7, మే 2018, సోమవారం

సమస్య - 2671 (భీతిన్ మున్ముందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్"
(లేదా...)
"భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

146 వ్యాఖ్యలు:

  1. కోతలు మానుము ,విడువుము
    భీతిన్,మున్ముందు కేగ విజయము గల్గున్,
    చేత శరముతో సింగము
    రీతి రిపుల దునుమనుచు కిరీటి వచించెన్

    ఉత్తర కుమారుని తో అర్జునుడు పలికిన మాటలు

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  2. "క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప"
    ...భగవద్గీత 2-3

    "నీతియె సమరము ప్రభులకు
    భ్రాతల జ్ఞాతుల మమతలు భ్రాంతియె ననుచున్
    రీతిగ హృదినిన్ వదలుచు
    భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్"

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారి సవరణ:


      "క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప"
      ...భగవద్గీత 2-3

      "నీతియె సమరము ప్రభులకు
      భ్రాతల జ్ఞాతుల మమతలు భ్రాంతియె యని యీ
      రీతిగ మదిలో వదలుచు
      భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్"

      తొలగించు
    2. సమరమే....
      👌🏻👏🏻🙏🏻
      మైలవరపు వారి తాలింపుతో సొంపు సరళమైనది 😊

      తొలగించు
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు


  3. భూతలమున మార్చగ తల
    రాతల ధైర్యము వలయు, పరమును తలచుచున్
    చైతన్యముతో, వీడుచు
    భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  4. మైలవరపు వారి పూరణ

    ఎస్వీ రంగారావు గారు ఎన్టీఆర్ గారితో... (పాతాళభైరవి)

    చేతము నిల్పి సాహసము సేయర ! డింభక ! అమ్మ మెచ్చురా !
    మాతఁ గరాళి గొల్వ నసమాన ధనాదులు , రాకుమారియున్
    బ్రీతి లభించురా ! మునిగి వేగమె రార సరస్సునందు ! ని...
    ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కు రా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. 👌🏻👏🏻
      సాహసమున్ జేయమనిరి శాంతిని పొందన్!😊

      తొలగించు
    2. ఆ రకంగా ముందుకు పోదాం.. ✌️

      నేతల దూషణమ్ములను నిక్కములంచు దలంపవద్దురా !
      పూతచరిత్రఁ గల్గిన ప్రభున్ జనులే గెలిపించుకొండ్రురా !
      నీతిపథమ్ముఁ దప్పనని నేడె ప్రమాణముఁ జేసి , వీడురా
      భీతిని ., ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కు రా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించు
    3. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించు
  5. నీతిని వీడక సతతము
    జాతిని జాగృత మొనర్చ సమరము చేయన్
    భీతిని విడుచుచు తా ని
    ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. వీరత్వము జూపమనిరి విజయము నందన్!
      👌🏻👏🏻🌹

      తొలగించు
    2. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీతిని విడుచుచు, నిర్భీతిన్' దాదాపు ఒకే అర్థాన్ని బోధిస్తాయి కదా! అక్కడ "ఖ్యాతి గలుగునట్టుల ని।ర్భీతిని..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించు




  6. భూతల మందు దక్కుటకు భూరిగ సంపద లెల్ల సోదరా,
    నీతల రాత మార్చుటకు నీ యతనమ్ము జరూరు చేయరా
    కోతల గట్టు పల్కు లను కుంచి కుదించుచు, మేలు వీడుచున్
    భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!



    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు

  7. భం భం రాహుల్ కీ జై :)


    ఖాతరు జేయకన్ ధృతిని ఖద్దరు బట్టల తాత లెల్లరన్
    నీ తలపుల్గొనంగ సయి నీ దగు పోరును సల్పు రాహులా
    నీతివిధుండ వైన భళి నిక్కము కన్నడ రాజ్యమయ్య! ని
    ర్భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. 👏🏻👏🏻👏🏻
      💐💐💐
      మూడు పద్యాలూ మెచ్చదగినవే...

      కానీ నేను విక్రమ్ రాథోడ్ ని దించేస్తారనుకున్నా...😃

      తొలగించు

    2. అబ్బే! మనదంతా లేటెష్టు పోలి ' టిక్సే' :) పాత కతల్ నో యూజ్ విట్టు బాబు గారు ! ఇప్పటి హవా రాహుల్ ! రైడ్ ది విండ్ :)


      నెనరులు మీ ప్రోత్సాహానికి

      చీర్స్
      జిలేబి

      తొలగించు
    3. జిలేబీ గారూ,
      సమకాలీనమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీతివిదుడు (నీతి తెలిసినవాడు)' అన్నది సాధురూపం. 'విధుడు' అంటే చంద్రుడు. మీరు "నీతికి చంద్రుని వంటివాడు" అన్న అర్థాన్ని తీసుకోలేదు కదా?

      తొలగించు

    4. కంది వారికి
      ఆంధ్ర భారతి ఉవాచ
      నీతివిధుడు -
      నీతికుశలుఁడు, నీతివిధుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
      a man well-versed in politics.

      :)

      జిలేబి

      తొలగించు
  8. డా.పిట్టా సత్యనారాయణ
    చేతల వెనుకను సాహస
    మూతంబగుగాని, శ్రద్ధ మొలిపించునదే
    భీతి యనుటయే తథ్యము
    భీతిని మునుముందుకేగ విజయము కల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  9. నీతిగ బ్రతుకును గడుపుచు
    భూతలమున నిత్య సత్య పోషణ తోడ
    న్నేతావాతా పాపపు
    "భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్"

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
    2. ధన్యవాదాలు గురువుగారూ
      🙏🏻

      తొలగించు
  10. రాతను మార్చుకొ నంగను
    నీతిగ బ్రతుకంగ కోరి నియమము తోడన్
    చేతన మందున బిగువు ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "చేతన మందున బిగి ని।ర్భీతిన్..." ఆనండి.

      తొలగించు
  11. డా.పిట్టా సత్యనారాయణ
    ఖ్యాతికి లక్ష్య సిద్ధికగు కార్యమునే తలపెట్టి ధీరుడై
    "చేతల దప్పనే"నను యచేతనమేమరుపాటు మూలమౌ
    ఖాతరుజేసి శ్రద్ధ కనుగామిగ జంకున బోవ సత్కృతిన్
    భీతిని ముందుకేగిననె ప్రీతి, జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనుగామిగ'...?

      తొలగించు
  12. (శివాజీ సేనాని తానాజీ మావళే వీరులతో)
    జేతలమై వెలుంగవలె జిక్కులబెట్టుచు మహ్మదీయులన్;
    చేతము ఝల్లనంగవలె చివ్వున వేయుడు శూలసంహతిన్;
    జోతల నందుకోగలరు శూరులు సింహగడమ్ము గొట్టి,ని
    ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    2. ధన్యవాదాలండీ!

      తొలగించు
  13. నేతగ,త్రాతగ,తాతగ,
    జాతికి మేల్గూర్పఁబూని సద్ధర్మముతో
    ఖ్యాతిని పాందుము తగ ని
    ర్భీతిని మున్మందుకేగ విజయముఁగల్గున్

    తాత=జాతిపిత గాంధీజీ

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు


  14. వేతును కత్తిపోటులన వెంగలివిత్తువలెన్ సహోదరా
    నీతిని వీడుచున్ బతుక నీమము కాదు సుమా! జనాళియున్
    కోతుల మూక గా తిరుగ కూడదు; కొంతసయోధ్య,కొంతయున్
    భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  15. స్వాతంత్రము సాధింపగ
    చైతన్యము తోడ నిండు జ్ఞానము గూడన్
    కాతరు డవ్వక దా ని
    ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు

    1. చేతనమందు నిత్యము విశేషముగన్
      హరిగొల్వ నీమమున్
      త్రాతగ నాతడే నుదుటి రాతల మార్చుగ నీశ్వరుండునై
      యాతన లేవియున్ మనము నంటవు
      తోషము తోడ వీడగా
      భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

      తొలగించు
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించు
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించు
  16. చేత మ్మువిశ్వ సిం చు చు
    నా త త ధైర్యమ్ము తోడ నరి వర్గ ము ల న్
    భీతుల నొ న రించు చు ని
    ర్భీ తి ని మున్ముందు కేగ విజయ ము గలు గు న్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  17. కోతలె యివెవ్విధంబుగ
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్?
    భూతల పతి సతతము ని
    ర్భీతిగ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోతలె యివి యెవ్విధమున' అనండి.

      తొలగించు
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2671
    సమస్య :: *భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా.*
    భయపడుతూ ముందుకు వెళ్తే దిగ్విజయం దక్కుతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శివాజీ తల్లి జిజియాబాయి తన కుమారునికి బాల్యంలోనే రామాయణ భారత భాగవతములలోని కథలను బోధించింది. దేశభక్తిని గుఱించి తెలియజెప్పింది. ఆమె శివాజీతో ‘’ఓ వీరకుమారా ! *ధైర్యే సాహసే లక్ష్మీః* అని పెద్దలు చెబుతారు. నీవు ధైర్యము సాహసము మొదలైన సుగుణాలతో పురోగమిస్తే నీకు కీర్తి దక్కుతుంది. జయం కలుగుతుంది. నిన్ను లక్ష్మి వరిస్తుంది. నిర్భీతితో (అంటే భయపడకుండా) ముందుకు వెళ్తే నీవు విశ్వ విజేతవు కాగలవు’’ అని ఉపదేశం చేసే సందర్భం.

    చేతము పొంగగా జిజియ చెప్పె శివాజికి “వీరపుత్రుడా !
    ఆతత ధైర్య సాహస గుణాదులతోడ పురోగమింపుమా !
    ఖ్యాతియు వచ్చు, నిత్యము జయమ్ము లభించు, వరించు లక్ష్మి, ని
    *ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా.” *
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జయంబు నిశ్చయంబురా! భయమ్ము లేదురా! జంకుగొంకు లేక సాగిపొమ్మురా!
      👌👌👌👌🙏🙏🙏

      తొలగించు
    2. నిర్భీతితో సాఁగిపోయినచో తప్పక జగద్విజయం దక్కుతుందని జిజియాబాయి శివాజీతో జెప్పినట్టుగా జేసిన మీ పూరణము అద్భుతంగా ఉన్నదండీ కోటవారూ! అభినందనలు!

      తొలగించు
    3. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    4. శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించు
    5. నిర్భీతిని ముందుకేగిన వరించు జగద్విజయమ్ము శ్రీ మధూ !

      తొలగించు
    6. గురువరేణ్యులు
      శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.

      తొలగించు

  19. ఇదెక్కడో చదివినట్టుందే :) అబ్బే పేరడీ కాదండి :)


    చేతము పొంగ సోనియ వచించెను రాహులుడా!కొమారుడా!
    ఆతత ధైర్య సాహస గుణాదులతోడ పురోగమింపుమా !
    ఖ్యాతియు వచ్చు, నిక్కముగ కన్నడ రాష్ట్రము నీకు దక్కు! ని
    ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ సమకాలీన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు

    2. కోటావారు కత్తులు నూరకుంటే సరి :)

      జిలేబి

      తొలగించు
    3. సహృదయులు జిలేబి గారూ!
      పలుకుతూ నతులు సన్నుతులు నూరకుంటే సరి.
      కోట రాజశేఖర్

      తొలగించు


    4. కోటావారు

      నమో నమః

      జిలేబి

      తొలగించు
  20. మిత్రులందఱకు నమస్సులు!

    చేతమునందు ధీరతయు, స్థేమము దేహమునందు నెప్డు స
    ద్ద్యోతముగాన్ బహిర్ద్విషులఁ ద్రుంచి, త్వదీయ దృఢాత్మతోడ సా
    కూతముఁ గాల్చి షడ్రిపులఁ, గూల్చియుఁ ద్వద్ధృదయస్థమైనయు
    ద్భీతిని, ముందు కేఁగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    2. అద్భుతమైన పూరణ మధుర కవిగారూ! 🙏🙏🙏🙏🙏🙏

      తొలగించు
    3. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
      🙏🙏🙏

      ధన్యవాదాలండీ సీతాదేవిగారూ!
      🙏🙏🙏

      తొలగించు
    4. మధురకవిగారూ! మీ పద్యం మధురం. మీ ఉపదేశం మధురం.

      తొలగించు
    5. ధన్యవాదాలండీ రాజశేఖర్ గారూ! మీ సహృదయతకు మనఃపూర్వక కృతజ్ఞతలు!

      తొలగించు
  21. నీతిని నమ్ము విలేఖరి
    నేతల యవినీతి ప్రజకు నేరుగ దెల్పున్
    ఘాతములకు వెరువక ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  22. ఖ్యాతిని బొందుట కొఱకై
    నీతి పథమ్మును విడువక నిశ్చల మతి దు
    ర్నీతిని దునుమంగను ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు


  23. ఖ్యాతిని కోరక, జనుడా
    సోతాపన్నుడ వగుచు వసుధలో నీవ
    జ్ఞాతుడ వై నెక్కొనుచు న
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!

    జిలే‌బి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సోతాపన్నుడవు'...?

      తొలగించు



    2. సోతాపన్న : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
      [బౌద్ధ]
      సంసార చక్రానికి కట్టిపడేసి ఉంచే బంధాలలో మూడింటిని తెంచుకొని నిర్వాణాన్ని చేర్చే జ్ఞాన ప్రవాహం (మార్గం)లో ప్రవేశించినవాడు.

      ఆంధ్ర భారతి ఉవాచ

      జిలేబి

      తొలగించు
  24. వ్రాతలు కలకండలుగా
    పోతలుఁ బోసెడు నొక కవి పుంగవుఁడహమున్
    ద్యోతకఁ బరుచక నొదుగుచు
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    - శ్రీకాంత్ గడ్డిపాటి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శ్రీకాంత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
    2. ఆచార్యులకు కృతజ్ఞతలు.

      తొలగించు
  25. నీతిని ధాత్రిలోన యవి నీతిని ద్రుంచుచు నిల్పుమంచు నా
    తాతలు చెప్పినట్టి నుడి తథ్యమదే కద యాచరింపగన్
    భీతిల కోయి సోదర వివేచన మన్నది వీడకుండ ని
    ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధాత్రిలోన నవినీతిని' అనండి.

      తొలగించు
  26. కందం
    తాతలు తండ్రులు భ్రాతలు
    నే తీరుగ సుతుని జంపి రెరుగవె? పార్థా! 
    సైతువె? బంధులనక ని
    ర్భీతిని మున్ముందు కేఁగ విజయము గల్గున్ 

    ప్రత్యుత్తరంతొలగించు
  27. భీతియె యపజయమునకున్
    హేతువుగా నిలిచియుండి హేడము గూర్చున్
    చేతన మొప్పగ వదలియు
    భీతిన్;మున్ముందు కేఁగ విజయము గల్గున్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  28. నీతిని విడిచి చరించెడి
    ఘాతకులౌ శత్రువులను కడతేర్చంగన్
    జాతిని రక్షించగ ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  29. సూతుని సామర్థ్యమ్మున
    నాతత నైపుణముతో మహారథి విలస
    త్కేతన వీరుఁడు సమరా
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్


    ఏ తరి నైన బుద్ధి శమియించు సధైర్యము శోక మంద శో
    కేతర ముండునే మదిని నీప్సిత నాశక మెంచ ధాత్రినిన్,
    వీతము సేసి శోకము వివేకముతో ధృతిఁ దాల్చి యింక, ని
    ర్భీతిని ముందు కేఁగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా


    శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్.
    శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః ৷৷ వా. రా. అయోధ్య. .62.15৷৷

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించు
    2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించు

  30. పాత చలనచిత్రమగుట
    చేత తొలుతనె ప్రవేశచీటీ వరుసన్
    రీతిగపంచ దొరకదను
    భీతిన్ మున్ముందు కేగ విజయము కల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  31. నీతినినిష్టను నిలుపగ
    జాతికి జాగృతిని బెంచి జనులకు జరిపే
    రీతిని జేయుటకై ని
    ర్భీతిన్ మన్ముందు కేగ?విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠను' టైపాటు. 'జరిపే' అనడం వ్యావహారికం.

      తొలగించు
  32. సద్గురుబోధ :

    ఉత్పలమాల
    చేతల నంతరాయమను చింతల నీచు లుపక్రమించరే
    చేతల మధ్య నడ్డముల జిక్కుచు నాపుదురంత మధ్యముల్
    జేతల నాపరెప్పటికిఁ జిక్కులుఁ జుట్టిన ధీరులన్న! ని
    ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. చక్కని పూరణ జి వి యస్ గారూ!
      ఆరంభించరు నీచమానవులు! 👌👌🙏🙏🙏

      తొలగించు
    2. సహదేవుడు గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించు
    3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
    4. మనోహరమైన పూరణము సహదేవుఁడు గారు. మూడవ పాదములో గూడ చేతల లేక సేతల ననండి. సరళాదేశ ముండ దక్కడ.

      తొలగించు
  33. ఖ్యాతిన్ బడయగ మనుజులు
    చేతల జూపంగ వలయు క్షేమము, నిరతము
    జాతికి జీవంబయి ని
    ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు

    1. సవరణతో....
      ఖ్యాతిన్ బడయగ మనుజులు
      చేతల జూపంగ వలయు క్షేమము, సతమున్
      జాతికి జీవంబయి ని
      ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!

      తొలగించు
    2. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  34. చోదక పండితుండువాచ:

    ప్రీతిగ చూపెదన్ కనుము బ్రేకిది క్లచ్చిది థ్రాటిలిద్దిరా
    తాతను సంస్మరించుకొని తాళపు చెవ్విని త్రిప్పుమిందులో
    మూతి బిగించుటన్ విడిచి ముద్దుగ గేరున బండినుంచి ని
    ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు


    1. ఈబండి రోడ్డు మీద పోతే ఎవరికేమవుతుందో మరి :)


      జిలేబి

      తొలగించు

    2. కారెంత కష్టపడి నేర్చుకుంటున్నా మధ్యలో ప్రాస గోల అడ్దుపడుతోందే అన్న కారణం కావచ్చేమో :)


      జిలేబి

      తొలగించు
    3. అయ్యా! సహదేవుడు గారూ:

      మూతి బిగుంపు tension భరించ లేక. క్రొత్త బండీ, క్రొత్త పెండ్లం...

      తొలగించు
    4. అమ్మా! జిలేబీ గారూ:

      ప్రాసాయాసం పునః పునః

      తొలగించు
    5. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    6. గోతిన దొర్లినన్ వెరవకుండగ గేరులు మార్చినీవు ని
      ర్భీతిని అంటే ఎలా ఉంటుంది జిలేబి గారు

      తొలగించు
    7. అన్నట్టు ఆఖరు వాక్యంలో ఈ 'ప్రీతి' ఎవరండి?

      తొలగించు
  35. నీతిని విడనాడకయవి
    నీతిని నిల దరుము కొట్టు నియమము గలడో
    యాతడు జీవిత మునని
    ర్భీతిన్మున్ముందుకేగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..దరిమికొట్టు' అనండి.

      తొలగించు
  36. వ్రాతలు బాల్యమందునను బ్రహ్మ లిఖించును, భీతి యేలనో?
    జాతిని గూల్చు దుర్జనుల స్వాంతమునన్ దలపోసి యవ్విధిన్
    ఘాతకులైన వైరులను కాతరుచేయక పోరులోన ని
    ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు



  37. నీతిగ బ్రతుకును గడుపుచు

    ఖ్యాతిని పెంచెడి పనులను కలవరపడకన్

    రీతిగ చేయుచు చనుని

    ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్.


    వేతనముహెచ్చు ననుచును

    నీతిని విడి సంచరింప నేరంబౌరా

    రీతిని మార్చుచు విడుచుచు

    భీతిన్ ,మున్ముందుకెగ విజయము గల్గున్.


    గీతాపఠనము చేయుచు

    సీతాపతినే తలచిన శీఘ్రమె యతడున్

    తాతీర్చును తాపము ని

    ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్.


    హేతువులను వెదుకక ని

    ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్

    ఖ్యాతియు పెరుగును భువిలో

    నీతిగ మసలుచుసతతము నెమ్మిని గనుమా.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించు
  38. నీతినివీడకుండగను నేమము తోడను బుణ్యకార్యముల్
    కాతర మేమియున్బడక కాంతల కెల్లను జేయుచుండునో
    నాతని మేటివానిగను నంచితరీతిని మెచ్చుకోవని
    ర్భీతినిముందుకేగిననెప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...చుండునో యాతని... మెచ్చుకొమ్ము...' ఆనండి.

      తొలగించు
  39. నీ తలకు మించిన పనిని
    సైతమొక ప్రణాళిక గొని చక్కగ నెఱప
    న్నీతిని విడనాడక ని
    ర్భీతిన్ మున్ముందు కేగ విజయము కల్గున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  40. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆరప పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించు
  41. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    తాతల సద్గురూత్తముల దండ్రుల భ్రాతల మేనమామలన్

    బాతక మంచు నెంచక , రణంబున జంపుచు రక్తసిక్త మౌ

    భూతల మెట్లు నేలవలె ? పోదము తేరు మరల్చు స్వామి ! యో

    పూతచరిత్ర - యో పరమపూరుష - యంచు కిరీటి వేడగా

    గీత వచించె ఫల్గునునికిన్ హరి యిట్టుల :- " వీడుమా యికన్

    చేతము లోని శంక , విను , నీవు నిమిత్తుడవే ! ధనుస్సు నీ

    చేత ధరించి శాత్రవుల జీల్చుము | మౌని దివౌకసాళి ని

    ధ్యాత సువిశ్వరూప మిదె ! యారసి , త్రుంచి మనంబులో సము

    ద్భీతిని , ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా "


    { నిధ్యాత = ధ్యానింపబడుచున్న }

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
  42. ఖ్యాతిని గలిగిన వీరుల
    నేతీరుగ నెదురుకుందు నియ్యని ననుచున్
    భీతిలకుత్తరుడా, ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  43. ఇల్లాలు తను మరెవరో కాదు ఇంటినేలెడి
    గృహ మంత్రి
    ఆవిడను కాదని పప్పుడకదు మోగదు
    ఆనంద తంత్రి
    విశ్వము తానై తోచు విధేయతగ
    ప్రసన్నత చిక్కురా
    భీతిని ముందు కేగిననె ప్రీతి
    జగద్విజయమ్ము దక్కురా

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మీ భావానికి పద్యరూపం!

      నేతగ శ్రీమతి గృహమున
      ప్రీతిని సంసార సుఖము పెంపొనరించున్
      ప్రాతగ పతియే నమ్రత
      భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!

      ప్రాత = భృత్యుడు

      తొలగించు
    2. సీతాదేవి గారూ,
      రమేశ్ గారి భావానికి మీ పద్యం రూపం బాగున్నది. అభినందనలు.

      తొలగించు
    3. ధన్యోస్మి!🙏🙏🙏🙏

      తొలగించు
  44. భూతలమంతయున్ వెదకి భూనిజ జాడను దెల్ప నిష్టుడై
    ఆతతముందపించు అనిలాత్మజు గన్గొని జాంబవంతుడా
    చేతము తోడ బల్కె నిటు చేకొని యాపదలన్ని సైచి ని
    ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శ్రీకాంత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూనిజ/భూమిజ'... టైపాటు.

      తొలగించు
  45. భీతిని జేరనీవు దరి, భీరువులై సరిహద్దు పౌరులన్
    యాతన బెట్టు ముష్కరుల నంతకు బారికి బంపు సైనికా!
    నీతగు జోదు లే డరుల, నీ పటు దీక్షను బెంచి వారిలో
    భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  46. కం:-
    నీతి,నియమమ్ము దప్పిన
    ఘాతకులెల్లను వధించి కాయువునిలుపన్
    యాతనలువిడి మదిని ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!!

    @ మీ పాండురంగడు*
    ౦౭/౦౫/౨౦౧౮

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. పాండురంగడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
  47. ప్రీతియు నేర్వగ సంతతి
    చేతిని గలుప తననె కద చేరు ముదమునన్
    రీతుల నిల్పగ బంధ, ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్


    dr H Varalakshmi
    Bangalore

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. చివరి గణం రగణం అవుతున్నది.

      తొలగించు
  48. *7-5-18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    సందర్భము: స్థితప్రజ్ఞుని లక్షణాలను గీతాచార్యుడైన కృష్ణు డిలా పేర్కొన్నాడు.
    దుఃఖే ష్వనుద్విగ్న మనాః
    సుఖేషు విగత స్పృహః
    వీత రాగ భయ క్రోధః
    స్థిత ధీ ర్ముని రుచ్యతే 56
    (భగవద్గీత సాంఖ్యయోగం)
    దుఃఖం సంభవించినప్పుడు కలత చెందరాదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోరాదు. రాగము (అనవసరమైన మమకారం), భయం, కోపం అనేవి విడిచిపెట్టాలి. అతడే స్థితప్రజ్ఞుడు. అంటే నిలిచిపోయిన ప్రజ్ఞ కలవాడు.
    నిజానికి దైవానుభూతి పొందాలనుకొనే ప్రతివాడూ ప్రయత్న పూర్వకంగా వీటిని యెంత కష్టమైనా సరే సాధించితీరాలి. యిందులో తనకు తానే ప్రమాణం. మరొకరు చెప్పాల్సింది లేదు. అట్లా సాధించ గలిగిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక రంగంలో మునుముందు కేగి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు.
    తక్కినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. ఆయుస్సు అంతరించిపోతూ వుంటుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం వుండదు.
    లేదా వేదాంత చర్చ లన్నీ శిష్యులను ఆకట్టుకొని మిథ్యాతృప్తి పొందడానికి ఆత్మ వంచనకు పనికివస్తాయి. ఒక్కొక్కసారి ఏదో ఒక దశలో అభాసు పాలు కావడానికి దారి తీస్తుంటాయి కూడ.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఆతండు స్థితప్రజ్ఞుడు,
    వీత క్రో ధానురాగ భీతుడు, కరమున్
    బ్రీతుడు దైవానికి.. ని
    ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    2 వ పూరణము..

    సందర్భము: వాస్తవానికి సుఖం వస్తుం దంటేనే భయపడాలి. కాని లోకంలో కష్టం వస్తే చాలు భయపడుతారు. కాని ఆ కష్టమే దైవాన్ని గుర్తుండేటట్టు చేస్తుంది. దైవానికి చేరువగా తీసుకు వెళుతుంది. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇంకొకనికి ఆదర్శంగా నిలబెట్టుతుంది.
    ఇక సుఖం వస్తేనా! నా యంతవాడు లే డనుకుంటాడు. అందరినీ చిన్నచూపు చూడడానికీ వెనుకాడడు. అందరిలో దైవాన్ని చూడడం అనే మాట నచ్చదు. దైవానికి క్రమంగా దూరమౌతాడు.
    దేవత లందరూ సుఖాని కలవాటుపడి మత్తులో మునిగియున్నప్పుడే రాక్షసులచేత స్వర్గంనుండి తరిమివేయబడుతారు. వాళ్ళ కప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఏ విష్ణుమూర్తివద్దకో వెళ్ళి మొరపెట్టుకుంటారు.
    ఈ విధంగా సుఖం పొందడంద్వారా దైవానికి దూరమై పోవడం సంభవిస్తున్నది. కాబట్టి అదే నిజమైన కష్టం. అందుకే *సుఖం వస్తుం దని భయపడాలి.*
    ఇక కష్టంలో భగవంతు డెప్పుడూ గురుతే వుంటాడు. కాబట్టి దానినే నిజమైన సుఖంగా భావించాలి.
    అందుకే కుంతీదేవి తన కెప్పుడూ కష్టాలే రావా లని కోరుకున్న దంటారు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    భీతి వలదు కష్టమునకు..
    లో తరసినఁ జెంతఁ జేర్చు లోకేశ్వరునే!
    ఏతెంచు నేమొ సుఖ మని..
    భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    ప్రత్యుత్తరంతొలగించు