధ్యమే!
తొలగించండిస్పందించినందులకు జిలేబీ గారికి, సీతాదేవి గారికి ధన్యవాదాలు!
👍👍👍👍
తొలగించండితప్పక - చివర నకారం వస్తుందా. తెలియజేయ ప్రార్థన.
రిప్లయితొలగించండిఅక ప్రత్యయాంత అవ్యయమైన 'తప్పక' కళయే. 'తప్పకన్' అన్న ప్రయోగం దోషమే.
తొలగించండిఅయితే ఇది ఆకాశవాణి వారిచ్చిన సమస్య. సమస్యను ఉన్నదున్న?ట్లుగా స్వీకరించడం జరిగింది. దానికి కందపాద రూపాన్నిచ్చింది నేను. (బి.వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు తాము పూరించిన ఆకాశవాణి సమస్యలను ఒక పుస్తకంగా ప్రకటించారు. అందులోనుండి గ్రహించాను).
నిజానికి ఇచ్చే సమయంలో నాకు అనుమానం రాలేదు. ఈరోజు ఉదయం గుర్తించి గుండు మధుసూదన్ గారితో ఈ విషయమై చరించాను కూడా. శ్రీహరి నిఘంటువు దీనిని క్రియా విశేషణం అన్నది. అప్పుడు 'తప్పకన్' అంటే దోషం లేదు. బి.ఎన్.రెడ్డి నిఘంటువు అవ్యయంగా పేర్కొన్నది. అప్పుడు దోషమే. కాబట్టి మనం క్రియావిశేషణంగా స్వీకరిద్దాం.
నామ సర్వ నామంబులకును గళ లగు నవ్యయంబులకును గడపల సముచ్ఛయార్థవిశేష పాదపూరణంబుల యందు “ను” శబ్దంబు తఱచుగ నగు.
తొలగించండికళ లగు ననుదదంత శబ్దము మీఁద నయ్యడది యు వర్ణ పూర్వకంబు విభాషనగు.
మఱియు నది శేష షష్టి యందు యొక్క లోపించు నపుడు లాగమాంత బహు వచనంబు మీదను సముచ్చయమునం జూపట్టెడి. --- ప్రౌఢ. వ్యా. శబ్ద. 116.
ను శబ్దాగమమున కూదాహరణలు:
కొమ్మన్ = కొమ్మయును
పురారిన్ = పురారియును
ఏమిని = ఏమియును
ఇట్టిదిన్ = ఇట్టిదియును
వెండిన్ = వెండియును
పోయిన్ = పోయియును
ఎంతను = ఎంతయును
ఏనిన్ = ఏనియును
మఱిన్ = మఱియును
లేకను = లేకయును
ఊఱడకను = ఊఱడకయును
కనుక పాద పూరణంబున తప్పకను / తప్పకన్
తొలగించండిచక్కని వివరణకు ధన్యవాదాలు!
తొలగించండి
రిప్లయితొలగించండిచీకటి మాటునన్ బడసి చేర్చిన లెక్కకు మిక్కిలైనవౌ
పైకము వెండి బంగరము వజ్రము లాదిగ సంపదల్ నహో!
తాకను వీలులేని యెడ తాపడమున్ గొన సీబియైనకున్
జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పగన్!
తొలగించండినెల్లూరు వంద కోట్ల అటెండరేనా ? :)
జిలేబి
ఇట్లాంటి వారు దేశమంతా ఉన్నారు!😪😪😪
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిసీబీయైని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'సంపదల్ + అహో' అన్నపుడు నుగాగమం రాదు. "సంపదల్ భళా" అనండి.
ధన్యవాదములాచార్యా! సవరిస్తాను🙏🙏🙏
తొలగించండిచీకటి మాటునన్ బడసి చేర్చిన లెక్కకు మిక్కిలైనవౌ
తొలగించండిపైకము వెండి బంగరము వజ్రము లాదిగ సంపదల్ పరుల్
తాకను వీలులేని యెడ తాపడమున్ గొన సీబియైనకున్
జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పగన్!
శోకమదేలనో సఖియ సొమ్ముల నెచ్చట నుంచి మర్చినా
రిప్లయితొలగించండివో కద తాలుమోయి యిట పొద్దది గ్రుంకగ జేరె నిండుగా
జీకటి, లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
నీకొరకై వెదంకెదను నేనును తెమ్మిక దీపమొక్కటిన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీకరుడైన శ్రీపతిని చిత్తము లోనతలంచనిత్యమున్
రిప్లయితొలగించండిప్రాకటమౌ ప్రకాశమిడు స్వామి యెడందకు,నట్టివేళలో
భీకర మైన శర్వరిని వెల్గు కనంబడు, దైవ లీలతో
చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అన్నపరెడ్డి వారి పూరణ వారు ప్రత్యక్షంగా అనభవించి వ్రాసినట్లే ఉన్నది! 🙏🙏🙏🙏
తొలగించండిఅనుభవించి
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .సమస్య
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
సందర్భము: అజ్ఞాన మనే చీకటి వున్నంతవరకు వస్తు వ్యామోహం వుంటుంది. అంటే రకరకాల వస్తువులను సేకరించడంలో భ్రమ. ఆ దశలో నరునికి లభించేవి వస్తువులే! కాని శాశ్వతమైన దివ్యానందానుభవాన్ని ప్రసాదించే *ఆత్మ* కాదు.
వెదుకగా వెదుకగా.. అనగా ఆత్మకోసం అన్వేషించగా.. అజ్ఞానాంధకారం నశిస్తుంది. జ్ఞాన భాస్కరు డుదయిస్తాడు. ఆ వేకువలోనే ఆత్మ లభిస్తుంది. వస్తు ప్రీతిని వర్ధిల్ల జేసే భ్రమ లన్నీ పటాపంచ లౌతాయి.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ప్రాకటమగు నజ్ఞానపు
చీకటిలో వస్తుచయము చిక్కును; వెదుకన్
చీకటి నశించు; జ్ఞానపు
వేకువ నాత్మయె లభించు;
విడు వస్తు భ్రమల్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపోకను జూర(చూర) జేసికొని పొందుగ దంతము లాడనీయకన్
పాకము రాదు(అది తాంబూలమనే అర్థం)పద్యముల భంగులు లేఖలవ్రాసినట్లుగా,
రూకల
గుప్ప బెట్టునటు రొక్కపు నాణెములౌనె? పాదముల్
వీకన రెంటి మధ్యనొక విస్తృత భావము (absurdity)నానగా వలెన్
చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
(విశ్వకవి రవీంద్రుని పద్యం లోని శబ్దము/సమూహము యొక్క అర్థమేమిటని పాఠకులు అడుగగా"నాకూ తెలియదు. ఒక్కొక్క పాఠకుడు ఒక్కొక్క అర్థాన్ని గ్రహిస్తాడు." అని సమాధానము నిచ్చారట రవీంద్రుడు.ఉన్నదున్నట్లు చదవడం ఊహలు లేని పాఠకుని స్వభావము.వివరణ లేనిది నే నెట్లా ఒప్పుకుంటానని అనకూడదని భావము.)
__/\__
తొలగించండికూకటి వేళ్ళను దీయుచు
రిప్లయితొలగించండిమూకల చీకటి ధనంబు ముట్టడి సేయఁ న్,
కోకల చాటున మాటుగ
చీకటి లో వస్తు చయము చిక్కును వెదుకన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కేకలు పెట్టగ పెద్దలు
రిప్లయితొలగించండిమేకల కొట్టమ్ము నందు మేలిమి సొమ్ముల్
వీకొని చోరుడు పారెను
చీకటిలో, వస్తుచయము చిక్కును వెదుకన్ !!
ఫణి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చీకటి యని చింతెందుకు
రిప్లయితొలగించండిచీకటిలో సెల్లు ఫోను చేతిలొ నుండన్
చీకటి వెలుగుల మధ్యను
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్
చీకటి చీకటి యనుచును
చీకటినె దిట్టుకొనక చిరు దీపముతోన్
చీకటిలో యత్నించిన
చీకటిలొ వస్తుచయము చిక్కును వెదుకన్
మధుసూదన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చేతిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చేతను నుండన్" అనండి. రెండవ పూరణలో కొన్ని టైపు దోషాలున్నవి.