కూనా అని పద్య పాదాన్ని మొదలెట్టినప్పుడు అవధాని గారి అశ్వ వేగం దాన్ని మార్చి ధ్యానంతో మొదలెట్టినప్పుడు పాండిత్య లాలిత్యం దేనికదే సాటి , పైపెచ్చు మైలవరపు వారికే అది పాటిగ సాటి
చారి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదం చివర గణదోషం. "వెల్గుచుఁ దా। మానవుల..." అనండి. రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం."ప్రానుడుగులు నేర్పుటకై" అందామా?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2666 సమస్య :: *హానిం జేయని యాత డెవ్విధిని తా నాచార్యుడై యొప్పునో?* హాని చేయని వాడు గురువెట్లా ఔతాడు? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: మనం గురుదేవునికి నమస్కారం చేస్తూ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా । చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ।। అనే శ్లోకం చెప్పుకొంటాం కదండీ. అజ్ఞానమనే అంధకారం వలన దేనినీ చూడలేని గ్రుడ్డి వానివలె ఉన్న శిష్యుని కన్నులను జ్ఞానమనే కాటుక పుల్లతో తెఱిపించి కైవల్యమార్గాన్ని చూపిస్తూ బ్రహ్మానందాన్ని అందించేవాడే అసలైన ఆచార్యుడు. ఆ విధంగా సముద్రమంతటి అజ్ఞానాన్నైనా సరే నశింపజేయలేనివాడు ఆచార్యు డెలా ఔతాడు అని ప్రశ్నించే సందర్భం.
నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇన్ని రోజులు మాకు దగ్గరగా ఉన్న R. M. P. వ్రాసిన మందులు వాడాను. మంచి డాక్టరుకు చూపించుకోవాలని ఇప్పుడే మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాను.
డా. పిట్టా వారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'మేనిన్ + ఆశలు' అన్నపుడు యడాగమం రాదు. 'తిమిరపు హాని' అన్న ప్రయోగం అంత సబబుగా తోచడం లేదు.
"గురోస్తు మౌనవ్యాఖ్యానం
రిప్లయితొలగించండిశిష్యాస్తు చ్ఛిన్నసంశయా: "
ధ్యానము ధారణములతో
నానందమ్మున లయించి యభిరూపుండై
మౌనమ్మున సంశయముల
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిసంశయహానితో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిసంశయహానిచేయనివాడాచార్యుడుకాడు! చక్కని బ్గావన!
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిహీనంబైన గుణమ్ముల్
స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
జీనము జేయన్ వాటికి
హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జీనము/చీనము' ... ?
తొలగించండికంది వారికి
ఆరోగ్యము జాగ్రత్త.
జీనము - నాశనము అన్న అర్థం లో వాడాను .
దా చీనము ఉపయోగించి ~ బంగారు వన్నె లద్దిరి ; నెనరులు !
జిలేబి
కానల కేగక రయమున
రిప్లయితొలగించండిమౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
వానప్రస్తము దెలియక
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వానప్రస్థము దెలియక హానిం జేయకయె'... అర్థం కాలేదు.
పూనిక నూనుచు శిష్యుని
రిప్లయితొలగించండిమానిక మట్టుల సలుపగ , మంచిపలుకులన్
వానికి నంతశ్శాత్రవ
హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్ ?
బాపూజీ గారూ,
తొలగించండిఅంతశ్శాత్రవ హానితో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నమస్సులండీ!
తొలగించండిఅంతశ్శాత్రవహానిఁజేయనివాడాచార్యుడుకాడు! మంచి యాలోచన!
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రహ్లాదుడు... గురువులతో
"కూనా ! మీ జనకున్ స్మరింపుమది నీకున్ మాకు లోకమ్మునం...
దానందంబిడు" నన్న వారిననె ప్రహ్లాదుండు "దేవా ! హరి...
జ్ఞానంబీయని విద్య విద్యయొకొ ? విశ్వాత్మేతరాలాపనా
హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినేటి పద్యం పై శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారి స్పందన.. 👇
తొలగించండిమీ సమస్యాపూరణం.
హానిన్....
చక్కని సమర్థన.. మంచి పద్యం..
అయితే.. ప్రారంభం.. సంబోధన..
"కూనా!"
పద్యంలోని ఇతర పదాలతో కుదురుకోలేదు..
మార్చ గలిగితే చాలా మంచి పద్యం...
వారి సూచననుసరించి ఇలా మార్పు చేసితిని.. 🙏
"ధ్యానింపన్ దనుజేంద్రు నామమును వత్సా ! నీకు మేలౌను , మా...
కానందంబగు" నన్న వారిననె ప్రహ్లాదుండు దేవా ! హరి...
జ్ఞానంబీయని విద్య విద్యయొకొ ? విశ్వాత్మేతరాలాపనా...
హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సవరించిన పూరణలో కవితాసౌరభం మరింత గుబాళిస్తున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండికూనా అని పద్య పాదాన్ని మొదలెట్టినప్పుడు అవధాని గారి అశ్వ వేగం దాన్ని మార్చి ధ్యానంతో మొదలెట్టినప్పుడు పాండిత్య లాలిత్యం దేనికదే సాటి , పైపెచ్చు మైలవరపు వారికే అది పాటిగ సాటి
అదురహో
జిలేబి
కూనా అని ప్రారంభంలో జెప్పినా, వత్సా అని వాక్యాంతాన జెప్పినా పద్యార్థపటుత్వంలో ఏమీ మార్పు రాలేదు. మైలవరపువారి పాండిత్యప్రకర్ష ఇట్టిది!
తొలగించండిజ్ఞానంబున్ సమరీతి నల్పునకు ప్రజ్ఞాశాలికిన్ బంచియున్
తొలగించండిసానందుండయి , శ్రద్ధఁజూపిన వరచ్ఛాత్రున్ బ్రశంసించి , వి
ద్యానాసక్తునికంత్యమందు గన
శూన్యాంకప్రదానమ్మునన్
హానిన్ జేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మూడవపాదంలో.... విద్యానాసక్తునకంత్యమందు... అని ఉండాలి... టైపాటు... 🙏🙏
తొలగించండిజిలేబీ గారికి.. శ్రీ శాస్త్రి గారికి నమస్సులు.. ధన్యవాదాలు 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
జ్ఞానంబిచ్చుచు కరుణ న
రిప్లయితొలగించండిజ్ఞానంబును పారద్రోలు చతురుండతడే!
లోనంగల శత్రువులకు
హానింజేయకయె యెటుల నాచార్యుడగున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిఅంతశ్శత్రువులకు హానితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "జ్ఞానం బిచ్చుచు దయ న।జ్ఞానంబును..." అనండి.
ధన్యవాదములు
తొలగించండిజ్ఞానము గోరుచు వచ్చిన
రిప్లయితొలగించండిమానవులను చేరదీసి మాలిమి తో న
జ్ఞానము మూర్ఖత్వములకు
హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మూర్ఖత్వము' కంటే 'మూఢత్వము' అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండిహీనంబై చరియించుదుర్గుణులకున్ హేఠమ్ములన్జేయు వా
రై నట్టింట జిలేబులై తిరుగుచున్ రావమ్ము తో తర్జనల్
స్థానంబుల్విడి జేయుమానవులకున్ జ్ఞానమ్ము జేర్చన్, "ఇ"కున్
హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!
"ఇ" = గర్వము
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇ' శబ్దానికి తెలుగులో వ్యస్త ప్రయోగం ఉన్నదా? చింత్యం!
తొలగించండికందివారు
నిజం చెప్పాలంటే తెలియదండి ! వ్యస్త ప్రయోగమంటే కూడాను!
సరియేనంటారా ? వీరతాడు వేసుకోవచ్చా ? :)
జిలేబి
... జ్ఞానమ్ము గూర్చన్నిభీ / హానిన్... అనండి.
తొలగించండిఇ భీ హాని = రోష భయముల హాని; ఇ = రోషము [గర్వమను నర్థము సందేహము.]
వ్యస్త ప్రయోగమంటే సమాసమున గాకుండా విడిగా స్వతంత్రముగా నని యర్థము. మన్మథుఁడు వచ్చెను దీనికి ఇ వచ్చె ననుట సరి గాదు. ఇ = మన్మథుఁడు
కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
తొలగించండిపోచిరాజు వారికి
ధన్యవాదములు
జిలేబి
అజ్ఞానమె భ్రాంతిగ తమమున సుఖములనదె
రిప్లయితొలగించండిపొందెదరుగ జనులు
అవిద్యగ దృష్టి నిలిపి విద్యను తాము
కాంచవుగా కనులు
వెలుగు చూపగ నెంచిన గురువు కాఠిన్యమున
దా చెప్పునో
హానిం జేయని వాడెటుల దానాచార్యుడై
యొప్పునో
+919948634619 ....వీరబ్రహ్మేంద్రాచార్య.....
రిప్లయితొలగించండిదీనుండై సువిచారతత్త్వ మెఱుగం దీండ్రంబుతో నుండి, వి
ద్యానాథుండగు దేశికేంద్రుఁ గని శిష్యత్వంబునుం బొందినం,
దానా శిష్యుని కాత్మవిద్యనిడి లోనందాగు మోహానికిన్
హానింజేయని యాతఁడెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో.
ముంజంపల్లి.
వీరబ్రహ్మేంద్రాచార్యుల పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి+919948634619. వీరబ్రహ్మేంద్రాచార్య. (స్వల్ప సవరణతో) దీనుండై సువిచారతత్త్వ మెఱుగం దీండ్రంబుతోనుండి, విద్యానాథుండగు దేశికేంద్రుఁ గని శిష్యత్వంబునుం బొందినం, దానా శిష్యుని కాత్మవిద్యనిడి లోనందాగు మోహాబ్ధికిన్ హానింజేయని యాతఁడెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో. ముంజంపల్లి.
తొలగించండి[02/05, 06:20] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండితానన్నివేళలందున
జ్ఞానానందశుభదుండు నైవెల్గుచున్
మానవులతెలివిలేమికి
హానింజేయకయె యెటులనాచార్యు డగున్
[02/05, 06:38] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
ప్రానుడుగునేర్పుటకై
జ్ఞానాకృతిదాల్చినట్టి నందకిశోరా
మానవమూర్ఖత్వమునకు
హానింజేయకయె యెటులనాచార్యు డగున్
చారి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదం చివర గణదోషం. "వెల్గుచుఁ దా। మానవుల..." అనండి.
రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం."ప్రానుడుగులు నేర్పుటకై" అందామా?
ప్రాణము తీయుచు జీవుల
రిప్లయితొలగించండిసేనము శోధనము చేసి జీవ బుధుoడున్
యీ నభమున మేల్జేయున్
"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
జంతువులను చంపి పరిశోధనములు చేసి మనకు నూతన ఔషధము లు అందించును జంతు శాస్త్ర వేత్తలు. మరి వారు హాని చేయక యున్న పరిశోధనలలో ఆచార్యుడు కాడుగదా అను భావన
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిపూరణ విషయంలో మీ సమర్థన బాగున్నది.
'బుధుండున్ + ఈ' అన్నపుడు యడాగమం రాదు. 'నభము'నకు అన్వయం?
రిప్లయితొలగించండికం
జ్ఞానము,వినయముతో నిజ
ప్రాణము ఛాత్రులకు నిలిపి ,ప్రౌఢిమ చేతన్
మేనిన గలారు రిపువుల
హానిం జేయకయె యెటుల నాచార్యు డగున్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిఅరిషడ్వర్గ హానిని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోనీయదు పులి యెవరిన్
రిప్లయితొలగించండిదానికి కనబడిన యంత ; తగు చదువులున్
జ్ఞానము లేకయె మనుజుడు
"హానిం జేయకయె ; యెటుల నాచార్యుఁ డగున్?"
సవరణతో :
తొలగించండిపోనీయదు పులి యెవరిన్
దానికి కనబడిన యంత ; తగిన చదువులున్
జ్ఞానము లేకయె మనుజుడు
"హానిం జేయకయె ; యెటుల నాచార్యుఁ డగున్?"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2666
సమస్య :: *హానిం జేయని యాత డెవ్విధిని తా నాచార్యుడై యొప్పునో?*
హాని చేయని వాడు గురువెట్లా ఔతాడు? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: మనం గురుదేవునికి నమస్కారం చేస్తూ
అజ్ఞాన తిమిరాంధస్య
జ్ఞానాంజన శలాకయా ।
చక్షు రున్మీలితం యేన
తస్మై శ్రీ గురవే నమః ।। అనే శ్లోకం చెప్పుకొంటాం కదండీ.
అజ్ఞానమనే అంధకారం వలన దేనినీ చూడలేని గ్రుడ్డి వానివలె ఉన్న శిష్యుని కన్నులను జ్ఞానమనే కాటుక పుల్లతో తెఱిపించి కైవల్యమార్గాన్ని చూపిస్తూ బ్రహ్మానందాన్ని అందించేవాడే అసలైన ఆచార్యుడు. ఆ విధంగా సముద్రమంతటి అజ్ఞానాన్నైనా సరే నశింపజేయలేనివాడు ఆచార్యు డెలా ఔతాడు అని ప్రశ్నించే సందర్భం.
జ్ఞానాఖ్యాంజన వర్తి చేత గురు డజ్ఞానాంధకారమ్మునన్
గానంజాలని వాని కండ్లు తెఱచున్, కైవల్య సంధాయియై
ఆనందమ్మును గూర్చు ; నిట్లు సతతం బజ్ఞాన వారాశికిన్
*హానిం జేయని యాత డెవ్విధిని తా నాచార్యుడై యొప్పునో?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-5-2018)
(శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదములతో)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅజ్ఞానాబ్ధికి హాని చేయనివాడు గురువు కాడన్న మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జ్ఞానము, బుద్ధి వికాసము,
రిప్లయితొలగించండిమానంబును కలుగజేయు మాన్యుడు గాదా
తానుగ శిష్యు నవిద్యకు
"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"
విట్టుబాబు గారూ,
తొలగించండిశిష్యుని అవిద్యకు హాని జేసెడివాడు గురువన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమానని వేదాధ్యయనము
తానక పరిచర్య జేయ తత్పరమతియై
పూనిక ఛాత్రునవిద్యకు
హానిం జేయకయె యెటుల యాచార్యుడగున్!
విద్యాతురాణాం న సుఖం న నిద్రా”
తొలగించండిజ్ఞానిగ జేయు దలంపున
మేనుకు విశ్రాంతినీక మెలకువ తోడన్
నానావిధ సుఖములకుం
హానిం జేయకయె యెటుల యాచార్యుడగున్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండితానున్నిత్యము శాస్త్రవిద్య యెడలన్ దాదాత్మ్యమే జెందుచున్
రిప్లయితొలగించండిపూనుంగా తన శిష్య కోటి మతులన్ పొల్పార యత్నించుచున్
జ్ఞానమ్మున్ దగినంత వేగ నిడుచున్నజ్ఞాన కాయానికిన్
"హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో"
***)()(***
(పొల్పార = దీపింప ; కాయము = చయము)
జనార్దన రావు గారూ,
తొలగించండిఅజ్ఞానమనే శరీరానికి హాని చేయనివాడు గురువెలా అవుతాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం చాల బాగుందండీ! కాయానికిన్ అనడం కన్న కాయమ్ముకున్ అంటే యింకా బాగుంటుందేమో!🙏🙏🙏
తొలగించండి'కాయమ్ముకున్' అనరాదు. 'కాయమ్మునకున్' అనడం సాధువు. "కాయానికిన్" అనడంలో దోషం లేదు.
తొలగించండిధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండినా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇన్ని రోజులు మాకు దగ్గరగా ఉన్న R. M. P. వ్రాసిన మందులు వాడాను. మంచి డాక్టరుకు చూపించుకోవాలని ఇప్పుడే మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాను.
రిప్లయితొలగించండివిన్నపాలు వినవలె మహాత్మా!🙏🙏🙏🙏
తొలగించండిఅనయుము నిస్వార్తముతో
రిప్లయితొలగించండివినయముగా చేయుచు నిజ వృత్తిని భక్తిన్
మనమున దుష్టతలపులకు
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
ప్రాస ముందున్న అక్షరాలు లఘువులుగా ఉన్నాయండీ..
తొలగించండిఅవునండి. పెద్దలు పండిత నేమాని గారితో గతంలో ఇదే తప్పుకు అక్షింతలు వేయించుకున్నాను. మాళ్ళీ ఇప్పుడు అదేతప్పు. తెలియజేసినందులకు ధన్యవాదములు. నమస్సులు.
తొలగించండిక: జ్ఞానాంభోనిధియై తా
తొలగించండివీనులకున్ విందు జేయు విద్యగరపుచున్
మానసపు చెడుగులకు నే
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమనో దుర్బుద్ధులకు హాని చేయక గురువు కాదన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండికానఁగఁ గామక్రోధ మ
రిప్లయితొలగించండిదానీకము లెల్ల జనుల కంతస్థమ్ముల్
తా నా యరి షడ్వర్గము
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
[ ఆచార్యుఁడు = ఋషి]
కానేరం డది నిక్క మెంచగను రక్షాదక్ష రాజన్య సం
తానశ్రేణికి లక్ష్య దర్శన ధనుస్త్రాణోగ్ర నారాచ సం
ధా నాదిక్రియ లందు శిష్య గణ హృత్సందేహ సంసృష్టికిన్
హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో
[సంసృష్టి = సమూహము]
స్నాన జప తపో రత స
తొలగించండిన్మానస యమ నియమ సువ్రత చరుఁడునై తా
నే నర మృగ ద్విజములకు
హానిం జేయకయె యెటు లనాచార్యుఁ డగున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
చివరి పూరణలో' అనాచార్యు' డన్న విరుపు బాగున్నది.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిమీరు సంపూర్ణారోగ్యమును బడసినట్లు భావించెదము. మండుటెండలో నింటి పట్టున నున్న నారోగ్యకరము కదా! శ్రద్ధ వహించ విన్నపము.
జ్ఞాన ము నొసగుచు నిరతము
రిప్లయితొలగించండితానే ర్పు చు సత్ పథం బు దార్శనికుoడై
దీన త్వమొన ర్చు చె డు కు
హాని oచేయకయె యె టు ల నాచా ర్యుoడగు న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిచెడుకు హానితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఙ్ఞానము నీయగ గురువులు
రిప్లయితొలగించండిమానంబునుదొలగజేసి మహనీయుడుగా
వానినిజేయ,నహమునకు
"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"
సుబ్బారావు గారూ,
తొలగించండిఅహమునకు హాని అంటూ మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని 'మానమును తొలగజేయడం'...?
ఆటవిడుపు:
రిప్లయితొలగించండి(గిరీశం బాబాయి)
ఆనందించుచు నగ్నిహోత్రునుది యాయాసమ్ము బుచ్చెమ్మతో
పానంజేయుచు చుట్ట ధూమమును నాబాలుండు ముట్టించగా
నానారూపములౌ నబద్ధములతో నమ్మించి వంచించుచున్
హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిగిరీశం ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అగ్నిహోత్రునుది'...? మొదటి పాదంలో అన్వయం లోపించినట్లున్నది.
మీ సవరణ:
తొలగించండి"అగ్నిహోత్రునిది" 🙏
మొదటి పాదములో "యాయాసమ్ము" తరువాత ఒక కామా (,) ఉండాల్సిన మాట.
రాణన్ జూపుచు వృత్తి పైన పని నిర్వర్తించుచున్ దీక్షతో
రిప్లయితొలగించండిజ్ఞానాంభో నిధియై వినీతులకు తాకావించుచున్ బోధనల్
మానమ్మున్ నిలబెట్ట చిత్తమున దుర్మార్గంపు నాసక్తికిన్
హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిదుష్టాసక్తుల హానితో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్తులకు నమస్సులు. ధన్యవదములు.
తొలగించండి
రిప్లయితొలగించండికం.
షానము తగలనిదే పా
షాణము శిల్పమెటులౌను, ఛాత్రులలోనన్
హీనగుణాలు తొలగగన్
హానింజేయకయె యెటుల నాచార్యుడగున్ ..
'షానము " స్వర్ణకారులు, కమ్మరివారు, శిల్పులు ఉపయోగించె ఒక పనిముట్టు. దీనికే పోగర అనే మరో సమానార్థక పదముంది.
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిహాని చేయవలసింది హీనగుణాలకా, ఛాత్రులకా? కొంత అన్వయలోపం ఉంది.
పూని బడినందు విద్యను
రిప్లయితొలగించండిదానము చేయుటకువచ్చి తాలిమితోడన్
కూనలు వ్రాసిన కొరతల
హానింజేయకయె యెటుల నాచార్యుడగు
సీతారామయ్య గారూ,
తొలగించండివిద్యార్థులకు కొరతలకు హాని అంటూ మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిమేనిన్ యాశలు నుడుగగ
పోనీ శిష్యుండ్రె తనదు పుత్రులటంచున్
తానే వెలుగై తిమిరపు
హానిం జేయకయె యెటుల నాచార్యుండౌ
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిగ్లానిం జెందడు స్వప్రయోజనము లెల్లం ద్రోసి జ్ఞానార్థియై
ఈ నా జాతికి నొజ్జ నౌదు ననియు న్నెన్నాళ్ళదీ జీవితం
బౌ నా వారిదె శిష్యబృంద విహితం బాశించి యజ్ఞానపుం
హానిం జేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'మేనిన్ + ఆశలు' అన్నపుడు యడాగమం రాదు. 'తిమిరపు హాని' అన్న ప్రయోగం అంత సబబుగా తోచడం లేదు.
డాపిట్టానుండిఆర్యా,
తొలగించండితిమిరపు కు బదులుగా శోధన హానిం. గా మార్చివేస్తే.....
మధు సూధనం గారు ఇవాళ కూడా పరస్పర గణ దోష విచారణము చేసిన బాగుండునేమో???
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
ఏకలవ్యుని నిర్వేదనము
>>>>>>>>>>>>>>>>>>
ఏ నే పాపము జేసితిన్ గురువరా | యీ రీతి " నంగుష్ట మీ
రా , నాకున్ గురుదక్షిణం " బనుట ధర్మం బౌనె | యా యద్రిభి
త్సూనుండే విలుకాడు విశ్వమున నంచున్ రూఢి గావించుటే
గా నీ యాశయ | మేల యిట్టి యధి వాకం బార్య ! నిత్యంబు మా
హీనామ్నాయపు వారి గూల్చ హితమా | యెట్లేనియున్ మా కించుకన్
హానిం జేయని వా డెటుల దా నాచార్యు డై యొప్పునో !
పోనీ లే గురుదక్షిణంబు గొనుమా పోనాడుమా కోపమున్ !
{ అద్రిభిత్సూనుడు = అర్జునుడు ; అధివాకము = పక్షపాతోక్తి
హీన + అమ్నాయపు వారు = హీన కులజులు }
తొలగించండిఅద్భుతమండీ గురుమూర్తి గారు
జిలేబి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిఏకలవ్యుని ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జిలేబి గారికి " తియ్యని " నమః పూర్వక ధన్యవాదములు
తొలగించండిశ్రీ గురువర్యులకు పదనమస్కృతులు మరియు ధన్యవాదములు
సమస్య : -
రిప్లయితొలగించండి"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"
కందము*
జ్ఞానంబునొసగు గురువులు
మౌనంబున లంచమును సమర్ఫించకనే,
ఈనాడిలాగు వెనుక క
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
......................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సమర్పించకయే' అనండి. 'వెనుక కహాని' నడిపే ఆచార్యులున్నారు కూడా! బాగుంది.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిజ్ఞానౌన్నత్యకృతాగ్నిసంస్కరణుఁడై, శారీరవాఙ్మానస
స్థానోత్కృష్టతపఃప్రభావయుతుఁడై, సమ్యక్చతుర్వేదశా
స్త్రానీకప్రథితాప్తబోధకుఁడునై, సన్న్యాసియై, సంసృతీ
హానిం జేయని యాతఁ, డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?
మధుసూదన్ గారూ,
తొలగించండిసంసృతీహానితో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ద్గన్యవాదాలండీ శంకరయ్య గారూ॒
తొలగించండిఅలాగే సర్
రిప్లయితొలగించండిధన్యవాదములు
దానంబెంచగ ధర్మమార్గమగు!సంధామ్ము సంతోషమౌ
రిప్లయితొలగించండిజ్ఞానంబుంచెడి విద్యబుద్దులనగా?"చాంచల్యభావంబునన్
హీనత్వంబునుమాన్పజేయుగద!సాహిత్యంబునన్ ద్రుంచుచున్
హానింజేయని యాతడెవ్విధిని దానాచార్యుడైయొప్పునో?
ఈశ్వరప్పగారూ!
తొలగించండిసాహిత్యంలో హీనత్వభావాలకు హానింజేయనివాడెట్లాచార్యుడగుననెడి మీ పూరణము చాలా బాగున్నదండీ! అభినందనలు!
మానము=గర్వము (ఆంధ్రభారతి)
రిప్లయితొలగించండిపోచిరాజు వారికి కృతజ్ఞతలతో
రిప్లయితొలగించండిమానక జపతపములనే
పూని సుదీక్షలను దాను పూర్ణపు రీతిన్
మానిత గుణముల నేరికి
హానిం జేయకనె యెటు లనాచార్యుడగున్?
🙏🙏🙏🙏
సీతాదేవి గారూ!
తొలగించండిమీ పూరణ బాగున్నదండీ! అభినందనలు!
ధన్యవాదములండీ! మీ అభినందనలు పూజ్యులు కామేశ్వరరావు గారికే చెందుతాయి!🙏🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికానంగ బెదురు గలుగగ
రిప్లయితొలగించండితానందించు వెలుగులును తారకలనగన్
మానంగ దుష్ట దురితము
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
వరలక్ష్మిగారూ!
తొలగించండిదుష్టదురితానికి హానిచేయనివాడు ఏలా ఆచార్యుడవుతాడు అనే మీ పూరణ చాలా బాగున్నదండీ! అభినందనలు!
కానల కేగక రయమున
రిప్లయితొలగించండిమౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
మానాభి మానములు విడచి
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
రాజేశ్వరి అక్కయ్య గారూ!
తొలగించండిమీ పూరణ బాగున్నదిఒ. అభినందనలు!
మూడో పాదంలో విడచి బదులు విడి అనండి.
కానల కేగక రయమున
తొలగించండిమౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
మానాభి మానములు విడి
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
dhanya vaadamulu madhurakavi gaaru
తొలగించండిశార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండితానైవిద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన వృద్ధాంగులిన్
బోనాడన్ గురుదక్షిణంచు గొనుచున్ బొమ్మైన భాగ్యమ్ముతో
రానించన్ గురువంశ రాజగురువౌ లక్ష్యమ్ముతో బోయకున్
హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?
సహదేవుడు గారూ!
తొలగించండిఏకలవ్యుని గూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!
మూడో పాదాదిని రాణించన్ అనాలి.
🙏ధన్యోస్మి 🙏
తొలగించండిటైపాటై సవరణతో
తానై విద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన వృద్ధాంగులిన్
బోనాడన్ గురుదక్షిణంచు గొనె గా బొమ్మైన భాగ్యమ్ముతో
రాణించన్ గురువంశ రాజగురువౌ లక్ష్యమ్ముతో బోయకున్
హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిడా.వెలుదండ వారలు సూచించిన మార్పుతో
తొలగించండిశార్దూలవిక్రీడితము
తానైవిద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన నంగుష్టమున్
బోనాడన్ గురుదక్షిణంచు గొనుచున్బొమ్మైన భాగ్యమ్ముతో
రాణించన్ గురువంశ రాజగురువౌలక్ష్యమ్ముతో బోయకున్
హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దానాచార్యుఁడై యొప్పునో?
కందం
రిప్లయితొలగించండిద్రోణుడుఁ గురు వీరులలరఁ
దానొక బొమ్మ గురువైన దక్షిణ గొనుచున్
దానంగుటమున్, బోయకు
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్!
సహదేవుడు గారూ!
తొలగించండిఏకలవ్యునినుండి అంగుటమును దానముగా గొని, బోయకు హానిచేయనివాడాచార్యుడెట్లగునో యనెడు మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!
🙏ధన్యోస్మి🙏
తొలగించండిహానిం జేసిన వాడ నౌదు కొడకా ఆమ్నాయ సక్తిన్ మహా
రిప్లయితొలగించండిజ్ఞానం బొందగ జూచు ని న్నితర జిజ్ఞాసార్థ మార్గంబులన్
నేనుంచ న్నని పంపినాడ నిచట న్నేమాత్రమున్ జ్ఞాని నా
హా! నిం జేయని యాతడెవ్విధిని దానాచార్యుడైయొప్పునో?
మిస్సన్న గారూ!
తొలగించండిశిష్యుని జ్ఞానిని జేయనివాడు ఆచార్యుడెట్లగునో యనెడి మీ పూరణ మద్భుతముగా నున్నది! అభినందనలు!
ధన్యవాదాలు మధుసూదన మిత్రమా.
తొలగించండికం.
రిప్లయితొలగించండిద్రోణుడి ప్రతిమను చేసియు
కానలనొకడు విలువిద్య కౌశలమొందెన్
వానినడిగె గురుదక్షిణ
హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండితానే ముందుగ జెప్పి బొమ్మ గొలువందా పాప మానాడు? నీ
ద్రోణా చార్యుడు నేకలవ్యు దిగిచెన్ దుర్బుద్ధియే నందునే
నీనాడిట్టుల దూర విద్య తపమున్ నెర్పంగ దుర్దక్షిణా
హానింజేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో?!
రిప్లయితొలగించండి..సమస్య
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
సందర్భము:శిష్యుని మనస్సులో వున్న సత్వ గుణాన్ని గురువు యెప్పుడూ పరిరక్షించాలి. అన్య గుణములను అంటే రజస్తమో గుణాలను ఏ విధంగానైనా బలహీన పరచాలి. శిష్యుని నొప్పించియైనా సరే అతని మనస్సునుండి తరిమివేయాలి.
ఎందుకంటే సత్వగుణంతోనే శాశ్వతమైన సుఖం సంప్రాప్తిస్తుంది. వేరే గుణాలతో కాదు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పూని తన శిష్యుని మదిని
మానిత సత్వగుణ శోభ మరుగుపడక ముం
దే నేర్పున నన్యములకు
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
అన్యములకు= ఇతర గుణములు..
రజస్తమో గుణములు
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
నేటి మాస్టార్లు: 👇
రిప్లయితొలగించండిదీనారమ్ముల గూర్చుటన్ వడివడిన్ ధ్యేయమ్ముగా నెంచుచున్
నానారీతి ట్యుటోరియల్సు బడులన్ నందమ్ముతో జేరుచున్
వానాకాలపు విద్యలన్ గరపుచున్ పానుల్ సిగారెట్లకున్
హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో!