28, ఆగస్టు 2022, ఆదివారం

సమస్య - 4176

29-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యకవిత్వము వర్జ్యమె కద”
(లేదా...)
“పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ”

17 కామెంట్‌లు:


  1. అకటా! ఆంగ్లంబే మా
    కిక ముద్దని చెప్పువారికేలర యట తె
    ల్గు కవనములంటినిక ప
    ద్య కవిత్వము వర్జ్యమె కద యచ్చట నికపై.

    రిప్లయితొలగించండి

  2. విద్యను నేర్తురాంగ్లమున విజ్ఞులు వారలె పండితోత్తముల్
    పద్యములేల? కూడదది పట్టెడు మెత్కులు రాల్చబోదనిన్
    హృద్యకవిత్వమున్ విడుట యింపది కాదని చెప్పుచుంటి
    పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ?

    రిప్లయితొలగించండి
  3. మాతృ భాషను మరచిన నేతలెల్ల
    పాలకజనులై దేశాన పరిఢవిల్ల
    తెలుగు నేర్వని విద్యతో మలగెడు చదు
    వరికి *పద్యకవిత్వము వర్జ్యమెకద*

    రిప్లయితొలగించండి
  4. సివము కలిగించు విషయము చెప్పు టందు
    భాష ముఖ్యమగును గాని బట్టి జూడ ,
    గణములు యతి ప్రాస లనుచు కట్టడి గల
    పాత పద్యకవిత్వము వర్జ్యమె కద

    రిప్లయితొలగించండి
  5. కఠిన తరమైన నియమాలు కష్ట మనుచు
    సులభ మైనట్టి వచన లే శోభ గూర్ప
    వచ్చె పద్య కవిత్వము వర్జమె కద
    యంచు నాధు నికు లు పల్కు టబ్బు రమె గ!

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. తేటగీతి
      కవనమొప్పఁగ పద్యమ్ము ఖ్యాతి గొనినఁ
      గూడదన గానమున ధార కొరవడంగఁ
      బాత్రధారి నాటకవేదిపైన నొప్పి
      పాడఁ బద్యకవిత్వము వర్జ్యమె కద!

      ఉత్పలమాల
      హృద్యమనంగ సత్కవనమింపొనరింపఁగ భేషు భేషనన్
      సద్యశమున్ జగమ్మున ప్రశస్తమటంచును బొందియుండినన్
      వద్య సుధార గానమునఁ బాయఁగ నాటక వేదిపైనఁ ద
      త్పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ?

      తొలగించండి
  7. పద్యమనంగ ఛందమను బంధము నందున మ్రగ్గునంచు నా
    పద్యము వర్జనీయమని బల్కుట యొప్పునె సత్కవీంద్ర యా
    హృద్యములైన పద్యములనేకులు మెచ్చగ విశ్వమందునన్
    పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల? సంప్రదాయమౌ!

    రిప్లయితొలగించండి
  8. ఆటవెలది
    హృద్యమైన తెలుగు *పద్యకవిత్వము
    వర్జ్యము కద*యంచు పలుకఁదగునె?
    నాల్గు పాదములను నడయాడు చుండెడు
    పాడియావు తెలుగు పద్యమౌర!

    ఉత్పలమాల
    *పద్యకవిత్వమెల్లరకు వర్జ్యమదెట్టుల?సంప్రదాయమౌ *
    విద్యయె,నాల్గుపాదముల విశ్రుత కీర్తిని గాంచె నల్దిశల్
    హృద్యములైన పద్యములు హేలగఁజెప్ప వధానశేఖరుల్
    ఖాద్యముగాదె వీనులకు కమ్మని తియ్యని పద్యరాశి నై
    వేద్యము పెట్టగావలె కవీంద్రులు పుస్తకపాణి వాణికిన్.
    -------దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  9. 1. పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ”
    పద్యము వ్రాయ వాణికిని ప్రార్థన జేయగ నీయు భావముల్
    గద్యము విద్దెయే బలుక గమ్మగ జేరు జనాళి మెచ్చగన్
    పద్యము గద్యమే నయన పర్వము గాదొకొ వేదమాతకున్

    2. గద్యము వ్రాయగా గవులు ఘంటము బట్టగ నేల నేడిలన్
    పద్యము జెప్ప ఛందమున ప్రాసయతీ పద గుంభనమ్ముయే
    హృద్యపు శైలి లేదు గన హృత్తును దాఁకెడు సౌరభమ్ములున్
    పద్యకవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ”
    విద్యను నేర్వ సాధనను వింతగ సాధ్యము గాదకో కవీ !!

    రిప్లయితొలగించండి
  10. ముత్యాల సరము//

    విద్యను నేర్వ, నిఘంటువు సొద
    గద్య రచనల గ్రహణయు దురద
    హృద్యము మాండలికపు జనపద
    *పద్యకవిత్వము వర్జ్యమె కద,* వ్యధ !!

    రిప్లయితొలగించండి
  11. పద్యము భావనాత్మకము ప్రాణసమానము కావ్యసిద్ధికిన్
    పద్యము ధారణమ్మునకు పాదగు రాగ లయాత్మకమ్మునై
    హృద్యపు స్వాదువాదముల నెల్లలులేకయె గూర్చుమోదమున్
    బద్యకవిత్వమెల్లరకు; వర్జ్యమదెట్టుల? సంప్రదాయమౌ
    విద్యలనెన్న నన్నియును పేర్చినవేగద పద్యమందునన్

    రిప్లయితొలగించండి
  12. పద్యము లగు భూషణములు హృద్యము లగుఁ
    జదువరులకు నయిన నేమి చదువ నెవ్వ
    రిష్ట పడుదురు దోష భూయిష్ఠ మైన
    వసుధఁ బద్య కవిత్వము వర్జ్యమె కద


    సేద్యము తోడఁ బోల్ప నగుఁ జెన్నుగఁ బద్య కవిత్వ మిద్ధరం
    జోద్యమె యన్య దేశ్యములు చొప్పడ నం దవి కల్పు మొక్కలే
    హృద్యములై చెలంగునె పఠించిన సంకర మైన భాషతోఁ
    బద్య కవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ

    రిప్లయితొలగించండి
  13. లోక హితమునుగూర్చని రోతబుట్టు
    రాత లెట్లగు రత్నముల్ రాళ్ళుగాక
    భావముద్దీపనముజేయ పద్య మగును
    వ్యర్థ పద్యకవిత్వము వర్జ్యమె కద

    రిప్లయితొలగించండి
  14. చిరు మార్పుతో దోదక వృత్తంలో పూరణ:

    పద్యము సుమ్మది భావన చేయన్
    హృద్యము గూర్చెడు రీతిగ నుండన్
    చోద్యపు బల్కుల శుష్కపు రాతల్
    పద్యకవిత్వమువర్జ్యమె కాదా

    రిప్లయితొలగించండి
  15. పద్యమటన్న నయ్యదియు భాషకు వన్నెను గూర్చునంచునా
    విద్యను నేర్చి వ్రాయమదివేదనలెల్లయుబాపునియ్యదే
    పద్యకవిత్వమెల్లరకు,వ్యర్థమదెట్టుల?సంప్రదాయమౌ
    పద్యమె హృద్యమై నదనిపల్కుటయొప్పగుమాటనమ్ముమా

    రిప్లయితొలగించండి