5, మే 2018, శనివారం

సమస్య - 2669 (ధవుఁడె కారకుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధవుఁడె కారకుండు తనయు మృతికి"
(లేదా...)
"ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్"
(మద్దూరి రామమూర్తి గారి 'అవధాన కల్యాణి' గ్రంథం నుండి...)

137 కామెంట్‌లు:

 1. విషయ మెరుగ నట్టి విశ్వనాథుండపు
  డడ్డ గించె నంచు నాగ్రహించి
  బాలుఁ జంప జూచి పార్వతి శోకించె
  ధవుడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   వినాయకుని కథా నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 2. చవియె లేక చప్ప చప్పగ బతుకన
  ధవుఁడె కారకుండు తనయు మృతికి!
  కవియె కారకుండు కద పద్య సృజనకు
  భువియె కారణమగు బొందకున్ను!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 3. తపసి కోరినంత తన భర్త సిరియాళు
  శాసనమ్మునివ్వ జంపి సుతుని

  వంటజేసి వగచి పలికె నివ్విధముగ

  ధవుఁడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   సిరియాళుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. పార్వతి విలాపము
  వలుగుఁబిండిన గణపతి నడచివచ్చె
  ముద్దు మురిపాల బాలు నపూర్వుడతడు
  'నాకు రక్షణ జేయు వినాయకుండు'
  ధవుడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముద్దు మురిపాల బాలుడపూర్వుడతడు అని చదువ ప్రార్ధన

   తొలగించండి
  2. ప్రసాద రావు గారూ,
   సమస్య పాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాసారు. సవరించండి. (మీ తేటగీతిని సులభంగా ఆటవెలదిగా మార్చవచ్చు. మీకే అవకాశం ఇవ్వాలకున్నాను).

   తొలగించండి
  3. ధన్యవాదములు పవరిస్తాను

   తొలగించండి
 5. పిండి బొమ్మ జేసి దండనాధు డవంచు
  ప్రాణ బిక్ష పెట్టె బాల చంద్ర
  తల్లి మాట వినిన తనయు డడ్డుపడగ
  ధవుఁడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   వినాయకుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బాలచంద్ర' అన్నచోట "బాలునకును" అనండి. అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
  2. పిండి బొమ్మ జేసి దండనాధు డవంచు
   ప్రాణ బిక్ష పెట్టె బాలు నకును
   తల్లి మాట వినిన తనయు డడ్డుపడగ
   ధవుఁడె కారకుండు తనయు మృతికి

   తొలగించండి
 6. ఆటవెలది
  అవ్వరాహ మౌచు నవనినిఁ గాపాడి
  పులకరింప జేసి పుత్రు నొసఁగి
  నడతఁ దప్పి నంత 'నరకు' దు ననెడు భూ
  ధవుఁడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
 7. పసుపు తోడ జేయబడిన బాలు డొకడు
  తలుపు వద్దనడ్డ, తాపమపుడు
  తాళ లేక దునిమి, తండ్రియైన నగజ
  ధవుఁడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   వినాయకుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏🙏🙏

   ముందు చక్కని తేటగీతి వ్రాసి చతికిల పడ్డాను నేను కూడా 😢

   తొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  నీటి బుడగల శబ్దమును పొరబాటుగా ఊహించుట....

  రవముల విన్న భూపతి శరమ్మున గూల్చియు శబ్దభేదిచే
  శ్రవణకుమారుఁ , బిమ్మట జలమ్ములు వృద్ధులకిచ్చి తెల్పగా
  వివరము , నిట్టులేడ్చిరి శపించుచు " కోసల భూ యశో రమా
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూలమయ్యెడిన్" !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   నీటి బుడగల శబ్దాన్ని విని ఏనుగున్నదని దురూహ చేసిన దశరథుని వృత్తాంతంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కోసలభూయశోధవుని -అని క్రొత్త కోణంలో పూరించారు .బాగుందండీ!

   తొలగించండి
  3. వద్దు వద్దటంచు వారింప , వినకుండ
   క్రొత్త బండి తెచ్చి కొడుకుకిచ్చె !
   చచ్చిపోయె వీడు ! లచ్చమ్మ ! చూడు ! నా
   ధవుడె కారకుండు తనయు మృతికి !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

 9. సారంగధర !


  అవును కదా! దురాయినట దాటగ కోపము తోడు ద్వేషమున్
  సవిధము గాన యా ధరుని సంకటముల్మొదలయ్యె మారుత
  ల్లి విధిని నిర్ణయించెను బలిన్గొనుచున్తునియింపగా నటన్
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   సారంగధరుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని రాజు సారంగధరునికి మరణశిక్ష విధించలేదు. కేవలం కాలుసేతులు ఖండించే శిక్ష వేసాడు.

   తొలగించండి


  2. ఇది చంపడం కన్నా మోసం కాదుటండీ ? అధర్మపు చావు. "తునియింపగా నటన్ ... సుతునధర్మపు చావు :)


   జిలేబి

   తొలగించండి
 10. సతి వలదన్న పతి పంపె సుతుని మేధోవలస
  దేశములకు
  మన తెలివిగ పరాయి సేవలు డాలర్ ఆశా
  పాశములకు
  జాతి వర్ణ వివక్షలకయ్యో బలిగా సుతు
  డాహుతయ్యెడిన్
  ధవుని దురూహలే సుతు నధర్మపు జావుకు
  మూలమయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రమేశ్ గారూ,
   చక్కని విషయాన్ని ప్రస్తావించారు. జిలేబీ గారో, నేనో మీ భావానికి పద్యరూపాన్ని ఇస్తాం.

   తొలగించండి


  2. రమేశు గారి భావనకు


   కవివర! భార్య వద్దనగ కాదనుచున్ పతి యంపె పుత్రుడా!
   తవిషమహో విదేశములు దస్కము బాగుగ దక్కు బోవ నీ
   కు! విధి! వివక్షయా? పసను కుత్సితమా?హతుడాయె బిడ్డడే!
   ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!


   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   రమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. (అర్జునుడు అభిమన్యుని మృతికి చింతిస్తూ ధర్మరాజుతో )
  అన్న !ధర్మరాజ !ఆయాసమిక వీడు ;
  నిన్ను ,భీము ,కవల నిలువరించి
  యరుగకుండ లోని ,కాపిన దుష్ట సైం
  ధవుడె కారకుండు తనయు మృతికి .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   సైంధవుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ బాపూజీ గారూ!
   ధవుని సైంధవుని అంటూ మనోహరంగా మార్చి సమస్యాపూరణ పద్యం అందించిన మీకు ప్రణామాలండీ.

   తొలగించండి
 12. మద్దూరి రామమూర్తి గారి పూరణ....

  దివిజ గణాధిపాత్మజుఁ బతిం గని ద్రోవది పల్కె నిట్టు లో
  ప్రవిమల కీర్తిసాంద్ర! యువరా జభిమన్యుఁడు మేటి యౌచు నా
  హవమునఁ బోరి కౌరవుల కాహుతి యెయ్యె దురాత్ముఁడైన సైం
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 13. ధవుడు = మనుష్యుడు

  తనయులంచు మునులు తరువుల బెంచిరి;
  వృక్ష రాజములును వృద్ధి జెందె.
  నేటి యవసరాలు నిన్నను మరిపింప
  చెట్లు నరికివేసెనిట్లు మనిషి.
  ముందు చూపు లేక మొండిగా వర్తించి
  హరిత సంపదలను యాహరించె:
  ప్రాణవాయువిపుడు పట్టున దొరుకదు
  భావితరముకింక భవిత కొరత.
  పెంచు వాడె మ్రాను తృంచిన చందంబు,
  బాధనింక పెంచు భయము కల్గు.
  ధవుల కారణమున తనయుల కిక్కట్లు!
  ధవుడె కారణంబు తనయు మృతికి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వామన కుమార్ గారూ,
   మానవునికీ చెట్టుకూ తండ్రీకొడుకుల సంబంధాన్ని ఆపాదించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముందు చూపు లేక' అన్నచోట గణదోషం. "ముందుచూపే లేక" అనండి.

   తొలగించండి
  2. సార్! ఆట వెలది గణములు సరియే అనుకుంటా...

   🙏🙏🙏

   తొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   అభిమన్యుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అభిమన్యు' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు.
   రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 15. ధవుని రాక దెలిసి తన్మయ మందుచూ
  నలుగు బిండి చేత మలచె దనయు
  కాపు గాసి యున్న గణపతినిదునుమ
  ధవుడె కారణంబు తనయు మృతికి
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాధాకృష్ణ రావు గారూ,
   వినాయక జననాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తన్మయమందుచు" అనండి.

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   కర్ణుని మరణాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. "కర్ణుడు మరణింప కదనమ్మునన్ గాంచి" అందామా? "కళేబరము, తలచె' టైపాట్లు.

   తొలగించండి
  2. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు.
   కర్ణుడు రణమందు కనుమూయగను కాంచి
   మృత కళేబరమును మృథపు భూమి
   కుంతి తలచె మదిని కొట్లాటలోన మా
   ధవుఁడె కారకుండు తనయు మృతికి
   మృథము: యుద్ధము

   తొలగించండి
  3. అన్నపరెడ్డి వారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. 3 వ పాదం
  కాపు గాయు వాని కంఠంబు దునుమంగ

  రిప్లయితొలగించండి
 18. ధవుని రాక దెలిసి తన్మయ మందుచు
  నలుగు బిండి చేత మలచె దనయు
  కాపు గాయు వాని కంఠంబు దునుమంగ
  ధవుడె కారణంబు తనయు మృతికి
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాధాకృష్ణ రావు గారూ,
   వినాయక జనన వృత్తాంతంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. డా.పిట్టా సత్యనారాయణ
  కవుల యూహగాదు కన్నతండ్రియె కోడ
  లవును'సవిత' పొందు నంద జూసి
  "భవము చాలు"ననుచు బాసెను ప్రాణాలు
  ధవుడు కారకుండు తనయు మృతికి
  (ఒక అభాగ్యురాలైన తల్లి కడుపు కోత,ఆవేదన)

  రిప్లయితొలగించండి
 20. సమస్య :-
  "ధవుఁడె కారకుండు తనయు మృతికి"

  *ఆ.వె**

  సకల విద్యలందు చతురుడు జానకీ
  ధవుఁడె కారకుండు తనయు మృతిక
  నంచు రావణుండు నక్కసు తోడను
  యుద్ధమునకు వెడలె యుక్తి లేక
  ...................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు ఆర్యా
   మీ ప్రశంస పొందగలిగాను
   ధన్యుండను

   తొలగించండి

 21. రమేశు గారి భావనకు


  కవివర! భార్య వద్దనగ కాదనుచున్ పతి యంపె పుత్రుడా!
  తవిషమహో విదేశములు దస్కము బాగుగ దక్కు బోవ నీ
  కు! విధివివక్షయా? పసను కుత్సితమా?హతుడాయె బిడ్డడే!
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రవిమలమైన విద్దెలకు బ్రాపు నదెక్కడ ?పాప పుణ్యముల్
  భవితకు నేర్పరే బుధులు పాపలు బిడ్డల బోటి బెంచుచున్
  నవత విదేశ వాసమునె నమ్మిన దీ మన వేద భూమి వా
  రవతల గుండ్ల మధ్య గను హాయి యదెంతటి
  దౌనొ దెల్య నా
  ధవుని దురూహలే సుతున ధర్మపు జావుకు మూల మయ్యెడిన్!

  రిప్లయితొలగించండి
 23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2669
  సమస్య :: *ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూలమయ్యెడిన్.*
  *నా కుమారుడు అన్యాయంగా చనిపోయేందుకు నా భర్తయే కారణ మవగలడు* అని చెప్పడం నేటి సమస్యలో ఉన్న విపరీతమైన అర్థం.
  సందర్భం :: {గాంధారి యొక్క ఆవేదన}
  నేనే ఈ భూమండలాన్నంతా యేలగలను అని అహంకరిస్తూ
  పాండవపత్ని యైన ద్రౌపదిని తన తొడపై కూర్చుండేందుకు రమ్మని పిలిచిన కొడుకును శిక్షించకుండా సమర్థిస్తున్నవాడు, కౌరవ కుల పక్షపాతి, పుత్రవ్యామోహంతో అధర్మమార్గాన్ని అవలంబిస్తున్నవాడు అగు నా భర్త యొక్క దుష్టమైన ఊహలే నా పెద్దకొడుకైన దుర్యోధనుని అధర్మపు చావుకు కారణం కాగలవు అని గాంధారి బాధపడే సందర్భం.

  అవగుణు డౌచు ద్రౌపదిని యంకము జేరగ బిల్చుచుండి, యీ
  యవనిని నేనె యేలగలనన్న సుయోధను ప్రోత్సహించె కౌ
  రవ శత పక్షపాతి ధృతరాష్ట్రు డధర్మపథావలంబి నా
  *ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూలమయ్యెడిన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   గాంధారీ స్వగతంగా మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   "ద్రౌపదిని నంకము..." అని కదా ఉండవలసింది?

   తొలగించండి
  2. గాంధారీదేవి మనస్తత్వ చిత్రీకరణ పరంగా పరమమైన
   పూరణ కావించారండీ !

   తొలగించండి
  3. గురువరేణ్యా! ప్రణామాలండీ. మీ సూచనయే సరియైనది. *ద్రౌపదిని నంకము* అనియే ఉండాలి. సవరించుకొనగలనండీ. ధన్యవాదాలు.

   తొలగించండి
  4. సహృదయులు
   శ్రీ jjk బాపూజీ గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ.

   తొలగించండి
 24. డా.పిట్టానుండి}
  ఆర్యా,
  Tab మొరాయింపుతో అన్నిసార్లు మొదటి పూ.వచ్చినది,సారీ

  రిప్లయితొలగించండి
 25. సవరించిన పద్యం
  నలుగుఁబిండి వాడు నాజూకువాడును
  నాకు రక్షయౌ వినాయకుండు
  నిలువ,బాలు నకట నిర్దయ వధియించె
  ధవుడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి


 26. కొంత ఫిట్టింగ్ :)


  అవును కదా! దురాయినట దాటగ కోపము తోడు ద్వేషమున్
  సవిధము గాన యా ధరుని సంకటముల్మొదలయ్యె మారుత
  ల్లి విధిని నిర్ణయించెను బలిన్గొనుచున్తునియింప తండ్రిరా
  జవిధిగ నిశ్చయించెనయ చంపగ,లోకులు గర్హ సేతురే
  "ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్"!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. సవరణ పద్యము...

  ఆ.వె.
  ( అర్జునుడు పద్మవ్యూహము గూర్చి చెబుతుంటె అన్న శ్రీకృష్ణుడు అడ్డుకున్నాడనే బాధతో...)


  బాలుడగు దనయుడు గూలె పద్మవ్యూహ

  మునను;మిగులగను వగచుచు

  మది తలచె సుభద్ర మరిమరి ,రుక్మిణీ

  ధవుడె కారకుండు తనయు మృతికి  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   'పద్మవ్యూహ' మన్నపుడు 'ద్మ' గురువై గణదోషం.
   రెండవ పాదంలో గణదోషం. మరల సవరించండి.

   తొలగించండి
 28. నిప్పు లుమియుచున్న నిండైన యెండలో
  తప్పలేదు పనికి తాను బోవ
  కుప్పగూల గాను కొమరుండు కమలబాం
  ధవుడె కారకుండు తనయు మృతికి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   సూర్యతాపాన్ని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యోస్మి గురుదేవా! నమస్సులు! మీరు కూడ యెండలో తిరుగవద్దు! 🙏🙏🙏

   తొలగించండి
 29. సింహ మట్లు పోరు చిన్నారి న భి మ న్యు
  కుట్ర జేసి చంప కుములు తండ్రి
  తల చె మనసు నందు తల్లడ మంది సైo
  ధ వు డె కార కుండు తనయుమృతి కి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   సైంధవుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 30. దైవ కార్య మునకు దనయుడేగి నపుడు
  భస్మమె యొనరింప భవుడు; లక్ష్మి
  వార్త నెఱిగి యిట్లు వాపోయె,"పార్వతీ
  ధవుడె కారణంబు తనయు మృతికి."

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మన్మథుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. *** *** *** *** ***
  ఆ.వె.
  ( అర్జునుడు పద్మవ్యూహము గూర్చి చెబుతుంటె అన్న శ్రీకృష్ణుడు అడ్డుకున్నాడనే బాధతో...)


  బాలుడగు దనయుడు గూలె పద్మవ్యూహ

  మునను;ముమ్మరమ్ముగను వగచుచు

  మది తలచె సుభద్ర మరిమరి ,రుక్మిణీ

  ధవుడె కారకుండు తనయు మృతికి  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'పద్మవ్యూహ' మన్నచోట గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. గణభంగము లేదు కదా! తేట గీతి కాదు కదా!

   తొలగించండి
  3. నిజమే.... నేనే పొరబడ్డాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  [పద్మవ్యూహమునఁ గౌరవులొనర్చిన ఘాతుకము కన్న సైంధవుఁ డొనర్చిన ఘాతుకము వలననే తన సుతుఁ డభిమన్యుఁ డధర్మపుం జావునకు గుఱియయ్యెనని యర్జునుఁడు వచించిన సందర్భము]

  "ఎవరినిఁ జేరనీక నట హింస్రుఁడు సైంధవుఁ డడ్డ బాలుఁడే
  చివరకుఁ దమ్మిమొగ్గరముఁ జేరియు యుద్ధమొనర్చి యప్డు కౌ
  రవ గురు వృద్ధ బాంధవ దురాగత యుక్తినిఁ జిక్కెఁ! జూడ, సైం
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!"

  రిప్లయితొలగించండి
 33. నలుగు పిండి తోడ నటరాజ సుతుఁజేసి
  తనకు రక్ష యుంచ వాని నంత
  శివుడు రాగ యడ్దు జెప్పగా ఖండించె
  ధవుడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శివుడు వచ్చి యడ్డు జెప్పగా' అనండి.

   తొలగించండి
 34. ఆ.వె.
  భార్య యేడ్చె గుండె పగిలి, ప్రాణేశుడు
  కోట్ల కారు కొనుచు కొడుకు కిడగ
  నతి వడిగ నడుపుచు యసువుల బాసెను
  ధవుడె కారకుండు తనయు మృతికి

  రిప్లయితొలగించండి
 35. ఆకాశవాణి వారి సమస్య తెవలుపగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆకాశవాణి వారి సమస్య....
   "సరములు దీసి ముద్దిడెను సంతస మందగ నద్ది తానుయున్"
   'తానుయున్' అన్న ప్రయోగం దోషం.

   తొలగించండి

  2. జిలేబి యమ్మి అంగట్లో కల :)


   వరుస జిలేబులన్ పొలతి వాకిట బేర్చుచు గ్రాహకుల్ కొనం
   గ రయము గాను కాసులట ఘల్లన సర్దుచు గల్ల పెట్టి లో
   న, రజతముల్ కలల్గనుచు నాంత్రము జేయగ లచ్చియమ్మయే
   సరములు దీసి ముద్దిడెను సంతస మందగ నద్ది తానుయున్!

   జిలేబి

   తొలగించండి
  3. "సంతస మందగ నద్ది తాఁ దమిన్" అంటే బాగుంటుంది.

   తొలగించండి
 36. కలదె భయము నాకు గండర గండఁ డే
  ననుచుఁ దిరుగఁ దా నిఁక నిరతమ్ము
  మండు టెండ లెల్ల నుండగఁ బద్మబాం
  ధవుఁడె కారకుండు తనయు మృతికి


  యుధిష్ఠిరుని సంతాపము:

  అవని వెలుంగు యోధుల మహారధి యీ యభిమన్యుఁడే సహ
  స్ర వర వరాంగ తుల్య ఘన సత్త్వ వరాన్విత భీముఁ డున్నచో
  బవరము నందునన్ ఖదిర పౌత్రుఁడు గూలునె వ్యూహ మందు సైం
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   పద్మబాంధవునితో మొదటి పూరణ, సైంధవునితో రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 37. తల్లి దండ్రిమమత తరుగని దైనను
  సత్యమందుహింస సాగనీక
  భామ దునిమె నరకబాధలుమాన్ప!మా
  ధవుడె కారకుండు తనయ మృతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మాధవునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 38. ఆ॥వె॥
  జరఠులాలుమగలు శ్రవణుని జనకులు
  ధవుడె కారకుండు తనయుమృతికి
  యంచు శాపమొసగిరా దశరథునికి
  సంతుశోకమందు చచ్చుననుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "శ్రవణు జనకులు భూ।ధవుడె కారకుండు...." అంటె బాగుంటుందేమో?

   తొలగించండి
  2. ధన్యవాదములు శంకరయ్యగారూ 🙏🏽

   తొలగించండి
 39. మంచి జేయ నెంచు మారుని భస్మమ్ము
  జేయు పరమశివుని చేత గనుచు
  తమ్మి యింటి గరిత తలపోసె శాంకరీ
  ధవుడె కారకుండు తనయు మృతికి!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   శాంకరీధవునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 40. 1984 తల్లి ఆవేదన:

  ఎవరు వధించిరోగద! మరెవ్వరు శిక్ష భరించిరోయిటన్!
  నవనవలాడు యౌవనము నందున తల్లి నశించ నిందిరా
  శవమును దూరదర్శన మసాలగ జూపిననాటి సోనియా
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!

  రిప్లయితొలగించండి
 41. భవునిది యాఙ్ఞలేనిదిల బామరునైనను జీమకుట్టదే
  యవనికిబూర్తిగా దనదు నగ్రసుతుండె విభుండె యంచుభూ
  ధవుని దురూహలేసుతునధర్మపుజావుకు మూలమయ్యెడి
  న్నవగత మయ్యెగా ప్రభు నహమ్ము ను డంభముమత్సరంబులుల్

  రిప్లయితొలగించండి
 42. వారువమును పట్టి బంధించు మణిపుర
  ధవుఁడె కారకుండు తనయు మృతికి
  సత్య మనెను కుంతి! సంజీవని మణిచే
  బ్రతుకు నిచ్చె బభ్రువాహనుండు ౹౹

  రిప్లయితొలగించండి

 43. విదుర బోధ:

  ప్రవిమల సచ్చరిత్రు లగు పాండవులం బరిమార్ఛి దుర్మతిన్
  బవరము లేకయే సుతుని పట్టము గట్టు తలంపు వీడు కౌ
  రవపతి! వారి కేడుగడ ప్రాకటమే గద చూడవేల మా
  ధవుని? దురూహలే సుతున ధర్మపుజావుకు మూలమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి


 44. 1.సమర రంగమందు సవ్యసాచి సుతుని
  చంప వ్యూహమల్లి శత్రువులట
  చేరుచు నభిమన్యు గూల్చెడి వేళ సైం
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.


  2.నలుగు తోడ చేసి నట్టి బాలగణేశు
  డడ్డు పడెనటంచు నద్రిజేశు
  డతని సంహరింప నగజ దలచె మది
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.

  3.వరము బడసినట్టి నరకుని దునుమంగ
  సత్య తోడ వచ్చె సమరమునకు
  పుత్ర శోకమంది పుడమితా తలచె మా
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.

  4.శివుని పెండ్లి చేయ శీఘ్రముగా నేగి
  వాడి తూపు లేసి భస్మ మయ్యె
  వార్త నెరిగి తలచె వైదర్భి “‘నయ్యుమా
  ధవుఁడె కారకుండు తనయు మృతికి".

  సుభద్ర మదిలో
  5.జవమున పాండు పౌత్రునట జంప గనెంచు చునొజ్జ వ్యూహమున్
  బవరము నందు ముందుగను పన్నికిరీటియు లేని వేళలన్
  దివమున జచ్చె నన్వినుచు దీనముగావిలపించి తల్లి సైం
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్"

  6.కువలయమందు దైత్యుడట కోరుచు దుష్ట బుద్ధితో
  డ వనము నందు నొంటిగ జడల్ దల దాల్చుచు సీత నాయశో
  కవనములోన దాచగని గాసిలి దైత్యు నిభార్య దల్చె తా
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ ఆరు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   చివరి పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. బల్లూరి వారూ!
   మీ ఆరు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
   కొన్ని సందేహాలు:
   మొదటి పూరణలోని మూడవ పాదంలో యతిభంగం.
   నాలుగో పాదంలో వైదర్భి యెవరు? ఆమె రుక్మిణి యైనచో, ఆ కథకును, ఈ కథకును గల లంకె ఏమిటి?
   ఆరో పూరణలో గణభంగం.

   తొలగించండి
 45. బవరము నందు శీఘ్రముగ పద్మముపన్నగురుండు, చూచి పాం
  డవులు కిరీటి గానక చటాలున పోరును చేయకుంట పా
  ర్థివుడు కతమ్మెరింగి వెస తీర్చగ పార్థు కుమారు పంచె భూ
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 46. దివిజ గణాధిపాత్మజుని ధీరుని గాంచుచు జెప్పె భీముడే
  యువిధ సుభద్ర పుత్రుడు మహోజ్వల రుద్ర సమానుడౌచు నా
  హవమున శత్రువుల్ కుటిల యత్నము జేయగ గూలెగాదె సైం
  ధవుని దురూహలే సుతునధర్మపు జావుకు మూలమయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 47. చంపకమాల
  ప్రవణుఁడటంచు పుత్రుని ప్రవాసము నంపఁగ పీఠమెక్కి ప్రే
  మ వివశ మంది కోమలికి మాటనొసంగి వివాహమెంచగన్
  బవరముఁ జేసినట్లు పిత కాదన, రోదనఁ దల్లి లోననెన్
  "ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్ "

  రిప్లయితొలగించండి
 48. ఒక తల్లి ఆవేదన:

  ఆటవెలది
  పదునెనిమిది నిండె బాలుడెట్లని వాన్కి
  కారు నీయఁ గొని హుషారు మీరి
  రింగు రోడ్డు మీద రెచ్చి పోవంగ నా
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.

  ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

  రిప్లయితొలగించండి
 49. భవానీ ప్రసాద్ గారి భావానికి నా పద్యరూపం....

  భూమి తల్లి వృక్షములకు సూర్యుఁడు దండ్రి
  సూర్యతాపమంది చొక్కి చచ్చు
  తరువుల గతిఁ గాంచి ధరణి తలఁచె నిట్లు
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.

  రిప్లయితొలగించండి
 50. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్పులుంటే మన్నించగలరు.

  కాపునుంచి బాల గణపతిని బయట
  తానమాడ వెడలె తల్లి గౌరి
  అడ్డగించబోవ నాగ్రహించె తండ్రి
  ధవుఁడె కారకుండు తనయు మృతికి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మహేశ్ కుమార్ గారూ,
   తొలిప్రయత్నమైనా మీ పూరణ సలక్షణంగా, నిర్దోషంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 51. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్పులుంటే మన్నించగలరు.

  కాపునుంచి బాల గణపతిని బయట
  తానమాడ వెడలె తల్లి గౌరి
  అడ్డగించబోవ నాగ్రహించె తండ్రి
  ధవుఁడె కారకుండు తనయు మృతికి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారం. నా చరవాణి లో మిత్రుని ఈమెయిలు నిక్షీప్తమవడంతో ఆయన పేరుతో పద్యం ఇక్కడ ప్రచురితమైనది. అసౌకర్యానికి క్షంతవ్యుడను

   తొలగించండి
 52. *5.5.18*
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. . 🤷🏻‍♂సమస్య
  *"ధవుఁడె కారకుండు తనయు మృతికి"*

  సందర్భము: లక్ష్మీదేవి కూతురు శ్రీ వల్లి షణ్ముఖునికి సరిజో డని తలంచి పార్వతి వియ్య మందడానికి ఉత్సాహపడింది. లక్ష్మీదేవి వద్దకు వచ్చింది. మునుపు లక్ష్మీ నారాయణుల కుమారుడైన మన్మథుని పరమేశ్వరుడు తన మూడవకంట బూడిద గావించినాడు. అది గుర్తుకు రాగా లక్ష్మీ దేవి మనస్సు బాగా కలతపడింది. అటువంటి దశలో పార్వతీదేవి రావడం జరిగింది. వచ్చిన విషయం అడిగింది. లక్ష్మి సరేమిరా అన్నది. "మా యమ్మాయికి మిగిలేదే ముంది? ఇంత బూడిద.. లేదా రుద్రాక్షలు. అంతే కదా!" అన్నది.
  పార్వతి చిన్నబుచ్చుకున్నది. భర్తకు వెళ్ళి చెప్పింది. పరమేశ్వరుడు సర్ది చెప్పి ఒక రుద్రాక్ష నిచ్చి దానికి తగినంత ధనాన్ని తీసుకు రమ్మన్నాడు. లక్ష్మీదేవి తన వద్దనున్న ఆభరణాలు ధనం అన్నీ త్రాసులో వేసి తూచినా రుద్రాక్ష తూగలేదు. లక్ష్మి సిగ్గు పడింది. పార్వతి " ఇలాంటి రుద్రాక్షలు మావద్ద లెక్కలే నన్ని వున్నాయి" అన్నది. విష్ణుమూర్తి కూడ నచ్చ జెప్పగా చివరకు లక్ష్మి తన కూతురును షణ్ముఖున కీయడానికి అంగీకరించింది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కమలాక్షు దేవేరి కమ్మ విల్తుని తల్లి
  తనయునిఁ దలపోసి కనలు వేళ
  నారు మోముల వాని కన్నింట సరిజోడు
  శ్రీ వల్లి యను బాల సిరి కొమరిత..
  యనుచుఁ తా నాశతో నరుదెంచె దుర్గమ్మ..
  యౌ నని యనదు, కా దనదు లక్ష్మి..
  "కూతును నీయింటి కోడలుగా జేయ
  నేమి మిగులుఁ గడ కింత బూది"
  యనియె.. మనసు లోన"నలనాడు..పార్వతీ
  ధవుఁడె కారకుండు తనయు మృతికి.."
  ననుచు మూతి ద్రిప్పు వనితామణికి శౌరి
  నచ్చజెప్పె.. సిరియు మెచ్చె కడకు..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 53. మరొక పూరణము

  సందర్భము: తమ్మి మొగ్గర మనగా పద్మ వ్యూహం. పెక్కురు కుమ్మక్కై సుభద్రా నందను నొక్కని నుక్కడగించినారు పద్మ వ్యూహంలో.
  సుభద్ర తన తనయుని మృతికి ధర్మరాజే కారకు డని, ఆతడు ఆదేశించకపోతే అభిమన్యుడు యుద్ధ భూమికి బలియై పోయేవాడు కాడని వలవలా విలపిస్తున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  తమ్మి మొగ్గరమున తనయు డీల్గె నటంచు
  వల వల వల వల సుభద్ర యేడ్చె..
  తలచె "ధర్మజుండె, ద్రౌపదీ భామినీ
  ధవుఁడె కారకుండు తనయు మృతికి"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెలుదండ వారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 54. శివుని తపస్సు మాన్పుటకు శ్రీమతి గౌరిని పన్పుచుండగా
  నవనవలాడు చైత్రమున నందము నీయగ కామదేవునిన్
  తవులుచు నీవు పొమ్మనుచు తంపులు పెట్టిన తండ్రి యైన మా
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్ :)

  రిప్లయితొలగించండి