ఏ నాలుగు రెండైనవో? సరిగా అన్వయించలేదనిపిస్తున్నదండీ పిట్టావారూ! అక్కడ ముగ్గురు నారులున్నారు. హరి ఒక్కడున్నాడు. మీరు రెండు జంటలన్నారు. కృష్ణుడు రెండుగా మారాడా, మూడుగానా? అంతా సందిగ్ధంగా ఉన్నట్టనిపిస్తున్నది. వివరించగలరు.
పిట్టావారూ! చతుర్వర్ణాలలోనూ ఉన్నది రెండే మంచివారూ, చెడ్డవారూనూ అనే మీ భావన చాలా బాగున్నది. కాని, మీరనుకున్నది చతుర్వర్ణాలు. వ్రాసింది ఆరుగురిని. చౌర్యులు, శ్రామికుల్- ఇవి చతుర్విధ వర్ణాలలో లేవే! ఈ రెంటిని పరిహరిస్తే సరిపోతుంది.
ఆ నాలుగు వేదాలు రెండుకథలుగా వచ్చినవి... రెండింటిలోను నల్లనివాడే....
శ్రీ లలనా మనోహర విశేషవిరాజిత దివ్య వేదముల్ నాలుగు , వాటి సారము గనన్ రచియించిరి మౌనులిద్దరీ కాలమునందు రామకథగా మరి భారతగాధగా ! కవీ ! నాలుగు రెండునయ్యెనట ! నల్లనివానికదేమి చిత్రమో !!
మన్నించండి సీతారామయ్యగారూ! మొబైలులో మీపేరును సరిగానే టైపుచేశాను. కాని, ఆటో కరెక్షన్ ఆన్ లో ఉండడంవల్ల సీతాదేవి అని సెలెక్టు చేసుకున్నది. ఇప్పుడు ఆఫ్ చేశాను. మునుముందు ఇలాంటి పొరపాటు జరుగదు.
అదేమైనా పెద్ద తప్పా! మన్నించమంటున్నారు! 🙏🏽 అయినా పెద్దల పొరపాట్లు పిన్నలకు మంచే చేస్తాయి. నా సీనియరు స్థాయికి ఎత్తేశారు. నాల్గు రెండయిన రోజున ద్వంద్వం ఏకపదమైంది.అంతేగా🙏🏽
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2667 సమస్య :: నాలుగు రెండు నయ్యె నట నల్లనివాని కదేమి చిత్రమో ? నాలుగు రెండుగా మారింది ఆ నల్లనయ్యకి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: శ్రీ కృష్ణ భగవానుని క్రమంగా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, సూర్యపుత్రి (కాళింది), లక్షణ వివాహమాడినారు. వారు ఒకప్పుడు ఇద్దరుగా నలుగురుగా ఇద్దరుగా కలసి శ్రీ కృష్ణుని చుట్టూ చేరినారు. ఆ సమయంలో ఆ నల్లని వానికి ఎన్ని వివాహాలయ్యాయి ? అని ఒక చెలికత్తె అడుగగా మరొక చెలికత్తె వారి నందఱినీ చూస్తూ *రెండు నాలుగు రెండు* (మొత్తం ఎనిమిది) వివాహాలయ్యాయి అని లెక్క చెప్పే సందర్భం.
నాలుగు కాళ్ళపై నడిచెనంట నృసింహుని వేళనందహో! చాలని మూటిపై నిలిచె చక్కని రాముని కాలమందహా! కాలము మారిపోయెగద! కంసుని ద్వాపర మందునన్ భళా! నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో :)
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నృసింహుడుగా క్రింది భాగం మానవ రూపమే కనుక రెండు కాళ్ళతోనే నడిచి ఉంటాడు. అక్కడ 'వరాహుని వేళ' అంటే సరిపోతుందనుకుంటాను. ఇక రాముడుగా 'మూటిపై' నడవడం అర్థం కాలేదు.
జిలేబిగారూ! ఇప్పుడే ఐడియా తట్టింది! మీకు లెక్కేంటి! వాయించండి! డిస్కౌంట్ సేల్ లో ఒకటికి ఒకటి ఫ్రీ అని నాలుగు చీరలు కొంటే ఉతకగానే అవి రెండైనాయని వ్రాసెయ్యండి! మీరు బేల కానడం మీ అభిమానులకు నచ్చదు! 😊😊😊
చాలిది వింతయా! నలుపు చాయలవానికి లెక్కలందునన్ నాలుగు సంఖ్యకున్ మరల నాలుగు కూడగ నెన్మిదయ్యెడిన్, నాలుగుతో మరొక్క గణనమ్మున, నారున తీసివేతలో నాలుగు రెండునయ్యెనట నల్లనివానిక, దేమిచిత్రమో!
నాల్గు చేతుల నారాయణయ్య గారు
రిప్లయితొలగించండిద్వాపర యుగము నందవతారమెత్తి
దేవకీ నందనుండాయె దివిని వీడ...
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర!
నారాయణయ్య 👉 నల్లనయ్య
నాల్గు చేతులు రెండైనవను మీ పూరణ అద్భుతంగా ఉన్నదండీ! అభినందనలు!
తొలగించండి🙏🙏🙏
తొలగించండిరెండు మనసులు కలసిన నిండు ప్రేమ
రిప్లయితొలగించండిరాధ నొడిజేరి మురియగ రాస లీల
నాల్గు రెండయ్యె నట నల్లనయ్య కౌర
ఎంత సోయగ మనగనీ వింత గనుమ
నాలుగు రెండైన వనుటకు అన్వయ మేది, అక్కయ్యగారూ! రెండు మనసు లొకటై, నాల్గు కన్నులు రెండయ్యాయంటే కుదురుతుందేమో?
తొలగించండిRajeshwari Nedunuri రెండు మనసులు కలసిన నిండు ప్రేమ
తొలగించండిరాధ నొడిజేరి మురియగ రాస లీల
కనులు కన్నులు కలసిన కవన మలరె
నాల్గు రెండయ్యె నట నల్లనయ్య కౌర
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినారి నారకి హరికిని నారిమధ్య
కృష్ణుడొక్కడే, జంటలు గిట్టె రెండె
అన్యులకు సాధ్యమే లీల లందు నిందు?
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర!
ఏ నాలుగు రెండైనవో? సరిగా అన్వయించలేదనిపిస్తున్నదండీ పిట్టావారూ! అక్కడ ముగ్గురు నారులున్నారు. హరి ఒక్కడున్నాడు. మీరు రెండు జంటలన్నారు. కృష్ణుడు రెండుగా మారాడా, మూడుగానా? అంతా సందిగ్ధంగా ఉన్నట్టనిపిస్తున్నది. వివరించగలరు.
తొలగించండిడా.పిట్టానుండి
తొలగించండిఆర్యా
కృ*నా;కృ*నా,2జంటలు. కృ common, ఇదే కృ లీల,నారీ నారీ నడుమ మురారి ,హరికీ నరికీ నడుమవయ్యారి, తానొకడైనా తలకొక రూపై నటనలు చూపే రాధా మాధవ కేళీ నటనా....అనే పాట గుర్తుకు వచ్చి......
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా
కృ*నా;కృ*నా,2జంటలు. కృ common, ఇదే కృ లీల,నారీ నారీ నడుమ మురారి ,హరికీ నరికీ నడుమవయ్యారి, తానొకడైనా తలకొక రూపై నటనలు చూపే రాధా మాధవ కేళీ నటనా....అనే పాట గుర్తుకు వచ్చి......
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచాలుకు బ్రహ్మ క్షత్రియుల చౌర్యులు వైశ్యులు శూద్ర శ్రామికుల్
ఏలిక యొక్కడౌ తరుణ,మిప్పుడు కాదది రాజులెల్లరున్
పోలిక సాధులౌ నరులు పుట్టు కుబుద్ధులు రెండు జాతులే!
నాలుగు రెండు నయ్యెనట నల్లని వాని కదేమి చిత్రమో!
పిట్టావారూ!
తొలగించండిచతుర్వర్ణాలలోనూ ఉన్నది రెండే మంచివారూ, చెడ్డవారూనూ అనే మీ భావన చాలా బాగున్నది. కాని,
మీరనుకున్నది చతుర్వర్ణాలు. వ్రాసింది ఆరుగురిని. చౌర్యులు, శ్రామికుల్- ఇవి చతుర్విధ వర్ణాలలో లేవే! ఈ రెంటిని పరిహరిస్తే సరిపోతుంది.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా,
చౌర్యమెరుగని వైశ్యులు, శ్రమ, శుశ్రూశలకై నిర్దేశిచ బడిన శూద్రులు ఈ4వర్ణాలే . కామాలతో వేరుగా సూచించలేదు.
మేలగుచూపులన్ పుడమిమీదకు మానవరూపుడై మహా
రిప్లయితొలగించండిహేలగ వచ్చినాడు గద నెంచగ విష్ణుడు దైత్యసంహతిన్
మూలము నూచముట్టుగను మోడుగ జేయగనెంచి ; హస్తముల్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో!
బాపూజీగారూ!
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నదండీ! అభినందనలు!
మూడో పాదంలో చివర .. చేయగ, శ్రీశు హస్తముల్...అంటే ఇంకా బాగుంటుందనిపిస్తున్నది.
మీ సూచన ఔచిత్యవంతంగా ఉన్నదండీ ! ధన్యవాదాలు .
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి1)రామాయణము వేదమే....
*వేదః* ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా !
2) భారతము పంచమ *వేదమే* !
ఆ నాలుగు వేదాలు రెండుకథలుగా వచ్చినవి...
రెండింటిలోను నల్లనివాడే....
శ్రీ లలనా మనోహర విశేషవిరాజిత దివ్య వేదముల్
నాలుగు , వాటి సారము గనన్ రచియించిరి మౌనులిద్దరీ
కాలమునందు రామకథగా మరి భారతగాధగా ! కవీ !
నాలుగు రెండునయ్యెనట ! నల్లనివానికదేమి చిత్రమో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపువారూ!
తొలగించండిఅత్యద్భుతమైన పూరణ! అభినందనలు!
ఉట్టిపై నాల్గుకుండలనున్న వెన్న
తొలగించండిదొంగిలింపగ మిత్రుని తోడుగఁ గొని,
యందుకొన జారి , విచ్ఛిన్నమయ్యె రెండు !
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆర్యా,
మొదటి పూ.లో నారకి టైపాటు నారికి గా చదువప్రార్థన.
నాల్గుకాళ్ళపై ధర్మమునడువ నొప్పు
రిప్లయితొలగించండివెల్లువైపారె కృష్ణుని విషయమందు
తాను నడిచినదంతయు ధర్మమవగ
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
సీతాదేవి గారూ!
తొలగించండిచాలా బాగున్నదండీ మీ పూరణ. అభినందనలు!
😃🙏🏽
తొలగించండి😃
తొలగించండిపేరు మార్చేశారు. సీతాదేవి గారి ముందు నేనెంత
అయ్యో భలేవారే! నేనింకా విద్యార్ధినేనండీ!
తొలగించండికొంచెం సీనియర్ విద్యార్ధి, అంతే!😊😊🙏🙏
మన్నించండి సీతారామయ్యగారూ! మొబైలులో మీపేరును సరిగానే టైపుచేశాను. కాని, ఆటో కరెక్షన్ ఆన్ లో ఉండడంవల్ల సీతాదేవి అని సెలెక్టు చేసుకున్నది. ఇప్పుడు ఆఫ్ చేశాను. మునుముందు ఇలాంటి పొరపాటు జరుగదు.
తొలగించండిఅదేమైనా పెద్ద తప్పా! మన్నించమంటున్నారు! 🙏🏽
తొలగించండిఅయినా పెద్దల పొరపాట్లు పిన్నలకు మంచే చేస్తాయి. నా సీనియరు స్థాయికి ఎత్తేశారు. నాల్గు రెండయిన రోజున ద్వంద్వం ఏకపదమైంది.అంతేగా🙏🏽
రిప్లయితొలగించండిమూల మయ్యెనాతండట ముద్దు గుమ్మ
లెల్ల పెండ్లి చేసుకొనంగ లెస్స గాను
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
భార్య లున్ను వేణువునూద పాటి గాను !
జిలేబి
జిలేబీ గారూ!
తొలగించండినాలుగు రెండైనవను భావనను వివరించగలరు. నాలుగునకు అన్వయం? రెంటికి అన్వయం? తెలుపగలరు.
తొలగించండినాలుగు * రెండు - ఎనిమిది భార్యలు
అందులో యిద్దరు రుక్మిణి సత్యభామ పాపులర్ అన్న అర్థంలో రాసే నండి సరి యే నంటారా?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండి'నాల్గు రెండ్లయ్యెనట..' అన్నపుడే మీ భావానికి సరిపోతుంది. కాని ఇక్కడ "నాల్గు రెండయ్యె"నని ఉన్నది.
ఉడికించకిక కనిపించుమోయనె రాధ తాను
రిప్లయితొలగించండిమూతి ముడిచి
దాగితి నీలో బయటికెట్లు వత్తుననె రాధ
వెంట నడిచి
వేణు నాదమున తానై కరుగ సఖియకెంతటి
ఆత్రమో
నాలుగు రెండు నయ్యెనట నల్లని వాని
కదేమి చిత్రమో
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిక్రాలుచు శ్రీధరుం డొకఁడె, కమ్రత రాముఁడు భ్రాతృయుక్తుఁడై
నాలుఁగు రూపుల న్వెలసె; నాలుఁగు రెండయె రామకృష్ణులై;
మేలములాడుచు న్రమయె మిక్కిలిగా హసియించి పల్కె నా
"నాలుగు రెండు నయ్యెనఁట నల్లనివాని కదేమి చిత్రమో!"
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2667
సమస్య :: నాలుగు రెండు నయ్యె నట నల్లనివాని కదేమి చిత్రమో ?
నాలుగు రెండుగా మారింది ఆ నల్లనయ్యకి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శ్రీ కృష్ణ భగవానుని క్రమంగా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, సూర్యపుత్రి (కాళింది), లక్షణ వివాహమాడినారు. వారు ఒకప్పుడు ఇద్దరుగా నలుగురుగా ఇద్దరుగా కలసి శ్రీ కృష్ణుని చుట్టూ చేరినారు. ఆ సమయంలో ఆ నల్లని వానికి ఎన్ని వివాహాలయ్యాయి ? అని ఒక చెలికత్తె అడుగగా మరొక చెలికత్తె వారి నందఱినీ చూస్తూ *రెండు నాలుగు రెండు* (మొత్తం ఎనిమిది) వివాహాలయ్యాయి అని లెక్క చెప్పే సందర్భం.
హేలగ బెండ్లియాడి రట కృష్ణుని రుక్మిణి, సత్యభామయున్,
లాలిత లౌచు జాంబవతి, లక్షణ, భద్రయు, మిత్రవిందయున్ ;
లీలగ తాను నాగ్నజితి, ప్రీతిగ నెన్నగ సూర్యపుత్రియున్.
వైళమ బల్కె నొక్కతె వివాహములన్ గణియించి, రెండగున్
*నాలుగు, రెండు, నయ్యె నట నల్లనివాని కదేమి చిత్రమో?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (3-5-2018)
(శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలతో)
తొలగించండిఅద్భుతంగా ఉన్నదండీ మీ భావన! అభినందనలు!
తొలగించండిసహృదయులు శ్రీ మధుసూదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తొలగించండినాలుగు లకార కట్నమే నాకునిండు
రిప్లయితొలగించండిసుందర సుగుణ నాముడు సుదతి కోరి
రంగు నలుపు మదితెలుపు రంగు చూడ
"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"
వరలక్ష్మి గారూ,
తొలగించండివరుడు నల్లగా ఉండటం వల్ల నాలుగు లక్షల కట్నం రెండు లక్షలయిందా? బాగుంది మీ పూరణ అభినందనలు. కొంత అన్వయదోషం ఉంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారికి కృతజ్ఞతలతో
తొలగించండిసగుణ బ్రహ్మగ విష్ణువే దిగెను భువికి
నాల్గు వేదంబులే గాగ నాల్గుకేలు
సూర్యచంద్రులే తన రెండు చూపులుగను
నాల్గు రెండయ్యనట నల్లనయ్య కౌర!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"
తే.గీ*
చిన్ని కృష్ణుడింటను జేరి చిక్కనైన
పాల కుండల నున్నట్టి పాలు త్రాగి
నిండు కుండలు రెండేనని పలికెనట
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బెదురు చూపులతో రుక్మిణి యెదురు చూచె
రిప్లయితొలగించండివిభుని రాక కొఱకు తాను వేయి కనుల
కడకు వచ్చెను నయనాలు కలుసు కొనగ
"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'బెదరు చూపుల రుక్మిణి/ బెదురు కనులతో రుక్మిణి' అనండి.
కృష్ణావతారం లో శంఖ చక్రాలనే కదా ఉపయోగించుకున్నది
రిప్లయితొలగించండిహస్త భూషణములు నాల్గు హరికి యేవి
శంఖము గదయు పద్మము చక్రములవి
వాడె కృష్ణుండుగా దానె వాడె రెండె
"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"
వాడె = అతడె
వాడె = ఉపయోగించెను
(సందేహ నివృత్తి గావించిన మైలవరపువారికి ధన్యవాదములతో 🙏🏻)
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హరికి నేవి' అనండి.
విశ్వ రూప ము జూపి oచె వె ఱ పు పుట్ట
రిప్లయితొలగించండికౌరవ సభ లో కృష్ణుడు కాంక్ష దీరి
నంత నుప సంహర ణ మైన హస్త ము ల గు
నాల్గు రెండ య్యే నట నల్ల నయ్య కౌ ర
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రథ,గజ,తురగ,పదాతులను నాలుగింటిలో రథ,తురగములు రెండే ఉన్నవని చెప్పు సందర్భం
రిప్లయితొలగించండిమ్రోలను భీష్మ,కర్ణుల,విరోధి గణంబులఁజూచి పార్థుడున్
లీలగ,బావ!తోలు మవలీలగ జోరుగ నన్న,కృష్ణుడున్
తోలె రథంబు,నశ్వ బలదుల్ తమకండగ నుం డ-నప్పుడున్
నాలుగు రెండునయ్య నట నల్లనివాని కదేమి చిత్రమో!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బలదుల్'...?
అశ్వములు తోడుగ నీడగ సుండ నప్పుడున్ అని 3వ పాదంలో మార్చాను సరిపోయిందనుకుంటాను
తొలగించండిరెండు నయ్యె నట అని చదువ ప్రార్ధన
రిప్లయితొలగించండిద్వైతమే లేదు, నెల్ల నద్వైత మనియె!
రిప్లయితొలగించండినరుడు పరమాత్మ యొకటైన నాల్గు కనులు
నాలుగు కరములును కాళ్ళు నాలుగేల
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గు రెండయ్యె నట నల్ల నయ్యకౌర
రిప్లయితొలగించండినల్లనయ్యకే కాదార్య! నరులకెల్ల
గలియు తరుణాన నగునట కరము లవియ
యిరువు రివియగు నాలుగు రెండు గాను
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నల్లనయ్య=నల్లగనుండు నొక వ్యక్తి
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిష్ణు మూర్తి చతుర్భుజ విలసితుండు
తొలగించండిదుష్ట శిక్షణకును మఱి శిష్ట రక్ష
ణకు నవతరించగ భువిఁ గర కమలములు
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
ఆలినిఁ బంపె వేఁడ విరహమ్మును సైఁచుచుఁ బుట్టినింటికిన్
జాలిగ వేచు చున్నను నిజప్రియ గేహిని రాక కోసమై
కాలము నిల్చె నేమొ మఱి కానఁడు మాసము లంత నెంచగన్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో
[నాలుగు రెండున్ = ఆరు]
👏👏👏
తొలగించండి"తెల్లనివానికి" కూడా ? :)
ఎల్లరికిని విరహములో!😊😊😊🙏🙏🙏
తొలగించండిఅవునండి తెల్ల వారితో సహా భార్యానురక్తుల కెల్లరకును.
తొలగించండిఇక్కడొక్క విశేషమున్నది. గమనించండి.
అయ్యెను- అటన్ - అల్లని వానికి ;
అల్లని వాడు = కబు ర్లల్లని వాడు, నిజము చెప్పు వాడు.
అల్లు = లేనివి కల్పించు.
🙏🙏🙏🙏
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
రెండవ పూరణలోని విశేషార్థం మీరు చెప్తేనే తెలిసింది సుమా!
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిపద్మనాభుడు జనియించి వసుధ పైన
రిప్లయితొలగించండికృష్ణుడను నామమునతాను కీర్తి బొందె
ద్వాపరయుగముఁ గరములు, వత్స వినుము
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో"
రిప్లయితొలగించండినాలుగు వేదము ల్ధరణి నమ్ముము రెండుగ మారెనేగదా
వీలుగ బాఠకుల్జదువవేమరు సారులు భారతమ్ము నన్
లాలిత సోయగంబయిన రాముని బాల్యము, వీరగాధలన్
గేలమువేయగా దెలిసె గృష్ణుడు రెండిట నుండెనేయనిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గేలము'...? 'అనిన్' అంతే యుద్ధంలో అన్న అర్థం వస్తుంది.
ధర్మము:
రిప్లయితొలగించండినాలుగు కాళ్ళపై నడిచెనంట నృసింహుని వేళనందహో!
చాలని మూటిపై నిలిచె చక్కని రాముని కాలమందహా!
కాలము మారిపోయెగద! కంసుని ద్వాపర మందునన్ భళా!
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నృసింహుడుగా క్రింది భాగం మానవ రూపమే కనుక రెండు కాళ్ళతోనే నడిచి ఉంటాడు. అక్కడ 'వరాహుని వేళ' అంటే సరిపోతుందనుకుంటాను. ఇక రాముడుగా 'మూటిపై' నడవడం అర్థం కాలేదు.
సార్!
తొలగించండిఇవి ధర్మానికి గల కాళ్ళు. కృతయుగములో నాలుగు కాళ్ళపై, త్రేతాయుగమున మూడు కాళ్ళపై, ద్వాపరయుగమున రెండు కాళ్ళపై ధర్మం నడుస్తుందని నానుడి.
https://m.facebook.com/story.php?story_fbid=801104413409335&id=335025213350593
రిప్లయితొలగించండిభువనములు పదునాల్గు విభునికటంచు
చెప్పుదురట! నీరేడుల చేవడి పదు
నాల్గు రెండయ్యెనట! నల్లనయ్య కౌర
లెక్క లెన్నిగలవయ జిలేబులూర !
హమ్నయ్య
ప్యాసా ఫెయిలా ?
జిలేబి
కవితా ప్యాసా! (హిందీ ప్యాసా) 😊😊😊
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యకవి మిత్రులకు శుభోదయం.
రిప్లయితొలగించండినా పూరణ
వామనావతారుడగుచు బలిని హరియె
వేడి మూడడుగుల నేల వేడ్కమీర
పాదముల గొల్చువేళ భువనములు పదు
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర!
సింహాద్రి జ్యోతిర్మయి
3.5.2018
జ్యోతిర్మయి గారి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండినాల్గుపాదాల ధర్మమున్ నడుప నెంచు
విగ్రహమె రాముఁ డంచును విబుధులనఁగ
బ్రహ్మ కడిగిన పాదాలు ప్రబలమగుచు
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఇవ్వాళ బుర్ర మరీ మొరాయిస్తోంది జవాబు రాలే !:)
బేలనయా !జిలేబినయ ! బెట్టుగ పట్టుగ చూచితిన్ జవా
బేలనకో సలీసుగను బెంగలిడంగను తట్టలేదయా!
జాలము "గూగిలించితి"! సజావుగ తేలక పోయెనెట్లనో
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో?
జిలేబి
జిలేబిగారూ! ఇప్పుడే ఐడియా తట్టింది! మీకు లెక్కేంటి! వాయించండి!
తొలగించండిడిస్కౌంట్ సేల్ లో ఒకటికి ఒకటి ఫ్రీ అని నాలుగు చీరలు కొంటే ఉతకగానే అవి రెండైనాయని వ్రాసెయ్యండి!
మీరు బేల కానడం మీ అభిమానులకు నచ్చదు! 😊😊😊
సేలున జౌకగ దొరికెను
తొలగించండిచేలములొకటికిని రెండు చిత్రమదేమో
స్కేలున కొలువగ నయ్యో
నాలుగు రెండాయెనుగద నల్లని పిల్లా!
జీలేబీ గారూ,
తొలగించండిమీ అశక్తతను తెలియజేస్తున్న పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సీతాదేవి గారూ,
మీ సలహా, దాని ననుసరించి వ్రాసిన పద్యం బాగున్నవి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిఎన్ని ముఖములు బ్రహ్మకు నెంచి జూడ ?;
రిప్లయితొలగించండిచీల్చ భీమ సేనుడు నాడు చేది రాజు;
వింత! భార్యలు పదియారు వేల మంది;
నాల్గు ; రెండయ్యెనట ; నల్లనయ్య కౌర !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
ఈరోజు క్రమాలంకార పూరణ చేసింది మీరొక్కరే అనుకుంటాను.
ధర్మ సంస్థాప నార్థమై ద్వాపరమున విష్ణు వవతరించెను గదా కృష్ణుని గను హరిగ నతడికి గల్గిన కరములు గన "నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర" (భావన బ్లాగు నుండి కాపీ కొట్టబడినది.బ్లాగుకు ధన్యవాదాలతో)
రిప్లయితొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండికాపీ కొట్టిన భావన అయినా దాని పద్యానుకృతి ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రోలయ నల్లరాజనెడు భూరి ధనాఢ్యుని యర్థభాగమౌ
రిప్లయితొలగించండియాలియె చాటుగాను తన యన్నకు నిచ్చెను దొంగబుద్ధితో
వేలకు వేలు దీసి, పతి విత్తము లెక్కను జూడగా నటన్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో.
శంఖు వాదుల ధరియించు చక్రధారి
రిప్లయితొలగించండిభువిని రక్షింప కృష్ణుడై పుట్టె గాదె
మురళి పింఛమ్ము కలిగిన హరిని గాంచ
నాల్గు రెండయ్యె నట నల్ల నయ్య కౌర
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికాలము నల్లనై జనుల కాంక్షలు మోహము పెచ్చరిల్లగా
వీలుగ కార్యసాధనకు వేయుచు వేషము లెన్నొతీరులన్
చాలుగ నర్ధకామములు చక్కగ జీవిత
పూరుషార్ధమన్
నాలుగు రెండు నయ్యెనట నల్లని వాని కదేమి చిత్రమో!
నల్లని కాలము = కలికాలము
చతుర్విధ పురుషార్ధములలో ధర్మమోక్షములు లుప్తమై అర్ధకామాలే మిగిలాయి!
నల్లని వాడు కలిపురుషుడు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి! 🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండితే.గీ.
భామిని ప్రియ సఖియ సత్యభామ గూడి
వెడలె నరకాసురుని కృష్ణు డడుచ దలచి
పోరున యశోద నందుడు మూర్ఛ బోయె
సత్య రెండు కేలుల శరాసనము బట్టి
దనుజు నరకుని కడతేర్చి ఘనతికెక్కె
తుదకు కరములు గణియించ దెలియవచ్చె
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలిది వింతయా! నలుపు చాయలవానికి లెక్కలందునన్
రిప్లయితొలగించండినాలుగు సంఖ్యకున్ మరల నాలుగు కూడగ నెన్మిదయ్యెడిన్,
నాలుగుతో మరొక్క గణనమ్మున, నారున తీసివేతలో
నాలుగు రెండునయ్యెనట నల్లనివానిక, దేమిచిత్రమో!
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేటి భక్తి!
రిప్లయితొలగించండిఉత్పలమాల
వేలకు వేలు డబ్బు తను పేకల నాడఁగఁ గూడినంతటన్
వాలెను గృష్ణునిన్ గొలువ పళ్లునుఁ బూలును నారికేళముల్
మ్రోలను సుప్రసాదములు! రూప్యము లెల్లను బోయినంతటన్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో!!
సహదేవుడు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅదురహహో సీతాదేవి గారికే అంకితం! మా నల్ల నయ్య కృష్ణస్వామి అయ్యరు గారి జేబులు ఖాళి!
సేలు! జిలేబి సేలనుచు సీతయు చెప్ప తురంగవేగమై
నేలను తాకకన్ వెడలి నేర్పరి గా నుచితంబు నాల్గుకు
న్నాలుగ నన్కొ నన్నుతుక నాఱగ సేలలు గోలుమాలయే
నాలుగు రెండు నయ్యెనట!నల్లనివాని కదేమి చిత్రమో,
బేల, జిలేబి పెన్మిటికి, పెక్కుగ జేబులు ఖాళియయ్యెనే
జిలేబి
👌👌👌👌👍👍👍👍
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిహాస్యరసస్ఫోరకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాకకన్' అనరాదు. "తాకకే' అనండి.
కన్య పదహారు వన్నెలకళలుయున్న? ౧౬
రిప్లయితొలగించండిఅర్ద నారిగమారంగ నర్దమయ్యు ౮
సంతు గలుగంగ సగమాయె వింతసొగసు ౪
నాల్గు రెండయ్యె నట నల్లనయ్య కౌర! ౨
కాళ్లు నాల్గాయె ముదుసలి కన్నులట్లు! (వయసునందుమార్పులతో)
ఈశ్వరప్ప గారూ,
తొలగించండివయఃపరిణామక్రమంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కళలు+ఉన్న = కళలున్న' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "కళలు గలుగ" అనండి.
Rajeshwari Nedunuri రెండు మనసులు కలసిన నిండు ప్రేమ
రిప్లయితొలగించండిరాధ నొడిజేరి మురియగ రాస లీల
కనులు కన్నులు కలసిన కవన మలరె
నాల్గు రెండయ్యె నట నల్లనయ్య కౌర
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*3-4-18*
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
.. .. .. ..సమస్య
*"నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర"*
సందర్భము: శ్రీ కృష్ణుని జీవితం ఆదర్శ ప్రాయం. అతని జీవితాన్ని పరిశీలిస్తే చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను ఆ మహానుభావుడు ఎలా సమకూర్చుకోగలిగినాడో అర్థం చేసుకోవచ్చు.
రెండు కండ్లను ఏ విధంగానైతే మానవుడు జాగ్రత్తగా చూచుకోవా లనుకుంటున్నాడో అలాగే ధర్మార్థ కామమోక్షాలనూ జాగ్రత్తగా సంపాదించుకోవాలి.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
కనులు రెండింటిఁ గాపాడుకొనుట యెటులొ
జగతి ధర్మార్థ కామ మోక్షములు నాల్గు
కూర్చుకొనవలె నటులె ముకుందుఁ జూచి..
నాల్గు రెం డయ్యె నట నల్లనయ్య కౌర!
2 వ పూరణము..
సందర్భము: ఒక నల్లనయ్య యనే వానికి విపరీతమైన పేకాట పిచ్చి. నాలుగు లక్షలు పెట్టినాడు. ఆట ముగిసేసరికి అవి రెండైనవి.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
అయ్యయో! చేతిలో మాయ మయ్యె డబ్బు...
అయ్యయో! జేబులే ఖాళి యయ్యె నబ్బ!
పేక ముక్కాట లక్షలు పెట్టినాడు
నాల్గు; రెండయ్యె నట నల్లనయ్య కౌర!
3 వ పూరణము..
సందర్భము: చి. మేడిచర్ల హరి నాగభూషణం రచించిన "బ్రహ్మ కడిగె.." అనే పద్య భావ ప్రేరణతో...
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నాల్గు వేదాల సారంబు నన్నుఁ జేరు..
రెండు పాదాల భక్తిఁ గొల్చినను చాలు..
వేదమూర్తి యాతడె కదా విష్ణుమూర్తి!..
నాల్గు రెం డయ్యె నట నల్లనయ్య కౌర!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
4 వ పూరణము...
రిప్లయితొలగించండిసందర్భము: ప్రణయ భావ పూర్ణ విలాసయైన యమునా తీరాన రాసలీలా వైభవ వివశలైనారు గోపికలు. ఇంతలో హఠాత్తుగా కృష్ణ పరమాత్ముడు అంతర్ధాన మైనాడు. ఈలోపల రాధ కూడ కనిపించ కుండా పోయింది.
వారు అన్వేషణ చేస్తూంటే స్త్రీ పురుషులయొక్క రెండేసి పాదాల గుర్తులు
(4) గోచరించాయి. వాటిని అనుసరిస్తూ కొంతదూరం వెళ్ళగా.. మహిళ యడుగు జాడలు కనిపించలేదు. కేవలం పురుషుని పాద చిహ్నాలే (2) కొంత లోతుగా కనపడ సాగినవి.
ఓహో! సుకుమారియైన రాధ శ్రమను తగ్గించే నెపంతో శ్రీ కృష్ణ ప్రభువు రాధాదేవిని ఎత్తుకుని నడచి వెళ్ళినా డని అందుకే కృష్ణ పాదముద్రలు రెండే కనిపిస్తున్నా యనీ గోపికలు అర్థం చేసుకొని తన్మయలై పోయారు.
అప్పు డొక గోపిక మరో గోపికతో అంటున్న మాటలివి...
శ్రీ గౌరీభట్ల బాల ముకుంద శర్మ గారు రచించిన "శ్రీ లలితాంగ.." అనే పద్య భావ ప్రేరణతో... వారికి ధన్యవాదాలతో...
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఇవె రాధ చరణమ్ము! లివె కృష్ణ చరణమ్ము!
లంద చందంబులే చిందు వేసె..
చూడవే పాదాల జాడ!.. లీ దారినే
సాగిపోయిరి సుమీ సరస మతులు!
నాలుగు చరణాల నాణ్యమౌ ముద్రిక
లిటనుండి కనిపింప వేమె! చెలియ!
అరయగా మగవాని వా రెండు జాడలే
కనిపించెడిని లోతుగా నిదె! యిదె!
ఇంతి శ్రమఁ జూడగా నోప కెత్తుకొనియె
నిచటనుండియే కాబోలు, నింతదనుక
నాల్గు; రెం డయ్యె నట నల్లనయ్య కౌర
పాద ముద్రిక లిటనుండి భద్రగతుల
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
నాలుగు చేతులన్ వెలసి నల్లని కృష్ణుడనంతుడౌటచే
రిప్లయితొలగించండిబేలతనమ్ము నర్జునుడు వేడుచు ప్రార్థన నిట్లుచేయుచున్:👇
"చాలును విశ్వరూపమిక చల్లగ మారుము బావగా"ననన్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో