31, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4178

1-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్”
(లేదా...)
“పుంస్త్వాకారము బ్రహ్మ కింపొదవమిన్ బూనెన్ గదా స్త్రీత్వమున్”

30, ఆగస్టు 2022, మంగళవారం

న్యస్తాక్షరి - 75

31-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
నాలుగు పాదాలలో యతి స్థానంలో
వరుసగా 'వి - నా - య - క' అక్షరాలను న్యస్తం చేస్తూ
తేటగీతిలో కాని, ఉత్పలమాలలో కాని
వినాయక స్తుతి చేయండి.

29, ఆగస్టు 2022, సోమవారం

సమస్య - 4177

30-8-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుండెడు పాల్వోసి కాఫి కోమలి సేసెన్”
(లేదా...)
“కుండెడు పాలు వోసి యిడెఁ గోమలి కప్పెడు కాఫి భర్తకున్”

28, ఆగస్టు 2022, ఆదివారం

సమస్య - 4176

29-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యకవిత్వము వర్జ్యమె కద”
(లేదా...)
“పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ”

27, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4175

28-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుం జంపె మారుతి రాముఁడు గన”
(లేదా...)
“రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్”

26, ఆగస్టు 2022, శుక్రవారం

సమస్య - 4174

27-8-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు”
(లేదా...)
“శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్”

25, ఆగస్టు 2022, గురువారం

సమస్య - 4173

26-8-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవికను విప్పెడి తఱి నిటు రమ్మనఁ దగునా”
(లేదా...)
“రవికను విప్పుచున్న తఱి రమ్మని పిల్చుట యుక్తమౌనొకో”

24, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4172

25-8-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”
(లేదా...)
“లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”

23, ఆగస్టు 2022, మంగళవారం

సమస్య - 4171

24-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే”
(లేదా...)
“మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చటాయెరా”

22, ఆగస్టు 2022, సోమవారం

సమస్య - 4170

23-8-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు”
(లేదా...)
“సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ”