6, మే 2018, ఆదివారం

సమస్య - 2670 (దేహము విడనాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"
(లేదా...)
"దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

122 కామెంట్‌లు:

 1. హాహా కారము జేయక
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  మోహపు తిమిరము తొలగగ
  సాహసమున పొందవచ్చు సంతస మెపుడున్

  రిప్లయితొలగించండి
 2. "భిద్యతే హృదయగ్రన్థిశ్ఛిద్యన్తే సర్వసంశయాః
  ........
  కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష-
  దావృత్తచక్షురమృతత్వమిచ్ఛన్!"


  దేహమ్ము నేను కాదని
  కోహమ్మని తరచి చూచి కోరిక తీరన్
  సోహమ్మని కనుగొని సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్!

  రిప్లయితొలగించండి


 3. ఓ హారిక! వినవే! సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  స్నేహంబున తక్కువగా
  డే! హంకారియునుగాడు!రేడితడేనే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   * శార్దూలమ్మదిగో జిలేబి కనుమా శాస్త్రీయ మేపారగన్

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'డ-ర' లకు యతిమైత్రి లేదు.

   తొలగించండి
 4. మోహమ్మును విడువుము, సం
  దేహమ్ము విడనాడి చూడు ధీరత్వమునన్,
  ద్రోహుల జంపు, కపిధ్వజ
  వాహనుడా యనుచు బలికె నర్జుని తోడన్

  రణమున బంధువులను జంపుటకు సంశయము పొందుచున్న అర్జునిని కాంచి కృష్ణుడు పలికిన పలుకులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది సార్! 👏👏👏

   నాల్గవ పాదము యతి సరియా?

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దేహము విడనాడి...' టైపాటు...
   నాల్గవ పాదంలో యతిదోషం. సవరించండి.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  వరూధిని.... ప్రవరునితో...

  మోహమ్మున్ గొన బారిపోయెదవొకో ? మూర్ఖత్వమౌ ! ముక్తికీ
  మోహమ్మే పథమౌను తుట్టతుదకున్ , భూదేవ ! కామాత్మనై
  బాహుద్వంద్వము జాచి యొంటినిట నిల్వన్ జుల్కనా నీకు ? సం...
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ! ధీరత్వ మేపారఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అనగా.. అనగా.. ఒక పులి....


   దేహంబా కృశమయ్యె , దంతముల దీప్తిన్ జూడు శుష్కంబు , నే...
   నాహారంబు దినంగజాల , గడు పాపాత్ముండ బూర్వమ్మునం ,
   దే హానిన్ దలపెట్టఁ గంకణమిదే ! యేమింక నీ శంక ? సం...
   దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ! ధీరత్వ మేపారఁగన్ !
   సాహాయ్యమ్మును పొందుమీ జలములన్ స్నాతుండవై రమ్ము , నీ
   యాహార్యమ్మును గాంచ బీదవ "ని వ్యాఖ్యానింప , దద్వ్యాఘ్రవా..
   ఙ్మోహావిష్టుడునై మృతిన్ గొనెను ధీమూఢుండు పాంథుండటన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 6. ఉత్తరుని ప్రగల్భాలుగా (బృహన్నలతో)

  సాహసినౌ నను గాంచిన
  నాహవమం దెదుటనగల యరివీరులె దా
  సోహమ్మనరే, యిక సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...ఎదుటను గల...' అనండి.

   తొలగించండి
 7. (మరొక సతితో అశ్వమేధం రాముడు చేస్తున్నాడేమో
  నని తలచే సీతతో వాల్మీకి మహాముని )
  ఊహలు చాలు ; పసిడి వై
  దేహిని ప్రక్కన నిడుకొని దివ్యుడు రాముం
  డా హయమేధ మొనర్చు ; సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సాహసమును వదలక సం
   దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
   బాహిర లోకానందము
   కాహళి నూదంగ పాందగా మది
   మది శాంతిన్

   తొలగించండి
  2. బాపూజీ గారూ,
   పూరణకు చక్కని అంశాన్ని ఎన్నుకున్నారు. బాగుంది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
   **********************
   ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మది మది' టైపాటు....

   తొలగించండి
  3. శంకరార్యులకు , సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు . సవరించిన పద్యం :
   ఊహలు చాలు ;పసిడి వై
   దేహిని ప్రక్కన నిడుకొను దివ్యుడు రాముం
   డా హయమేధకరుడు ; సం
   దేహము విడనాడి చూడు ధీరత్వమునన్ .

   తొలగించండి
 8. మూడవ పాదం మూడవ గణం రగణం వచ్చింది సరిచేయండి.

  రిప్లయితొలగించండి
 9. మోహము వీడుము స్వజనుల
  పై;హనువున వెంటరారు;బావా!కౌంతే
  యా!రణమును సల్పుము;సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"

  రిప్లయితొలగించండి
 10. శ్రీహరి పూజల కొరకై
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  మోహమును జయించి భువిని
  వాహనమేతెంచు హరి నివాసము చేర్చన్

  రిప్లయితొలగించండి
 11. సాహస మున నె దు రు నిలిచి
  పాహి యన క నిడు ము ల కును పంతము తోడ న్
  మోహ ము దరి జేరని సం
  దేహము విడనాడి చూడు ధీరత్వము న న్

  రిప్లయితొలగించండి
 12. గేహము నాత్మకు దేహము
  మోహమ్మును పొందవలదు మూర్ఖపు మనసా
  సాహసి వై బ్రతుకు కడకు
  "దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  [ఉత్తర గోగ్రహణ సమయాన శమీవృక్షము పైనున్న గాండీవమును దించి, యతఁడు నిజమైన యర్జునుఁడేనా యని సందేహించుచున్న యుత్తరుని చేఁతియందలి గాండీవముం దాఁకి, యర్జునుండు తన నిజరూపమ్ముం బొంది, "యో యుత్తరకుమారా! యా యర్జునుఁడే యీ బృహన్నల! నీ సందేహమును విడనాడి, నీ ధీరత్వ మేపారఁగా ననుం జూడుము! నీ యజ్ఞానము నశించి, జ్ఞానము బోధపడఁగల" దని చెప్పుచున్న సందర్భము]

  "మోహాగ్నుల్ కనుఁగప్ప నీకు నెవియున్ బూర్ణంబుగాఁ దోఁచకే,
  దాహార్తిం బడి పోల్చవైతి విఁక నో ధర్మాత్మ! గాండీవినై
  సోఽహమ్మంచును జెప్పుచుంటి నెదుటన్ జూపించి నా రూపు! సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్!"

  రిప్లయితొలగించండి
 14. మోహము విడు,ననిలోసం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  ద్రోహులను జంపుము ధవళ
  వాహనుడ యని గిరిధారి బలికె రణము లోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. వాహినిలో మీమిత్ర స
  మూహమునందొకడు మునిగిపోవంగా నీ
  స్నేహితుని యుసురుపై సం
  దేహము విడ; నాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 16. సమస్య :-
  "దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"

  ఊహల చేతను కోపపు
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  మాహాల నీ బృహన్నల
  పోహణ విడిపించు నమ్మి పోరు కుమారా!
  ....................✍చక్రి
  మాహా : ఆవు
  పోహణ : నేర్పు

  రిప్లయితొలగించండి
 17. డా.పిట్టాసత్యనారాయణ
  మోహము నాపవు ప్రాణము
  గేహంబున నుందు ననుచు గీ పెట్టును నీ
  సో.హ.పు సాధన యేమయె
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2670
  సమస్య :: *దేహమ్మున్ విడనాడి చూడుము సఖా! ధీరత్వ మేపారగన్.*
  దేహాన్ని వదలివేసి చూడు. నీవు ధీరుడివి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి తన విశ్వరూపాన్ని చూపించి ఓ పార్థా! { *మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి* }అన్నింటికీ కారణం నేనే. నా మహిమను చూడు. ఉత్సాహాన్ని పొందు. {నీవు *న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజన మాహవే....* అని అనకుండా} నావాళ్లు అని నీవనుకొంటున్న వారిపై మమకారాన్ని విడిచిపెట్టు. { *అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా* అనేనా మాటను స్మరించి} మాయను ఛేదించు. నేను ఆహా అని నిన్ను మెచ్చుకొనేటట్లు { *యుధ్యస్వ విగత జ్వరః* } ధర్మయుద్ధం చేయి. { *నః పాపమేవాశ్రయే దస్మాన్ హత్వా* అని భావించకుండా} వీరిని చంపితే పాపం వస్తుందేమో అనే సందేహాన్ని వదలిపెట్టి చూడు. ఉత్తమ క్షత్రియుడవుగా వీరుడవుగా ధీరుడవుగా మెలగు. అని గీతోపదేశం చేస్తున్న సందర్భం.

  ఊహాతీతము నా మహత్తు గనుమా! ఉత్సాహమున్ బొందుమా!
  స్నేహమ్మున్ స్వజనమ్ముపై విడువుమా! ఛేదించుమా మాయ, నే
  నాహా యంచన ధర్మయుద్ధమునుచేయం బూనుమా! పార్థ ! సం
  *దేహమ్మున్ విడనాడి చూడుము సఖా! ధీరత్వ మేపారగన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 19. మోహము వీడుటె ప్రగతికి
  దోహద పడుననిరి గాదె దోర్బల వర్తుల్
  సాహస మాయుధమౌ ;సం
  "దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"

  రిప్లయితొలగించండి
 20. డా.పిట్టా సత్యనారాయణ
  సోహమ్మున్ జపియించి ధ్యానమున నీ చూడ్కున్ సుషుమ్నన్ గనన్
  బాహాబాహినియూర్ధ్వపుం గతిని వే మార్లట్లు బోనోపితే!
  స్వాహా యౌగతి దేహమే కరుగ నా సాన్నిధ్యమే చేరువౌ!....
  ఓ.హో..యిప్పుడె సాహసమ్ము కరువౌ నూడ్చంగ భూ బంధమున్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారగన్!
  (పండిట్ ఫకీర్చంచంద్ జీ మహరాజ్,హోషియార్పుర్(పంజాబ్)గారి రాధాస్వామిసత్సంగ్Hnkలో తమ 90వ యేట నుడివి కన్నీటి పర్యంత మవడం చూచి,R.S అవలంబిగా మీతో నా జ్ఞాపకాన్ని పంచుకున్నాను. స్వోత్కర్షగా భావించకూడదని మనవి)

  రిప్లయితొలగించండి
 21. ద్రోహము తలపకు మెన్నడు
  మోహము విడనాడి చూడు ముక్తిలభించున్
  సాహసమున భావనలో
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 22. కం:-
  మోహమ్మునబడి మిక్కిలి
  దాహమ్మునకు వెరవుపడి తల్రుట కంటెన్
  దేహమున దేహినెఱిగి సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్ !!!

  @ మీ పాండురంగడు *
  ౦౬/౦౫/౨౦౧౮
  తల్రుట..తలరుట:-బాధపడుట. దుఃఖించుట

  రిప్లయితొలగించండి
 23. (కృష్ణుడు అర్జునునితో)
  మోహమ్ము వలదు వైరా
  రోహమ్మున నిలచి యిటుల స్రుక్కుట తగునే
  ద్రోహులశిక్షించగ సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్!!!
  వైరారోహము = యుద్ధము

  ఓ హేమసుతా!నీ సం
  దేహము విడనాడిచూడు ధీరత్వమునన్
  మోహము తొలగిన రాముని
  సౌహార్థము నెఱుగగలవు సద్గుణశీలా!!!
  (వాల్మీకి సీతతో..)

  రిప్లయితొలగించండి
 24. దేహము తానని భ్రమయుచు
  దేహీయని ప్రాకులాడి దీనత్వమునన్
  హాహాకారము జేయక
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్!

  దేహ భ్రాంతిని విడచి యని!

  రిప్లయితొలగించండి

 25. అర్జునుడు - కృష్ణుడు

  ఆహాకారములన్ గనన్ కుదరదయ్యా!నేనశక్తుండ! నే
  నీ హాంత్రమ్ముల చూడలేను విడుతున్నీరంగమున్నిప్పుడే!
  సాహాయ్యంబగుదున్!కిరీటి!నెఱియౌ సారంగమున్బట్టి,సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Dr.nvnchary
   మోహమ్మున్ విడనాడు పార్థ! కలయే ముందున్న బంధమ్ములున్
   స్వాహాజేసిరిమీదు రాజ్య సుఖముల్ వారేమి నీసొంతమా
   నీహారమ్ము వలెన్ కరుంగు నిది నా నీమంపు భ్రాంతిద్ది సం
   దేహమ్మున్ విడనాడి చూడుముసఖా ధీరత్వమేపారగన్

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ***************
   డా. ఎన్వీయెన్ చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. దేహముపై నజ్ఞానపు
  మోహమునే విడిచి చూడుము మరియును జగ
  న్మోహనునే మది దలచుచు
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 27. సాహంకారులుగౌరవు
  లాహవరంగంబునందు హతునిగ జేయన్
  మోహమునొందక యునుసం
  దేహము విడనాడిచూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి


 28. ఓహో నేనే యనకోయ్!
  దేహము విడనాడి చూడు, ధీరత్వమున
  న్నీ హర్మ్యంబునట జిలే
  బీ, హాంకారములు నిన్ను విడి కల తొలగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 29. ఓహోనాదని నీదనన్ జగడముల్ కొట్లాటలేలా ! భళా
  దేహమ్మున్ విడనాడి చూడుముసఖా ధీరత్వమేపారగన్
  నీహర్మ్యంబెట? నీశుడేల నినుతన్నీరమ్ముగాజేసెనో?
  సోహంబో మరి హంసవో? యెరుకయెన్? శోభిల్ల మార్గంబెటన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 30. రాహువు,కేతువు బట్టిన
  సాహసమున యెదురునిలచి సాగెడిరవిలా
  బాహటముగచుట్టిన?సం
  దేహమువిడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలె' అనే అర్థంలో 'లా' అనడం సాధువు కాదు. "సాగెడి రవియై" అనండి.

   తొలగించండి
 31. .
  దేహము నాత్మల హంస
  స్సోహమనెడి నాటకమును చూచెదరిలలో
  మోహాంబుధి దాటుటకై
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 32. రాహుల్ గాంధి సిద్ధరామయ్యతో:

  ఓహో! కన్నడ సిద్ధరామ! కనుమా! ఊహించ లేవీవు గా!
  సాహో! కాంగ్రెసు నేత నేను! వినుమా! సాఫల్యమొందున్ గ! నే
  రాహుల్ గాంధిని!!! నేను గెల్చెదనురా! రాకాసి మోడీని! సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఈశార్దూలముకైన రాహులుడటన్ గెల్వంగ మేలౌ భళా :)

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


  3. 🙏🙏🙏

   ............


   జిలేబీ గారూ:
   మీ శార్దూల పాద పద్మము బాగున్నది. యతి సవరించండి.

   తొలగించండి
  4. సమయానుకూలమైన పూరణ... శ్రీ శాస్త్రి గారూ... అభినందనమందారమాల 💐👏👏🙏🙏


   ఓహో... సాహో... రాహుల్...భలే పదాల విందు....

   రాహుల్ గాంధికి పంపిన
   సాహో ! యను పూరణమును చదివిన ., మోదీ
   ద్రోహంబని భావించిన
   నో హోహో యందు నేను నుత్సాహముతో !!

   .... మురళీకృష్ణ

   తొలగించండి
  5. తెలంగాణ మాండలికంలో ’ఈ’ ని ...’గీ’ అంటే సరి జిలేబీ గారూ... మీ యతిభంగదోషం పలాయనం చిత్తగిస్తుంది!

   తొలగించండి

  6. ఇవ్వాళ యతి మహోదృతంగా పడినట్టుంది కందంలోనూ శార్దూలాలలోనూ :)

   నెనరులు సవరణలకు

   జిలేబి

   తొలగించండి
 33. స్నేహితులను సంబంధుల
  నాహా దూరమున నుంచు నక్కట నీ వి
  త్తాహంకారము, నిస్సం
  దేహము, విడనాడి చూడు ధీరత్వమునన్


  దేహత్యాగులె మన్నిమిత్తమున నీ ధీరుల్ స భీష్మాదులే
  బాహాటమ్ము నిమిత్త మాత్రుఁడవు నా వారంచు వీ రెల్లరున్
  మోహావేశముఁ బొంద నేల మది సంపూర్ణమ్ము భీభత్స సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 34. స్నేహితుడా తప్పిటు దా
  సోహమనుట మద్యమునకు - శుభకరమగు వ్యా
  మోహము విడ - లేదే సం
  దేహము - విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 35. శార్దూలవిక్రీడితము(పంచపాది)

  దాహమ్మెంతయొ? గంగ నీదె తులసీదాసుండు భార్యన్గనన్!
  మోహమ్మున్విడి దైవమందు మదినే మోక్షార్థమై యుంచుచున్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా! ధీరత్వ మేపారఁగన్ 
  సాహాయమ్మిడు దాట భౌతికమనన్ సాధ్వీమతల్లప్పుడు
  న్నూహాతీతముగన్ మహాకవిగనై యొప్పారె వాల్మీకనన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తల్లి + అప్పుడు, వాల్మీకి + అనన్' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

   దాహమ్మెంతయొ? గంగ నీదె తులసీదాసుండు భార్యన్గనన్!
   మోహమ్మున్విడి దైవమందు మదినే మోక్షార్థమై యుంచుచున్
   దేహమ్మున్ విడనాడి చూడుము సఖా! ధీరత్వ మేపారఁగన్ 
   సాహాయ్యమ్మిడు దాట భౌతికమనన్ సాధ్వీమ బోధించఁగ
   న్నూహాతీతముగన్ మహాకవిగనై యొప్పారె ధన్యుండునై!

   తొలగించండి

 36. ఆహా! రాముని నామ మెంత రుచియో యంచున్ను పాసించుచున్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్
  మోహావేశములం త్యజించి సతమున్ పూజించ నారాయణున్
  బాహాటమ్ముగ తానె చూపు నిలలో భవ్యంపు జీవమ్ములన్

  రిప్లయితొలగించండి
 37. దేహమ్మాత్మయు వేరువేరు మృతి యీ దేహమ్ముకే వీడు నీ
  మోహ మ్మగ్రజు పైన జేరెను దివమ్మున్ వాలి నీ కేల సం
  దేహ మ్మార్కి! సువత్సు నంగదుని బ్రీతిం జీరి యంత్యేష్టి కా
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 38. కరుక్షేత్ర సంగ్రామం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుని తో :
  కందం
  ఆహా! నీ సుతుఁ జంపిన
  మోహమ్మే బంధువులని? మొన గీతన్ సో
  దాహరణముగ వినుచు సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 39. ఆహా యెంతటి సుందరాంగుడవు నాయందమ్ము నీకే సుమా
  మోహమ్మెంతయొ గల్గె నిన్ గనగనే మోదమ్ముతో జే రగన్
  బాహుద్వందము జాచితిన్ బ్రవర నా ప్రాణేశ్వరా వేగ సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమే పారఁగన్.

  రిప్లయితొలగించండి
 40. మోహము చే గద నిట వై
  దేహిని చాటుగను పట్టి తెచ్చితివిగదా!
  యా హరి యే రాముడు సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  రిప్లయితొలగించండి
 41. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,  సౌహార్దమ్ము బరిత్యజించుచు పరైశ్వర్య ప్రలోభాత్మ చే

  ద్రోహాలోచన చేయ నేల ? ధన మీ లోకమ్మునన్ శాంతిదం

  బే ? హేవాకధనంబు బొందు మిక , సిధ్ధించున్ గదా ముక్తి | సం

  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా | ధీరత్వ మేపారగా

  నూహాతీతు - ననంతు - నచ్యుతుని నీ యుల్లమ్మునన్ నమ్మినన్

  సాహాయ్యం బొనరించు నీ కొసగుచున్ సంక్షేమమున్ నిత్యమున్


  { హేవాక ధనము = ఙ్ఞాన ధనము ; చూడుము సఖా = యోచింపుము

  సఖా }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 42. సౌహార్ద్రంబును చేగొనంగ వలయున్ సాంగత్యముల్మేలవన్
  మోహంబేలర?మానవా! బతుకునన్ మొండించుమా కోరికల్
  సాహోరేయనజీవితమ్ము జనుడా సాధింపుమానీహృదిన్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 43. వాహనము నడుపగనె నీ
  దేహమునకు కీడు కల్గి తీరునటంచున్
  యాహార్యము మార్చక సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అటంచున్ + ఆహార్యము' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 44. శుక్రాచార్యునితో బలిచక్రవర్తి

  సాహాయ్యమ్మును గోరి నీవటువు మాసామ్రాజ్య మేతెంచగా
  నాహా! మూడడుగుల్ వసుంధరను తానాశించె ,నీయంగ సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా! ధీరత్వమేపారగా
  నూహించన్ నతడచ్యుతుండనగ నుత్సాహంబు హెచ్చాయగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..గోరి యీవటువు' అనండి. 'హెచ్చెంగదా' అనండి.

   తొలగించండి
 45. దేహము భోగాస్పదమై

  మోహాది గుణము లకాత్మ మూలంబయ్యెన్ ;

  ఐహిక ములనా శింపక.

  దేహము విడనాడి చూడు ధీరత్వము నన్:

  విద్వాన్, డా!! మూలె. రామమునిరెడ్డి. ప్రొద్దుటూరు. కడప జిల్లా, 7396564649.

  రిప్లయితొలగించండి
 46. *6.5.18*
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  "దేహము విడనాడి చూడు ధీరత్వమునన్"

  సందర్భము: దేహము విడువడం తొడుగడం అనేవి చొక్కా వేసుకొనడం విప్పేయడం లాంటివే! పెద్ద కష్టమైన విషయా లేమీ కావు.
  ఎవరికంటే దేహ భ్రాంతి నశించిన వానికి..
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  మోహము నశించినంతనె
  యాహా! యంతటను నీవె!
  యది యొక చొక్కా
  యే! హాయి విడుట.. తొడుగుట..
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  2 వ పూరణము..

  సందర్భము: మనకెన్నో జన్మ లున్నాయి. జన్మ జన్మకూ ఒక దేహం దేవు డివ్వాల్సిందే! అందువల్ల మనకు దేహా లెన్నో వున్నాయి. దేహం మారినపుడల్లా భార్య పిల్లలూ మారుతూనే వుంటారు. ఇది అవగాహనకు వస్తే నరుడు ధీరు డౌతున్నాడు.
  ఈ దేహమే నే ననుకొన్నవాడు మోహంలో మునిగి గిలగిలా కొట్టుకుంటూనే వుంటాడు. అనుకోనివాడు స్వేచ్ఛగా వుంటాడు. దేహం పోతే పోనీలే అనుకుంటాడు.
  వాడే ధీరుడై దేహాన్ని విడనాడగలడు. ధరించగలడు కూడ.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  దేహము నే నని తలచిన
  మోహము కమ్ముకొని కొంప ముంచును; కాదేన్
  దేహము లెన్నో నీ, కొక
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  3 వ పూరణము..

  సందర్భము: దేనినీ లక్ష్యపెట్టకుండా (నిర్లక్ష్యంగా) వుండేవాడే లోకంలో సుఖపడు తాడు. వాని కేదీ అడ్డు రాదు.
  ఇందులో సందేహానికి తావు లేదు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "పో! హే! పో!" యను నిర్ల
  క్ష్యోహా ప్రియుడే సుఖించు; నొక్కటియును న
  డ్డై హానిఁ జేయునే! సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 47. కాలమున తానై పుట్టినది కాలములోనే
  కనుమరుగౌనది
  పాంచభౌతికమౌ దేహమిది కట్టెగ కాలి
  బూడిదై చనునది
  నేను దేహమను అహంకారమున తమమదె
  నిను ఊయలూపగన్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా
  ధీరత్వమేపారగన్
  6-5-2018

  రిప్లయితొలగించండి
 48. [5/6, 1:02 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.

  6/5/18

  ఆహవ రంగము నందున

  మోహంబదియేలపార్థ ముందుగ విడుమా

  సాహాయము చేతును సం

  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్.


  మోహంబును విడనాడుము

  సాహసమేచూపుమయ్య సమరమునందున్

  దేహమశాశ్వత మనుచు

  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్.


  దేహము స్థిరమా? కాదే!

  మోహము వీడగ కలుగును మోక్షము పార్థా

  నాహంకర్తాయని సం

  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్.


  దేహము గేహము లన్నియు

  మోహము పెంచెడి వనుచును మోహము తోడన్

  న్నూహలలోబ్రతుకక సం

  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్.

  రిప్లయితొలగించండి
 49. సోనియా రాహుల్ తో:👇

  "ఆహా! ఏమవి చేపవోలు కనులో! ఆ వాక్కు కప్పల్ వలెన్!
  సాహాయ్యంబును డింపులయ్య! కొనుమా జంజాటమేలా యికన్!
  బాహాటమ్ముగచెప్పెదన్ కనుమురా బంగాలు టైగర్ను...సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్!"

  రిప్లయితొలగించండి