27, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4175

28-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుం జంపె మారుతి రాముఁడు గన”
(లేదా...)
“రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్”

20 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రామలక్ష్మణులన్ గొని భీమబలుఁడు
    దాచ పాతాళమున వైరి తత్వమెరిగి
    పంచముఖలతో నార్పి దీపమ్ముల మయి
    రావణుం జంపె మారుతి రాముఁడు గన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      చేవగలుంగు వాడనుచు చెప్పిన వెంటనె పంక్తికంఠుడున్
      బావని కళ్లుఁ గప్పి తన పాలననుండెడు లోకమందునన్
      ధీవర రామలక్ష్మణుల దింపగ, పంచముఖాలఁ దాల్చి మై
      రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్

      తొలగించండి
  2. రాముడెవరిని జంపెను లంక లోన,

    అంజనీ సుతుడన‌ నెవ రవని లోన,

    యగ్ని దూకె నెవరు కాంచ నవని‌ తనయ

    రావణుం జంపె, మారుతి, రాముడు గన

    రిప్లయితొలగించండి
  3. లంక యందున నున్నట్టి రామ లక్ష్మ
    ణులను గొనిఁదేర మారుతి నూహఁ జెంది
    మారు వేషము ధరియించు మాయను మయి
    రావణుం జంపె మారుతి రాముఁడు గన

    రిప్లయితొలగించండి
  4. దాశరథి యు సీతకొరకై దనుజుడైన
    రావణుం జంపె,మారుతి రాముడు గన
    తెచ్చి సంజీవినీగిరిన్ తీరుగా ను
    కాచె సౌమిత్రి ప్రాణముల్ ఘనముగాను

    రిప్లయితొలగించండి
  5. రామ లక్ష్మణ ద్వయమును రాత్రి వేళ
    నపహ రించిన రాక్షస నృపుని వెదకి
    కడకు పాతాళ లోకాన కనుగొని మయి
    రావణుం జంపె మారుతి రాముఁడు గన

    రిప్లయితొలగించండి
  6. క్రమాలంకారంలో ---
    చంపె నెవరిని రాముడు శరము చేత?
    జలధి లంఘించి లంకకు చనియె నెవరు?
    పరిగిడె నెవరు జూడంగ పసిడి జింక?
    రావణున్ జంపె : మారుతి : రాముడు గన

    రిప్లయితొలగించండి
  7. రావణ రామ యుద్ధమున రాముడు
    లక్ష్మణు డాదమర్చియుం
    బోవుచునుండ నిద్ర గని మోసము
    చేసియు వారలిద్దరిన్
    జీవముతోడ వేగమున జేకొని పొయిన
    గాంచి దుష్ట మై
    రావణు జంపె మారుతియె రాముడు
    సూచుచు మెచ్చురీతిగన్






    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    లంకకేగియు శ్రీరఘు రామమూర్తి
    *రావణుంజంపె;మారుతి,రాముడు,గన*
    బడగ సౌమిత్రి,జానకి పడసె ముదము
    పుష్పవృష్టియు గురిసె నపూర్వముగను.

    రిప్లయితొలగించండి

  9. పావన జానకీ సతిని పాతక రావణుడెచ్చటుంచెనో
    కావలి వారు నేమరగ కాయము జిన్నగ జేసి దూరెనే
    జీవము నిల్పుకొన్న సతి జిక్కిన దేహము గాంచి జింతనన్
    రావమ పోదమంచు నట రాముని సన్నిధి జేరి స్వప్నమున్
    “రావణుఁ జంపె మారుతియె, రాముఁడు జూచుచు మెచ్చు రీతిగన్”

    రిప్లయితొలగించండి

  10. రమణి సీతను కాపాడ లంకజేరి
    రామభద్రుండు భీకర రణమునందు
    రావణుం జంపె, మారుతి రాముఁడు గన
    చెలగి మైరావణుని జంపె చివ్వలోన.


    రావణు మేనమామ రణ రంగమునందున భీముడైన మా
    యావులలోన శ్రేష్ఠుడు మహాత్ములు రాఘవ లక్ష్మణుండ్ర మా
    యావియె బంధిసేసెనని యావహమందున యుక్తితోడ మై
    రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి
  11. లంక లోనికేగి యచట రాఘవుండు
    రావణుం జంపె ; మారుతి రాముఁడు గన
    చిందులుద్రొక్కి కీర్తన జేయుచుండ
    బయలునుండి వేల్పులు పూలవాన నొసగె

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల
    దేవతలెల్ల మెచ్చగను ధీరుడు శ్రీరఘు రామమూర్తి యే
    రావణుఁజంపె;మారుతియె,రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్
    గ్రావములెత్తి వైచుచును రాక్షససేనల రూపుమాపి యా
    పావని జానకిన్ విభుని వద్దకు జేర్చెను రామభక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  13. రామ కార్యంబు నీడేర్చ లంకజొచ్చి
    హనుమ సీతను గాంచగ హరుసమందె
    కనులు మోడ్చగ మదిలోన కలిగెనూహ
    రావణుం జంపె మారుతి రాముఁడు గన

    రిప్లయితొలగించండి
  14. రావణు లంకజొచ్చి యనిలాత్మజుడేగి యశోకవాటికన్
    పావని జానకిన్ గనగ భావన గల్గెను మానసంబునన్
    దేవగణంబుతన్బొగడ దీమసమొప్ప రణాంగణమ్మునన్
    రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  15. రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్”
    రావణు చావుఁ గల్గుమఱి రాముని చేతను గాని ,గాదుగా
    నావన చారు డా కపుఁడు నాయత తేజుఁడు నాంజనేయుచేఁ
    గావున నాజినందుమఱి నాతఁడె చంపెను కచ్చితంబుగా

    రిప్లయితొలగించండి
  16. ధార్తరాష్ట్ర కౌంతేయుల వర్తనమ్ము
    లాజిఁ గాంచ కున్నను రాఁగ నంత మందు
    మెఱసి దుర్యోధను తొడలు విఱిచి యపర
    రావణుం జంపె మారుతి రాముఁడు గన


    పావను మించి వీరులను భక్త వరేణ్యులఁ గాంచ శక్యమే
    యీ వసుధా తలమ్మున మఱెక్కడ నైనను భండనమ్మునన్
    రావణు సేన లోనఁ బలు రాక్షస వీరుల దీనుఁ జేయఁగా
    రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  17. భమిడిపాటి కాళిదాసు.,. అనకాపల్లి.

    రావణు మేనమామ మయిరావణు డారఘు వంశశ్రేష్టులన్,
    లావుగలట్టి వారలగు రాముని లక్ష్మణు తస్కరింప నా
    పావిని రూపుమాపుటకు పాపజగంబును చేరితానె మై
    రావణు జంపె మారుతియె, రాముడు సూచుచు మెచ్చురీతిగన్!!

    రిప్లయితొలగించండి
  18. ఉ.

    భావన తండ్రి మాటలను భారము కాదని లక్ష్మణున్ రహిన్
    పావని సీతఁ గాననము బాళిగ జేరెను శిష్టరక్షగా
    *రావణుఁజంపె, మారుతియె, రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్*
    దైవముగా పరాత్పరుని ధైర్యముతో గొలువంగ లంకలో.

    రిప్లయితొలగించండి