9, మే 2018, బుధవారం

సమస్య - 2673 (కరణము వద్దనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్"
(లేదా...)
"కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

160 కామెంట్‌లు:

 1. పరభాషావ్యామోహము
  విరివిగ మదిలో చేరన్ విద్యార్థులకున్
  బరువాయెగా తెనుగు, వ్యా
  కరణము వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! శుభోదయం!

   రెండవ పాదం మూడవ గణం మరొకసారి చూడండి...

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   వ్యాకరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదాన్ని "విరివిగ మదిలోన జేర విద్యార్థులకున్" అంటే గణదోషం తొలగుతుంది.

   తొలగించండి
  3. నమస్కారమలు శాస్త్రి గారు . తప్పే ఉదయము మత్తు వదల లేదు .

   పరభాషా వ్యామోహము
   విరివిగ మనమున కలుగగ విద్యార్థులకున్
   బరువాయెగా తెనుగు,వ్యా
   కరణము వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

   తొలగించండి
 2. అరసున్నలు, క్త్వార్థకములు;...
  పరగడపున నేను సలుపు పద్యమ్ముల, శం
  కరవర! కఠినత్వపు వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   వ్యాకరణము వద్దన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అరసున్నల విషయంలో అంత పట్టింపు లేకున్నా క్త్వార్థకమైన ఇత్తునకు సంధి చేస్తే మాత్రం కఠినంగా ఉంటాను.

   తొలగించండి
  2. 🙏🙏🙏

   నాకు క్త్వార్థకమంటే ఏమిటో తెలియదు...చూస్తాను సార్!

   తొలగించండి
  3. అసమాపక క్రియా పదముల తుది వచ్చు ఇత్తు క్త్వార్తకము.పోయి,చేసి,ఆడి,వచ్చి మొ౹౹

   తొలగించండి
 3. ధరలో ధరలే విరివిగ
  పెరుగుట గాంచిన పిదపను భీరువు లెల్లన్
  తరుణమిది కాదని యలం
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   పెరిగిన ధరలతో అలంకరణం వద్దన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 4. సరిసరి ! గ్రామస్థులకిక
  కరణము వద్దనుచుఁ జెప్పు! కాలము వచ్చెన్
  భరియింపలేమికన్ వీ
  ళ్ళ రావడిన్! నందమూరి లసితపు హుకుమౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   రామారావు రద్దు చేసిన వ్యవస్థను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పరదేశపు మోజునబడి
  రసరమ్యపు తెనుగు భాష రద్దొన రించన్
  పరిశీలించగ మనకను
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి గారూ నమస్సులు!

   రెండవ పాదం ప్రాస...

   తొలగించండి
  2. అరయగ వాడుక మాటలె
   విరివిగ వాడెడు వచన కవిత్వమె పెరుగన్
   నిరసించుచుపద్యము, వ్యా
   కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్.

   తొలగించండి
  3. అక్కయ్యా,
   పరానుకరణము వద్దన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదాన్ని "వర రమ్యపు తెలుగుభాష వద్దని చెప్పన్" అంటే ప్రాసదోషం తొలగిపోతుంది.

   తొలగించండి
  4. విరించి గారూ,
   వ్యాకరణము వద్దన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  5. పరదేశపు మోజునబడి
   వరరమ్యపు తెనుగు భాష వద్దని చెప్పన్
   పరిశీలించగ మనకను
   కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చున్

   తొలగించండి
 6. అక్కయ్యా మీ పద్యంలో రెండవ పాదం ఇలా వుంటే యేలావుంటుందో చెప్పండి

  సరసమ్మగు తెలుగు భాష చతికిల పడగన్

  రిప్లయితొలగించండి
 7. పరిణతిఁగలదని పల్కుచు
  పర దేశపు'షోకు'లన్నీ పాటించెదమం
  చరమరికలు లేకయె, సం
  స్కరణము వద్దనుచుఁజెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి


 8. అరరె!జిలేబు లన్విడిచి నాకడ పోయిరి ! ఓ శుభాంగి ! వ్యా
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?
  సరిసరి మీదు శోషయు ! కసాయితనమ్ముల పిల్ల కాయలన్
  సరికొనిరయ్య నేర్వమని సాధ్యము గాక పరారయేరయా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   వ్యాకరణాన్ని వద్దని పిల్లకాయలందరూ పారిపోలేదు. కొందరున్నారు. పోయిన కొందరు తిరిగి వస్తున్నారు. అందుకే 'శంకరాభరణం' నిరాటంకంగా నడుస్తున్నది!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. త్వరగా నేనీ జగతిని
  పురోగ మించగ నలుగురు పొనరుచు విధమున్
  జరుపుటయే, నా అంతః
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   అంతఃకరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 10. ఓల్డ్ స్టొరీ :)


  అరకొర కావు మా చెయివు! ఆస్తుల లెక్కలు ఖచ్చితమ్ముగా
  పరకట సూక్ష్మ మెల్ల సయి బాగుగ మా కయి వాలకుండగా
  తరతర లేక గాచితిమి; దారుణ మిద్దె!ప్రభుత్వ మేలనో
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. హరి పెద్ద భార్య యగునా
  దరిద్ర దేవత యెచటని తఱచియు మదిలో
  పరికింపగ నకటకటా!
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్.
  ****)()(****
  (ఒకనాడు వైభవంగా బ్రదికిన కరణము వద్ద నేడు దారిద్ర్యము తాండవిస్తున్నదని భావము.ఈ పూరణకు మూలమొక పాత చమత్కార పద్యము.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణలోని చమత్కారం బాగున్నది. అభినందనలు.
   కాని 'వద్ద + అనుచు' అన్నపుడు సంధి లేదు. 'వద్ద ననుచు' అవుతుంది. 'వద్దు+అనుచు = వద్దనుచు' అవుతుంది.

   తొలగించండి
  2. ధన్యవాదాలు! (స్పందనూహించినాను)

   తొలగించండి
 12. మద్దూరి వారి పూరణ

  విరులను దాల్చబోరు, కనువిందుగ కాటుక దిద్దలేరు,సుం
  దరమగు వస్త్ర సంచయము నాస్తి, వచింపగ గాజులన్నచో
  కరములు వీడె, కుంకుమకు కాలము చెల్లెను. పాతదౌ యలం
  కరణము వద్దు మాకనెడి కాలము వచ్చె నిదేమి వింతయో.

  మద్దూరి రామమూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మద్దూరి వారి 'సంప్రదాయాలంకరణం' వద్దన్న పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పాతదౌ యలంకరణ వద్దని చక్కని పూరణ చేసినారు! నమోనమః! 🙏🙏🙏🙏

   తొలగించండి
 13. సుకవి మిత్రులందఱకు నమస్సులు!

  "శరణము మాకు నెప్పుడును చక్కని భాషనుఁ దీర్చిదిద్దు వ్యా
  కరణ" మటంచుఁ బండితులు, కమ్మని పద్దెము లల్లు సత్కవుల్
  "వరమిది దక్కె మా" కనఁగ; "వద్దయ! చిన్నయసూరిగారివ్యా
  కరణము వద్దు మా" కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   బాలవ్యాకరణ ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. పర భాషా వ్యామోహము
  పెరగి యు తెలుగు న కవితలు విచ్చల విడి యై
  మరచి రి ఛ oదoబున్ వ్యా
  కరణ ము వద్దనుచు చెప్పు కాలము వచ్చె న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   ఛందోవ్యాకరణాలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. డా.పిట్టాసత్యనారాయణ
  భరణము లెక్కుడు కాగా
  కరమరుదుగ నే,బి,సీ(A,B,C)ల గణనము జేయన్
  బరువడి ప్రతి తెగకు పృథ
  క్కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   పృథక్కరణంతో మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 16. నరమేధములేల, వలదు,
  పర రాజ్యాపహరణంబు,పగ,ద్వేషంబుల్
  మరువుము,నాశనము వలది
  క,రణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   ఇక రణము అంటూ విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 17. తరళపు భక్తితో దెనుగుతల్లికి గావ్యపుమాలలల్లి సం
  బరమున నన్నయాది కవివర్యులు ధీరులు భక్తిమీర నా
  భరణము లట్లలంకరణ భాసురభంగి నొనర్ప ,నీర్ష్య వ్యా
  కరణము వద్దు మాకనెడు కాలము వచ్చె నదేమి చిత్రమో!

  రిప్లయితొలగించండి
 18. (2)
  [కరణాలు పెట్టు బాధ లింతింత యని చెప్పలేని గతకాలంలో నిద్దఱు కరణాలు ముచ్చటించుకొంటున్న సందర్భము]

  "హర! శివ! శంకరా! ప్రజకు నక్కఱ లీయక, దోచుకొంచు, నీ
  కరణపుఁ బెద్ద లీ విధిని గాటపు బాధలఁ బెట్టుచుండ్రి! సం
  స్కరణము సేసి, పాలనముఁ జక్కఁగ మార్చుఁడు వేగ! నిప్పు డీ
  కరణము వద్దు మాా" కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   ఇద్దరు కరణాల సంవాదంగా మీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 19. డా.పిట్టాసత్యనారాయణ
  వరిమడి, చెల్క లెక్కడివె వారివి గోత్రమునంతజెప్పు నా
  కరణము చోట వీ.అరు.వొ గాంచెను యూరికి మేర దెల్యకన్
  కరచరణాదులే గనని, గంతల గట్టిన ముగ్ధగా నవన్
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాంచెను+ఊరికి' అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
 20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2673
  సమస్య :: *కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో ?*
  మాకు కరణం వద్దు అనే కాలం వచ్చింది. ఇది వింతగా ఉంది కదా! అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: వేదమాతకు ఛందస్సే రెండు పాదములు. కల్పమే రెండు చేతులు. జ్యోతిషమే రెండు కన్నులు. నిరుక్తమే రెండు చెవులు. శిక్షా శాస్త్రమే నాసిక. వ్యాకరణమే ముఖము అని పాణిని మహర్షి ఈ శ్లోకాలలో చెప్పియున్నారు.
  ఛందః పాదౌ తు వేదస్య హస్తౌ కల్పోఽథ పఠ్యతే ।
  జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే ।।
  శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్ ।
  తస్మాత్ సాంగ మధీత్వైవ బ్రహ్మలోకే మహీయతే ।।
  కాబట్టి వేదాంగమునకు ముఖముగా ఉన్న వ్యాకరణాన్ని అందరూ శ్రద్ధాసక్తులతో నాడు నేర్చుకొనేవారు. అంత గొప్పదైన వ్యాకరణాన్ని నేడు వద్దు అని అనడం ఎంతో వింతగా ఉంది కదూ అని విశదీకరించే సందర్భం.

  స్వర యుత వేదమాత కిల వర్ధిలు ఛందము పాదయుగ్మమౌ,
  నరయగ కల్పమౌను వర హస్తయుగమ్ముగ, జ్యోతిషమ్ము నే
  త్రరమ, నిరుక్తమౌ చెవులు, ప్రాణము శిక్ష, ముఖమ్ము దెల్ప వ్యా
  కరణ మిటుల్ షడంగముల గాంచుచు నేర్తురు నాడు ; నేడు వ్యా
  *కరణము వద్దు మాకనెడు కాలము వచ్చె నిదేమి వింతయో ?*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (9-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదమాతకు ముఖమై యొప్పెడి వ్యాకరణా న్నిప్పుడు నేర్చుకోలేక కొందఱు వద్దనడాన్ని వింతగా పేర్కొంటూ అద్భుతంగా పూరించారండీ కోట వారూ! అభినందనలు!

   తొలగించండి
  2. కోట రాజశేఖర్ గారూ,
   వ్యాకరణంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. సవరణను గమనించ ప్రార్థన.
   మూడవ పాదంలో *ప్రాణము* బదులు *ఘ్రాణము* అని సవరించి చదువ మనవి.

   తొలగించండి
  4. సహృదయులు
   శ్రీ మధుసూదన్ గారూ! హృదయపూర్వక ధన్యవాదాలండీ.

   తొలగించండి
  5. గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ.

   తొలగించండి
  6. శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.

   తొలగించండి
 21. మైలవరపు వారి పూరణ

  సంధి ప్రస్తావనకు సుయోధనుని స్పందన...

  అరయ గదాప్రహారములనాజినొనర్చెదనూరుభంగమున్
  కురునరనాథ ! నీకని వృకోదరుడాడెను నాడు బీరముల్ !
  పిరికితనమ్ము గాదొ వినిపింపగ పంపుట సంధిమాట ! యిం..
  క రణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రణము వద్దు సంధి కావాలని పాండవులు కోరుకొనడం వింతగా వుందని వ్యంగ్యంగా కౌరవు లన్నట్టుగా చేసిన మీ పూరణ మద్భుతంగా ఉన్నదండీ మైలవరపువారూ! అభినందనలు!

   తొలగించండి
  2. ఇంక రణము వద్దంటూ మైలవరపు వారు వైవిధ్యంగా ప్రశస్తమైన పూరణ చెప్పినారు. అభినందనలు.

   తొలగించండి
 22. సిరిపైనేలో యలిగియు
  దరిద్ర దేవత పరుగున తాజేరెనుగా
  హరిహరి! యేమని యందును?
  "కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్."

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   పద్యం బాగుంది. కాని దరిద్ర దేవతకు కరణానికి సంబంధం?

   తొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   అనుకరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "భారిగ నయ్యెన్/ భారీ యయ్యెన్" అనండి.

   తొలగించండి
 24. అరయగ శాంతిని మించిన
  వర గుణము జగతిని లేదు వరలగ జాతుల్
  కరుణను ప్రేమను జూపు మి
  క రణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్!

  వసుధైక కుటుంబకమ్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   ఇక రణము అంటూ విరుపుతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి
 25. మెరుగని వచనకవిత్వమె
  పరుగులు తీయుచును జనులు, పద్యమ్ములనే
  పరివర్జించుచు నిల, వ్యా
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్!!!

  పరదేశపు సంస్కృతులకు
  ధరలో ప్రాభవము హెచ్చి ధారణ కరువై
  బరువయ్యెను నేడు నలం
  కరణము, వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   వ్యాకరణ, అలంకరణములతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 26. వరులకు వధువులె యిలలో
  కరువై పోయిరి కటకట!కలికాలమయో!
  వరుడే యిసుమంతయు "నా
  కరణము వద్ద"నుచు జెప్పు కాలము వచ్చెన్
  ***)()(***
  అరణము = కట్నము (వరకట్నము)

  రిప్లయితొలగించండి
 27. పర సంస్కృతి మరగిన నొక
  వర గుణ సత్సంప్రదాయ వర్జితు నో ధీ
  వర! యిది యేల యనగ అను
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీకాంత్ గారూ,
   అనుకరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. అరకొరభాషను గలుగుట
  సరసముగా వ్రాయకాక చదువగ రాక
  న్నిరవున్గానిదియీవ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   వ్యాకరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. వర జన హిత నైతిక సం
  స్కరణము, సాలంకరణము, సంస్కృతమగు వ్యా
  కరణము,శుభ శుద్ధాంతః
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిటితోటి వారూ,
   నాలుగు కరణాలతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అన్నింటినీ ఒకే పద్యంలో అమర్చిన మీ ప్రతిభ అసామాన్యం! 💐💐💐

   తొలగించండి
  3. మాన్యులు చిటితోటివారూ! సంస్కరణము, అలంకరణము, వ్యాకరణము, అంతఃకరణము వద్దని చెప్పే కాలం వచ్చిందంటూ చేసిన మీ పూరణ మద్భుతంగా ఉన్నదండీ! అభినందనలు!

   తొలగించండి
  4. శ్రీ శంకరయ్య గారూ! సీతాదేవి గారూ! సుకవి మిత్రులు మధురకవి గారూ! ధన్యుడను. కృతజ్ఞతాంజలులు.

   తొలగించండి
 30. డా.ఎన్.వి.ఎన్.చారి
  పరిపరిమార్గముల్ గనుచు భారతదేశ ముజొచ్చి కౄరులై
  విరివిగజమ్ము కాశ్మిరుజవానుల పౌరుల జంపు చుండగా
  తరుణముజూచి వారల హతంబొ నరించ తురుష్క మూకలిం
  క,రణము వద్దు మాకనెడు కాలము వచ్చె !నిదేమివింతయో??

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   ఇంక రణము అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. కందం
  దొరికినఁ దాళిని మెడ నప
  హరించఁ గొన లాగివేయు నపహారకులున్
  దిరుగాడు చుండఁగ నలం
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   అలంకరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 32. అరణపు రోజులు పోగా
  భరణపు రోజులు మరింత భారీ యయ్యెన్
  తరగగ ఋణబంధము, అను
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్


  Dr H varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 33. అరయగ విచ్చల విడిగా
  పరిశ్రమలను నెలకొల్ప బంగరు భూముల్
  సరికాని రీతిని సమీ
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   సమీకరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంకరము' ఉన్నది. 'సంకరణము' అన్న పదం లేదు.

   తొలగించండి
 35. పరదేశపు పదములతో
  వరుసగ పలుపద్యములను వ్రాయుచు నిచ్చన్
  మరచి తెలుగు భాషను వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   వ్యాకరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 36. ధరణిని క్రొత్త పంటలవి తప్పక లాభమటంచు నెంచుచున్
  వరుసగనాటి పెట్టుబడి భారము మోయగలేక చిక్కుచున్
  మరణము నొందు చుండగను మాన్య కృషీవలులింక యాధునీ
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?

  రిప్లయితొలగించండి
 37. సరిగనుభూమి లెక్కలుసుసాధ్యముకాకయువారి పల్లెకున్
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో"
  యరకొరయైన యోచనను నచ్చటి పౌరుల జీవనంబహో
  యెరుగమునెట్టులుండునికయెవ్వరుజెప్పగలేరుగాభువిన్

  రిప్లయితొలగించండి
 38. మరణమ సంధుల దుస్సహ
  భరణము ద్రుతముల నిజమ్ము పతనమ తలఁచన్
  హరణమ స్వాతంత్ర్యము వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!


  సురుచిర విత్త సంచయ యశో విభవమ్ములు వేగ మాకు ని
  ద్ధరఁ గర మశ్రమమ్మున సతమ్ము వివృద్ధము నౌచు దేవ భా
  సురముగ వచ్చు పద్దతినిఁ జూడుమ స్వప్రతిభాతి శీతలీ
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   త్రిప్రాసతో మీ మొదటి పూరణ మనోహరంగా ఉన్నది.
   శీతలీకరణంతో మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది.
   అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి


 39. అరరే! ట్రంపూ కిమ్ముల
  సరసపు సంభాషణలకు సమయము వచ్చెన్!
  మరి వారిరువురు కలిసి యి
  క రణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   అమెరికా, కొరియాల యుద్ధభయం వీడిందన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
   అభినందనలు.

   తొలగించండి
 40. సమస్య :-
  "కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్"

  *కందము**

  నెరవేరని హామీలను
  వరములుగ నొసగి,నడిగెడు వారుందురనీ
  పురజనులందరిని సమీ
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్
  .................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   అభినందనలు.
   'ఒసగి యడిగెడు' అనండి.

   తొలగించండి
 41. వరముగపంట బండుననివారలు వీరలుజెప్పవెంటనే
  త్వరితమునందు రైతులటపంటలకుంచ?రసాయనాలనే
  జరిగినకల్తిమోసమని జాగృతియందునరైతుదెల్పె సం
  కరణమువద్దుమాకనెడి కాలమువచ్చెనిదేమివింతయో!

  రిప్లయితొలగించండి
 42. పరుగులు తీయించ ప్రజల
  నరయంగా పద్దె కవిత నడ్డుచు బోవ
  న్నఱకొఱ పదముల నిడి వ్యా
  కరణము వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   అభినందనలు.
   'పద్యకవిత' అనండి.

   తొలగించండి
 43. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  ----------------------------------------------------------------------------------------
  శ్రీ కృష్ణుడు కౌరవుల యొద్దకు రాయబారిగా వెళ్ళుటకు ముందు ,

  పాండవుల సంప్రదించు నట్టి తరుణము లో
  ----------------------------------------------------------------------------------------------------

  [ " కృష్ణా ! అన్న గారగు ధర్మజుని వాంఛానుసారము పాండవులకు

  కౌరవులకు సంధి గావింప యత్నింపుము . " అని పలుకు భీమునితో

  ముకుందుడు ఈవిధంగా అన్నాడు ]
  " కురుపతి పెందొడల్ విరుగ గొట్టెద సంగర మందు , లోక భీ

  కర మగు మద్గదాయుధ విఘాతముచే | సతి వస్త్రముల్ సభాం

  తరమున నూడ్చు నీచు c గదనంబున గూల్చి - పగిల్చి రొమ్ము - నె

  త్తురు గడుపార గ్రోలెదను | ద్రోవదికిన్ హరుసంబు గూర్తు " నంచు న

  ల్వురి యెదుటన్ బ్రతిఙ్ఞలను రువ్విన యట్టి వృకోదరుండె , యిం


  క రణము వద్దు మా కనెడు కాలము వచ్చె నదేమి చిత్రమో ! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
   అభినందనలు.
   నాల్గవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


   ----------------------------------------------------------------------------------------
   శ్రీ కృష్ణుడు కౌరవుల యొద్దకు రాయబారిగా వెళ్ళుటకు ముందు ,

   పాండవుల సంప్రదించు నట్టి తరుణము లో
   ----------------------------------------------------------------------------------------------------

   [ " కృష్ణా ! అన్న గారగు ధర్మజుని వాంఛానుసారము పాండవులకు

   కౌరవులకు సంధి గావింప యత్నింపుము . " అని పలుకు భీమునితో

   ముకుందుడు ఈవిధంగా అన్నాడు ]
   " కురుపతి పెందొడల్ విరుగ గొట్టెద సంగర మందు , లోక భీ

   కర మగు మద్గదాయుధ విఘాతముచే | సతి వస్త్రముల్ సభాం

   తరమున నూడ్చు నీచు c గదనంబున గూల్చి - పగిల్చి రొమ్ము - నె

   త్తురు గడుపార గ్రోలెదను , ద్రోవది హర్షము నొంద " నంచు న

   ల్వురి యెదుటన్ బ్రతిఙ్ఞలను రువ్విన యట్టి వృకోదరుండె , యిం


   క రణము వద్దు మా కనెడు కాలము వచ్చె నదేమి చిత్రమో ! !

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. గురువర్యులకు పదనమస్కృతులు , ధన్యవాదములు

   మీ ఆదేశానుసారము సవరించి వేరొక పద్యము పంపించాను .

   తొలగించండి
 44. అరకొర విజ్ఞాన ముతో
  పరుల ను దూషించు వైషమ్యమతు ల్
  పర దేశ సంస్కృతు ల కను
  కరణ ము వద్ద ను చు చెప్పు కాలము వచ్చె న్

  రిప్లయితొలగించండి
 45. వర శ్రోత్రియ సుతులు తమ యు
  దర పోషణము కొరకు ఘనత గల నమెరికా
  పురమున్ జేరగ నగ్నీ
  కరణము వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

  బ్రాహ్మణ కుటుంబములలో నిత్య అగ్నిహోత్ర కార్యము ప్రస్తుతం ఉద్యోగ రీత్యా జరుగదను భావన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   అభినందనలు.

   తొలగించండి
 46. అరయగ నైక్యముగ నిలచి
  విరోధి పార్టీని గెల్చి, వీడిన వారిన్
  నిరసించి పొత్తుల సమీ
  కరణము వద్దనుచు జెప్పు కాలము వచ్చెన్ !

  రిప్లయితొలగించండి
 47. ఆటవిడుపు పూరణ
  (సరదాగా)

  కరములు నాట్యమాడగ వికారపు పార్కినుసన్ను వ్యాధితో
  వరుసగ కోరలూడగ సవాలయి చావగ బొజ్జ నింపుటే
  భరతముపట్టు దారలు శుభమ్ముగ స్వర్గము జేరి పిల్వగా
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో :)

  కరణము = శరీరము
  భరతముపట్టు = ఎక్కువగా భోజనము చేయించు
  (ఆంధ్రభారతి నిఘంటు శోధన)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆట విడుపుపద్యముల స
   యాటగ వృత్తములలో వయనమొనరిచిరే !
   సాటి గలవారెవరయా
   మా టెంకణమిదియె మీకు మండలి వర్యా :)

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబి గారూ:

   నేనీ శంకరాభరణ సర్కసులో బఫూనుని కదా!

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ సరదాగా ఉన్నది.
   అభినందనలు.

   తొలగించండి
 48. ఎరుగ రుడు యోగ తిథులను
  మరిచిరి పంచాంగ గణన మక్కువ లేకన్
  సరియగు వారము చాలును
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  రిప్లయితొలగించండి
 49. .నిరసించిరాధునికులువ్యా
  కరణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్
  అరయగ నదిలేకున్నను
  సరగున విరచించవచ్చు చక్కగ కవితల్.

  2.చరవాణిని వీడక జనులు
  కరమున సతతమ్ము నుంచి కవితలనల్లన్
  చరణములందిక నేవ్యా
  కరణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

  3.తరుణీమణులట సొమ్ములు
  ధరియించి నడుచుచు నుండ తస్కరులచటన్
  కిరికిరి చేయజనులలం
  కరణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్.

  4.బరువయ్యెను మదిబావా
  తరుణము కాదిపుడు పోర ధరలో వినుమా
  సరిగాదీకార్యము వలది
  క రణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

  5.ధరలో దొంగల బెడదయు
  కరమధికంబయ్యెను గను కాసుల పేరుల్
  సరములు మొదలైన యలం
  కరణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్

  6.కరువయ్యె మాతృభాషకు
  మరియాదయు వసుధలోన మానిరి ఛందో
  పరమగు పద్యము లిక వ్యా
  కరణము , వద్దనుచు చెప్పు కాలము వచ్చెన్.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ ఆరు పూరణలు బాగున్నవి.
   అభినందనలు.
   రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 50. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  ---------------------------------------------------------------------------------
  నేటి స్త్రీలు చాలా మంది పాశ్చాత్య నాగరికత ననుకరించి

  వెండ్రుకలు విరియబోసుకొని తిరుగుతూ ఉన్నారు .

  పై విషయాన్ని ఖండిస్తూ వ్రాస్తున్న పద్యము

  ------------------------------------------------------------------------------------------


  కురులను చక్కగా ముడిచి కొప్పును వేసియొ , లేదయేని సం

  వరముగ చక్కగా నలరు వాల్జడ వేసియొ , మల్లెపూలు దా

  ల్చరు గద | నేటి యింతులు పిశాచిక లట్టుల , దీర్ఘ కేశముల్

  బరువుగ నా కపోలములపైన నసహ్యపు రీతి వ్రేలగన్

  తిరుగుచు నుంద్రు ఫ్యాష నని | స్త్రీ లిక కొందరు మంచిదౌ యలం

  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి చిత్రమో


  { సంవరముగ = సంబరముగ ; వ్రేలగా = వ్రేలాడగా ;

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 51. *9-5-18*
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  సందర్భము: గురు శిష్యుల
  సంభాషణం
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "సరి లేదు నేను వ్రాసినఁ
  దరి, సూటిదనంబు చాలదా కైత! " కనన్
  "సరె! మంచిది" యంటిని.. వ్యా
  కరణము వ ద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  2 వ పూరణము..

  సందర్భము: శ్రీ ఊర ఈశ్వర్ రెడ్డి గారి
  ప్రేరణతో..
  పద్యం వ్రాయడానికి ఓపిక చాలని వాని మాట
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "చరవాణి బ్రదుకు లాయెను..
  తరమా పద్యంబు వ్రాయ! తాత లపుడు వ్రా
  సిరి,యది చాలుఁ గదా! వ్యా
  కరణము వ ద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్"

  3 వ పూరణము..

  సందర్భము: సులభము.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  వరమైన ముహూర్తమునకు
  నరు డిల తిథి వారములను నక్షత్రములన్
  సరిగాఁ జూచును; యోగము
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  4 వ పూరణము..

  సందర్భము: హోరా హోరీ కవిత్వం
  వ్రాసే ఒకానొక వీర కవి ఉవాచ...👇🏻
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "బరబర తోచినదే పే
  పరుపై కెక్కించు టదియె వర కవనము; వ్యా
  కరణము, ఛందస్సు, నలం
  కరణము వ"
  ద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  5 వ పూరణము..

  సందర్భము: వీర కవుల హోరులో
  ఇదీ ఒక తీర్పు...👇🏻
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "సరి లేదు మా కవితలకు
  మరి! చర చర గిలుకు టొకటె
  మా నైజము, వ్యా
  కరణము గీకరణ మలం
  కరణము వ" ద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ ఐదు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 52. కరువును కాదని జనుల కావ దేవళములు
  కట్టిరి రాజులు
  ఉపాధికిదె మా హామి యనుచు పనులనిచ్చిన
  నేటి రోజులు
  నాటికి నేటికి కలరన ఒడలు వొంచక
  తామిసుమంతయో
  కరణము వద్దు మాకనెడు కాలము వచ్చె
  నిదేమి వింతయో

  రిప్లయితొలగించండి
 53. అరుదగు ఛందస్సు నెరిగి
  పరమాద్భుత మైన రీతి భావము దెలుపఁన్
  వరమగు పద్యములకు వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  కరువయ్యెను పద్య రచన
  లరకొరగా నాంధ్ర మందు ; నది యెరుగ దగున్
  చురకత్తిగ సాగెడి వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  అరసున్నలు లేకున్నను
  నరకొరగా నచ్చులున్న నది నేరమనన్
  మరణించును పద్యము వ్యా
  కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పలు దుష్కృతములు సలిపెడి.
  ఖలులగుణములను తమదగు ఘనకైతలలో
  తెలుపగ రాదని దలచెడి
  కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 54. అరయగ నాంగ్ల మాధ్యమమె యద్భుత మంచును మూర్ఖులెల్లరున్
  మురియుచు తెల్గుభాష యిక మూఢులకంచు తలంచి నేడిలన్
  భరమని తల్చిరే జనులు పద్యములన్నను, సాంప్రదాయ వ్యా
  కరణము వద్దు మాకనెడు కాలము వచ్చెనదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 55. చంపకమాల
  అరయఁగ నిత్యమున్ గణన యంత్ర ప్రపూరిత కార్యశాలలన్
  దిరిగుటె కాక వారి యొడిఁ దీరఁగ నెక్క ప్రకాశ తీవ్రతన్
  బెరుగఁగ నప్రజాసులును బెంగపడంగ ప్రజాళి క్షోభఁ ద
  త్కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో!

  రిప్లయితొలగించండి
 56. ధరలవి మిన్ను దాకుచును తారల నంటగ మానవాళికిన్
  భరమయె నిత్యజీవనము ప్రాలును తైలము కూరగాయలున్
  గరువగు రోజులందు నెల కాంచనమంచును కోరునో, యలం
  కరణము వద్దు మాకనెడు కాలము వచ్చెనదేమి వింతయో.

  రిప్లయితొలగించండి
 57. నిరతము ఎన్నిక లిచ్చట
  విరివిగ ఛానళ్ళువేయి విసుగును గొల్పన్,
  పురజనులీయెడను సమీ
  కరణము వద్దనుచు జెప్పుకాలమువచ్చెన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 58. సరసము లాడ మా కసలు చాలదు కాలము పిల్లపాపలన్
  విరసము లేక పెంచ గల వేడుకయున్ మరి నాస్తి యెందుకీ
  పరిణయ మింక పోరు గద బాధ కుటుంబము లన్న వద్దుగా
  క రణము వద్దు మాకనెడు కాలము వచ్చె నదేమి వింతయో.

  రిప్లయితొలగించండి
 59. పరవస్తువారిమాటలు వరములుచక్కనిపలుకులుపలుకగనేర్వన్ దరవగతమతులగుచువ్యా కరణమువద్దనుచుజెప్పుకాలమువచ్చెన్. ఆచార్యలక్ష్మణ పెద్దింటి యానాం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మణాచార్యులు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం అర్థం కాలేదు.

   తొలగించండి
 60. మరచి విభక్తి జాబితలు మారణ హోమపు సంధి సూత్రముల్
  కరచెడి యర్ధ సున్నలును క్త్వార్థక బాధలు తాళజాలకే
  పరుగులు బెట్టి పారుచును బాలురు చిన్నయ సూరి బాలవ్యా
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో

  రిప్లయితొలగించండి